Thursday, November 9, 2017

చింత చిగురు రుచే వేరబ్బా...ఏమంటారు ???

చింత చిగురు



మనప్రాంత వంటకాలలో  సీజన్ లో చింత చెట్లు నుండి చింత చిగురు, వామన చింత ,చింతకాయలు ,ఇలా వాటితో
అధికం గానే వంటలు చేస్తారు చెట్లు తగ్గాయి రోడ్లు పెరుగుదలలోఉండేవి ఎక్కువ శాతం పోయాయి తోటల్లో ఉన్నవి మాత్రమే ప్రస్తుతము
మనం వండే వంటకాలలో చింత పండు
తప్పక వాడతారు
వంటకాలలో పులుపు లేని వంట లేదు మంచి రుచి కలుగచేసే దినుసు
ఈ చింత చెట్టు లేత ఆకులను చింత చిగురు అంటారు .
చింత చిగురు పచ్చడి
చింత చిగురు పప్పు పలుచని ఇగురు
రుచికరంగా వండుతారు
ఈ చింత చిగురు చింత చిగురు పప్పు అన్నం లో కలిపి నోటిలో పెడితే.ఆ పుల్లతనం నాలుకకి హాయి ఇచ్చి లాలా జల గ్రంధులు నుండి నోరు వూరుతుంది ,

దాని రుచి వేరు

ఇది మంచి పోషకాహారం
 చింత చిగురు రుబ్బి జ్వరం వఛిన
వారి నుదురు కు తలకు పెట్టిస్తే
జ్వరం తగ్గుతుంది నొప్పీలకు వేపి కాపడం పెడతారు,
జీర్ణశక్తి కి తోడ్పడుతుంది
విటమిన్  C పుష్కలం గా దీనిలో
లభిస్తుంది నోటిపూత నివృత్హి లో ఉపకరిస్తుంది జీర్ణవ్యవస్థకు మంచి ఓ షదం కూడా
అన్నిటి కీ మంచి రుచి
అధిక పోషకాహారము చింత చిగురు మాంసాహారులు చింత చిగురు తో కాయతోను ఎక్కువ వంటకాలు చేసుకొంటారు
మిక్కిలి ఇష్ట పడి తింటారు కూడా అన్ని వంటకాలలో
దాని రుచే వేరబ్బా...ఏమంటారు ???

No comments:

Post a Comment

Total Pageviews