Thursday, November 30, 2017

ప్రదోష సమయం చాలా శుభకరమైన సమయం.

ప్రదోష సమయం

‘ప్రదోష’ అనే పదానికి అర్ధం అధిక దోషం కల సమయం. కానీ నిజానికి ఇది చాలా శుభకరమైన సమయం. ఇంత శుభప్రదమైన కాలాన్ని శబ్దార్ధం ప్రకారం వ్యతిరేకమైన భావాన్ని స్ఫురింపజేసే ‘ప్రదోష’ అనే పదంతో వర్ణించటం వింతగా కనిపిస్తుంది. శబ్దార్ధం ప్రకారం కలియుగ అనే పదానికి పాపంతో నిండిన యుగం అని అర్ధం. కానీ ఈ యుగంలో తప్ప మరియే యితర యుగాల్లోనూ అధిక మోతాదులో పుణ్యం సముపార్జించటానికి అవకాశం లేదు. ప్రదోష కాలంలో ప్రజలు సమావేశమై పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే అ సమయం వారికి శుభప్రదమౌతుంది. అలాగాక వారు ఇతర కార్యక్రమాల్లో ఆ సమయాన్ని గడిపితే దోషాల్ని లేక అనర్ధాల్ని ఇస్తుంది. ప్రదోష సమయంలో చేసిన పాపాల ఫలితాలు మామూలు వేళల్లో చేసిన పాపాల ఫలితాలకంటే నూరు రెట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ కాలంలో ఒనరించిన పుణ్యాల ఫలితాలు కూడా ఇంచుమించు అదే నిష్పత్తిలో ఉంటాయి.

నిజాన్ని గ్రహిస్తే ప్రదోష కాలం చాలా పవిత్రమైనది. శుభప్రదమైనది కూడా. ఈ సమయంలో కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ సమావేశమవుతారు. కనుక ఈ సమయంలో ఇతర దేవతలా సాన్నిధ్యం కొరకు ఆయా దేవుళ్ళ ఆలయాలకు పోనక్కరలేదు. ఆ కాలంలో అందరు దేవతలు శివుని దగ్గరే ప్రత్యక్షమౌతారు. కాన ఆకాలంలో శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోబాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రదోషకాలం యొక్క విశేష లక్షణమిదే.

ఈ సమయంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మనకు దర్శనమిచ్చుట ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తాడు. ఆయన ఎడమవైపు పార్వతి రెండవ పార్శ్వమున శివుడు ఉంటారు. ఈ సమయంలో మనంఅర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే మనకు రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోర్కెలను నియంత్రించగల్గటం ఒకటి. కాలాన్ని అనగా మరణాన్ని జయించగల్గటం రెండవది. శివునకు కాల సంహారమూర్తియని, కామ సంహారమూర్తియని పేర్లున్నవి. శివునకు చాలా ఇతర నామాలున్నాయి. కంచిలో ఒక మామిడి వృక్షం క్రింద ఉంటాడు గనుక అక్కడ ఆయన్ని ఏకామ్రేశ్వరుడ౦టారు. మద్రాసులోని మైలాపూరులో ఆయన్ని కపాలేశ్వరుడని పిలుస్తారు. అక్కడ ఉన్న ఈశ్వరుడు చేతిలో కపాలాన్ని ధరించి ఉంటాడు. మన్మథుణ్ణి సంహరించాడు. గనుక ఆయనకు కామ సంహారమూర్తి అని పేరు కూడా ఉంది.

ప్రదోషకాలంలో ఉపామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేస్తుంది ఈ క్రింది శ్లోకం.

“శ్లో!! సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్
వామాంచి మాత్ర కలితే జనని త్వదీయే
కావా ప్రసక్తిరిహ కాలజయే పురారే!!

అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు మాత్రమె చెందుతుంది. నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం ఈయబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా, కానీ యిక్కడ పరమేశ్వరునకు మాత్రమె ఈయబడినది. అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగా యముణ్ణి తన వామపాదంతో తంతాడు. వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”

ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని ఈరూపంలో స్మరించిన ప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.

ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు. “ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా” విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసి౦హునకు మినహాయింపు ఈయబడింది. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః” -ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.

పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపంమనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్యసమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధి ఉన్నా ఇబ్బంది లేదు. కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి.

హనుమాన్ చాలీసా ఉద్భవo

 హనుమాన్ చాలీసా

ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.

వారణాసిలో నివసిస్తూవున్నసంత్ తులసీదాస్ : రామనామగాననిరతుడయిబ్రహ్మానందములోతేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలువెల్లువలవుతుండేవి. వారిప్రభావమువలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామరసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాలపట్లమాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.

ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకలులా వారిద్దరూ అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసాడు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించి పోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవు కనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవ్వాన్ని పాడెమీద పనుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది. 

శవ వాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలివిలపించటం మొదలెట్టింది.
గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులు తెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయినేదని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా నా నోట రాముడు అసత్యం పలికించడే! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నా తలరాత నా పసుపు కుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.

దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి ,తండోపతండాలుగా జనం వారినిదర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.

ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను , అమాయకులను మోసంచేస్తున్నాడని, పలు ఫిర్యాదులు చేసారు. దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.
తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.
అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?
అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?
అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.
మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?
అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.
సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.
క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి . మనకోరికలతో కాదు.

చూడు తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు . మీరామనామము, మీరు చెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.

రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదుషా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడనుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు, ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది . దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా, సింహ ద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ...... జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు.

దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేమి కావాలో కోరుకో అని అన్నారు.
అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధంకోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు.

