కృత్తిక నక్షత్రంతో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలి తం ఉంటుందని పండితులు చెబుతయారు..ఉదయం నుంచి ఉపవాసం ఉండి, కార్తీక దామోదరున్ని పూజించి 365 ఒత్తులు వెలిగించి చంద్రుని దర్శనమైన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. అంతే కాకుండా కొత్తగా పెళ్లయిన అమ్మాయితో 33 పున్నమి నోములు చేయిస్తారు. ఆ రోజు సాయంత్రం శివాలయంలో అమ్మవారికి గుమ్మడిపండు, కంద, పసుపు మొక్కతో పాటు స్వయంపాకం ఇప్పిస్తారు.ఈ దినం కార్తీక స్నానం ఆచరించి శివకేశవులను పూజించడంతో పాటూ సాయంత్రం శివాలయాల్లో జరిగే "జ్వాలాతోరణోత్సవం" ను దర్శించాలని శాస్త్రవచనం. కార్తీక పూర్ణిమనాటి సాయంత్రం శివాలయాల్లోని ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎతైన కర్రలను నాటి మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతోవెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా వుంటుంది.
దీనికి - "జ్వాలాతోరణం" అనే పేరు. శివపార్వతులను పల్లకీలో వుంచి ఈ జ్వాలాతోరణం క్రింద తిప్పుతారు. ఈ ఉత్సవానికే 'జ్వాలాతోరణోత్సవం' అని పేరు. కార్తీక పూర్ణిమనాడు శివాలయాల్లో జరిగే ఉత్సవాన్ని దర్శించడం వల్ల జన్మ జన్మల పాపాలు అంతరించి పుణ్యఫలాలు లభిస్తాయి.
ఈ జ్వాలాతోరణోత్సవాన్ని దర్శించడంతో పాటూ కార్తీక పూర్ణిమ నాడు "దీపదానోత్సవం" చేయవలెను. కార్తీక పూర్ణిమనాడు ప్రదోష సమయంలో శివాలయంలోగాని , వైష్ణవాలయంలో గాని దీపాలు వెలిగించాలి. అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిదిలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలను వెలిగించాలనీ...అలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలు హరింపబడి ఇహంలో సౌఖ్యం పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఇతరలు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూడడం కూడా విశేష ఫలితాలనిస్తుంది. కాగా ఆవునెయ్యితో దీపాలు వెలిగించడం ఉత్తమం. అలా కుదర నప్పుడు నువ్వెలనూనెతో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్పనూనెతో గాని వెలిగించవచ్చు. ఇవేవీ వీలుకాకుంటే ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు. ఈ రోజు ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం. అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ దీపం వుంచి నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే!దీపదానం చేసే సమయంలో -

"కీటాః పతాంగా: మశకాశ్చవృక్షా:
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగిః
భవంతి నిత్యాంశ్చ పబాహి విప్రాః ||"
అనే శ్లోకంను పఠించవలెను.
No comments:
Post a Comment