Tuesday, March 31, 2015

పెళ్ళినాటి ప్రమాణాలు. సప్తపదిలో ఏడు అడుగులు వేస్తూ " ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు " అనే మంత్రం చదువుతారు. దాని అర్ధం:-


పెళ్ళినాటి ప్రమాణాలు.
సప్తపదిలో ఏడు అడుగులు వేస్తూ " ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు " అనే మంత్రం చదువుతారు. దాని అర్ధం:-
మొదటి అడుగు : శక్తి కోసం 
రెండవ అడుగు : బలం కోసం
మూడవ అడుగు : వ్రతం కోసం 
నాల్గవ అడుగు : ఆనందం కోసం 
ఐదవ అడుగు : ఇంద్రియబలం కోసం 
ఆరవ అడుగు : రుతువులకోసం 
ఏడవ అడుగు : గృహ ధర్మాలకోసం
వధూవరులు ఇద్దరూ కలసి జీవితాంతం ఇలాగే కలసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది కార్యక్రమం తోనే * వధువు ఇంటి పేరు మారిపోతుంది *. వివాహానికి ఈ సప్తపది కార్యక్రమమే చాలా ముఖ్యం.
ఈ పెళ్ళినాటి ప్రమాణాలను స్త్రీ , పురుషులు ఇద్దరూ అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకొంటుంది. భార్య భర్తకు , భర్త భార్యకు తోడునీడగా, అన్యోన్యం గా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తేనే ఈ ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది.


ఓ విష్ణూ నీకు నమస్కారము.


శాంతాకారం భుజగ శయనం - పద్మనాభం సురేశం 
విశ్వాధారం గగన సదృశం - మేఘవర్ణం శుభాంగం 
     లక్ష్మీకాంతం కమలనయనం - యోగిహృద్ధ్యాన గమ్యం 
వందే విష్ణుం భవ భయ హరం - సర్వ లోకైక నాధం

శాంతా స్వరూపా ! భుజగశయనా ! నాభి యందు పద్మము గలవాడా దేవతలకు అధిపతి యైనవాడా! విశ్వమునకు ఆధారమైనవాడా! ఆకాశము వాలే సర్వత్రా వ్యాపించినవాడా! మేఘమువంటి నీలమైన వర్ణము కలవాడా! శుభమైన అంగములు కలవాడా ! లక్ష్మీపతీ ! కమలనయనా ! యోగులకు ధ్యానగమ్యము నీవే . ఓ విష్ణూ ! సంసార భారమును హరించువాడా నీకు నమస్కారము.



Monday, March 30, 2015

ప్రకృతి చెప్పే సత్యాలు.!!!



ప్రకృతి చెప్పే సత్యాలు.!!!




కొబ్బరికాయ ( టెంకాయ ) ప్రాముఖ్యత.

                                         కొబ్బరికాయ ( టెంకాయ ) ప్రాముఖ్యత.

 భక్తులు తమ హృదయాన్ని భగవంతునికి అర్పించాలని శాస్త్రాలు చెపుతున్నాయి. నిజంగా హృదయ సమర్పణం సాధ్యం కానిదని దానికి ప్రతీకగా కొబ్బరికాయను సమర్పించడమనే విధానం ఏర్పడింది.

                       నైవేద్యమిడ మాకు నారికేళము లేదు 
                       హృదయమే చేతి కందనీయనుంటి!!
అన్న కవి మాటలలో ఈ భావమే ప్రకారాంతరంగా వ్యక్తమవుతున్నది. మనకు స్థూల, సూక్ష్మ, కారణాలనేమూడు శరీరలున్నాయని వేదాంతశాస్త్రం నిరూపిస్తుంది.ఈ శరీరాలను వదిలించుకొంటేనే ముక్తి. కొబ్బరికాయపై  బెరడు స్థూల శరీరాన్ని, కొబ్బరి శూక్ష్మ శరీరాన్ని,నీరు కారణ శరీరాన్ని సూచిస్తాయి. జీవత్వం పొందటానికి సంకేతంగా మూడు ఆవరణలతో వున్నా టెంకాయను దేవునికి అర్పిస్తున్నట్లు భావించాలి.
           కాయపైనున్న పిలక అహంకారానికి సంకేతమని కొందరు, అఖండ జ్ఞానానికి సూచకమని మరికొందరూ చెపుతారు. నీరు చంచలమైన మనస్సుకు సూచకమని గూడా వివరిస్తారు. పిలకను తొలగించడం  అహంకార నిర్మూలనాన్ని సూచిస్తుంది. లేదా చివరివరకూ,,, అంటే శరీరత్రయం నశించి జ్ఞేయంలో లీనమయ్యే వరకూ, జ్ఞానరూప శిఖను అట్లే వుంచి తరువాత దాన్ని తొలగించాలని కుడా వివరిస్తారు.
కొబ్బరికాయను దేవతలకు సమర్పించాదాన్ని గురించి ఒక ఐతిహ్యం వుందని పెద్దలు చెపుతారు. అది ఏమిటంటే వినాయకుడు ఒకసారి శివుణ్ణి " నీ  తలను నాకు బలిగా ఇమ్మ"న్నాడట. తల ఇవ్వడం కుదరదు కానీ తలతో సరితూగే దానిని ఇస్తాను అని మూడు కన్నులవేల్పు తలకు బదులుగా మూడు కన్నులున్న నారికేళం వినాయకుడికి ఇచ్చి తృప్తి పరచినట్లు  ఆ తరువాత దేవతలకందరికీ టెంకాయలు సమర్పించే సంప్రదాయం ఏర్పడిందని పెద్దలు చెపుతారు.  

