వందేమాతరం
నిజమే! మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని ప్రోత్సహిస్తున్నది. గోమాంసం తిన్న వాడిని రాళ్లతో కొట్టటం దుర్మార్గం అన్నారు. సురేంద్ర కులకర్ణి ముఖాన నల్లసిరా పోయటం తప్పు- ఇది భారత ప్రజాస్వామ్యం ముఖాన పూసిన నల్లరంగు అన్నారు- ఈ విషయాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది.
భావప్రకటన స్వేచ్ఛ అంటే ఏమిటి??
ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రకటించడం. సృష్టికి మూలం కార్యాకారణ సంబంధం అన్నాడు. ఆదిశంకరుడు మాయావాదం ప్రతిపాదించాడు. ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదిస్తే దానికి స్టీఫెన్ హాకిన్స్ సవరణలు చేశాడు. ఇదంతా భావ ప్రకటనాస్వేచ్ఛ కిందికి వస్తుంది. పరిశోధన కిందికి వస్తుంది. ‘్ఫసిజం’ అనే మాట సామ్యవాద నిఘంటువులో చాలా పెద్ద తిట్టు. తమకు నచ్చని వారినందరినీ ఫాసిస్టులు అని తిడుతూ ఉంటారు. జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలినీ ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో రష్యాకు వ్యతిరేకంగా పనిచేశారు. అందుకని వారిని ఫాసిస్టులు అన్నారు. హిట్లర్ యూదు జాతీయులను చంపితే స్టాలిన్ ట్రాయిస్కీ వంటి స్వంత దేశంలోని అసమ్మతి వాదులనే హత్య చేయించాడు. ఐతే హిట్లర్‌ను మాత్రమే ఫాసిస్టు అన్నారు కాని స్టాలిన్‌ను ఎవరూ ఫాసిస్టు అనలేదు. టిబెట్టులో పది లక్షల మంది బౌద్ధులను చంపించిన చౌ-ఎన్‌లై-మావోసెటుంగ్‌లను ఎవరూ నరహంతకులు అనలేదు. ఎందువల్ల? భూమి చతురస్రాకారంలోకాక గుండ్రంగా ఉంది- అని చెప్పిన సైంటిస్టును క్రైస్తవ మత పెద్దలు శిక్షించారు. ఎందుకంటే ఇది బైబిలుకు విరుద్ధంగా ఉంది అన్నారు. సృష్టి పుట్టి ఐదువేల సంవత్సరాలే అయింది. ఇదికాదన్న శాస్తవ్రేత్తలు శిక్షార్హులు అన్నారు. అలాంటి పోపులను ఎవరూ ఫాసిస్టులు అని తిట్టలేదు. సరికదా శాంతి దూతలు అన్నారు. మలాలా అనే అమ్మాయి ముస్లిం స్ర్తిలను పాఠశాలలకు తీసుకుపోతుంటే ఆమెపై జిహాదీలు దాడిచేసి చంపబోయారు. ఆమె తృటిలో ప్రాణాపాయంనుండి తప్పించుకున్నది. ఆమెకు గత సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం కూడా లభించింది. ఆఫ్గనిస్థాన్‌లో అతిపెద్ద గౌతమబుద్ధుని విగ్రహాన్ని నేలకూల్చారు. ఆనాడు ఈ జిహాదీ దుర్మార్గాలకు ఎవరూ నిరసన తెలుపలేదు ఎందువల్ల? ఓటు బ్యాంకు రాజకీయాలు కారణమా??
తస్లిమా నస్రీన్‌ను బంగ్లాదేశ్‌కు తరిమివేసినప్పుడు ఎవరూ నిరసన తెలుపలేదు. ఆమెను హైదరాబాదులో అసదుద్దీన్ ఒవైసీగారి ఇత్తెహాదుల్ మజ్లీస్ అవమానించినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. సాలమన్ రష్డీ తలకు ఇస్లామిక్ తీవ్రవాదులు వెలకట్టినప్పుడు మన రచయితలలో నిరసన తెలిపి తమ పురస్కారాలు ఎందుకు తిరిగి ఇవ్వలేదు??
