Tuesday, June 30, 2015

వందే మా 'తరం' మా 'తరం' మహత్తరం అందుకే అందాం మనమందరం వందే మా 'తరం' ఎండనక వాననక చలి గిలి పగలు రేయనక వీధుల్లో యధేచ్చగా ఆటలు పాటలు మాటలు నేర్చుకున్నది మనదే చివరి తరం.1970 - 1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి మరియు కొత్త తరానికి మధ్య వారధి లాంటి వాళ్ళు అని నేను అంటాను మీరేమంటారు. ?

   వందే మా 'తరం' మా 'తరం' మహత్తరం అందుకే అందాం మనమందరం వందే మా 'తరం' 
ఎండనక వాననక చలి గిలి పగలు రేయనక వీధుల్లో యధేచ్చగా  ఆటలు పాటలు మాటలు  నేర్చుకున్నది మనదే చివరి తరం.                    

1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం 
వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.
వీధుల్లో కోడా బిళ్ళలు, గోలీలు ఆడినది మనదే చివరి తరం.
మట్టి లో ఆటలాడిన తరమూ మనదే..
పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
రబ్బర్ బాల్ తో ఈప్చాండ్ ఆడి మన ఫ్రెండ్ వీపు పగల గొట్టిన చివరి తరం మనదే
స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.
చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు.
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే..
మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.
వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
యంటినా తిప్పుతూ టీవీ సిగ్నల్ ను సరి చేసిన ఆఖరి తరం మనదే
డీడీ8 చానెల్ ను ఎక్కువగా చుసిన ఆఖరి తరం మనదే
మన వీధి లో అమ్మే గ్రీటీంగ్స్ కొని ఫ్రెండ్స్ కు పంచిన ఆఖరి తరం మనదే
ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే..
అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం.
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం, మరియు స్మార్ట్ మొబైల్ ను కుడా వాడుతున్నాము
సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం.
స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో ఆ బేధాలు చూపే వాళ్ళం కాదు.
చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.
శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
ఆదివారం ఉదయం 9 కి ట్యూషన్ తప్పించుకుని"మహాభారతము" " రామాయణం" " శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే...
ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,
అమ్మ ఇచ్చిన రూపాయి ని అపురూపం గ చూసుకున్న ఘనతా మమదే ..
ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
రుపయిన్నరకు థియేటర్ లో సినిమా...
బ్లాక్ అండ్ వైట్ టీవీ లో సినిమా చూడడానికి
రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం
గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం...మనమే..
అమ్మ 25 పైసలు ఇస్తే అయిదు బలపాలని అపురూపంగా దాచుకున్న కాలం...మనమే..
గోర్లపైన కొంగ గోరు గుర్తులు చువ్వాట..సిర్రగోనే ఆట..కోతి కొమ్మ...అష్ట చెమ్మ...ఆడిన తరము మనదే.
క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం. ఇప్పడు వాటిని వాడుతున్నాము కుడా
ఇలా చెపుతూ పొతే ఇంకా చాల నే ఉన్నాయ్
ఈ 1970 - 1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి మరియు కొత్త తరానికి మధ్య
వారధి లాంటి వాళ్ళు అని నేను అంటాను మీరేమంటారు. ?

పెద్దలమాట చద్దిమూట!!

పెద్దలమాట చద్దిమూట!!


శుభోదయం../\..

శుభోదయం../\..
అహంకారం మనసుని ఆవరిస్తే....ఆత్మీయులు దూరం అవుతారు 
మమకారం  మనసున  ఉంటే .....అందరూ మనవారే  అవుతారు.


పెద్దలమాట చద్దిమూట!!!!

పెద్దలమాట చద్దిమూట!!!!



శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.

                             శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.

 హనుమంతునికి  ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమదాలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కోవాలి. సకల రోగ, భూత,  ప్రేత,  పిశాచాది భాధలు తొలగుటకు, అభీష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధ లో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదువ వలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్.
 'శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకంతరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం.
 శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశనశత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
 అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసిచివరిలో స్వామికి విశేషర్చన జరిపించి'' మయాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వర దో భూత్వా మామాభిష్ట సిద్దం ద దాతు'' అని జలమును అక్షత లతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం,శిర స్స్నానం, నేలపడక, సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.ఆచరణ: భక్తులకు ఏ బాధలు కల్గినా నియమాలు చెప్పి వారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వార తోలగునట్లు చేయాలి. హనుమత్పు దక్షిణ ధ్యానం శీలాఫలకం పై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెల్పాలి.అభి షేకంపరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కావున ఆయనకు అభిషేకం ఇష్టం. అందునా మన్యు సూక్త అభిషేకంచే పరమానంద భరితుడౌతాడు. కోరికలు  తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర నాడు తప్పక చేయాలి. వారం వారం, నిత్యమూ చేయగల్గుట మరీ మంచిది.

                                       సర్వేజనా సుఖినోభవంతు!!