దానితో మరింత ప్రియం కలిగిన స్వామి , తులసీ మాతకు అత్యంత ప్రీతిపాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు.అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనే వున్నది.

భారతీయ సంస్కృతి లోని 64కళలు

భారతీయ సంస్కృతి లోని 64కళలు
64 కళలు
ఇతిహాసాములు
ఆగమములు
కావ్యములు
అలంకారములు
నాటకములు
గానం
కవిత్వం
కామశాస్త్రం
దురోదరం
దేశభాష విజ్ఞానం
లిపి కర్మ
వాచకము
సర్వ విధ అవధానములు
స్వర శాస్త్రము
శకున శాస్త్రము
సాముద్రికము
రత్న శాస్త్రము
రథ కౌశలము
అశ్వ కౌశలము
గజ కౌశలము
మల్ల శాస్త్రము
సూద కర్మ
దోహదము
గంధవాదము
ధాతు వాదము
ఖని వాదము
రస వాదము
జల వాదము
అగ్ని స్తంభనం
ఖడ్గ స్తంభనం
జల స్తంభనం
వాక్ స్తంభనం
వయః స్తంభనం
వశీకరణం
ఆకర్షణము
మోహనము
విద్వేశము
ఉచ్చాటనము
మారణము
కాల వంచనము
పరకాయ ప్రవేశము
పాదుకా సిద్ధి
వాక్సిద్ది
ఇంద్ర జాలము
అంజనము
పర దృష్టి వంచనము
పర వంచనము
మణీ మంత్రౌశాధ సిద్దులు
చొర కర్మం
చిత్ర కర్మ
లోహ క్రియ
అస్మ క్రియ
మృత క్రియ
దారు క్రియ
వేణు క్రియ
చర్మ క్రియ
అంబర క్రియ
అదృశ్య కరణం
దండ కరణం
వాణిజ్యము
పాశుపల్యము
కృషి
ఆసవ కర్మ
లావకుక్కుట మేషాది యుద్ధ కారక కౌశలము

లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.

బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు.

లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న  తపోధనుడైన అగస్త్యుడిని చూచి

హయగ్రీవులు ఇలా అన్నారు.

లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా,  లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి, భక్తిప్రపత్తులతో అడుగుతున్నందువలన నీకు ఉపదేశము చేస్తున్నాను.

ఇవి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృ భక్తిలో పూర్ణ భక్తి గల వారికి, శ్రీవిద్య ఎరిగిన వారికి, శ్రీ దేవీ ఉపాసకులకు మాత్రమే యీ సహస్రనామములు చెప్పవలెను.

మంత్రములలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీవిద్యలలో ఎలా కాదివిద్య ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమైనదో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీవిద్యోపాసకులలో పరమ శివుడు ఎలా గొప్ప వాడో, అలా సహస్రనామాలలో యీ లలితా సహస్రనామాలు బహు శ్రేష్టాలు.

ఈ నామాలు పఠి౦చటం చేత శ్రీ లలితా దేవి బహు ప్రీతి నొందును. శ్రీచక్ర రాజములో లలితా దేవిని బిల్వ దళాలతోగాని, పద్మాలతో గాని, తులసి పత్రములతో గాని, ఈ సహస్రానామాలతో ఎవడు పూజిస్తాడో అతడికి లలితా దేవి వెంటనే మేలు చేకూర్చును.

చక్రరాజమైన శ్రీచక్రమును పూజించి, పంచదశాక్షరీ మంత్రాన్ని జపించి, తరువాత ప్రతి దినము యీ సహస్రానామాలతో కీర్తించ వలెను. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణం చేయాలి. ప్రతిదినము నిత్య కర్మల మాదిరి యీ లలితా సహస్రనామములు చేయవలెను.

శ్రీలలితా దేవి ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు యీ లలితా సహస్రనామములను స్తోత్రము చేసిరి.

సకల రోగాలను పోగొట్టి, సకల సంపదలను ఇచ్చే ఈ స్తోత్రమునకు సమానమైన స్త్రోత్రము ఇంతవరకు లేదు.

ఇది సమస్త అకాల మరణములను పోగొట్టి, అపమృత్యువుని దరి చేరనీయకుండా, సకల జ్వరాలను, రోగాలను శమింపజేసి, దీర్గాయుస్సును అందజేస్తుంది.

పుత్ర భాగ్యం లేనివారికి పుత్రులను ఇస్తుంది. ధర్మార్ధ కామ మోక్షా లనే నాలుగు పురుషార్ధములను చేకూరుస్తుంది.

లలితాదేవి పూజాతత్పరులు ప్రతిదినం ప్రయత్నపూర్వకముగా శ్రీవిద్యా జపము చేసి, శ్రీచక్రార్చన చేసి, ఈ నామములను చదువ వలెను.

గంగ మొదలైన నదులలో కోటి జన్మలు స్నాన మాచారిస్తే ఏ ఫలం కలుగుతుందో, కాశీ క్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ట చేస్తే ఏ ఫలం కలుగుతుందో, కురుక్షేత్రములో సూర్య గ్రహణ సమయంలో కోటిమార్లు దానాలు చేస్తే ఏ ఫలం దక్కుతుందో, గంగా తీరంలో కోటి అశ్వమేధ యాగాలను చేస్తే ఏ ఫలం దక్కుతుందో,

అంతటి పుణ్యానికి కోటి రెట్లు అధిక పుణ్యము యీ సహస్ర నామాలలో ఒక్కటి పఠి౦చినా కూడా లభిస్తుంది.