Sunday, March 29, 2015

*గణపతి మంగళ స్తోత్రo*

*గణపతి మంగళ స్తోత్రo*

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే
గౌరిప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం!
నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్న వినాశినే
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళం!
ఇభవక్త్రాయ చంద్రాది వందితాయ చిదాత్మనే 
ఈశాన ప్రేమపాత్రాయ జైష్పదాయాస్తు మంగళం!
సుముఖాయ సుశుండాగ్రోక్పిప్రామృత ఘటాయచ
సురవృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళం!
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్ మస్తకాయ చ
చరణావనతానంత-తారణాయాస్తు మంగళం!
వక్రతుండాయ వటవేవంద్యాయ వరదాయ చ
విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళం!
ప్రమోదా మోదరూపాయ సిద్ది విజ్ఞాన రూపిణీ 
ప్రహృష్ట పాపనాశాయ ఫలదాయాస్రు మంగళం!!!


29/03/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం నేను నా శ్రీమతి ప్రతీ వారం నిర్వహించే 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం నేను నా శ్రీమతి ప్రతీ వారం నిర్వహించే 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' శ్రీ రామ నవమి ప్రత్యేక కార్యక్రమం చిన్నారులు చక్రీతిక, ఐకాంతిక ప్రభవ్ లతో, ఆ పాతమదుర పాటలు, మాటలు 29/03/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 11 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!!


ఈ లంకె నొక్కి వినండి!

28/03/2015 తేదీన మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటలవరకు 'టోరీ మారిషస్ తెలుగు తల్లి ప్రేమ'

28/03/2015 తేదీన మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటలవరకు 'టోరీ మారిషస్ తెలుగు తల్లి ప్రేమ' అనే కార్యక్రమంలో శ్రీ సీతారామ కళ్యాణ వైభోగాన్నిమారిషస్ వారికి ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా అందించిన కార్యక్రమం మరియు మా విస్సా ఫౌండేషన్ అధ్వర్యంలో చిన్నారులతో నిర్వహించిన శ్రీ రామ నవమి నాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ లింక్ నొక్కి మీరంతా విని ఆనందించండి .

http://www.teluguoneradio.com/archivesplayer.php…

Saturday, March 28, 2015

*అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.*

*అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.*

అందరికీ ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా వుండాలని కోరుకొంటున్నాను.
శ్రీ రామనామంబు చిరకాల కీర్తన 
జేసెడు జిహ్వయే జిహ్వాతలప 
శ్రీరామరూపంబు స్థిరములై దర్శించు 
కన్నులే నిజమైన కండ్లుగాదె!
శ్రీరాము సన్నిధిన్ జేరగా నడచెడి యంఘ్రులగును
శ్రీరాముని పూజలు చేసి చేసి యలయు
కరములె ముక్తి కాకరము లెంచ
తారక బ్రహ్మ దర్శన సారమొకటే
బ్రతుకు నద్దరి చేర్చేది పరమ శక్తి
రామ నామము తారక రమ్యగణుతి
రామ చరణమే ముక్తి కా రామ పదము.
శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలు.






Thursday, March 26, 2015

దేవీ దేవతల చేతులలోనున్నవాటికి వాటి నామధేయాలకు వారి లీలలకు వెనుక అంతర్నిగూడ మైన అర్ధాలున్నాయి. మధుర మీనాక్షిదేవి చేతిలో చిలుక ఉంటుంది.ఎందుకు?

దేవీ దేవతల చేతులలోనున్నవాటికి వాటి నామధేయాలకు వారి లీలలకు వెనుక అంతర్నిగూడ మైన అర్ధాలున్నాయి.  మధుర మీనాక్షిదేవి చేతిలో చిలుక ఉంటుంది.ఎందుకు?
         మధుర మీనాక్షీదేవిచేతిలో చిలుక జీవునికి, జీవుని ప్రాణానికి లేక మనస్సుకి ప్రతీక. అలాగే మీనాలవంటి కన్నులు కలిగివుంటుంది కాబట్టి  ఆ అమ్మకి మీనాక్షి అని పేరు. ఈ పేరువెనుక ఒక రహస్యం కుడా వుంది. చేపలు గ్రుడ్లుపెట్టి,  వాటిని పొదుగుతాయి. వాటినుండి పిల్లలు వస్తాయి.వెంటనే ఆకలితో అలమటిస్తాయి. చేప సస్తన ప్రాణి కాదు. వాటికి పాలివ్వలేదు. వాటి ఆకలి తీర్చడానికి తల్లిచేప వాటి కళ్ళు విప్పి చూస్తుంది. ఆ చూపుతో వాటి కడుపు నిండుతుంది. అదేవిదంగా విష్ణువు చేతిలోని చక్రం మన మనస్సే. మనస్సు  చక్రం వంటిది. ప్రపంచమంతా తిరిగివస్తుంది. దానిని పరమాత్మ పరంచేస్తే విష్ణు చక్రమవుతుంది.ఆయన చేతిలోని గదమన బుద్ధి. గదకు ప్రతిదాన్ని చితకొట్టే గుణమున్నట్లే.. మన బుద్ధికి ప్రతివిషయాన్ని తర్కంతో విశ్లేషించే దానిని భగవత్పరం చేస్తే భగవదర్పిత బుద్ధిగా మారుతుందని పెద్దలు చెపుతారు.   