Monday, June 29, 2015

చందిప్ప గ్రామంలో వెయ్యేళ్ళనాటి మహా మహిమాన్విత శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర ఆలయం(మరకత సోమేశ్వరలింగ ఆలయం)











































గత ఆదివారం మావూరిలో బంధుమిత్రులతో కలసి మహాశివునికి లక్షపత్రిపూజ! ఈ ఆదివారం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి కి దగ్గరలోని
చందిప్ప గ్రామంలో వెయ్యేళ్ళనాటి మహా మహిమాన్విత శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర ఆలయం(మరకత సోమేశ్వరలింగ ఆలయం) లో అభిషేకం చేసుకునే భాగ్యం ఆ మహాశివ సంకల్పం...ఈ ఆలయం ప్రాచుర్యంలోనికి శ్రీ నరేష్ కుమార్ అనే ఒక మహానుభావుడు ఆయన సెల్ నం: 9440016988..ఇంకా ఆలయ వివరాలు ఆయన రూపొందించిన బ్లాగ్ ను ఈ దిగువ ఇచ్చిన బ్లాగ్ అడ్రస్ ను క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి!   http://chandippamarakathashivalingam.blogspot.in  
 ఆలయం వివరాలు క్లుప్తంగా...
ఈ మహాలయ ప్రాంగణం లో ఉన్న శిలా శాసనం ప్రకారం పశ్చిమ చాళుక్య వంశ రాజులలో సుప్రసిద్ద 
చక్రవర్తి శ్రీ త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుడు ( క్రీ.శ.1076 నుండి 1126 వరకు ) పరిపాలనను సాగించెను.
ఈ మహా రాజు తన పరిపాలనలో భాగంగా, తన అతి విశాల భూభాగా సామ్రాజ్యమందు నిత్య భూదాన వశాత్, చందిప్ప గ్రామమును వేదపారంగతులైన భూసురులకు (బ్రాహ్మణులకు) అగ్రహారంగా ప్రకటించి, ఈ గ్రామ సీమ యందు గల సమస్త భూమిని ఆ అగ్రహారమునకు, అక్కడి మహాజనులకు, పురజనులకు మరియు అక్కడ వేద విద్యనభ్యసించు, విద్యార్థుల మరియు అధ్యాపకుల భోజన వసతులకు, స్థానపతి జీతభత్యాల కొరకు మరియు అక్కడ ఒక సోమేశ్వరాలయ స్థాపనకు, ఆ దేవుని అంగరంగ భోగములకు, విశేష పూజలకు, ఆలయ నిర్వాహణ, రథోత్సవ, శివరాత్రి మొదలగు దైవ కార్యక్రములకు గాను పశ్చిమ దిశలో "హెబ్బి హొలు" అను పేరు గల పొలములో 153 ఎకరాలు నల్ల రేగడి భూమి ని, మరియు  దేవుని నైవేద్యమునకు గాను "హరియ కట్టె" లో  తూర్పు దిశగా 2-20 ఎకరాల నీరావరి (వరి) భూమిని మరియు, ఆ మహా దేవుని నిత్య పూజకు, పూదోటకు గాను దేవాలయ దక్షిణ దిశగా ఒక మత్తరు భూమిని, మరియు తూర్పున గల మాతంగి పొలమును దేవలాయానికి ధారదత్తము చేయడమైనది. కావున ఇట్టి దేవ మన్యాన్ని అక్కడి గ్రామ ప్రజలు, గ్రామ ప్రభువు రక్షించాలని ఆదేశం.
                      ఇంతే గాక దేవుని నిత్య నంద దీపమునకు ఒక నువ్వుల గానుగను మరియు మహా నైవేద్యమునకు ఉత్తర దిక్కునగల 54 ఎకరాల తాటి వనమును దైవ మాన్యముగా అర్పించడం జరిగినది.
స్వస్తి మహా సకల అధ్యయన, అధ్యాపన స్వాధ్యాయ, ధ్యాన, ధారణ, మౌన, అనుష్టాన, జప, హోమ, సమధి, శీల సంపన్నులైన బ్రహ్మనోత్తములైన స్థానాపత జ్యోతిష్కుడు _________ భట్టాచార్యుడుగా నియమించి, శ్రీమచ్ఛాలుక్య విక్రమ కాలపు (1101 A.D.) విక్రమాదిత్యుడు పట్టాభిశక్తులైన 25వ సంవత్సరం లో, విషు నామ సంవత్సరమున కార్తీక మాసము నందున శుక్ల పక్ష పంచమి తిధి బృహస్పతి వారము రోజున అనగా విక్రమ శకం 1101A.D., అక్టోబరు నెల, 23వ తేది గురు వారము నాడు  సోమేశ్వర లింగ ప్రథిష్ట గావించి, జక్కణబ్బె నామ ధేయురాలైన శివ భక్త శిరోమణి ధర్మము చేయగా ఆలయ నిర్మాణమునకు మరువోజనుని పుత్రుడు తమ్మోజన సోదరుడు ఆలయ నిర్మాణమును గావించారు. 

