Friday, September 22, 2017

ఆశ్వీయుజ మాసం


ఆశ్వీయుజ మాసం

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి, మహాలక్శ్మి, పార్వతీదేవిలకు అత్యంత ప్రీతికరమైన, వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ’ఆశ్వీయుజ మాసం’. చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం ఏడవ మాసం. శరదృతువు ఈ మాసంతో ప్రారంభమవుతుంది. ఈ నెలలోని పూర్ణిమనాడు చంద్రుడు ’అశ్వని నక్షత్రం’ సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి ’ఆశ్వీయుజ మాసం’ అనే పేరు ఏర్పడింది. మనకు వున్న ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వనీ నక్షత్రం మొదటి నక్షత్రం. అలా నక్షత్రాల ప్రకారంగా తీసుకుంటే ఆశ్వీయుజ మాసం తొలి మాసం అవుతుంది.
జగన్మాత అయిన పార్వతీదేవి దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధం తొమ్మిది అవతారాలను ధరించిన, ఆయుర్వేద దేవుడైన ’ధన్వంతరి’ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త అయిన మధ్వాచార్యులవారు జన్మించిన, దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడితే ప్రజలందరూ ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసం ఆశ్వీయుజ మాసం. ఈ మాసంలోని తొలి తొమ్మిదిరోజులు అంటే శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు శక్తి ఆరాధనకు విశేషమైన రోజులు. ఈ తొమ్మిది రోజులకు ’దేవీ నవరాత్రులు’ అని పేరు. దేవీ ఆరాధనకు ప్రధానమైన రోజులు కనుక వీటికి ’దేవీ నవరాత్రులు అని, శరత్కాలంలో వచ్చే రాత్రులు కనుక ’శరన్నవరాత్రులు’ అనే పేరు ఏర్పడింది.
ఈ తొమ్మిది రోజులు నవదుర్గలను రోజుకొకరి చొప్పున ఆరాధిస్తారు.
నవదుర్గలు….
1. శైలపుత్రి
2. బ్రహ్మచారిణి
3. చంద్రఘంట
4. కూష్మాండ
5. స్కందమాత
6. కాత్యాయిని
7. మహాగౌరి
8. సిద్ధిధాత్రి
దేవీ నవరాత్రులలో సప్తమిరోజు అంటే మూలా నక్షత్రంనాడు విధ్యాదేవత అయిన శ్రీ సరస్వతిదేవిని పూజించవలెను. అట్లే దుర్గాష్టమినాడు దుర్గాదేవిని పూజించి కూష్మాండ(గుమ్మడికాయ) బలిని ఇవ్వడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ నెలలోని బహుళ పక్షంలో చతుర్దశి, అమావాస్య తిథులలో దీపాలను దేవాలయం, మఠం ప్రాకారాల్లోగాని, వీధులు, ఇంటియందు సాయంత్రం సమయంలో వెలిగించవలెను. అందువల్ల పితృదేవతలు సంతృప్తి పడతారు. శరన్నవరాత్రులలో తిరుమల క్షేత్రములో కొలువై యున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఆశ్వీయుజ మాసంలో స్త్రీలు చేసే వ్రతాలు…
కోజాగరీ వ్రతం.
ఈ వ్రతంను ఆశ్వీయుజ పూర్ణిమనాడు ఆచరించవలెను. ఈ వ్రతం శ్రీమన్నారాయణుడికి, అతని దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. రాత్రి శ్రీమహాలక్ష్మిని పూజించి, బియ్యం, పాలు,పంచదార, కుంకుమపువ్వు వేసి చక్రపొంగలి చేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ దినం రాత్రి శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుందిట. ఎవరైతే మేలుకుని ఉంటారో వారికి సకల సంపదలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
గొంతెమ్మ పండుగ
దీనిని కూడా అశ్వీయుజ పూర్ణిమనాడే జరుపుకొనవలెను. ఈ దినం కుంతీ మహేశ్వరీదేవిని పూజించి అరిసెలు, అప్పములు, అన్నము మొదలైన నైవేద్యములు సమర్పించవలెను. ఈ విధంగా పూజించడంవల్ల మహిళల కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి.
చంద్రోదయ గౌరీవ్రతం
