బేడి ఆంజనేయ స్వామి అనగా ఎవరు? ఆయనకి ఎందుకు సంకెళ్ళు వేశారు?
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా సంనిదివీధిలో స్వామికి అభిముఖంగా అంజలిబద్ధుడై ఉన్న ఆంజనేయస్వామి బేడి ఆంజనేయ స్వామి. కాళ్ళకు, చేతులకు బేడీలు తగిలించిన మూర్తి కనుక ఈయనకు ఆపేరు వచ్చింది. ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు. తిరుమలలో తపస్సు చేసి ఆమె స్వామిని కన్నది. బాల్యంలో కోతిచేష్టలు, అల్లరిపనులు చేస్తూ తిరుగుతున్నా కుమారుణ్ణి కట్టడి చేయడానికి అంజనా దేవి బేడీలు వేసి ఆ వేంకటేశ్వరస్వామికి ఎదురుగా నిలబెట్టిందని ఐతిహ్యం. పూర్వం దేవస్థానానికి పాలకులైన పూరీ జగన్నాథంలోని సంప్రదాయంప్రకారం బేడి ఆంజనేయమూర్తిని స్వామి కెదురుగా నిలిపినారని కుడా పెద్దలు చెపుతారు.
No comments:
Post a Comment