ఈ రోజు 'విస్సా ఫౌండేషన్ ' బ్లాగ్ మొదటి పుట్టినరోజు



2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు ' విస్సా ఫౌండేషన్' బ్లాగ్ తెరిచాము మా బ్లాగ్ విజయోత్సాహం!! ఇదిగో చూడండి. నేటికి సరిగ్గా ఒక సంవత్సరం. .24 దేశాలకు( యునైటెడ్ స్టేట్స్13007 మందితో  మొదటి స్థానంలో,  ఇండియా 6041 మందితో రెండవ స్థానం లో, రష్యా (204), యునైటెడ్ కింగ్ డం (112),  ఆస్ట్రేలియా (82), పోర్త్యుగల్ (66), ఫ్రాన్స్(53), సింగపూర్ (48), సౌదీ అరేబియా (43), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(42), ఐర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, ఒమన్, స్పెయిన్, కెనడా, చైనా, పోలాండ్, బహరేన్) చెందిన 20,130 మంది వీక్షకులు మా ' విస్సా ఫౌండేషన్ బ్లాగ్'  సందర్శించడం ఒక పక్క మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది...మరోపక్క మా వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా మా బ్లాగ్ ను నిర్వహించే భాద్యతను మరింత పెంచుతోంది. ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన మా విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే  ఈ లంకె మీద నొక్కండి,  https://vissafoundation.blogspot.com మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!....ఈ ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ 'యు ట్యూబ్ లో' 63 వీడియో లను వీక్షకుల ఆనందం కోసం ఉంచడం జరిగింది. ఈ లంకె మీద నొక్కండి.  https://www.youtube.com/channel/UCqz6Qi6b8UuK-hiIs-6np_Q  

అలాగే మా పినపళ్ళ గ్రామ విశేషాలు, తెలుగు వికీపీడియా లో ఈ లంకె మీద నొక్కండి.    https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AA%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3  

మా విస్సా ఫౌండేషన్ గురించి, తెలుగు వికీపీడియా లో ఈ లంకె మీద నొక్కండి.  
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE_%E0%B0%AB%E0%B1%8C%E0%B0%82%E0%B0%A1%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D  
......... 

 ఇంకా టోరీ ఇంటర్నేషనల్ రేడియో లో, రేడియో కేక లో మా విస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల ప్రసారాలు కూడా యు ట్యూబ్ లో వినవచ్చు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా విశ్వవ్యాప్త విస్సా పీఠం కార్యక్రమాలను మరింత సర్వజన మనోరంజకంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడ వలసిందిగా మా వినమ్ర విన్నపం! .....ధన్యవాదములతో.      మణిసాయి - విస్సా ఫౌండేషన్.

శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి.

శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి.
అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే,
ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు నిర్దేశించబడ్డాయి.
1,సద్యోజాత ముఖం ( పశ్చిమ)
2,తత్పురుష ముఖం (తూర్పు )
3,అఘోర ముఖం (దక్షిణ )
4,వామదేవ ముఖం (ఉత్తర )
5,ఈశాన ముఖం (ఆకాశం)
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం.
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.
ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.
మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది. దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.
తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.
ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని ఇస్తుంది.
1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు.
2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు.
3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యం ప్రసాదిస్తాడు.
అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.
శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి నుండి సేకరణ.

శివ స్తోత్రాల పారాయణ -- వారముల ఫలితం.

                  శివ స్తోత్రాల పారాయణ -- వారముల ఫలితం.
1. ఆదివారం -- అఖిలాష్టమకము.పటించడం వలన - సర్వాభీష్టసిద్ధి, సంతానము.
2. సోమవారము -- చంద్రసేఖరాష్టకం పటించడం వలన - ఆయుష్షు, ఆరోగ్యం,     మనశ్శాంతి .
3. మంగళవారం -- కాలబైరవాష్టకం పటించడం వలన - సర్వదోష పరిహారం.
4. బుధవారం -- విశ్వనాధాష్టకం పటించడం వలన - విద్య, ధనధాన్య సమృద్ధి .
5. గురువారం -- శివాష్టకం పటించడం వలన - సర్వపాపనాశనం .
6. శుక్రవారం -- లింగాష్టకం పటించడం వలన - ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మనాశనం.
7. శనివారం -- శివనామావళి అష్టకం పటించడం వలన - ఆగామి, సంచిత ప్రారబ్ధ  కర్మనాశనమ్.
ఇలా ప్రతిరోజూ శివుని పూజించడం వలన మంచి జరుగుతుందని పెద్దలు చెప్పారు.

                                     సర్వేజనా సుఖినోభవంతు!!!

Sunday, June 28, 2015

అభిషేకప్రియుడు శివుడు ! ఆ స్వామికి చేసే అభిషేకాలు వాటి ఫలితాలు!!