నిత్య కర్మలు చెయ్యకపోవటం చేత, నిషిద్ధ కర్మలు చెయ్యటం చేత కలిగే పాపాలు కూడా సమసిపోవటం నిశ్చయం. సమస్త పాపాలను పోగొట్టడంలో ఒక్క సహస్రానామానికి వుండే శక్తి ఎలాంటిది అంటే, ఈ పద్నాలుగు లోకాలలోని వారంతా కలిసి చేసే మొత్తం పాపాలు కూడా యీ సహస్రనామ శక్తికి తీసికట్టే. దాని శక్తికి మించినవి ఏ మాత్రం కావు.

ప్రతి రోజు చేయక పోయినా పుణ్య దినములలో, తన భార్య, తన బిడ్డల జన్మ నక్షత్రము వచ్చే రోజులలో, అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, శుక్రవారములలో ముఖ్యముగా పఠి౦చవలెను.

పౌర్ణమి నాడు చంద్రుడిలో లలితాదేవిని ధ్యానించి పంచోపచారముల చేత పూజ చేసి, సహస్ర నామములను పఠిస్తే సమస్త రోగములు పోయి, దీర్గాయుస్సు కలుగుతుంది. ఇది కామ్య ప్రయోగ విధి.

పిల్లలు లేని గొడ్రాలకి వెన్నను ఈ నామ పారాయణ చేత మంత్రించి యిస్తే గ్రహ పీడలు తొలగి పుత్రులు కలుగుతారు.

ఈ సహస్ర నామ పారాయణుని పై ఎవరైనా అభిచారాది దుష్ట ప్రయోగములు చేస్తే, ప్రత్యంగిరా దేవి ఆ ప్రయోగములను తిరుగ గొట్టి, ఆ ప్రయోక్తలను సంహరిస్తుంది.

 శ్రీదేవీ ఉపాసకులను, ఎవరైనా దూషించినా, నిందించినా, అనరాని మాటలు అనినా, అగౌరవపరచినా, అవమానపరచినా,  క్రూర దృష్టితో చూచినా, వాదించినా, వాడి ధనమును దోచినా, కృతఘ్నత చూపినా,
వాడ్ని క్షేత్రపాలకుడు అయిన శివుడు చంపుతాడు. నకులేశ్వరి వాడి నాలుకను తేగకోయును.
వాక్ స్థంభనము చేయును.

ఎవడు భక్తితో ఈ నామములను ఆరు నెలలు చేస్తాడో, అతడి యింట లక్ష్మీ దేవి స్థిరముగా ఉండును.

ఎవరు శ్రీవిద్యను ఉపాసన చేస్తారో, ఎవరు నిత్యం శ్రీచక్రాన్ని అర్చిస్తారో, ఎవరు యీ నామాలను కీర్తిస్తారో, వారికి దానం ప్రయత్న పూర్వకముగా ఇవ్వవలెను. దానం చెయ్యాలను కొనేవారు, పరీక్షించి శ్రీవిద్య తెలిసిన వారికే దానం చెయ్యవలెను.

లోక వాక్యాలకంటే విష్ణు సంకీర్తనం ముఖ్యం. అలాటి విష్ణు సహస్ర నామముల కంటే గొప్పది ఒక్క శివ నామము. శివ సహస్ర నామాలకన్నా దేవీ నామం ఒక్కటి ఎంతో మహిమ గలది.

దేవీ సహస్ర నామాలలో పది విధాలైన సహస్ర నామములు ప్రధానమైనవి. అవి గంగ, భవాని, గాయత్రీ, కాళి, లక్ష్మి, సరస్వతి, రాజ రాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. వీటిలో లలితా సహస్ర నామములు అతి శ్రేష్ఠమైనవి.

Wednesday, November 29, 2017

తెలుగు నవలలు

 మన ఇంట్లో ఓ వంద-నూటయాబై తెలుగు నవలలు వున్నాయనుకోండి...మీరు ఏరికోరి సేకరించినవి...వాటిని చూసుకున్నప్పుడు, మీకు ఎలా అనిపిస్తుంది....
ఎవరైనా వాటిలో కొన్నింటిని చదివి ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి, తిరిగి ఇవ్వలేదనుకోండి....మీకు ఎలా అనిపిస్తుంది...
మీకు ఇష్టమైన పుస్తకాలన్నీ, మీ అరచేతిలోనే వుండి, ఎవ్వరూ వాటిని తీసుకెళ్ళే అవకాశం లేక పోతే...ఎంత బాగుంటుంది కద....!!!
ఇదిగో మీకు అటువంటి ఒక అవకాశం....అందుకోండి....ఆనందించండి..
(ఇటువంటి అవకాశం నాకూ ఇచ్చిన వారికి  ధన్యవాదములతో...)....👇👇👇..
Madhu Babu detective Novels collection

