పూజ చేసేటప్పుడు అనుసరించవలసిన నియమాలు....
1 పూజా ద్రవ్యాలు మనకు కుడి వైపున వుండాలి.
2 నేతిదీపం దేవునికి కుడివైపున వుండాలి . నూనె దీపం దేవునికి ఎడమవైపున వుండాలి.
౩. ఎడమ చేతితో ఉద్ధరిని నీళ్ళు తీసుకుని కుడి చేతితో పోసుకుంటూ ఆచమనం చేయాలి.
4 ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు.
5 గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్తితుల్లోను నేలపై ఉంచరాదు.
6 పువ్వుల రెక్కలనువిడదీసి పూజించరాదు.
7 తూర్పు, ఉత్తర దిక్కులకు అభిముఖంగా పూజించడం మంచిది.
8 ఒంటి చేయి చాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతికింద వస్త్రమునుంచుకొని, శ్రద్దగా స్వీకరించాలి. వస్త్రం లేనిచో చేతికింద చేతిని ఉంచాలి. నిలబడి తీర్థప్రసాదాలను స్వేకరించరాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలపై రాసుకోరాదు.
9 పూజలకు, జపాలకు ఉపయోగించిన ఆసనం – అనుష్టానం అనంతరం ఎవరికి వారే తీయాలి. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు. దీనిని వేరే వాళ్ళు తీస్తే దాని ఫలితం వారికి పోతుంది.
పెద్దలు చెప్పారు.
No comments:
Post a Comment