Saturday, March 21, 2015

అందరికీ శ్రీ మన్మద నామ ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.


ఉత్తరాయణం ప్రారంభమయ్యే మొదటి రోజున జరుపుకునే పర్వదినం ఉగాది.వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకుని కళకళలాడుతుందనీ, అందువల్ల ఆ రోజున, అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు భావించవచ్చనీ కొందరు చెబుతుంటారు.ఈ ఉగాది పండుగ మానవ జీవితంలోని ప్రతి కోణాన్నీ స్పృశిస్తుంది. ఇతర పర్వదినాల్లో పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయంగా వస్తుండగా, ఉగాది రోజున మాత్రం షడ్రుచుల పచ్చడి చేసుకుని ఆరగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ పర్వదినంలో భాగంగా జరిగే పంచాంగ శ్రవణం ఏడాదిలో ఎదురయ్యే అనేక కష్ట సుఖాలకు మనలను మానసికంగా సిద్ధం చేస్తుంది. రాజ పూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాల గురించి చెప్పి, జాగ్రత్తలు సూచిస్తుంది.
అందరికీ శ్రీ మన్మద నామ ఉగాది శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు.
" ఆమని ఆగమనం "
అరుదెంచెను ఆమని వర్ణించను ఏమని.
లేలేత చిగురులే నూగారు సొబగులు
కువకువల ఎగురులే తారాడే ముంగురులు
అంతట కుసుమాకర మీ ఆమని
ఎంతటి సుకుమారమొ ఆమె మేని
పచ్చచీర కట్టి ఎర్రబొట్టు పెట్టి
మడుమాసమే దరహాసమై
ఈదర సింహాసన మదిరోదించగ " అరుదెంచెను "
కృష్ణవేణి జడగా వడివడిగా
పదమంజీర నాదాలే రవళించగా
గోదారి దారిలో అరుదెంచెను అదిగో ..
దివి దిగివచ్చేను ఇదిగో ...
కోకిల కిలకిలా...చెరకున తీపిలా
మావిమారాకులో ... వేపపూరేకులో
ఆ రాకే తెలుసుకో...
నోరూరే ఆరు రుచుల అలరించగా
ఊరూరా ఆశల ఊసుల కలవరించాగా
ఆ... కల వరించగా ఈ ఇల వరాలు కురిపించగ
ఆ...అందమే మరందమై మన ఆనందమె మిలిందమై
అదిగదిగో ... అరుదెంచెను ఆమని వర్ణించను ఏమని.
అందరికీ శ్రీ మన్మద నామ ఉగాది శుభాకాంక్షలు.



No comments:

Post a Comment

Total Pageviews