హర హర మహా దేవ షంభో శంకర!
అభిషేకఫలం
పరమశివునికి ఉన్న అనేక పేర్లలో " ఆశుతోషుడు" ఒకటి !
ఆస్తోషుడు అంటే స్వల్ప మాత్రానికే సంతోషించేవాడని అర్ధం.
అందుకే శ్రీనాధ సార్వ భౌముడు స్వామి భక్తసులభుడు అని ఈ కృంద విధముగా వర్ణించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేనువతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె  చెట్టు !
అంటే శివుని శిరస్సుపైన కాసిన్ని నీళ్ళు జల్లి, కాస్తంత పత్రిని వేసినంత మాత్రానికే , ఆ భక్తుని ఇంట కామధేనువు గాట కట్టిన పశువు అవుతుందట.
అలాగే దేవతా వృక్షము అయిన కల్ప తరువు ఆ భక్తుడి ఇంట మల్లె  చెట్టు అవుతుందట!
ఆ స్వామి అభిషేకప్రియుడు.
స్వామికి  వివిధ ద్రవ్యాలతో చేసే అభిషేకం వివిధ ఫలితాలను కలుగ చేస్తుంది అని శాస్త్ర వచనం
శివునికి నెయ్యతో భిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది.
పెరుగు తో అభిషేకం చేస్తే కీర్తి, ఆరోగ్యం కలుగుతాయి.
తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి కలుగుతుంది.
చెరకు రసంతో అభిషేకం ధనవృద్ధి!
పంచదార తో చేస్తే దుఃఖ నాశనం!
కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపదల వృద్ధి,
విభుతి నీటి తో చేసే అభిషేకం మహా పాపాలను నశింపచేస్తుంది.
నవరత్న జలాభిషేకం ధనధాన్య ,పశుపుత్ర లాభాన్ని,
మామిడి పండ్ల రసంతో చేసే అభిషేకం చర్మ వ్యాధుల నిర్మూలనం,
పసుపు నీరు తో చేసే అభిషేకం సౌభాగ్యాన్ని కలిగిస్తాయి.
నువ్వుల నూనేతో అభిషేకిస్తే అపమృత్యువు భయం తొలగిపోతుంది.
పుష్పోదకాభిషేకం భూలాభాన్ని , బిల్వ జలాభిషేకం భోగభాగ్యాలను ప్రసాదిస్తాయి.
రుద్రాక్ష ఉదకంతో చేసే అభిషేకం ఐశ్వర్యాన్ని,
గరికి నీటి తో అభిషేకం చేస్తే ధన కనక వస్తువులు, మరియూ వాహనాలను ప్రసాదిస్తుంది.
సువర్ణ ఉదకాభిషేకం దారిద్ర్యాన్ని పోగొడుతింది.
కస్తురికా జలాభిషేకం చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.
సదా శివానుగ్రహ ప్రాప్తిరస్తు!!! 

మనం నిత్యం ఆహారంలో తీసుకునే కూరగాయలు, పళ్ళు, పప్పుధాన్యాలు లో ఎన్నో రోగాలను నయం చేసే శక్తి వుంది.

మనం నిత్యం ఆహారంలో తీసుకునే కూరగాయలు, పళ్ళు, పప్పుధాన్యాలు లో ఎన్నో రోగాలను నయం చేసే శక్తి వుందని మన పెద్దలు చెపుతూ వుంటారు. చిన్ననాటినుంచి పిల్లలకు అన్నిరకాలు తినే అలవాటు చేస్తే మంచిది.మన ఆహార పదార్ధాలలో ఉన్న ఉపయోగాలు ఏమిటో  తెలుసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !!!  
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
• ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.
యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ తెలియచేయండి.

మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారిపై శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు

పెరిగిన ఒక మహా హిమాలయంల కాలసముద్రగర్భంలో కరిగి కలసిపోయిన వైనాన్ని చూసి మరో మహిమాలయం కన్నీరు కారుస్తున్నట్లు వుంది ఇది చదువుతుంటే...గ్లోబల్ వార్మింగి కి కాదు మంచు శిఖరాలు కరుగుతున్నది. విశ్వ వీక్షణలో అనాదిగా సాక్షీభూతంగా నిలిచి  పెరిగిపోతున్న దానవత్వం, తరిగి పోతున్న మానవత్వం చూసి చూసి హిమాలయాలు కరిగిపోతున్నాయి.       నిజానికి  కాలసముద్రగర్భంలో కరిగి కలసిపోయిన ఒక మహా నది వైనాన్ని గూర్చి ఒక మహా సాహితీ శిఖరం కన్నీరు కారుస్తున్నట్లు వుంది. ఇది చదువుతుంటే... కనీసం శతక సాహిత్యం కూడా నేర్పకుండా అమ్మభాషను బలిపెట్టి, ఆంగ్ల భాషను బ్రతుకు తెరువుకి భాషని ముడిపెట్టి, నాటి పెద్దబాల శిక్షను పక్కకు నెట్టి, కే. జీ ల నుంచి పీ.జీ ల దాకా చదువుల పేరిట ముక్కుపచ్చలారని చిన్నారుల వీపులపై నేటి బాలలకి పెద్దశిక్షలు వేస్తూ తెలుగు బిడ్డలను విదేశాల వీధుల్లో బానిసలుగా, ఆడ్డా కూలీలుగా నిలబెట్టిన మన సమకాలిక తెలుగుప్రపంచానికి ఇటువంటి చేతనా జీవుల ఉనికి ఎందుకు పడుతుంది. శ్రద్ధాంజలి కూడా ఘటించకుండా...కనీసం కన్నీరైనా కార్చకుండా దొంగనిద్ర నటిస్తోంది. అందుకే ఈ దుస్థితి వల్లే ఇటీవల కాలంలో మొన్నటికి మొన్న దాశరధి గారు, శివానంద మూర్తిగారు, నిన్న శ్రీ రామచంద్రుడు గారి వంటి ఎందఱో మహానుభావుల అంతిమ యాత్రలు మహా నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. నేటి తెలుగు బాలబాలికలకు అలనాటి సాహితీ వాసనలు వీలైనప్పుడు మనం రుచి చూపించడమే ఆ మహానుభావులకి  మనం ఇవ్వగలిగిన ఘనమైన నిజమైన నివాళి!  "పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు" అన్న కవి గారి పలుకులు నిజం చేస్తూ మిగిలిన వారిని ఇప్పటికైనా గౌరవించు కోవడం మొదలుపెడదాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.   