ఫ్రాన్సులో జర్నలిస్టులను చిత్రకారులను సజీవ దహనం చేశారు. డెన్మార్క్‌లో ఒకాయన ప్రవక్తగారి బొమ్మ గీచాడని అతనిని హింసించారు. ఐఎస్‌ఐఎస్ కార్యకర్తలు అమెరికన్ జర్నలిస్టుల తలలు నరికినప్పుడు కనీసం ‘అయ్యో పాపం’ అని కూ డా అనలేదు. 1984లో ఢిల్లీ వీధులలో 3000 మంది అమాయక సిక్కుల ఊచకోత జరిగినప్పుడు నయనతార నయనాలు చెమ్మగిల్లలేదు. ఆ సిక్కులు చేసిన పాపం ఏమిటి??
డిఎంకె కార్యకర్తలు పాండిచ్చేరిలో సంస్కృత శిక్షణా శిబిరాన్ని ధ్వంసంచేసి సరస్వతీదేవి పటాన్ని నేలకు వేసి కొట్టినప్పుడు ఎవరూ స్పందించలేదు. రాముడి విగ్రహానికి చెప్పుల దండలు వేసి ఊరేగించినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నేనెందుకు హిందువునైతా? అంటూ కంచె ఐలయ్య పుస్తకం వ్రాసినప్పుడు ఈ హేతువాదులు హర్షించారు.
రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం వ్రాసి సీతకన్నా తాటక మంచి అమ్మాయి అని వ్రాస్తే ‘రం గాజీ’ అంటూ ఆమెకు సన్మానాలు చేశారు. పుష్కరాలల్లో స్నానాలు చేయండి అని కోరే పురోహితులను జైళ్లల్లో పెట్టండి అని కంచె ఐలయ్య ప్రకటిస్తే ఎవరూ నిరసన తెలుపలేదు. గణేశ నవరాత్రులను కత్తి పద్మారావు తిడితే ఎవరూ పట్టించుకోలేదు. భారతాన్ని అవమానిస్తూ బైరప్ప ‘పర్వ’ అనే పుస్తకం వ్రాస్తే హైదరాబాదు పిలిచి లక్ష రూపాయలు ఇచ్చి సత్కరించి పంపారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇప్పించారు.
హిందూ దేవీదేవాలయ విగ్రహాల మీద మూత్రం పోయండి అని కలబరిగి పిలుపునిచ్చినప్పుడు ఇది దుర్మార్గం అని నయనతార పత్రికా ప్రకటన విడుదల చేయలేదు. కలబరిగిని చంపటం ఎంత దారుణమో ఆయన హిందువులను అవమానించడమూ చట్టబద్ధంగా అంతే నేరం. కర్ణాటకలో కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉన్నది. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చూచుకోవాలి. నయనతార కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శిస్తున్నది? అంటే అసలు కారణం అది కాదు. ఆమె నెహ్రూగారి మేనకోడలు. ఇటీవల రాజకీయాలల్లో నెహ్రూ కు నెహ్రూ కుటుంబానికి ఆదరణ తగ్గింది. అందుకని!!
తప్పనిసరిగా విడుదల చేయవలసిన పోస్టల్ స్టాంపుల జాబితానుండి నెహ్రూ, ఇందిరల పేర్లు తొలగించారు- అందుకని! దాద్రీ సంఘటన కేవలం ఒక సాకు మాత్రమే! సురేంద్ర కులకర్ణి ముఖాన ఇంక్ పోసినప్పుడు ఓవర్‌యాక్షన్ చేసిన విమర్శకులు ఢిల్లీలో, హైదరాబాద్‌లో యాసిడ్‌లు పోసి అమ్మాయిలను హతం చేసినప్పుడు ఎందుకు స్పందించ లేదు?
అహ్మద్ కసూరీ పాక్ విదేశాంగ మం త్రిగా ఉన్నప్పుడు ఎందరో భారతీయులను ఎల్‌ఓసి వద్ద పొట్టనపెట్టుకున్నారు. బొంబాయిలో రైలు ప్రేలుళ్లలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కోఠీ గోకుల్‌ఛాట్ భండార్‌వద్ద ఎందరో అమాయకులు ఉగ్రవాదుల చేతిలో హతమైనారు. ఆనాడు నయనతార గ్యాంగ్ కనీసం నిరసన తెలియజేయలేదు సరికదా హిందువులను రౌడీలు, బొట్టుగ్యాంగ్ అని తిడుతున్నారు. ముఖాన ఉన్నది కుంకుమ బొట్టు కాదు రక్తం అన్నాడు ఎం.కె.కరుణానిధి.
