నీతో నువ్వు*
మనల్ని మనం సంస్కరించుకొవటం అంత కష్టమైన పని ఈ ప్రపంచంలో ఇంకొకటి వుండదు అనే చెప్పాలి. అదే సమయంలో ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం అనేది కూడా ఈ ప్రపంచంలో అంతే అంతే సులభం. రమణ మహార్షి గారు చెప్పినట్టు "
*ఈ ప్రపంచానికి నువ్వు చేసిన మహోపకారం ఏదైనా ఉంది అంటే అది నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే* "
ఈ మాటలు మనకి వినటానికి కాస్త కఠోరంగా చేదుగా అనిపించినా, పాటించటానికి ఇబ్బందిగా అనిపించినా అవి మాత్రం *సువర్ణాక్షరాలు* , *శిలా శాసనాలు*. దానికి కావలసింది .
*మన అంతరాత్మకి మనం దగ్గర కావటం ఒక్కటే మార్గం*.
రోజూ టి వి, కంప్యూటర్ , కుటుంబం బంధు మిత్రులు ఇలా అందరితోనూ తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతాము కాని మనతో మనం గడపటానికి సమయం ఉండదు ఎప్పుడైతే మనం మనతో గడపటం మొదలు పెడతామో అప్పుడు మన అంతరాత్మకు మనం దగ్గర అవుతాము దానికి సరైన మార్గం *యోగం* , *ధ్యానం* యోగం అంటే ముక్కు మూసుకొని తపస్సు చెయ్యనక్కర్లేదు. అది యోగుల సాధన. మనలాంటి సామాన్యులకు ప్రశాంతమైన చోట కూర్చుని కళ్ళు మూసుకోని మనలోకి మనం తొంగి చూడటం. మద్యలో అలోచనలు వస్తాయి వస్తే రాని మళ్ళీ మళ్ళీ ఆ అలోచనలు నుండి బయటికి వచ్చి మన ఊఛ్వాశ నిశ్వాసలు గమనిస్తూ ఉండటం లేదా ఒకసారి మనలో జరుగుతున్న అత్యద్బుతమైన జీవక్రియలను పరికించటం . రోజూ ఇలా చెయ్యటం వలన మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నమా అనే అంతరాత్మ ప్రభోదం మొదలవుతుంది. ఇలా రోజుకు కనీసం పదినిమిసాలు మనతో మనం గడిపినా చాలు ..రోజూ కాకపొయినా అప్పుడప్పుడు అయినా చాలు ..రోజూ నిద్ర లేవగానే కూర్చుని మనం పడే కునుకు పాట్లు కూడా ఒక రకమైన ధ్యానమే . కళ్ళు మూసుకొని కాసేపు ఒంటరిగా ఆలోచించిన ఆ కాస్త సమయమైనా నిన్ను నీకు దగ్గర చేస్తుంది. ఓ ధ్యానంలా కాకున్నా కనీసం ఒంటరిగా నడవటం, ఒంటరిగా ఆలోచించటం కూడా మనల్ని మనకు దగ్గర చేస్తుంది. ఒంటరిగా నడవటం అంటే మొబైల్ పెట్టుకొని హెడ్ ఫోన్ చెవిలో పెట్టుకొని నడవటం కాదు .
ఈ యాంత్రిక జీవనంలో ఎదో తెలియని ఉక్కిరిబిక్కిరి, వేగం ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని తరుముతూ ఉన్నట్టు ఉంటుంది. దానికి తోడు మితిమీరిన ఎలక్రానిక్ పరికరాలతో గడపటం ఇవన్నీ మనకి మనల్నే దూరం చేస్తున్నాయి. మనమేంటీ అని అవలోకనం చేసుకోటానికి అవకాశం ఏ మాత్రం ఉండటం లేదు. సామాజిక మీడియాలో కుప్పలు తెప్పలుగా టన్నులకొద్దీ నీతి సూత్రాలు, పోస్టింగ్లు, యూట్యూబ్ వీడియోలు, టీవీల ద్వారా వద్దంటే వినోదం, అవసరానికి మించిన సమాచార వ్యవస్థ ఇంకా వారాంతం అయ్యిందంటే ఫ్రెండ్స్ పార్టీలు . స్నేహితులతో గడపటం కూడా అత్యవసరమే కానీ నీతో నువ్వు కనీసం ఒక గంట కూడా గడపలేని బిజీ బిజీ గజిబిజీగా కాదు. మనం ఎటుపోతున్నాం ఎలా ఆలోచిస్తున్నాం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అని తీరక లేకుండా మనిషి జీవితం తయారయ్యింది. కనీసం పడుకొనేముందు లేచేముందైనా ఓ పావు గంట కళ్ళు మూసుకొని ఈ రోజు ఏం చేసాం ఏమి చెయ్యబోతున్నాం అందులో తప్పులు ఒప్పులు, జరిగిన విషయాలు జరగబోవు విషయాలు అన్నీ విడమర్చి నీతో నీ అంతరాత్మ సంభాషిస్తుంది ఇంకా ఎక్కువ సేపు గడిపినా ఇంకా మంచిది. ఒక సాధనలా గురోపదేశం తీసుకొని ఇంకా ఇంకా చెయ్యగలిగతే ఇంకేముంది ఋషులం అయిపోతాము. పిండి కొద్దీ రొట్టె అంత కానక్కరలేదు కానీ ఇంత చాలు మనం హాయిగా ప్రశాంతంగా వేరెవరికీ హాని చెయ్యకుండా జీవించటానికి .
No comments:
Post a Comment