ఈ వ్రతమును ఆశ్వీయుజ బహుళ పక్ష తదియనాడు ఆచరించవలెను దీనికే ’చంద్రోదయోమావ్రతం’ అని, అట్లతద్ది వ్రతం అని కూడా పేర్లు ఉన్నాయి. అట్లతద్దినాడు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నానం చేసి, గౌరీదేవిని, గణపతిని పూజించవలెను పగలంతా అంటే రాత్రి చంద్రుడు ఉదయించేవరకు ఉపవాసం ఉండి అనంతరం అట్లు చేసి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించవలెను. ఆ అట్లతో భోజనం చేయవలెను.
ఆశ్వీయుజ మాసంలో పండుగలు..
ఆశ్వీయుజ శుక్లపక్ష దశమి : విజయదశమి
పాడ్యమి మొదలుకుని దశమివరకు ఉన్న పదిరోజులకు ’దసరా’ అని పేరు. ’దశహర్’ అనే పదం నుండి ’దసరా’ అనేది ఏర్పడింది. అంటే పది పాపములను హరించునది అని అర్ధం. మొదటి తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు. విజయదశమికే ’అపరాజిత దశమి’ అని కూడా పేరు. అనగా అపజయం లేని రోజు. ఈ దినం ఆయుధపూజ చేసి దేవిని పూజించడంతోపాటు సాయంత్రం శమీవృక్షం వద్దకు వెళ్ళి దర్శించి పూజించవలెను.
శుక్లదశమి : శ్రీమధ్వాచార్య జయంతి
త్రిమతాచార్యులలో ఒకరు, ద్వైతమత స్థాపకుడు అయిన శ్రీమధ్వాచార్యులవారు ఈ దినం జన్మించినట్లు చారిత్రక కథనం.
శుక్ల ఏకాదశి : పాశాంకుశ ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాస వ్రతమును అనుసరించడంవల్ల పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి అని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కృష్ణపక్ష ఏకాదశి : ఇందిరా ఏకాదశి
ఈ ఏకాదశి వ్రతం పాటించడంవల్ల ఇహలోకంలోని వారికి సౌఖ్యం లభించడమే కాకుండా యమలోకంలో బాధలు అనుభవిస్తూ ఉన్న పితృదేవతలకు విముక్తి లబించి వైకుంఠానికి వెళ్తారని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
కృష్ణపక్ష ద్వాదశి : గోవత్స ద్వాదశి
గోవును శ్రీమహాలక్ష్మి స్వరూపంగా ఆరాధించడం మన ఆచారం.ఈ దినం సాయంత్రం గోవును దూడతో సహా అలంకరించి పూజించవలెను. గోసంబంధమైన అంటే పాలు, పెరుగు, నెయ్యి వంటివాటిని భుజించరాదు. మినుములతో వండిన వంటకము భుజించడం మంచిది.
కృష్ణపక్ష త్రయోదాశి : శ్రీ ధన్వంతరి జయంతి
ఈ రోజు ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను. ఇలా పూజించడంవల్ల సకల వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని శాస్త్ర వచనం.
కృష్ణపక్ష చతుర్దశి : నరక చతుర్దశి
దీనికే ’ప్రేత చతుర్దశి’ అని పేరు. ఈ రోజు తెల్లవారుఝూమునే నిద్రలేచి నువ్వులనూనెతో తలంటుకుని స్నానం చేయవలెను. స్నానానంతరం నువ్వులతో యముడికి తర్పణం వదలవలెను. సాయంత్రం దీపములను వెలిగించవలెను.
కృష్ణపక్ష అమావాస్య : దీపావళి
ఈ దినం సూర్యోదయపూర్వమే స్నానమాచరించవలెను. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి లక్ష్మీదేవిని పూజించవలెను. సాయంత్రం నువ్వులనూనెతో ఇంటి ద్వారం, ధాన్యం కొట్టు, బావి, రావిచెట్టు, వంట ఇంటిలో దీపాలను వెలిగించవలెను. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడని, మహాలయ పక్షాల్లో భూమిమీదకు పితృదేవతలు తిరిగి వెళ్ళేందుకే మగవారు దక్షిణ దిక్కుగా నిలబడి దివిటీలు వెలిగించవలెను. అనంతరం ఇంటిలోనికి వచ్చి తీపి పదార్థాన్ని భుజించి బాణాసంచా వెలిగించవలెను.
ఈ విధంగా ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకున్న మాసం ’ఆశ్వీయుజ మాసం’ . ఈ మాసంలో చేసే పూజలు, విధుల ఆచరణవల్ల అనంతమైన ఫలితాలు కలుగుతాయి.