https://app.box.com/s/eu33l8o4nj7psrszizm1mzuyhivlnrcf


Malladi Venkata Krishna Murthy Novels Collection

https://app.box.com/s/lmrf353l6yioq6kfoliypnkc0vqdhikl


Yandamuri Veerendranath Novels Collection

https://app.box.com/s/hh75fyidmqezifbuso2cj50zflmlf1ok


Yarramsetty Sai Novels

https://app.box.com/s/u24jxdewnx8xopubjipnnj7w8quhhrry


Vempalli Niranjan Reddy Novels

https://app.box.com/s/3kdq847eacwrisv5wa3w3psuomxoq2rc


Syambabu Novels

https://app.box.com/s/brbtjimej1e6f8bvbr3diq27znixl43j


Chanadamama Monthly 1950 to 2000 month wise in telugu

https://app.box.com/s/zzyai70lx7igc9xkuz2v


Mayamayi by Bolanath

https://app.box.com/s/tngcw1uyn78h2sp8rksv


Suryadevara Ram Mohan Rao Novels

https://app.box.com/s/5078odok5fjd9odezq0qvo3uo4x5vurv


Panuganti Detectives Novels

https://app.box.com/s/c7xzirjei9r2da7dem34k65rmgpgnnp9


NR Nandi Novels

https://app.box.com/s/spi1t1itxy3xhne2pph0m3olklu2lh6r


Mynampati Bhaskar Novels

https://app.box.com/s/ge6owm24spqn1476zyp3iemd1h56h22g


Mudigonda Sivaprasad Novels

https://app.box.com/s/u2epmowde4hrgqx1cvz4r7gmj7ui2yps


Merlapaka Murali Novels

https://app.box.com/s/xyh7ylnr7bzpsbwx7z4rm2bhitb25wtk


GV Amereswara Rao Novels

https://app.box.com/s/iglq0j5q1265ojas33nd182411l61jih


Dr. Smaram Novels

https://app.box.com/s/kh4lxmea730vuamt57q4ovvt26uwrgqh


Dr. Kirankumar Novels

https://app.box.com/s/dnbuew1rt0uhu2vip3tv58v7vjrc26cx


Different Writers Novels

https://app.box.com/s/c6zvh3fpgv4v3i5a96z8x8jv0ce3rmt8


Chandu Sombabu Novels

https://app.box.com/s/g7llbpactop8vvpmdhmw125ikxkq350j


Challa Subrahmanyam Novels

https://app.box.com/s/3uvqt2kzisx2zh1ks7xsc8un39nk7k21


Chalam Novels

https://app.box.com/s/awhnot0v32aavu27i8se5qbhuyd64l1y


C Anandaramam Novels

https://app.box.com/s/c31slfod968tanzp20dcsup8i5lx1cfh


Bollimunta Nageswara Rao Novels

https://app.box.com/s/8cgo5xqefstdaymambyb10nomg2utrac


Bapu and Ramana Novels

https://app.box.com/s/7rh0u4a2py99lzrdcvtf2o6ihxv9pkqi


Balabhadra Patruni Ramani Novels

https://app.box.com/s/7v2c61nxtvmwihr3o36d7256uwk9i698


Auto Biography's

https://app.box.com/s/4qxxyvjekfe3qtvmz124f13a8fa4hx8q


Akki Peddi Novels

https://app.box.com/s/71zuduq9gk9kkhfaac9dfcyx3bqzfsa9


Different Writers Novels Part II

https://app.box.com/s/52unmql3jcfcg8l6hmi7bo65aiues1xz

🙏తెలుగు భాషాభిమానులందరికి🙏

ఒక అవధానిగారు అవధానం చేస్తుండగా తెలివైన పృఛ్ఛకుడు అడిగిన విషయమిది.

దత్తపది!
తమన్నా - సమంతా - త్రిష - కాజల్
(ఈ పదాలన్నీ వచ్చేలా పద్యం చెప్పాలి)

అవధానిగారి పూరణ!
భీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో...

తేటగీతి:
తాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు - కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ రప్పించు త్రాగుటకా జలమ్ము

🙏తెలుగు భాషాభిమానులందరికి🙏

తెలుగు భాష మేటి భాష!

 తెలుగు భాష మేటి భాష!
-
అల్లరి చెయ్యమంటే తెలుగు వాళ్ళ తర్వాతే అండి.
జొన్నవిత్తుల గారి పద్యాల బాణీలో వ్రాసిన ఈ పారడి పద్యాలు .
-
పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!
.
మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!
.
పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు
దాని పైన మిర్చి దద్దరిల్ల
జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు
సాటి తెలుగు భాష మేటి భాష
.
స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
తాగ లెక సురులు ధరణి లొన
ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు
ఆవ కాయ కొఱకు నంగలార్చి.
.
కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
కారమింగువలను తగిలించి తిను వాడు
ఘనుడు తెలుగు వాడు కాదె భువిని
.
ఆట వెలది యనిన అభిమానమెక్కువ
తేట గీతి యనిన తియ్య దనము
సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు
కంద పద్యమెంత సుందరమ్ము
.

Tuesday, November 28, 2017

""నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరిక - ఒక కొడుకు కథ""

""నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని కోరిక - ఒక కొడుకు కథ""

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.

ఆమె పిల్లలు పడుకున్నారు!

భర్త  కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో అభిమాన  'క్యాండీ క్రష్ సాగా' ఆటలో లీనమై ఆసక్తిగా ఆడుతున్నాడు.

చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా  ఏడుస్తూ ఉంది.

ఆ ఏడుపు..వెక్కిళ్ళ శబ్దానికి గేమ్ ఆడుతున్న ఆమె భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!

 "ఓయ్ ! ఏమైంది?  ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చాలా రోజుల్నిండి నేను నిన్నేమి అనటం లేదుగా!!" అడిగాడతను టెన్షన్ తో

 "నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను!" "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రండీ!! " అని చెప్పాను!!

తాను ఒక ప్రశ్నను అడిగితే.. మరో సమాధానం చెబుతున్న భార్యను  విసుగ్గా చూస్తూ...

"సరేగానీ!! నీవ్వెందుకు ఏడుస్తున్నావు?" ప్రశ్నించాడతను.

"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"

భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడా బాబు?"

"వినండి చదువుతాను"

హెడ్డింగ్ ఇలా పెట్టాడు

"నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక."

అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు!

వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా..శ్రద్ధగా ..ఇష్టంగా చూసుకుంటారు...చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా!!

 నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది.. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది.. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!