భారతదేశాన్ని వెయ్యి సంవత్సరాలు అరబ్బులు, మొఘలులు, ఈస్టిండియా కంపెనీవారు బ్రిటీష్, డచ్చి, ఫ్రెంచివారు పరిపాలించారు. 1947లో స్వాతంత్య్రం ఇచ్చినట్లు నటించినా దేశంలో- రష్యా, అమెరికా, బ్రిటన్ ఆదేశాల మేరకు పరిపాలన సాగింది.
2014లో నరేంద్రమోదీ పూర్తి మెజారిటీ అధికారంలోకి వచ్చేసరికి ఈ విచ్ఛిన్నకర శక్తులు సహించలేకపోతున్నాయి. దేశాన్ని మళ్లీ చైనా-రష్యా- అమెరికా-పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఇదీ అసలు సంగతి!! గోమాంసం తిన్న ముస్లింను ఎవరో చంపితే ములాయంసింగ్ కొడుకు బాధ్యత వహించి ఉత్తరప్రదేశ్‌లో రాజీనామా చేయాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఏంచేస్తుంది??
కర్ణాటకలోని మూడ్ బిగ్రీ గ్రామంలోని అట్టడుకు వర్గానికి చెందిన ప్రశాంత్ పూజారి అనే పిల్లవాడు ఇటీవల గోహత్య మహాపాపం అన్నాడు. వెంటనే పీపుల్స్ ఫ్రంట్ అనే ఇస్లామిక్ సంస్థకు చెందిన వారు హత్య చేశారు. దీనికి ఒక్క రచయత కూడా నిరసన తెలియజే యలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం వాళ్ల ఇంటికి వెళ్లి సానుభూతి కూడా ప్రకటిం చలేదు. ఇది ద్వంద్వ ప్రమాణ సూచనం కాదా?
గోవింద పన్సారే అనే సిపిఐ కార్యకర్తను హత్యచేశారు. దీనిపై విచారణ జరిపి దోషులను శిక్షించాలి. నరేంద్ర దబోల్కర్‌ను చంపారు. ఇది కూడా తప్పే. ఎవ్వరూ ఈ దుష్కృత్యాలను బలపరచటం లేదు.
కాని కేరళలో బెంగాల్ రాష్ట్రాల్లో గత అరవై సంవత్సరాలుగా వేల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయి. అప్పుడు ఈ రచయితలు ఎందుకు స్పందించలేదు?
నేతాజీ, శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ, లాల్‌బహదూర్‌శాస్ర్తీ వంటి మహానాయకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినప్పుడు ఎందుకు వీరు స్పందించలేదు?
జయేంద్ర సరస్వతి స్వాములవారిని జైలులో పెట్టినప్పుడు మీగడ తిన్న పిల్లుల్లాగ ఈ రచయితలు ప్రవర్తించారు. తమిళనాడులో డిఎంకె కార్యకర్తలు విజయోత్సవాలు చేసుకున్నారు. గులాం అలీ భారతదేశంలో ఎక్కడైనా సంగీతం కచ్చేరి నిర్వహించుకోవచ్చు. ఐతే బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసులు ఇస్లామాబాద్‌లో పాడగలరా?
కేరళలోనే జేసుదాసుపై క్రైస్తవ చర్చి నిషేధం విధించింది తెలుసా?
రాచమల్లు రామచంద్రారెడ్డి నుండి రాచపాలెం చంద్రశేఖరరెడ్డివరకు కాళీపట్నం రామారావునుండి కాత్యాయనీ విద్వహేవరకు గత అరవై సంవత్సరాలుగా కేవలం సామ్యవాద రచయితలకే కేంద్ర సాహిత్య సంగీత నాటక అకాడమీ పురస్కారాలు, పద్మశ్రీలు, ఫాల్కే అవార్డులు లభిస్తున్నాయ. ఇవ్వాళ ఈ వర్గం నిరసన తెలియజేస్తూ పురస్కారాల తిరస్కారాల ప్రహసనం మొదలుపెట్టటం ఏమిటి??
కాశ్మీరీ పండిట్లు కాందిశీకులైనప్పు డు, అత్యాచారాలకు గురిఅయినప్పుడు ఈ సాహిత్య అకాడమీ పురస్కార రచయితల గుండెలు బండలుగా ఎందుకు ఉండిపోయాయి?.
...అసలేమైపోతుంది ఈ దేశం

No comments:
Post a Comment