శుభోదయం!!! ఇది లక్ష్మీదేవి ద్వాదశనామ స్తోత్రం. ఆ జగన్మాత అనుగ్రం మనమీద అనుక్షణం వుండాలి అంటే ప్రతినిత్యం స్మరించుకోవలసిన ప్రార్ధన.

శుభోదయం!!!
ఇది లక్ష్మీదేవి ద్వాదశనామ స్తోత్రం. ఆ జగన్మాత అనుగ్రం మనమీద అనుక్షణం వుండాలి అంటే ప్రతినిత్యం స్మరించుకోవలసిన ప్రార్ధన.


Wednesday, March 25, 2015

ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర కాదు అనే సామెత ఎందుకు వచ్చినదంటే ?

                   ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర కాదు అనే సామెత ఎందుకు                                                  వచ్చినదంటే ?

పురుషులకి పేరు ప్రతిష్టలు, స్త్రీ వ్యామోహాలూ ఎక్కువ.ఈ రెండింటికి కావలసినది డబ్బు. సంపాదించిన డబ్బు ఎలా అయినా ఎవరిష్టం వచ్చినట్లు వారు వృధాగా ఖర్చు చేస్తుంటారు. అదే వ్యాపారము దగ్గర, వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు.  అలా మొహమాట పడితే అసలుకే ఎసరు రావచ్చు. ఎటువంటి వారైనా వ్యాపార, వ్యవహారాల్లో డబ్బువిషయంలో లొంగేది ఒక్క ఆడదనిదగ్గరే. అందుకనే ఎక్కడైనా బావ గని వంగతోట దగ్గర బావకాదు. అని అంటారు. 

Tuesday, March 24, 2015

శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్.


ఇది భాషా సంగీతమా అన్నారు * తెలుగు * గురించి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి లో అన్నారు .

ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో ,
ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో ,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్చగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతుందో,
ఎక్కడ విరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో,
ఎక్కడ పరిశుద్ద జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపు టెడారిలో ఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పధాల వైపు ఎక్కడ పయనిస్తుందో,
ఆ స్వేచ్చాస్వర్గం లోకి నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు తండ్రి.   
శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్.*
-------------------------------------------------------------------------------------------
మరో అనువాదం 
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ,
సంసారపు గోడల మద్య
ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరుగని శ్రమ
తన భాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో
స్వచ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,
ఎక్కడ మనసు
నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛ స్వర్గానికి,
తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు....
-గీతాంజలి,(రవీంద్రనాథ్ టాగోర్)

Where The Mind Is Without Fear

Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
             -By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
            -Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee 
           -Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

Monday, March 23, 2015

శ్రీ మన్మధ నామ శుభాకాంక్షలు

Sunday, March 22, 2015

శ్రీశైలం లో పాతాళగంగలోని నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది?

                                 శ్రీశైలం లో పాతాళగంగలోని నీరు పచ్చగా ఎందుకు ఉంటుంది?

చంద్రగుప్త మహారాజు అనేక సంవత్సరాలు యుద్ధం చేసి, విజయాలతో రాజ్యం చేరతాడు. అంతఃపురం లోని స్త్రీలతో ఉన్న అందాలరాశి చంద్రావతిని  తన కూతురు అని తెలియక ఆశిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవటంతో, చంద్రావతి  శ్రీశైలం అరణ్యాలకి వచ్చి పరమేశ్వరుడ్ని అనుగ్రహించమని తపస్సు చేస్తుంది. అక్కడికి కుడా చంద్రగుప్తుడు వచ్చిచంద్రావాటిని చెరపట్టబోతుండగా మహాశివుడు ప్రత్యక్షమై కామంతో కనులు మూసుకుపోయిన నీవు పచ్చలబండవై పాతాళగంగలో పది ఉండమని శపిస్తాడు.చంద్రగుప్తుడు శివుడ్ని వేడుకోగా, శ్రీమహావిష్ణువు  కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానంకై  దిగిననాడు, స్నాన మాచరించిన నాడు నీకు శాప విమోచనం కలుగుతుందని మహేశ్వరుడు తెలిపినట్లు పెద్దలు చెపుతారు.    


శుభోదయం... శివదర్శనం సర్వపాప హరణం

శుభోదయం

శివదర్శనం సర్వపాప హరణం


'మణిసాయి సాహితీ యుగళ గీతిక' శ్రీ మన్మధ నామ ఉగాది కార్యక్రమం - 22/03/2015

మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' శ్రీ మన్మధ నామ ఉగాది కార్యక్రమం ఇందులో చిన్న పెద్ద కవులతో కవి సమ్మేళనం, ఆ పాతమదుర పాటలు, మాటలు 22/03/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 11 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!! 
ఈ లంకె నొక్కి వినండి!



