Friday, November 24, 2017

ఓం శ్రీ మహా సరస్వత్యై నమః

శ్లో! అపూర్వః కోపి కోశోయం
విద్యతే తవ భారతి
వ్యయతో వృద్ధిమాయాతి క్షయమాయాతి సంచయాత్
తా.అమ్మా! సరస్వతీ దేవీ, నీ చెంత వున్న నిధి చాల అపూర్వమైనదమ్మా! విచిత్రం ఏమిటంటే, ఆ నిధిని ఖర్చు పెడుతున్న కొద్దీ పెరుగుతూనే వుంటుంది. పైగా దాచుకునే కొద్దీ తరుగుతుంది. ఆ నిధి పేరే విద్య.
ఈ భావాన్నే "వ్యయేకృతే వర్ధత ఏవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం" అని భర్తృహరి చెప్పాడని విన్నాను. అంటే, 'ఖర్చు పెట్టే కొద్దీ పెరిగే ఏకైక ధనం, ఒక్క విద్యా ధనమే' అని అర్థం. అలా వ్యయం చేయకుండా, విద్యా ధనాన్ని తనలోనే దాచుకుంటే, ఒక రోజు అతనిలోని విద్య నశించిపోతుంది. అందుకే, ప్రతి ఒక్కరు తమలో వున్న జ్ఙానాన్ని పంచుతూ పోవాలి.
"శిష్యాదిచ్ఛేత్ పరాజయం", అన్న సూక్తి ఆధారంగా తమ శిష్యులు, తమను మించిపోవాలని గురువులు ఎప్పుడూ ఆశ పడాలట. అలా, ఏ కాలమైనా విద్యావంతులు తమ విద్యను అవసరమైన వాళ్లకు, అడిగిన వాళ్లకు బోధిస్తూ, తమ జీవితాలను సార్థకం చేసుకోవాలి.

No comments:

Post a Comment

Total Pageviews