అమ్మానాన్నలు..  ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా  స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చే లోపే వాళ్ళు.. ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు!
కానీ.. నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

ఒకవేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తూ వుంటే కూడా!!....

చివరికి అప్పుడు కూడా వాళ్ళు నాతో కాకుండా  స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!
 వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!

వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు!
అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!!కానీ వాళ్ళకి అది ముఖ్యం కాదు!

అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు!

అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!
ఎప్పుడూ తనలోనే ఉంచుకుంటారు!!
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!
దాన్ని చాలా ఇష్టపడుతారు!!
దానితో రిలాక్స్ అవుతుంటారు!!
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!
దానితో ముచ్చట్లు పెడుతారు!
దాన్ని చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వుతారు!
పడుకుంటునప్పుడు కూడా తనప్రక్కనే ఉంచుకుంటారు!!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు!!
దానితో చాలా ఆనందంగా ఆడుకుంటారు!!
దాన్ని ప్రేమిస్తారు!!

కాబట్టి! నా కోరిక ఏమిటంటే..నేను అమ్మానాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!!

 భార్య చదువుతుంటే..విన్న భర్తకు కూడా మనసంతా పిండేసినట్లైంది!! ఉద్వేగభరితుడయ్యాడు..అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

 "ఎవరు రాశారది? " అడిగాడు భార్యని..గొంతు గద్గదమౌతుండగా...

"మన కొడుకు" అంది భార్య  కన్నీరు కారుతుండగా!!!
వస్తువులను ఉపయోగించుకోవాలి!
బంధాలను ప్రేమించాలి!!

అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరుచుకుని  ప్రేమించడం మొదలుపెడుతూవుంటే .....క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడుతుంటాయి!!

‘భగవద్గీత’ విశిష్టత.

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.
1) ఏమిటా విశిష్టత..?
అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.
ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని ‘జయంతి’ గా జరుపుకుంటారు.
అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల ‘గీతాజయంతి’ ని జరుపుకుంటారు.
ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.
2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?
సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..
ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది.
3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..?
ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో…
ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..
ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..
అదే ఉంటుంది.
నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.
నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.
నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.
4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?
భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..
గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.
భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.
5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?
ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..
భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..
6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..
ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు…?
కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.
విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.
క్రైస్తవులు,మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం.. రక్తచరిత్రగా, సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.
వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..
ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..
“ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.”

Friday, November 24, 2017

వందనమయ్యా సుబ్రహ్మణ్యం వందితపాదా సుబ్రహ్మణ్యం


 సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్
హే స్వామినాథ కరుణాకర దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో
శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
దేవాది దేవసుత దేవ గణాధినాథ!
దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
నిత్యాన్నదాన నిరతాఖిల రోగాహారిన్!
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
క్రౌంచా సురేంద్ర పరి ఖండన శక్తి శూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపానే
శ్రీ కుండలీశ ధృతతుండ షిఖీస్ట్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
దేవాదిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠనగరం దృడ చాపహస్తమ్
శూలం నిహత్య సురకోటి భిరీడ్యమాన!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
హారాది రత్న మణియుక్త కిరీట హార!
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయీ మర బృంద
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
పంచాక్షరాది మనుమంత్రిత గాజ్ఞతోయై పంచామృతై:
ప్రముదితేన్ద్ర ముఖైర్మునీంద్రై:
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ!
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా!
కామాది రోగ కలుషీకృత దుష్టచిత్తమ్
భక్త్వా తు మా మవ కళాధర కాంతికన్త్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్
ఫలశృతి
సుబ్రహ్మణ్య కరావలంబమ్ పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదత:
సుబ్రహ్మణ్య కరావలంబమ్ ఇదం ప్రాతరుత్థాయ య: పఠేత్
కోటి జన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి!!!!!!

సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు!!!



సుబ్రహ్మణ్య షష్ఠి దీనినే సుబ్బరాయషష్ఠి అని, స్కందషష్ఠి అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజు ఈరోజు. సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు.  ఈరోజును  పండుగగా జరుపుకుంటాము. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు.శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.   తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది.

స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు వాటి అర్ధాలు తెలుసుకుందాం!!
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ - తమిళం లో పిలుస్తారు.

అందరికి ఆ స్వామి అనుగ్రహం కలిగి సుఖంగా ఉండాలని కోరుకొంటూ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు!!

పెద్దలను అర్ధం చేసుకో0డి

పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి!*
*చిన్న‌ సంఘటన.*
పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.* ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.
భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.
ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.
*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*
తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు.
*ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.*
ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.
*భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.*
అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు.
*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*
అప్పుడు *తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*
అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.
*పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*
తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.
*పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.*
తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడ‌వుండి రా! అన్నాడు.
*ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*
తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.
*భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.*
సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.
*రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.*
చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.
*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*
దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.
*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.*
భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.
*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*
ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
*భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*
ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.
*భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*
తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.
*చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!*
అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!
*తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు.*