Saturday, March 21, 2015

అందరికీ శ్రీ మన్మద నామ ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.


ఉత్తరాయణం ప్రారంభమయ్యే మొదటి రోజున జరుపుకునే పర్వదినం ఉగాది.వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకుని కళకళలాడుతుందనీ, అందువల్ల ఆ రోజున, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు భావించవచ్చనీ కొందరు చెబుతుంటారు.ఈ ఉగాది పండుగ మానవ జీవితంలోని ప్రతి కోణాన్నీ స్పృశిస్తుంది. ఇతర పర్వదినాల్లో పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తుండగా, ఉగాది రోజున మాత్రం షడ్రుచుల పచ్చడి చేసుకుని ఆరగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ పర్వదినంలో భాగంగా జరిగే పంచాంగ శ్రవణం ఏడాదిలో ఎదురయ్యే అనేక కష్ట సుఖాలకు మనలను మానసికంగా సిద్ధం చేస్తుంది. రాజ పూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాల గురించి చెప్పి, జాగ్రత్తలు సూచిస్తుంది.
అందరికీ శ్రీ మన్మద నామ ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.
" ఆమని ఆగమనం "
అరుదెంచెను ఆమని వర్ణించను ఏమని.
లేలేత చిగురులే నూగారు సొబగులు
కువకువల ఎగురులే తారాడే ముంగురులు
అంతట కుసుమాకర మీ ఆమని
ఎంతటి సుకుమారమొ ఆమె మేని
పచ్చచీర కట్టి ఎర్రబొట్టు పెట్టి
మడుమాసమే దరహాసమై
ఈదర సింహాసన మదిరోదించగ " అరుదెంచెను "
కృష్ణవేణి జడగా వడివడిగా
పదమంజీర నాదాలే రవళించగా
గోదారి దారిలో అరుదెంచెను అదిగో ..
దివి దిగివచ్చేను ఇదిగో ...
కోకిల కిలకిలా...చెరకున తీపిలా
మావిమారాకులో ... వేపపూరేకులో
ఆ రాకే తెలుసుకో...
నోరూరే ఆరు రుచుల అలరించగా
ఊరూరా ఆశల ఊసుల కలవరించాగా
ఆ... కల వరించగా ఈ ఇల వరాలు కురిపించగ
ఆ...అందమే మరందమై మన ఆనందమె మిలిందమై
అదిగదిగో ... అరుదెంచెను ఆమని వర్ణించను ఏమని.
అందరికీ శ్రీ మన్మద నామ ఉగాది శుభాకాంక్షలు.



Thursday, March 19, 2015

మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు. 44వ పద్యం.

మా తాత గారైన కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు.
44వ పద్యం.
అందముకెల్ల మూలమయి, ఆభరణములంబుకన్న మిన్నయై 
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రోక్కుగానటన్
పొందుగ భక్తితత్పరత పూరుషులున్ మగువల్ వినమ్రులై 
అందున పుణ్యమేమొగద అర్పణ చేయగకుంతల్లమ్ములన్!!!  

శుభోదయం!! మారేడు దళాల విశిష్టత.

శుభోదయం!!
మారేడు దళం!!
మారేడు దళం శివునికి ప్రీతికరమైనది. భస్మంతో అభిషేకం తర్వాత, మారేడు దళంతో శివుని పూజిస్తారు మూడు ఆకులు, మూడుగుణాలు సూచిస్తాయి. మారేడు కొమ్మలే వేదాలు. వేరులు రుద్రుడు. మారేడు దళం త్రినేత్రాలను సూచిస్తాయి. వీటిని పౌర్ణమి నాడు కోయరాదు. పశ్చిమ దేశాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మారేడు మొక్కలను పరిశోధనలకై పెంచు తున్నారు. కీళ్లవ్యాధులు, వాంతులు, క్షయ, విరేచనాలకు మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు దళాల రసాన్ని మంచినూనెలో కలిపి వేడిచేసిన తర్వాత చెవివ్యాధులకు ఉపయోగిస్తారు.


మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం బరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...

మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం బరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...

శుక్లాం బరదరం- తెల్లని వస్త్రములతో 
విష్ణుం - అంతటా వ్యాపించిన వాడై 
శశివర్ణం - చంద్రుని వంటి ప్రకాశం కలవాడై 
చతుర్భుజం - నాలుగు భుజములు(చేతులు) కలవాడై
ప్రసన్న వదనం - ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని 
ధ్యాయేత్ - ధ్యానించుచున్నాము 
ఆగజానన పద్మార్హం- నాయకత్వం లేని మాకు 
గజానన మహర్నిశం - నాయకుడివై మమ్ములను నడిపించు
అనేకదంతం భక్తానమ్- కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో 
ఏకదంతం ఉపాస్మహే- ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము.

Tuesday, March 17, 2015

తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?

               తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?