ఓం శ్రీమాత్రే నమః.


Thursday, September 21, 2017

Vyshyula Kavita - |Sri kadimella


ఎవరు బ్రాహ్మణులు - ఏది బ్రాహ్మణవాదం ధర్మసందేహం

🙏ఎవరు బ్రాహ్మణులు - ఏది బ్రాహ్మణవాదం
ధర్మసందేహం

ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.

వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.

తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.

ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.

పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.

నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.

ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.

ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.

కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.

చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.

ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.

చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.

విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.

ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.

గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.

విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.

బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.

మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.

తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.

ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.

అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.

భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.

అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి  సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.

బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.

మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.✍మీ శశికాంత శర్మ🙏ఎవరు బ్రాహ్మణులు - ఏది బ్రాహ్మణవాదం
ధర్మసందేహం

ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.

వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.

తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.

ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.

పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.

నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.

ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.

ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.

కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.

చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.

ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.

చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.

విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.

ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.

గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.

విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.

బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.

మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.

తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.

ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.

అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.

భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.

అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి  సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.

బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.

మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్నే ...... courtesy...... rpraorevoori⁠⁠⁠⁠

శుభసాయంత్రం

శుభసాయంత్రం!!
ఒకరి కళ్ళనుంచి కన్నీళ్ళు వచ్చినప్పుడు
మరొకరి కళ్ళ నుంచి కూడా కన్నీళ్లు వస్తే
ఆబంధం కన్నా ఉత్తమమైన బంధం
ప్రపంచంలో మరేదీ లేదు.!!!!

Monday, September 18, 2017

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు. రామాయణం

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.


:::::::::::::::::::::::::::::::::::::
రామాయణం
:::::::::::::::::::::::::::::::::::::

1.   భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్

2.   కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్

3.   కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).

4.   రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా

5.   పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
6.   సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్

7.   మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్

8.   కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం

9.   దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.

10.   సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.

11.   ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.

12.   తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్

13.   అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్

14.   కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్

15.   గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16   దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.

17.   చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.

18.   పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


19.   కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.

20.   శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.

21.   హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.

22.   ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక

23.   విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.

24.   శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు

25.   రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.

26.   అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక

27.   శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక

28.   సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.

29.   వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.

30.   కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.

31.   లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్

32.   తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్

33.   పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.

శరన్నవరాత్రులు

                              ‘శరన్నవరాత్రులు’

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

నవదుర్గలు :
ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

1 శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

2. బ్రహ్మచారిణి ( గాయత్రి )  : దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

3. చంద్రఘంట ( అన్నపూర్ణ )  : అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

4. కూష్మాండ ( కామాక్షి ): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.
శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

5. స్కందమాత ( లలిత ): అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

6. కాత్యాయని (లక్ష్మి): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.
శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

7. కాళరాత్రి ( సరస్వతి ): దుర్గామాత ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

8. మహాగౌరి ( దుర్గ ) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

మంచిమాట !!

మంచిమాట !!
ప్రశంస పన్నీరు లాంటిది.
తాత్కాలిక గుబాళింపే తప్ప దప్పికకు ఉపయోగపడదు.
విమర్శ వేడినీరు లాంటిది.వెంటనే చురుక్కుమన్నా కుళ్ళునూ(లోపాలను) కడుగుతుంది.చల్లారాక దప్పికనూ తీరుస్తుంది.!!!