మహామహోపాధ్యాయ పుల్ల్లెల శ్రీరామచంద్రుడుగారు నిర్యాణం చెందటం భాషకీ, సాహిత్యానికీ, సంస్కృతికీ పెద్దలోటు.
గ్రీకులోనో,లాటిన్లోనో లేదా కనీసం డాంటే, షేక్స్పియర్,గొథేవంటి సాహిత్యవేత్తలమీదనో కృషి చేసినపండితుడెవరైనా యూరోప్ లో ఇప్పుడు మరణించిఉంటే పత్రికలు, విశ్వవిద్యాలయాలు, సాహిత్యవేత్తలు ప్రపంచమే కూలిపోయినంతగా శోకించిఉండేవారు. కొన్నాళ్ళ పాటు ఆయన గురించీ,ఆయన కృషిగురించీ, ఆయన మాట్లాడినవిషయాలగురించే మరింత మరింతగా మాట్లాడుకుంటూ ఉండేవారు. కాని సమకాలిక తెలుగుప్రపంచానికి శ్రీరామచంద్రుడుగారు మాట్లాడినవిషయాలపట్ల, కృషిచేసిన రంగాల పట్ల, అందించిన కానుకలపట్ల సహజంగానే గొప్ప ఆసక్తి అంటూ ఏదీలేదుకాబట్టి ఆయన నిష్క్రమణ కూడా దాన్నెక్కువగా చలింపచేసినట్టు కనిపించదు.
కాని నా వరకూ నేను శ్రీరామచంద్రుడుగారికి ఎంతో ఋణపడిఉంటాను. సంస్కృత, ప్రాకృత వాజ్మయాలకు చెందిన అపురూపమైన సారస్వతాన్ని ఆయన తేటతెలుగులో ఎంతో శ్రద్ధతో, అవగాహనతో, అనితరసాధ్యమైన పరిశ్రమతో ఒక పరంపరగా వెలువరిస్తూ వచ్చారు. ఆయన రచనలే లేకపోయిఉంటే ప్రాచీన భారతీయ సాహిత్యంలోకి నేను ప్రవేశించి ఉండగలిగేవాణ్ణి కానని చెప్పగలను.
శ్రీరామచంద్రుడుగారు శతాధిక గ్రంథకర్త. ఆయన వ్యాఖ్యానసహితంగా తీసుకువచ్చిన అనువాదాలు ప్రధానంగా మూడు రంగాలకి సంబంధించినవి. మొదటిది, ఇతిహాసాలు, రామాయణానికీ, మహాభారతానికీ చేసిన అనువాదాలు. రెండవది, దర్శన గ్రంథాలు, బ్రహ్మసూత్రభాష్యం, సర్వదర్శన సంగ్రహం వంటి ఎన్నో అపురూపమైన భారతీయ దర్శన గ్రంథాలకు చేసిన అనువాదాలూ, వ్యాఖ్యానాలూను. మూడవదీ, ఎంతో విశిష్టమైందీ, ఆలంకారవాజ్మయానికి చేసిన అనువాదాలు, నాట్యశాస్త్రం, ధన్యాలోకం,అలంకారశాస్త్రచరిత్ర, కుంతకుడి వక్రోక్తి జీవితము, ప్రాకృతభాషా చరిత్ర వంటి అద్భుతమైన గ్రంథాలు. వీటిలో ఏ ఒక్కదానిమీద కృషి చేసి అనువాదం వెలువరించినా ఏ భాష అయినా ఆ మహనీయుడికి తరతరాలుగా ఋణపడిఉంటుంది. అట్లాంటిది ఇన్ని పుస్తకాల్ని అనువదించి అందించిన మహనీయుడికి తెలుగుభాష ఎంత ఋణపడిఉండాలో కదా.
అన్నిటికన్నా ముందు శ్రీరామచంద్రుడిగారిని వాల్మీకి రామాయణం అనువాదానికి ప్రస్తుతించాలి. ఏడు కాండలకీ ఆయన చేసిన అనువాదాన్ని, బాలానందిని పేరిట ఆయన వ్యాఖ్యానాన్ని ఆర్ష విజ్ఞాన ట్రస్టు వారు 1993 లో ప్రచురించారు. ఆ ప్రచురణ తెలుగులో రామాయణ సాహిత్యంలో ఒక మైలురాయి.
అందులో ఆయన రామాయణ శ్లోకం,ప్రతిపదార్థం, తాత్పర్యంతో పాటు అక్కడక్కడ ఎంతో ఔచిత్యంతో కూడిన వ్యాఖ్యానం చేసారు. నేను ఆ పుస్తకం ఆధారంగా వాల్మీకిని కూడబలుక్కుని చదువుకోగలిగాను. ఆయన ఇచ్చిన ప్రతిపదార్థం అన్వయక్రమంతో ఇచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఒక విద్యార్థిలాగా ఆ అన్వయతాత్పర్యాల్ని బట్టి వాల్మీకిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ అనువాదం కూడా ఎంతో సరళంగా, శుభ్రపదజాలంతో కూడుకున్న తెలుగు. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:
రజ: ప్రశాంతం సహిమోద్యవాయు
ర్నిదాఘదోషప్రసరా: ప్రశాంతా:
స్థితా హి యాత్రా వసుధాధిపానాం
ప్రవాసినో యాంతి నరా: స్వదేశాన్ (కిష్కింధాకాండ, 28:15)
(ఇపుడు పరాగము శాంతించినది, వాయువు చల్లగా ఉన్నది.గ్రీష్మఋతువుకు సంబంధించిన తాపాదిదోషములు తగ్గినవి. రాజుల యుద్ధయాత్ర నిలిచిపోయినది. దేశాంతరములకు వెళ్ళినవారు స్వదేశములకు తిరీగివచ్చుచున్నారు.)
బాలేంద్రగోపాంతరచిత్రితేన విభాతి భూమిర్నవశాద్వలేన
గాత్రానుపృక్తేన శుకప్రభేణ నారీవ లాక్షోక్షితకంబలేన (28:24)
(చిన్న ఇంద్రగోపకీటకములచేత మధ్యమధ్య చిత్రవర్ణముగా నున్న కొత్త పచ్చికబీడులతో భూమి లత్తుక చుక్కలు చల్లిన చిలుకవర్ణముగల కంబళముశరీరముపై కప్పుకున్న స్త్రీవలె ప్రకాశించుచున్నది.)
షట్పాదతంత్రీ మధురాభిధానం ప్లవంగమోదీరితకంఠతాలం
ఆవిష్కృతం మేఘమృదంగనాదైర్వనేషు సంగీతమివ ప్రవృత్తం (28:36)
(వనములలో సంగీతము ప్రారంభమైనట్లున్నది.దీనిలో తుమ్మెదల ధ్వనులే మధురమైన వీణాధ్వనులు,మండూకముల కంఠధ్వనులే కంఠతాళములు, మేఘధ్వనులే మృదంగధ్వనులు.)