మొదటి సారి తీర్ధము శరీర శుద్ధి, శుచికి, రెండవసారి తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు, మూడవసారి తీర్ధము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. ఓం అచ్యుతాయనమః అని మొదటిసారి భక్తులు తీసుకోన్నచో వారి ఆత్మా పవిత్రము అగును. ఓం అనంతాయ నమః అని రెండవసారి, ఓం గోవిందాయనమః అని మూడవసారి తీర్ధము తీసుకొంటే వారికి మోక్షమునకు యోగ్యతా లభించును. శ్రీమన్నారాయణుని అనుగ్రహము వలన స్త్రీ, బాల, వృద్దులు అందరూ శ్రద్ధా భక్తులతో మూడుసార్లు తీర్ధం సేవించవలెను.
తీర్ధమంత్రము:- 
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాప శమనం విష్ణు పాదోదకం శుభం!! 

పై మంత్రముతో తీర్ధం పుచ్చుకొని అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకొంటున్నాను.



మిత్రులారా...శుభోదయం!!

మిత్రులారా...శుభోదయం!!

    మహనీయుల సాహితీ సేద్యములో కుసుమించిన కావ్య సౌరభాలని ఒక సారి ఆస్వాదిద్దాం! ఆనందిద్దాం!!.భావితరాలకి అందిద్దాం ..మన తెలుగు దనం కృషిని అభినందిద్దాం!!! ఇలా..ప్రతి రోజు మనవైన ..ఘన సాహితీ సంపదలను పంచుకుని...పెంచుకుందాo
 తనకు తెలియదు, ఒకడు చెబితే వినడు.
కొందరు మాకు అన్నీ తెలుసునని గొప్పగా చెప్పుకుంటారు. ఆ విషయం మీద అవగాహన లేకపోయినా మాకు అంతా తెలుసులే అని గర్వంగా ఫీలవుతారు. ఎదుటి వారు ఇలా కాదు, 'అలా' అంటే వినరు. ఇతరులు నాకు చెప్పేంత వాళ్ళా అని కోపగించుకుంటారు. నేనే గొప్పని చెప్పుకుంటారు. అందరి కంటే నాకే బాగా తెలుసు అని భ్రమపడతారు. కాని వాళ్ళకు ఏం తెలియదు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని ఉద్దేశించినప్పుడు ఈ నానుడిని వాడతాం.
ఆలోచించి మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఆలోచించకూడదు.
ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడుతున్నామా? స్నేహపూరకంగా మాట్లాడుతున్నామా? అనే విషయాల్ని మాట్లాడేటప్పుడే ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత ఆ మాటను తిరిగి వెనక్కి తీసుకోలేం. మాట నాలుక దాటి బయటకు వచ్చే ముందు ఈ విషయాల్ని గ్రహించటం మంచిది. ఎందుకంటే పెదవిదాటి బయటకు వచ్చిన మాటకు విలువ ఉండదు సరికదా! ఆ మాట సరైనది కాకపోతే నలుగురిలో నవ్వులపాలు కావాల్సి వస్తుంది.అంతే కాదు మనల్ని మంచివారుగానో, చెడ్డవారుగానో ఎదుటివారి ముందు నిలబెట్టేది మనమాటే. నోరుంది కదా! అని నోటికొచ్చిన మాటల్లా మాట్లాడితే మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచిస్తే మాట్లాడిన తర్వాత చింతించే ప్రమాదం తప్పుతుంది.





శ్రీ సంజీవ గారితో మరియు ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు శ్రీ P.C.ఆదిత్య గారితో నేను జరిపిన చర్చా కార్యక్రమములో ... పూతరేకులు చిత్రం గురించి మరియు మారిషస్ విశేషాలు విని ఆనందించండి. స్పందించండి. -- సత్యసాయి విస్సా.

శ్రీ సంజీవ గారితో మరియు ప్రఖ్యాత చలనచిత్ర దర్శకులు శ్రీ P.C.ఆదిత్య గారితో నేను జరిపిన చర్చా కార్యక్రమములో ... పూతరేకులు చిత్రం గురించి మరియు మారిషస్ విశేషాలు విని ఆనందించండి. స్పందించండి. -- సత్యసాయి విస్సా.
 Mauritius Telugu Talli Prema  :: Date: Aug 10 2013
http://www.teluguoneradio.com/archivesplayer.php?q=7473&host_id=61#.Ugx9a5kiY64.facebook

టోరి రేడియోలో మా పాత తెలుగు కార్యక్రమం

Tori  International Radio Mauritius Telugu Talli Prema  :: Date: Aug 31 2013
http://www.teluguoneradio.com/archivesplayer.php?q=7839&host_id=61#.UiYTkDJYin8.facebook

Monday, March 16, 2015

దేవాలయంలో ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఎప్పుడూ నమస్కరిస్తూనే ఎందుకు కనిపిస్తాడు ?


దేవాలయంలో ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఎప్పుడూ నమస్కరిస్తూనే ఎందుకు కనిపిస్తాడు ?