అబ్రహాం లింకన్ సంస్కారం

అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది.
ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు.
అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. 
అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని
‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్. 
మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు.
ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి. అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్.
ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు.
లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు.
నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు.
కానీ అదీ సంస్కారం అంటే..
అదీ సంక్షోభంలో తట్టుకుని నిలబడడమంటే...
అదీ తుఫాన్ అలను చాకచక్యంగా తప్పించుకోవడమంటే...
లింకన్ వెంటనే తేరుకుని ఆ వ్యక్తికి శాల్యూట్ చేస్తూ ‘‘ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తుచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే.
మీవి, మీ ఇంట్లోవారి బూట్లను కూడా కుట్టాడు.
అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు.
అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజుకన్నా ఎక్కువ తక్కువలు ఉండవు.
ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లుకుట్టడం నేర్పాడు.
నా తండ్రికి అప్రతిష్ఠ రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికొచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను.
ఈ సభలో మా నాన్నగారిని గుర్తుచేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనందబాష్పాలతో నా ప్రసంగం మొదలుపెడుతున్నా’’ అన్నాడు.
అంతే! ఆయన్ని నలుగురిలో నవ్వులపాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇదీ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే.😁😁😁

Sunday, September 17, 2017

పెద్దలమాట .చద్దిమూట!!!!

పెద్దలమాట .చద్దిమూట!!!!
మానవుడికి ఆకలి,నిద్ర లాగే కోపం కూడా ఒక బలహీనత.
ఒక్కోసారి తొందరగా కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడే ఈచిన్న విషయానికి ఇంత కోపం ప్రదర్శించడం అవసరమా అని ప్రశ్నించుకుంటే శాంతం దానంతట అదే మనలను వరిస్తుంది.

Thursday, September 14, 2017

అమ్మాయిల పేర్లు

🔢*గణితంలో ఉండే అమ్మాయిలు* ..
*రేఖ, సరళ , గీత, బిందు , పూర్ణ* ..
🌈 *ఆకాశంలో ఉండే అమ్మాయిలు ..*
*తార, తారక, చంద్రిక , జ్యోత్స్న, వెన్నెల, కిరణ్, సూర్యకళ, చంద్రకళ , ఉష , అరుణ,*
💦 *నీటిలో ఉండే అమ్మాయిలు..*
*కమల , పద్మ, నీరజ ,జలజ, మీనా , లహరి ...*
✍ *సాహిత్యంలో ఉండే అమ్మాయిలు ..*
*కవిత, సాహితి , కల్పన, కావ్య, ఊహ , భావన,... .*
🌏 *నేలమీద ఉండే అమ్మాయిలు*
*భూమి, భూదేవి, భూమిక, ధరణి, పృథ్వి, మహి...*
🎷 *సంగీతంలో ఉండే అమ్మాయిల పేర్లు*
*పల్లవి, రాగ, శ్రుతి, వీణ, మోహన, సింధు, భైరని, కల్యాణి, ప్రియ, కృతి, కీర్తన....*. etc. ......

పిల్లల పై అతిమోహం వద్దు ..