ఈ అనువాదం ఇంత సరళసుందరంగా ఉందికాబట్టే, కేవలం ఈ అనువాదాన్నే ఇప్పుడు మళ్ళా రెండుసంపుటాలుగా ప్రచురించారు. రామాయణానికి మూలవిధేయంగా వచ్చిన అనువాదాల్లో ఇదే సర్వోన్నతమైందని చెప్పడానికి నాకు సంకోచం లేదు.
రామాయణం తర్వాత, ఆయన పుస్తకాల్లో నేను పూర్తి స్థాయి విద్యార్థిగా పఠించింది ధ్వన్యాలోకం. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం, దానికి అభినవగుప్తుడు రాసిన వ్యాఖ్య లోచనం రెండిటినీ కలిపి వాటికి తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఆయన వెలువరించిన అనువాదం ఒక్కటిచాలు, ఆయనకు నాబోటివాళ్ళు జన్మజన్మలకీ ఋణపడిఉండటానికి.
అయిదారేళ్ళకిందట నేనొక పత్రికలో నేను తిరుప్పావై మీద ఒక వ్యాసం రాసినప్పుడు అందులో ఆలంకారిక పరిభాష తప్పుగా పలికానని ఒక ప్రసిద్ధ రచయిత, తెలుగు ఉపన్యాసకుడు నన్ను భరించలేనంతగా అవహేళన చేసాడు. నన్ను నేను సరిచేసుకుందామనే ఉద్దేశ్యంతో ఎవరైనా ధ్వన్యాలోకం పాఠం చెప్పేవాళ్ళున్నారా అని రాళ్ళబండి కవితాప్రసాద్ ని అడిగాను. ఆయన ఎవరి పేరో చెప్పాడుగాని,వాళ్ళు నాకు అందుబాటులో ఉన్నవాళ్ళుకారు. ఒకరోజు ఆ తపన మరీ తీవ్రంగా ఉన్నప్ప్పుడు నా పుస్తకాల అలమారులో ఈ పుస్తకం కనబడింది. 1998 లో వచ్చిన ఈ పుస్తకాన్ని నేను 2000 లోనే కొనుక్కున్నానుగాని చదవలేదు. వెంటనే తెరిచి అధ్యయనానికి పూనుకున్నాను. దీనికి సహాయంగా 'ఆయనే వెలువరించిన 'అలంకార శాస్త్ర చరిత్ర ' (2002)ఎలానూ ఉండనే ఉంది. ఆ తరువాత రోజుల్లో ప్రసిద్ధ పండితుడు నరాల రామారెడ్డిగారు 'గాథాసప్తశతి'లోంచి 300 కవితలు అనువాదం చేసి నాకు పంపిస్తూ ముందుమాట రాయమని అడిగినప్పుడు, నేను ఎంతో సాహసంతో ఆ పనికి పూనుకోవడం వెనక శ్రీరామచంద్రుడిగారి ధ్వన్యాలోకం ఉందని చెప్పితీరాలి.
ఇవి కాక మరొక పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది ' ప్రాకృత భాషా వాజ్మయ చరిత్ర '(2002). ప్రాకృతసాహిత్యం గురించి ఇంగ్లీషులో చాలా పుస్తకాలు ఉన్నాయి. కాని ఇంత సమగ్రంగా ఉన్న పుస్తకం మాత్రం ఇదే, ఇది అనువాదం కాదు. మొత్తం ప్రాకృత వాజ్మయమంతటినీ సంక్షింప్తంగానూ, సమగ్రంగానూ ఒకచోట ప్రస్తావించిన పరిచయం.
ఇందులో కూడా కొన్ని ప్రాకృత గాథలకి రమణీయమైన అనువాదాలు లేకపోలేదు. ఒకటి రెండు చూడండి, మచ్చుకి, మొదటిది గాథాసప్తశతినుంచి, రెండవది వజ్జలగ్గం నుంచి, మూడవది కర్పూరమంజరినుంచి:
అద్దం సణేణ పేమ్మం అవేఇ అ ఇదంసణేణ వి అవేఇ
పిసుణజణజంపి ఏణ వి అవేఇ ఏమే అ వి అవేఇ (పే.202)
(చాలాకాలం పాటు చూడకపోతే ప్రేమ తగ్గిపోతుంది. ఎక్కువగా చూస్తున్నా తగ్గిపోతుంది. చాడీలు చెప్పేవాళ్ళ మూలాన తగ్గిపోతుంది, ఏమిటో,అలాగే తగ్గిపోతుంది.)
లలిఏ మహురక్థర ఏ జవ ఈయణ వల్లహే ససింగారే
సంతే పా ఇయ కవ్వే కో సక్క ఇ స్క్కయం పఢి ఉం.(పే.204)
(లలితమూ, మధురాక్షరయుక్తమూ, యువతులకు ప్రియమూ శృంగారభరితమూ అయిన ప్రాకృత కావ్యం ఉండగా సంస్కృతం ఎవడు చదువుతాడు?)
పరుసా సక్క అబంధా పా ఉ అబంధో వి హో ఈ సు ఉమారో
పురి సమ్హిలాలాణాం జేత్తి అమిహస్తరం తేత్తి అమిమాణం (పే.211)
(సంస్కృతపదబంధాలు పరుషంగా ఉంటాయి. ప్రాకృత బంధాలు సుకుమారంగా ఉంటాయి. ఈ రెండింటికీ ఉన్న తేడా పురుషులకూ, స్త్రీలకూ మధ్యనున్న తేడా వంటిది.)
బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యభాష్యంతో చేసిన అనువాదవ్యాఖ్యానాలు, నాట్యశాస్త్రం మీద అనువాదవ్యాఖ్యానాలు నేనింకా చదవాలి.ఇట్లాంటి గ్రంథాల్ని సంస్కృతంలో ఎలానూ చదవలేం. ఇంగ్లీషు అనువాదాలు ఉంటాయిగాని, అవి చదివితే మనసుకు పట్టవు. తెలుగులో చదివితేనే అవి వంటపడతాయి. ఆ రహస్యం తెలుసు కాబట్టే ఆయన తన జీవితమంతా అందుకు అంకితం చేసారు.
అది కూడా ఎట్లాంటి కృషి! ఆయన పుస్తకాల్ని కంపోజ్ చేసే మిత్రులు సమంత గ్రాఫిక్స్ కృష్ణగారు, పవన్ గారూ నాకొక సంగతి చెప్పారు. ఒకరోజు ప్రూఫుదిద్దిన డిటిపి అర్జంటుగా ఆయనకి ఇవ్వడానికి రాత్రి పదకొండుపన్నెండుమధ్య ఆయనింటికి వెళ్తే అప్పుడు కూడా ఆయన రాసుకుంటూ కనబడ్డారట!
శరీరం పరోపకారం కోసమే అనే సుభాషితానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ ఏముంటుంది?

