తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!
పూర్వం గణపతి సరస్వతి శ్లోకాలు, సుమతి వేమన మొదలైన పద్యాలు చదవకుండా చదువులు ప్రారంభించేవారు కాదు. సరస్వతి అనుగ్రహం వుంటే చదువులు బాగా వస్తాయని నమ్మే వారు. మరి ఇప్పుడు ఒకటి.... ఒకటి.... రెండు... రెండు... మూడు... మూడు అంటూ పరిక్షా ఫలితాల ప్రకటనల్లో గొంతు చించుకునే ఒకటి రెండు కాలేజీల్లో చేర్పిస్తే చాలు ఎల్ కే జీ నుంచే ఐ ఐ టి కోచింగ్ ట అంటూ వేలంవెర్రిగా అక్షరాలు నేర్పించేందుకు కూడా అక్షరాలా లక్షలు పోసి చదువు 'కొంటున్నాం' ఒక్కసారి ఆలోచిద్దాం!! చదువులమ్మను మనసారా కొన్ని పద్యాలతో అయినా నిత్యం పూజిస్తే చల్లని చదువులతల్లి అనుగ్రహిస్తుంది! మనం నేర్చుకుందాం పిల్లలకి నేర్పిద్దాం!!
శారదా, శారదాంబోజ వదనా, వదనాంబుజే
సర్వదా, సర్వదాస్మాకం సన్నిధి, సన్నిధిం క్రియాత్
తాత్పర్యము: ఓ శారదా దేవీ! (శారదాంభోజ వదనా) తెల్లటి కలువలాంటి ముఖంకలదాన! (వదనాంబుజే) ముఖమే పద్మముగా కలదానా; (సర్వదా) అన్నిటినీ అనగా అన్ని విద్యలనీ ఇచ్చేదానా, (సర్వదాస్మాకం సన్నిధి) ఎల్లప్పుడూ మాయొక్క సన్నిధిలో అనగా మాకు తోడుగా ఉండి, (సన్నిధిం క్రియాత్) మంచినిధిని అనగా మంచిని చేయుగాక!

No comments:
Post a Comment