వారిని స్వశక్తితో ఎదిగేందుకు
సహకరిద్దాం ...
ప్రతీ తల్లిదండ్రులు చదవాల్సినది .
శూరసేనుడనే మహారాజు
చాలా గొప్పవాడు.
అతడు తన రాజ్యంలోని ప్రజలందరినీ
కన్నబిడ్డలా చూసుకునేవాడు.
ఇతని పరిపాలనలో రాజ్యం
చాలా సుభిక్షంగా ఉండేది.
ప్రజలు ఎవరి వృత్తులను వారు
సక్రమంగా చేసుకునేవారు.
అలా పరిపాలిస్తున్న మహారాజుకు ఓక కోరిక కలిగింది.
గొంగళి పురుగు సీతాకోకచిలుక ఎలా అవుతుందో చూడాలి అనుకున్నాడు.
తన ఉద్యానవనంలో కొన్ని చెట్లకి గొంగళి పురుగులు ఉండడం చూసి పంట పండింది అనుకోని రోజు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు గూడు కట్టుకొని ఉండేవి. మరలా వచ్చి చూసేసరికి సీతాకోకచిలుకలై ఎగిరిపోతూ ఉండేవి.
ఇలా చాలారోజులు ప్రయత్నించాడు.
కాని ఎప్పుడు సీతాకోక చిలుక పుట్టుక మాత్రం చూడలేకపోయేవాడు.
ఒకనాడు మంత్రిగారిని పిలిచి తన
మనస్సులో కోరికను వెల్లడించాడు.
మంత్రి విని వెంటనే ఆ గొంగళి
పురుగులు ఉన్న చెట్టు దగ్గర
భటులను నియమించి
''సీతాకోకచిలుక పుట్టే సమయాన్ని
మాకు తెలియజేయండి"
అని ఆదేశించాడు.
భటులు అలాగే అని గొంగళిపురుగులు ఉన్న
చెట్టు దగ్గర కాపలా కాచి సీతాకోకచిలుక పుట్టే
సమయాన్ని మంత్రిగారికి తెలియజేయగా,
హుటాహుటిన రాజుగారిని
వెంటబెట్టుకొని ఉద్యానవనానికి వెళ్ళాడు.
సరిగ్గా అదే సమయానికి గూడులో
నుండి సీతాకోక చిలుక బయటికి
రావడం మొదలైంది.
రాజుగారు ఎంతో ఆసక్తిగా చూడడం
మొదలుపెట్టాడు.
గూడులో నుండి మెల్లమెల్లగా
బయటికి రావడం మహారాజు
చూసి,
అయ్యో! ఎంత కష్టపడుతుందో!
పాపం అనుకోని దగ్గరికి వెళ్లి
ఆ గూడుని తన దగ్గర ఉన్న చాకుతో చిన్నగా,
సీతకోకచిలుకకి ఏమి కాకుండా కోశాడు.
అది బయటికి వచ్చి క్రింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంది.
అది చూసి అయ్యయ్యో ఇది ఎగరలేకపోతుంది
అని తన చేతుల్లోకి తీసుకొని పైకి ఎగరేశాడు.
అయినా అది ఎగరలేక క్రిందపడిపోయి ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కాని రెక్కలు విచ్చుకోకపోవడంతో అలా తన్నుకొని తన్నుకొని చనిపోయింది. అది చూసిన మహారాజు
దుఃఖించాడు.
మంత్రివర్యా!
ఏమిటి ఇలా జరిగింది.
ఎందుకలా చనిపోయింది? అని అడిగాడు.
అప్పుడు మంత్రిగారు ఇలా అన్నారు.
మహరాజా! సృష్టిలో ప్రతీదీ తనకుతానుగా
ఎదగడానికి ప్రయత్నించాలి.
అప్పుడే తన సామర్ధ్యం ఏమిటో తెలుస్తుంది.
ఒక విద్యార్థి విద్య నేర్చుకునేటప్పుడు గురువు శిక్షిస్తాడు.
అలాగని గురువుకి శిష్యుడి మీద కోపం ఉంటుంది అనుకోకూడదు.
తనను మంచి మార్గంలో పెడుతున్నాడు.
శిక్షించకపోతేనే ప్రమాదం.
విచ్చలవిడితనం పెరుగుతుంది.
సర్వనాశనం అవుతాడు.
అలాగే ప్రకృతికి లోబడి జీవులు బ్రతకాలి.
మీరు ఏదో సహాయం చేద్దాం అనుకున్నారు.
అది కష్టపడుతుంది అనుకుని మీరు సాయం చేయబోయారు. చివరికి చనిపోయింది.
ఇదిగో దీన్ని చూడండి అని మరొక సీతాకోకచిలుక బయటికి రావడం చూపించాడు.
రాజు గారు మళ్ళి దానిని బయటికి తీయడానికి వెళ్లబోతుంటే మంత్రి ఆపి,
మహారాజా!
ఎం జరుగుతుందో చూడండి అని అక్కడే నిలబెట్టేశాడు.
సీతాకోకచిలుక తన చుట్టూ ఉన్న వలయాన్ని చీల్చుకువచ్చి రివ్వున ఆకాశానికి ఎగిరింది.
అప్పుడు
మహారాజా! చూశారా!
ఇది ప్రకృతి సహజంగా తనకు తానుగా పోరాడి బయటికి రావడం వలన తన ఇంద్రియాలలో బలం పెరిగింది.
దానివలన దాని రెక్కలు పటిష్ఠమై ఎగరడానికి సహాయపడ్డాయి.
ఇందాక మీరు అది ఎక్కడ కష్టపడుతుందో అని, కష్టపడకుండా సుఖపెట్టాలని వలయాన్ని చీల్చేసారు.
దానివలన సీతకోకచిలుకకి కష్టపడాల్సిన పనిలేక బలం సరిపోక రెక్కలలో బలం చాలక ఎగరలేక చనిపోయింది.
అర్థమైందా మహారాజా! ప్రతిజీవికి పరమాత్మ
స్వయం శక్తిని ఇచ్చాడు.
దానిని ఎవరివారిని తెలుసుకోనివ్వాలి.
అలాకాకుండా ఎక్కడ కష్టపడతారో అని ఆ జీవి కష్టం కూడా మనమే పడితే ఇదిగో అనవసరంగా నాశనం చేసినవారం అవుతాము. అని చెప్పగా మంత్రిగారికి కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించి బహుమతులు ఇచ్చాడు.
దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకొంత పరిపాలనకు వాడుకున్నాడు.
ఈ కథ ఇప్పటి తల్లిదండ్రులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
ఇలా పిల్లలపై ప్రేమ పిల్లల నాశనానికే తప్ప వికాసానికి దారితీయదు.