Saturday, June 27, 2015

చింతామణి, సర్వరోగ నివారిణి అయిన వేపచెట్టు గురించి మంచివిషయాలను తెలుసుకొందామా !!!

వేపాకు, వేపచెట్టు - హిందూ సనాతన ధర్మంలో వేప కు ఒక విశిష్టమైన స్థానం వుంది. భారతీయ పురాణాల ప్రకారం వేపచేట్టును లక్ష్మీదేవి గా భావిస్తారు.
అంతటి ప్రాశస్త్యం  కలిగిన వేపచెట్టు గురించిన కొన్ని విషయాలు:

వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి అరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది. వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంధంలో చరకుడు ఇలా చెప్పాడు.... "ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు". ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు. భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. వేపపువ్వు హిందువులు ఉగాది పచ్చడి లో చేదు రుచికోసం వాడతారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప. కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది. చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకోవాలి. చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. ఆయుర్వేదిక్ ఉపయోగాలు రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపా కులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడు క్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటి మలు, మచ్చలు తగ్గుతాయి. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగుసేవిస్తుంటే కడుపు, పేగు ల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. మీజిల్స్, చికెన్పాక్స్లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండుసార్లు వేప చిగు ళ్లకు రెట్టింపు చింత ఆకు కలిపి నూరి ఉండ చేసి పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగితూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గుతుంది. వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కాలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మూత్రమార్గ ఇన్ఫెక్షన్ తగ్గి మూత్రమార్గంనుంచి చీము రావడం తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి. అలాగే ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్త శుద్ధి జరిగి ఒంటి దురదలు, తామర, పుండ్లు, మచ్చలు, గుల్లలులాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. వేపబంక చూర్ణాన్ని రెండుపూటలా అరస్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది.వేపనూనె, నీరుడు విత్తుల తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పై పూత మందుగా కుష్టువ్యాధిలో ఎక్కువగా వాడుతారు. ఎండించిన వేపపండ్ల చూర్ణం, ఉప్పు, పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా వాడవచ్చు. వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయంపూట నీటితో సేవిస్తూ పై పూత మందుగా వేపపప్పును రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకూ మాడ్చి సల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి. ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాలకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగితూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్గున్యా వంటి వైరస్ వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకో దగిన దివ్యౌష ధమిది. కాడలను తొల గించిన తాజా వేప పువ్వులను వెడ ల్పాటి పాత్రలో వేసి తగి నంత పంచదార లేదా పటికబెల్లం వేసి బాగా కలిపి ఒక గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో ఒక నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవు తుంది. వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం, ముక్కులోనుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయి నట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి. పొంగించిన పటిక ఒక భాగం, వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది. వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి. ఈ బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్ అనే చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుందని అనుభవ వైద్యం చెబుతోంది.
భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.
వేపపువ్వు ను హిందువులు (ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు)ఉగాది పచ్చడి లో చేదు రుచికోసం వాడతారు.
వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.
వేపనూనె ను క్రిమిసంహారి గా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు.
అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.
వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.
ఈ చెట్టు నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు.వేపచెట్టు అంధ్రప్రదేష్ రాష్ట్రమునకు రాష్ట్ర వ్రుక్షముగా తీసుకోబడినది. వేప తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్య భాగం గా వున్నది.ప్రతి సంవత్సరము తెలుగు సంవత్సరాది ఐన ఉగాది నాడు ఉగాది పచ్చడినందు వేప ఖచ్చితంగా ఉండవలసినదే.ప్రతి సంవత్సరము వేపకాయల కాలము నందు గ్రామాలలో చిన్నపిల్లలు మరియు వ్రుద్ధులు వెపకాయలను వేరి అమ్మడం మనం చూడవచ్చు.ప్రతి రైతు తన పొలమునందు ఖచ్చితంగా కనీసం ఒక వేపచెట్టైనా పెంచుకుంటారు.పొలం పని చేసి మధ్యలో వేపచెట్టు కిందే తలవాల్చి నిద్రిస్తాడు.మధ్యాహ్న సమయాన పొలం పని అయిన తరువాత వేపచెట్టు నీడలో కూర్చుని కూలీలు,రైతు,అందరు వాల్ల వల్ల చద్దిమూటలు విప్పి భోజనం చేస్తారు.కొన్ని గ్రామాలలోరచ్చ వేపచెట్టుని దైవంగా భావించి ప్రతి సుభకార్యమునందు మొదటగా వేపచెట్టునే పూజిస్తారు.ఇలా వేపచెట్టు మన సంస్కృతి లో ఒక ప్రధాన భాగమయింది.

Total Pageviews