Thursday, June 11, 2015

శుభోదయం.../\... లక్ష్మీదేవి నివసించే స్థానాలు.

శుభోదయం.../\...
లక్ష్మీదేవి నివసించే  స్థానాలు.
మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ  ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది.  ఆ సమస్య కొలిక్కి వచ్చిన  సమయంలో  లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో ఎక్కడ ఉండదో చెప్పింది.   
              గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గలవారికి ఆ శ్రీమహాలక్ష్మి తన కటాక్షాన్ని అందిస్తుంది. అతిగా నిద్రపోఎవారి ఇళ్ళల్లోనూ, ప్రాతఃకాల సమయంలో పూజ చేయని వారి ఇంటిలోనూ లక్ష్మీదేవి నివసించాడు. ఇల్లు పరిశుభ్రంగా  లేకపోయినా, గడపలకు పసుపు రాయకపోయినా, ఆడవారికి నిషిద్ధమైన 4 రోజులు పూజామందిరానికి దూరంగా ఉండకపోయినా లక్ష్మీదేవి ఆ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. ముగ్గు,పసుపు,పువ్వులు, పాలు, పళ్ళు, దూప, దీప, మంగళ ద్రవ్యాలు లక్ష్మీదేవి నివసించే స్థానాలు అని పెద్దలు చెపుతారు.   ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల  ఆమె కృప అన్నివేళలా  మనపై  ఉంటుంది.


No comments:

Post a Comment

Total Pageviews