రావణవధ అయ్యాక సీతారాములు వెళ్ళిపోతూ ఆంజనేయుడితో " నీకేం కావాలి?" అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు నాకు మరేవిధమైన కోరికలూ వద్దు. ఏరూపం చూచినా అందులో నీ రూపమే కనిపించేలాగ, ఏ శబ్దం వినిపించినా అందులో సీతారాముల కథే వినిపించేలా, ఎక్కడ నమస్కరించినా అది మీకే చెందేలాగ ఈ భావం నాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు అని కోరుకొన్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. అందుకని ఆంజనేయుని నమస్కారం సీతారాములకే. ఆంజనేయ ధ్యానమంతా సీతారాముల విషయంలోనే.అంతేకాదు సీతారాములకి నమస్కరిస్తున్న హనుమకి నమస్కరించడం ఆ సీతారాములకి మరింత ఇష్టం. ఎందుకంటే భగవంతుడు తనకి చేసిన నమస్కారం కంటే తన భాగవతునికి ( భక్తునికి ) చేసిన నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాడు కదా!!
                                             (అహం స్మరామి మద్భక్తం.)



Sunday, March 15, 2015

మా తాత గారై కీ. శే . శ్రీ విస్సా వేంకటరావు గారు. వారి భక్తి రసాత్మక, సహకవితా ప్రసూనములు:- 41వ పద్యం .-


41వ పద్యం .
స్వార్ధపు చింతవీడి నిజశక్తిని  మానవసేవ సల్పుచున్ 
అర్ధము కామ మోహముల నన్ని జయించియు సత్వచిత్తుడై
వ్యర్ధపులోక వాసనల వాంఛల నెల్లపరిత్యజించి మో
క్షార్ధిగదైవ చింతనల సల్పెడు భక్తులు ధన్యులేగదా!!! 
42) కన్నులు రెండు పాపులట కానగలేవట నీదుతేజమున్
కన్నులు మూసి ధ్యానమున కానగావచ్చని నీదు రూపమున్ 
సన్నుతిచేయుచుంటి జలజాతవిలోచన నాదుదృష్టికిన్ 
తిన్నగా దర్శనంబోసగి దీవెనలీగదే వెంకటేశ్వరా !!!  
43) పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణ కల్పన జేసినట్టి నీ
పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే
గుట్టుగా నెల్ల వేళలను కొల్చుచునుంటి మహానుభావ! నే
పట్టినపట్టు వీడనిక పంతము సేయక కానరాగదే!!
44) అందముకెల్ల మూలమయి, ఆభరణములంబుకన్న మిన్నయై 
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రోక్కుగానటన్
పొందుగ భక్తితత్పరత పూరుషులున్ మగువల్ వినమ్రులై 
అందున పుణ్యమేమొగద అర్పణ చేయగకుంతల్లమ్ములన్!!! 
45) 

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం........జ్యోతిర్లింగ దర్శన భాగ్య ఫలితములు.

     ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం........జ్యోతిర్లింగ దర్శన భాగ్య ఫలితములు.

                             ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ 
ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకార అమరేస్వరం  
పరల్యాం వైద్యనాధం చ ఢాకిన్యాం భీమశంకరమ్ 
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే.
వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే 
హిమాలయే తు కేదారం ఘృష్ణేశం శివాలయే. 
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

                  జ్యోతిర్లింగ దర్శన భాగ్య ఫలితములు.:-

1. సౌరాష్ట్ర సోమనాధుని దర్శించిన -- భోగభాగ్యాలు.
2. శ్రీశైల మల్లికార్జునుడిని సేవించిన -- సర్వదరిద్రాలు సమసిపోతాయి.
3. ఉజ్జయిని మహాకాలుడ్ని కొలచిన -- సర్వభయ పాపాలు హరించుకు పోతాయి.
4. ఓంకారేశ్వర అమరలింగేశ్వర దర్శనం -- ఇహపరాలను, సౌఖ్యాలను ఇస్తాయి.
5. పరళి వైద్యనాధ లింగాన్ని సేవించిన -- అనేక దీర్ఘ వ్యాధులు నయమవుతాయి .
6. భీమేశ్వరము భీమేశ్వరలింగాన్ని దర్శించిన -- శత్రుజయం కలిగి అకాల 
మృత్యుభయాలుతొలగిపోతాయి
7. రామేశ్వరం రామేశ్వర లింగాన్ని అభిషేకించిన -- మహోన్నతమైన పుణ్యం కలిగి పరమపదాన్ని 
చేరుతారు.
8. ద్వారక నాగేస్వరున్ని దర్శించిన --- మహాపాతకాలు,ఉప పాతకాలు నశిస్తాయి.
9. కాశీ విశ్వేశ్వర లింగాన్ని సేవించిన --- సమస్తకర్మ బంధాల నుంచి విముక్తి .
10. నాసిక్ త్రయంబకేశ్వరుని కొలచిన --- కోరిన కోర్కెలు తీరుతాయి,అపవాదులు పోతాయి.
11. హిమాలయ కేదారేశ్వర దర్శనం ---- ముక్తిని పొందుతారు. 
12. ఘృష్ణేశ్వర  లింగ దర్శనం --- ఇహపర భోగాలను అందిస్తుంది.

  

'మణిసాయి సాహితీ యుగళ గీతిక' 15.03.2015.


మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'
15/03/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 11 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఈ మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!!
ఈ లంకె నొక్కి వినండి!
    
https://www.youtube.com/watch?v=MlZacvMURR8
Sahiti Yugala Geetika - 15.03.2015





Friday, March 13, 2015

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం.భోజనం వడ్డించే పద్ధతులు.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి
అనాదిగా ఉన్నఆచారం.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. 

శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్నభయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు. 
 వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని డా పెంచుతుంది. 
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద ట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. 
న్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడామేలు చేస్తాయి. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక  కూడాను. ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన  భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో! అరటి ఆకులో, 
అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. 
తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది.
బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. 
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే  జ్ఞానం వస్తుంది.
జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. మన అరటి ఆకుకు  మించిన ఆకు లేదు.                                
                                 భోజనం వడ్డించే పద్ధతులు 
ప్రతి  శుభకార్యాల్లో భోజనాలు వడ్డించే కార్యక్రమం ఎంతో సందడిగా కనిపిస్తుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని విస్తళ్లలో వడ్డిస్తూ వెళుతుంటారు. ముందుగా పప్పు ... చివర్లో మజ్జిగ అనే సూత్రం పైనే ఈ వడ్డన కొనసాగుతుంటుంది. అయితే మన పూర్వీకులు వడ్డన విషయంలో పద్ధతిని పాటిస్తూ వచ్చారు. ఆ పద్ధతిని పరిశీలిస్తే ... ఆహార పదార్థాలను వడ్డించడానికి వాళ్లు అరిటాకు శ్రేష్టమైనదిగా భావించారు.

అరిటాకులో ముందుగా కూరలను వడ్డించిన తరువాత మధ్య భాగంలో అన్నాన్ని వడ్డించాలి. ముందే ఉత్త అన్నాన్ని వడ్డించడాన్ని శాస్త్రం తప్పు పడుతుంది. ఇక పప్పు ... పాయసాలను అరిటాకు కుడి వైపున, పిండి పదార్థాలను ఎడమవైపున వడ్డించాలి. అతిథులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్లు తినడం ప్రారంభించక ముందే నెయ్యి వడ్డించాలి ... తినడం ఆరంభించాక ఉప్పును వడ్డించాలి.

ఇక ఉప్పును అడిగి వడ్డించ కూడదనీ, ఒకవేళ వడ్డించడం మరిచిపోయినా అడగకూడదని అంటూ వుంటారు. ఆచారాన్ని గౌరవిస్తూ ... ఈ విధమైన పద్ధతులను పాటిస్తూ జరిపిన వడ్డన వల్లనే ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

శుభోదయం!!! తిరుమల తిరుపతి లో పూలబావి ప్రత్యేకత



శుభోదయం!!!

తిరుమల తిరుపతి లో పూలబావి ప్రత్యేకత 

                   అద్దాల మంటపానికి ఉత్తరం దిక్కున ఉంది ఈ పూలబావి. స్వామివారికీ సమర్పించిన తులసి, పూలదండలు, పువ్వులు ఎవ్వరికీ ఇవ్వకుండా ఈ పూలబావిలోనే పడేస్తారు. ఆపదవచ్చినప్పుడు తొండమానుడు ఈ పూలబావి రహస్య సొరంగమార్గం ద్వారానే ఆ వేంకటేశ్వరస్వామిని శరణువేడాడు. స్వామివారు ఆ ఆపద సమయంలో ఏకాంతంగా ఉన్నారు. తొందమానుడ్ని చూసి శ్రీమహాలక్ష్మి సిగ్గుతో శ్రీమహావిష్ణువు వక్షస్థలం లో చేరింది. అదే సమయంలో భూదేవి తొండమానుడు కట్టించిన పూలబావిలోకి వెళ్లి రహస్యంగా దాక్కుందని పురాణాల గాధ!!!

Thursday, March 12, 2015

శుభోదయం!!! శ్రీమహాలక్ష్మీదేవి ఎక్కడ ఉండదు?




శుభోదయం!!!
శ్రీమహాలక్ష్మీదేవి ఎక్కడ ఉండదు?
   మాసిన బట్టలు ధరించిన వారిదగ్గర, సంధ్యాకాలాల్లో నిద్రపోయేవారి ఇంట్లోను శ్రీమహాలక్ష్మి ఉండదు.  ధనానికీ, ధన్యానికీ, పుస్తకానికీ, పెద్దలకీ కాళ్ళు తగిలితే శ్రీమహాలక్ష్మికి ఆగ్రహం వస్తుంది. అందుకే మనం ఎవరైనా పెద్దవారికి పొరపాటున మన కాళ్ళు తగిలితే వెంటనే క్షమించమని దణ్ణం పెడతాము. అన్నిటికన్నా మించి మహిళలు కన్నీరు పెట్టుకొనే చోట,  ఆ పరిసర ప్రాంతాలలోను కుడా శ్రీమహాలక్ష్మి ఉండదని పెద్దలు చెపుతారు.

లక్ష్మీదేవి తామరపువ్వులో, ఇరుపక్కలా ఏనుగులతో ఎందుకు ఉంటుంది?