ఓం శ్రీ మహా సరస్వత్యై నమః

శ్లో! అపూర్వః కోపి కోశోయం
విద్యతే తవ భారతి
వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్
తా.అమ్మా! సరస్వతీ దేవీ, నీ చెంత వున్న నిధి చాల అపూర్వమైనదమ్మా! విచిత్రం ఏమిటంటే, ఆ నిధిని ఖర్చు పెడుతున్న కొద్దీ పెరుగుతూనే వుంటుంది. పైగా దాచుకునే కొద్దీ తరుగుతుంది. ఆ నిధి పేరే విద్య.
ఈ భావాన్నే "వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం" అని భర్తృహరి చెప్పాడని విన్నాను. అంటే, 'ఖర్చు పెట్టే కొద్దీ పెరిగే ఏకైక ధనం, ఒక్క విద్యా ధనమే' అని అర్థం. అలా వ్యయం చేయకుండా, విద్యా ధనాన్ని తనలోనే దాచుకుంటే, ఒక రోజు అతనిలోని విద్య నశించిపోతుంది. అందుకే, ప్రతి ఒక్కరు తమలో వున్న జ్ఙానాన్ని పంచుతూ పోవాలి.
"శిష్యాదిచ్ఛేత్ పరాజయం", అన్న సూక్తి ఆధారంగా తమ శిష్యులు, తమను మించిపోవాలని గురువులు ఎప్పుడూ ఆశ పడాలట. అలా, ఏ కాలమైనా విద్యావంతులు తమ విద్యను అవసరమైన వాళ్లకు, అడిగిన వాళ్లకు బోధిస్తూ, తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి.

శుభసాయంత్రం

శ్లో : యావచ్చ వేద ధర్మాస్తు యావద్వై శంకరార్చనం|
యావచ్చ శుచి కృత్యాది తావన్నశో భవేన్నహి||

తా : ఎంత వరకు వేద ధర్మములు ప్రమాణము గా నిలచి ఉంటాయో
ఎప్పటి వరకు దేవతారాధన ఉంటుందో,
శుచి కర్మ లు ఎంత వరకు విడవకుండా సాగుతాయో,
అంత వరకు ఈ లోకానికి నాశనం లేదు.

Tuesday, November 21, 2017

కూరగాయల emotions.....


 #గోంగూర కి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను #గుంటూరు వాసినని..😎😎😎

#పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని..😍😍

#చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని...😑😑

#కందకి... వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....😋😋

#వంకాయకి గర్వమెక్కువ ..🍆🍆 కూరగాయలన్నింటికీ తనే #రారాజునని...😎

#బెండకాయకి ఆనందమెక్కువ .. తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని...😂😂

#దొండకాయకి ఆందోళనెక్కువ .. కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని...💆

#కాకరకాయకి శాంతమెక్కువ .. ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా ...💑

#బంగాళాదుంపకి సహనమెక్కువ ... కూరలకైనా , చిరుతిండ్లకైనా , పూరీకైనా , పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....👭💐🍪

#గుమ్మడి కాయకి గాంభీర్యమెక్కువ కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా ..💂💂

#ఉల్లిపాయకి టెక్కు ఎక్కున ..తాను లేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిది ...👸👸👸

#మిర్చికి కోపమెక్కువ ..ముందు నోటినీ , తరువాత కడుపుని మండించేస్తుంది....😠😠

#కరివేపాకు కి మిడిసిపాటు ఎక్కువ. తాను కొంచెమైనా కూర సువాసనకి తానేఅని ...💃

#బీరకాయ కి దిగులెక్కువ...తనను ఎడా పెడా వాడేస్తారని..పీచుని కూడా వదలరని...😦😧

#కారెట్ కి బీట్ రూట్ కి హంగామా ఎక్కువ ...తామంతటి రంగు ఎవరికీ లేదని....😒😒.....🌰🍑

ముందుచూపు:

ముందుచూపు:

దానం చేస్తే దరిద్రుడినవుతానేమో అనే భయంతో
 మూర్ఖుడు దానం చెయ్యడు.
దానం చెయ్యకపోతే ముందు జన్మలలో దరిద్రుడినవుతానేమో
అనే ఆలోచనతో దానం చేస్తాడు బుద్ధిమంతుడు.

ఇద్దరి ముందుచూపులోనూ ఎంత తేడా😇

మంచిమాట

మనిషికి చదువు,సంపదలూ,కీర్తి,బలమూ ఎన్నున్నా ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎప్పటికయినా పతనం తప్పదు.
కాబట్టి మనసుని దానిష్టానికి దానిని వదిలేయకుండా అదుపులో పెట్టుకోవాలి.
మనస్సుని గెలిచిన వాడు దేవేంద్రుడినయినా గెలవగలడు.

గుడికి ఎందుకు వెళ్ళాలి? చక్కటి సందేశం

గుడికి ఎందుకు వెళ్ళాలి? చక్కటి సందేశం

అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా?
కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.
గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు.

 ఆలయాలను దర్శించుకోవడం వెనుక భక్తి తో పాటు శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి.

మనదేశంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి.
అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే శక్తి క్షేత్రాలుగా శాస్త్రం అంగీకరిస్తుంది.

అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి.
ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి.
ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది.
ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి.

ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు.

కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది.
అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది.

గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.

ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు.
ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు చక్కటి పవిత్ర వాతావరణాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెడతారు.
ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే.
అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది.

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.

కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు.
అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది.

కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు.

Saturday, November 18, 2017

Venkateswara Rao Astro Peetham Near Shivam


డాక్టర్ పి.ఎస్.రవి కుమార్ రామకృష్ణ హోమియో వరల్డ్ వివరాలు:



డాక్టర్ గారి వివరాలు:
డాక్టర్ పి.ఎస్.రవి కుమార్ 
రామకృష్ణ హోమియో వరల్డ్ 
కృష్ణ నగర్ జంక్షన్, దేవీచౌక్ నుండి పేపర్ మిల్ రోడ్ 
రాజమండ్రి . 
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు
సాయంత్రం 6.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు 
ట్రైనింగ్ కాలేజ్ ఎదురుగా, సాయికృష్ణ థియేటర్ పక్కన 
రాజమండ్రి .
ఫోన్ : 0883 - 2475850 0883 - 2463425
94903 43905 9397913690

*పోలి స్వర్గం కథ ఇదీ*

**పోలి స్వర్గం కథ ఇదీ*

_కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ_.
_అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట_. _వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి_. _కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది_. _తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం_. _అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది_. _అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది_.  _ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు_.
_కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి_. _దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి_. _చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది_. _కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది_.
_ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది_.  _అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు_. _ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది_. _విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు_.

_ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు_. _ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది_. _ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు_.
_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.
_ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది_. _అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... *పోలిస్వర్గం* కథ వినిపిస్తూనే ఉంటుంది_.కథ ఇదీ*

_కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ_.
_అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట_. _వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి_. _కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది_. _తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం_. _అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది_. _అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది_.  _ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు_.
_కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి_. _దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి_. _చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది_. _కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది_.
_ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది_.  _అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు_. _ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది_. _విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు_.

_ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు_. _ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది_. _ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు_.
_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.
_ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది_. _అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... *పోలిస్వర్గం* కథ వినిపిస్తూనే ఉంటుంది_.

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది.

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది...నిజమో కాదో మీరే ట్రై చేయండి

ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుకున్నారో తెలియదు. కానీ అది నిజమే. ఆశ్చర్యం...నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 2 తో గుణించండి (x)

3) ఆ మొత్తానికి 5 కూడండి (+)

4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి (x)

5)వచ్చిన మొత్తానికి 1767 కూడండి (+)

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి (--)

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ! నేను ప్రయత్నించాను కరక్టుగా వచ్చింది. మీరు కూడ ప్రయత్నం  చేసి ఫార్వర్డ్ చేయండి.

Tuesday, November 14, 2017

నీరు ......జపాన్ డాక్టర్ల పరిశోధనల ఫలితాలు:

జపాన్ డాక్టర్ల పరిశోధనల ఫలితాలు:
గోరు వెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను , తల నొప్పి, లో బిపి, కీళ్ల నొప్పులు, హర్ట్ బీట్, కొలెస్ట్రాల్ పెరుగుదలను, ఆస్తమా, పొడి దగ్గు, దగ్గు , బ్లాక్ అయిన నరాలు, కడుపు, కంటి, చెవి, గొంతు సంబంధిత వ్యాధులు అన్నింటినీ నయం చేయగలవు.
గోరు వెచ్చని నీరు ఎలా త్రాగాలి
ఉదయము పరగడుపున 5 గంటల సమయం లో 4 గ్లాసుల గోరు వెచ్చని నీరు త్రాగాలి. 45 నిమిషాల వరకు ఏమి తినకూడదు
.
మీరు 4 గ్లాసుల నీరు త్రాగలేక పోతే మొదట 1 గ్లాసు, తర్వాత 2 గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి.
గోరు వెచ్చని నీరు త్రాగేవారికి ప్రయోజనాలు:
డయాబెటిస్-30 రోజుల్లో
బీపీ-30రోజుల్లో
ఉదర సంబంధిత -10రోజుల్లో
అన్ని రకాల క్యాన్సర్లు-9నెలల్లో
నరాల బ్లాకులు-6నెలల్లో
మూత్ర సంబంధిత-10రోజుల్లో
గొంతు,చెవి,కంటి,ముక్కు-10రోజుల్లో
స్త్రీల ఋతు క్రమం- 15రోజుల్లో
గుండె సంబంధించిన -30రోజుల్లో
తల నొప్పీ/మైగ్రేన్ నొప్పి-3రోజుల్లో
హై బీపీ-30రోజుల్లో
కొలెస్ట్రాల్- 4 నెలల్లో
ఆస్తమా- 4 నెలల్లో తగ్గిపోతుంది.
కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం
యుక్త వయసు లో ఉన్నప్పుడు దాని ప్రభావం తెలియదు వయసు పెరుగుతుంటే తెలిసొస్తుంది.
కూల్ వాటర్andకూల్ డ్రింక్స్ హార్ట్ ఎటాక్ కి ముఖ్య కారణం.
కూల్ వాటర్ లివర్ సమస్యలను తెస్తుంది.కూల్ వాటర్ తాగిన వారిలో ఎక్కువ మంది లివర్ చెడిపోయిన వాళ్ళు ఉంటారు.
వాటర్ బాటిల్, ఐస్ క్రీమ్ లు, మీ కుటుంబీకులకు అలవాటు చేయకండి

కార్తిక పురాణము - 26వ అధ్యాయము



కార్తిక పురాణము - ఇరవై ఆరవ అధ్యాయము
Image result for కార్తిక పురాణము - 26వ అధ్యాయము