ముగ్గుకున్న ప్రాధాన్యత

మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి?
ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?
ఇంటి / గడప/ గేటు ముందు
ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి.
ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.
ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు.
పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.
నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది.
అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి.
అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు.
అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.
తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.
యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి.
దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు.
ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.
పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.
అంతేకాదు
మనం రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం .
దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు.
ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.
నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.
ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి.
పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు.
ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు.
వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.
ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు.
అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు.
శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.
ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.
మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు.
మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.
ఆచరించి ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ


Wednesday, September 13, 2017

A to z నిరుద్యోగి వ్యధ

A  to z నిరుద్యోగి వ్యధ

Aమని చెప్పను నా వ్యధ.  అదో
Bకారి గాధ.  చెప్పడానికీ
Cగ్గు పడుతున్నా
Dగ్రీ ,  పీజీలున్నా  నాకు  ఉద్యోగం  సున్నా,
E సమస్యపై  సైనికుడిలా
Fక్టీవ్ గా  పోరాడుతూనే  ఉన్నా .  ప్చ్,  అయినా
Gవితంలో  స్థిర పడలేక  పోతున్నా ,  ఇవన్నీ  వద్దు  సోంతకాళ్ళపై  నిలబడమని నాన్న  ఎప్పుడో Hచ్చరించారు.
 Iనా  నేను  మారలేదు .   అదే నా  పొరపాటు .  నా చదువుకు  నాన్న  Jబులు ఖాళీ  అయ్యాయ్ .   Kజీల  కొద్ది  పుస్తకాలు  చదివితేనే
L కేజీలు ,  పీజీలు  పూర్తయ్యాయ్.   ఇప్పుడు
Mల్యేలు ,  ఎంపీల  చుట్టూ  తిరిగినా
Nన్నికయ్యాక  చుద్దాం  అంటున్నారే  గానీ
Oక్కరైనా  కనికరించరే ?
 Pచ్చివాడిలా  అన్ని ప్రయత్నాలు  చేశా .  
Qలో  నిల్చొని  కొలువు  కలలు  కన్నా ,
Rళ్ళుగా చెప్పులరిగేలా  తిరుగుతూనే  ఉన్నా.   ఆఖరికి
S..  నేను  మారాలి  అని  వేరే  ప్రయత్నాలు  మొదలు  పెట్టినా  అక్కడా  తీవ్ర  పో
T. ,  
Uద్ధం  లాంటి  పరిస్థితి.   జీవితంపై
Vరక్తి  పుట్టి  ఆసుపత్రి కెళ్తే
X రే  తీసి
Yద్యులు  నీకు  "  నిరుద్యోగం "  జబ్బు  సోకిందని
Zడ్జిమెంట్  ఇచ్చేశారు...

ఉప్మా....ఏమిటి చెప్మా.?

ఉప్మా....ఏమిటి చెప్మా.?
-
ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣...
ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..
ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂...
ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..
కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺...
వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇..
ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸...
తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..
ఇంకాస్త పెట్టమంటారా అంటే😳....
ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣...
ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥.
గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..
ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛...
జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇...
ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..
టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅....
ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅....
శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..
ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪..
ఇక చూడండి👈..వారోత్సవాలు...👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝....
తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊...చేసిన పాపం ఉరికే పోదు👎👎..
ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃...
పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆....
అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠...
ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭...మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜...
ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛...
ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌....
నేను అదే చేస్తా లాభం లేదు😫😫...
ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊...
అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి😆😆...
ఎదో మనిషి కి మనిషి సహాయం😜😜...మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని..
:)

నాన్నకి అంకితం

👉 కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది "నాన్న..."🚶

👉 నాన్నకి అంకితం 🏃
-----------------
👉అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
👉నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
👉 జీవితం అమ్మది - జీవనం నాన్నది.
-------------------
👉ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
👉ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
👉 అమ్మ భద్రత - నాన్న బాధ్యత.
------------------
👉పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
👉పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు
👉 నడక అమ్మది - నడవడిక నాన్నది.
--------------------
👉తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
👉నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన-నాన్న ఆచరణ
----------------
👉అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
      But... కానీ ....
👉నాన్న ప్రేమను నువ్వు నాన్నవుఅయ్యాకే తెలుసుకోగలవు...