లక్ష్మీదేవి తామరపువ్వులో, ఇరుపక్కలా ఏనుగులతో ఎందుకు ఉంటుంది?

            సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది.తనూ నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటంలోని పరమార్ధం. ఇక ఇరుప్రక్కలా వున్న ఏనుగులతో ఉండటంలోని  అర్ధం  ఏమిటంటే శ్రీమహాలక్ష్మి ధనబలము గజబలమంతటిది అని అర్ధం చేసుకోమని పరమార్ధం. 








Sunday, March 8, 2015

శుభోదయం!! దిష్టి ఎందుకు తీస్తారు?

                                       శుభోదయం!!
                                 దిష్టి ఎందుకు తీస్తారు?
               
               చిన్నారుల పుట్టినరోజు, పండగ వేడుకలలో, శుభకార్యాలలో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ దిష్టిని విభిన్నపద్దతుల్లో తీస్తూ వుంటారు. పిల్లలూ, పెద్దలూ ఘన విజయాలు సాధించినప్పుడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు, అతిగా నీరసించి డీలా పడినప్పుడు దిష్టితీస్తారు. అదేవిధంగా పిల్లలకి బయటిజనం దృష్టిదోషం తగలకుండా వుండాలని, నిద్రలో కలవరింతలు, ఉలికిపాట్లు  లేకుండా నిద్రపోవాలని, పసుపూ,సున్నం కలిపిన నీటితో  దిష్టి తీస్తారు.
                     చిన్నపిల్లలు లేదా పెద్దలు ఎవరైనా కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనటంవల్ల వారి చుట్టూ అంటా చేరటంవల్ల కొంతమంది అస్వస్థతకు గురిఅవుతారు. అందుకే వివాహవేడుకలలోను,పుట్టినరోజు వేడుకలలోను విధిగా హారతి ఇచ్చి చివరిలో ఎర్రనీళ్ళతో దిష్టితీస్తారు.ఎరుపురంగు పదేపదే చూడటంవల్ల అనేక రోగాలు సమసిపోయి మనసుకు ప్రశాంతతతోపాటు ధైర్య గుణం వస్తుంది.
                                           ../\..  

ఈ లంకె నొక్కి వినండి! 08/03/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

ఈ రోజు 08/03/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

మా విస్సా పీఠం అధ్వర్యంలో 'రేడియో కేక' అనంత పురం 'మణిసాయి సాహితీ యుగళ గీతిక'

5/02/2015 మా విస్సా పీఠం అధ్వర్యంలో  'రేడియో కేక' అనంత పురం నుంచి ఉదయం 9 గంటల నుంచి 11 గంటలవరకు ప్రత్యక్ష ప్రసారంలో మేము నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఈ  మీరు కూడా వినండి. మీ అమూల్య అభిప్రాయాలు తెలియచెయ్యండి...ప్రతి ఆదివారం రేడియో కేక లో 'మణిసాయి సాహితీ యుగళ గీతిక' లో మీరు కూడా  పాల్గొనవచ్చు మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు. మా విశ్వ వ్యాప్త ముఖపుస్తక బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక సాదర ఆహ్వానం!!
ఈ లంకె నొక్కి వినండి!

https://www.youtube.com/watch?v=RWbMv9HUxiA

Saturday, March 7, 2015

* 7 * సంఖ్య మంచిదా.... కాదా?

                                         * 7 * సంఖ్య మంచిదా.... కాదా?


తిరుమల తిరుపతి కొండలు 7.
ప్రత్యక్ష్య దైవం సూర్య భగవానుడు  నుంచి వచ్చే కిరణాలు 7,
పాతాళం క్రింద లోకాలు 7, 
భువర్లోకాలు 7,
అలాగే ద్వీపాలు 7,
పెళ్ళిలో వధూవరులు ఇద్దరూ కలసి వేసే అడుగులు 7,
అగ్నిదేవుని నాలుకలు 7,
బ్రహ్మోత్సవాలు జరిగేది 7 వ నెలలో,
సప్తస్వరాలు 7,
7సంఖ్య మంచిదికాదని కొందరి మూడనమ్మకము.7 సంఖ్య కుడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతీది మనకోసమే. దాన్ని ఉపయోగించే పద్దతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

                                    మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 

ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు, ఉద్యమకారులకు, అభ్యుదయ వాదులకు స్ఫూర్తినిచ్చే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మర్చి 8. మిత్రులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.

కనులు తెరిచినా క్షణం నుంచి  బంధం కోసం.... భాద్యత కోసం 
కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి 
ఆత్మీయత పంచి... అవమానాలను సహించి 
అయినవారికోసం అహర్నిశలూ కష్టించి 
వారి భవిష్యత్తు గురించి కృషిచేసి 
తన ఇంటిని నందనవనంగా మర్చి
అభ్యుదయాల కళకళలతో 
అన్నింటా విజయాల తళతళతో
అమ్మదనపు కమ్మదనాల కిలకిలతో
అవనిలో ప్రేమామృతాల గలగలతో    
అన్నింటా మణి మాణిక్యాలుగా గా 
వెలిగే మహిళలు అందుకే....మహిళలు  మహారాణులు.

Total Pageviews