ఇట్లు దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరి నిలయమైన వైకుంఠమునకు జేరెను.దుర్వాసుడు ఇట్లు ప్రార్థించెను. జగన్నాథా! బ్రాహ్మణ ప్రియా! మధుసూదనా! సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము. ఓ విష్ణో! సూర్య కోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. నివారించుము స్వామీ, నివారించుము. నీ భక్తుడైన అంబరీషునకు శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది. వేలకొలదీ బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను. కాబట్టి నన్ను రక్షించుము. హరీ! నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగుమహర్షి హరిని పాదముతో వక్ష స్థలమందు తన్నెను గదా! కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను. ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామీ! నను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికినవాడాయెను. అంత హరి నవ్వుచు ఇట్లనియెను. దుర్వాసా! బ్రాహ్మణులు నాకు దేవతలు అను మాట నిజమే. మీవంటి వారు మిక్కిలి దేవతలేయగుదురు. బ్రాహ్మణోత్తమా! నీవు సాక్షాత్ శంకరుడవు. బ్రహ్మ స్వరూపుడవు. జటలతో గూడి భృకుటికుటిలమైన నీ ముఖమును జూచినచో యెవ్వరికి భయము గలుగదు? మీవంటి వారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరు గదా! నేను మనో వాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను. ఆ సంగతి నీకు తెలిసియేయున్నది గదా! దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేనవతరించుచుందును. దుర్వాసా! నీవు సాదు నిందితమైన కర్మను ఆచరించితివి. అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితిని. అంబరీషుడు మనోవాక్కాయములచేత శత్రువునకును అపకారమును జేయదు. సర్వభూతములయందును Image result for కార్తిక పురాణము - 26వ అధ్యాయమునన్ను బావించుచు చరాచరమూలందంతటను నన్ను జూచుచుండును. అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చెదనని చెప్పి పోయి సకాలమునకు రాలేదు. నీకు అనుష్ఠానమున్నచో చేసుకోనవచ్చును. కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయునివ్వలేదు. కేవలము జలమును బుచ్చుకొని ద్వాదశీ పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదక పానమందేమి దోషమున్నది? ఉపవాస కాలమును నీరు త్రాగుట దోషము కానేరదు. బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదక పానము విహితమై యుండగా దాహ శాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేదీ సందు దొరకక దానినొక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి గానీ విచారించిన అది దోషము అగునా! అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీవలన భయము పొంది తన హృదయాంతర్వాసియైన స్వయం ప్రభువైన నన్ను శరణు వేడెను. అంతలో నీవు శాపమిచ్చితివి. బ్రాహ్మణుని మాట అసత్యమై పోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఈ పది జన్మల శాపమును అంగీకరించితిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఎరుగడు. వినలేదు. నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము గలిగినదే ద్వాదశిని విడిచిన హరి భక్తి లోపించునను భయంతో జలపారణ చేసితిని. దానితో బ్రాహ్మణ తిరస్కార మాయెంగదా? హరీ! నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణు జొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరిచి తన శరీరమును తానెరుగక యుండెను. ఇట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు, "మీనము, కూర్మము మొదలైన పది జన్మలు గమ్ము" అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి అతని చెవి వలన నీవిచ్చిన శాపమును వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగెను గదా దీనినెట్లు చేయుదును అని ఆలోచించితిని . బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేసితేని ణా భక్తునికి అనిష్టము గల్గును. శాపమును నివారించితినేని బ్రాహ్మణ వచనము సత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్త రక్షణమౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని. భక్తులకు కల్గిన అంతులేని మహా కష్టములనన్నింటినీ నేను హరింతును. నాభక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములయందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి. వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయములుగా చేసికొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి గదా!
Image result for కార్తిక పురాణము - 26వ అధ్యాయముపురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికంతకూ కొన్ని ధర్మములూ చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడువకూడదు. రెండు పక్షములందును మనుష్యులందరికిని ఏకాదశినాడు భోజనమాచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది. అట్లుగాక భుజించిన యెడల దోషము చెప్పబడి యున్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషమూ సంభవించును. కాబట్టి నాభక్తి లోపించునను భయముతో వాడు జలపారణము చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి గదా! అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో దుర్వాసుని మాటను అసత్యముబొందించతగదు అని తలంచి నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరు గాన శాపము వృధాయగునని తలంచి నివారించు భావముతో చక్రమును పంపితిని. బ్రాహ్మణోత్తమా! దుఃఖించకుము. అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను. నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి యున్నది. నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తుయొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకునూ, మనువును రక్షించుటకునూ, పెద్ద చేపనగుదును. దేవదానవులు సముద్రమును మదించు తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నావీపున ధరించుటకు తాబేలునగుదును. హిరణ్యాక్షుని సంహరించుటకునూ, భూమిని ఉద్ధరించుటకునూ నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగుదును. హిరణ్య కశిపుని సంహరించుటకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచూ వికృతాననుడైన మనుష్య సింహమునగుదును. లోక త్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామనుడిగా పొట్టివాడనగుదును. క్షత్రియ నాశనము కొరకు మహా బలముతో కూడి క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును. రావణుని సంహారం కొరకు ఆత్మ జ్ఞాన శూన్యుడైన రాముడను రాజును అగుదును. యదువంశమందు ఆత్మజ్ఞానము గలిగియు గోపికాముకుడనై రాజ్యములేని కృష్ణుడనగుదును. కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశినగుదును. కలి యుగాంతమందు విప్ర శత్రు ఘాతకుడనైన బ్రాహ్మణుడనగుదును. ఇట్లు నాకు పది జన్మలు గల్గును. ఈ పది అవతారములు విను వారికిపాతకనాశనములగును.
Image result for dasavatharam

ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే షడ్వింశాధ్యాయ సమాప్తః!!

పెన్సిల్ చిత్రం

మంచిమాట 
మా అబ్బాయి Vaibhav Vissa వేసిన పెన్సిల్ చిత్రం చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలుపండి!!!
కనిపించే దానిని చూడటానికి కళ్ళు కావాలి.
కనిపించని దామంచిమాట 

కనిపించే దానిని చూడటానికి కళ్ళు కావాలి.
కనిపించని దానిని చూడటానికి వివేకం కావాలి.మంచిమాట 

కనిపించే దానిని చూడటానికి కళ్ళు కావాలి.
కనిపించని దానిని చూడటానికి వివేకం కావాలి.నిని చూడటానికి వివేకం కావాలి.

Total Pageviews