Sunday, November 5, 2017

శుక్లాం బరదరం విష్ణుం

మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం బరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...తెలిసినవారు కూడా మరొక్కసారి చదువుదాము.
శుక్ల+అంబర+ధరం --శుభ్రమైన (తెల్లని) వస్త్రము ధరించినవాడు
విష్ణుం - సర్వాంతర్యామి ఐనవాడు
శశివర్ణం - చంద్రుని రంగు కలిగినవాడు
చతుర్భుజం - నాలుగు భుజములు(చేతులు) కలవాడు..పాశము, అంకుశము, మోదకము మరియు అభయ హస్తము కలిగినవాడు అన్నది స్థూలమైన అర్థము. మన ఆశా పాశమునకు అంకుశము వేస్తే ఆయనకది మోదకము. అప్పుడు ఆయన అభయహస్తము మనకు సిద్ధిస్తుంది.
ప్రసన్న వదనం - ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడు
ధ్యాయేత్ - ధ్యానించుచున్నాము
సర్వ విఘ్నోపశాంతయే-- ఆటంకముల నన్నింటినీ మట్టుబెట్టుటకు (సర్వ+ విఘ్న ఉపశాంతయే)

No comments:

Post a Comment

Total Pageviews