💐🙏🌹👍
: కొడుకు :ఈ రోజు నా గుండె operation నాన్న


నాన్న :తెలుసురా ఎందుకు బయపడుతున్నావ్ నేను ఉన్నానుకదా నీకు


కొడుకు :i love u నాన్న


నాన్న :i love u too ra చెపుతూ
 ఏడ్చాడు


Operastion తరువాత ఎప్పుడైతే ఆ అబ్బాయ్ కి మెలుకువ వచ్చిందో కళ్ళ ముందు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు



కొడుకు :మా నాన్న ఎక్కడా



ఫ్రెండ్ :నీకు తెలియదా నీకు గుండె ఏవరిచ్చారో  మీ నాన్నేనురా !



కొడుకు :గుండె పగిలేల ఏడవడం మొదలుపెట్టాడు
అప్పుడు గుండె నుండి ఒక్క శబ్దం వచ్చింది  ఏడవకురా నీ గుండె చప్పుడులో నేను ఎప్పుడు నీతో బ్రతికే ఉంటానురా



కొడుకు :i miss you నాన్న


మన కాళ్ల మీద మనం
నిలబడ్డామని అమ్మ నాన్నని దూరం పెట్టకు. మనం ఇలా నిలబడడానికి అమ్మ నాన్న మన ముందుండి  నడిపించారు మర్చిపోకు మన  భారాన్ని  అంత నాన్న మోస్తూ మనల్ని నడిపించాడు మనం సంతోషగా బ్రతకడానికి తన ప్రాణాలను  దరబోసే వాడు నాన్న

పాము సాధువు కథ !


⁠⁠⁠⁠⁠పాము సాధువు కథ !
ఓ సారి వూరి వెలుపల ఓ సాధువు గారు కొలువు తీరారు.. ఆ సాధువు గారు కూర్చుని ఉన్న అల్లంత దూరాన పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చి బుసలు కొట్టింది . సాదువు గారు దానికి హితబోధ చేసారు చూడు నిన్ను చూసి అందరూ ఎలా భయపడుతున్నారో.. నువ్వు కుడా నాలా సాధువులా జీవించు అని హితం చెప్పారు. సాధువు గారు చెప్పిన మాట విని పాము తన కోపాన్ని తగ్గించుకుంది . ఆహారానికి తప్ప బయటకు రావడం మానేసింది .. మనుషులు ఎవరిని చూసినా బుస కొట్టడం మానేసింది .ఇపుడు జనాలు తనను చూసి భయపడ్డం లేదు..కొందరు ఆకతాయిలు ఇది గమనించి పుట్టలోకి వెళ్లబోతున్న పాము తోకను బట్టి ఈడ్చి నేల కేసి కొట్టారు. ఎలాగో జారవిడచుకుని బ్రతుకు జీవుడా అని పుట్టలోకి జారుకుంది. ఇప్పుడు ఆహారం కోసం పుట్ట నుండి బయటకు రావాలన్నా భయం వేస్తోంది.కొన్నాళ్లకు సాధువు గారు మళ్ళీ వచ్చి అదే చోట కొలువు దీరారు. అందరూ వెళ్లాక పాము బయటకు వచ్చి తన దీన గాథను వివరించింది . అపుడు సాధువు అన్నారు.. పిచ్చిదానా .. నిన్ను నీవు రక్షించుకునేదానికి అయినా బుసకొట్టాలి లేక పోతే ఇంతే.. నిన్ను అపకారం చేయవద్దన్నాను గానీ నిన్ను నీవు రక్షించుకోవద్దు అన్నానా అని చెప్పారు.. దీనిలో నీతి ఏమిటంటే
మనం హిందువులం.. అహింసా పరమో ధర్మ: అని చెబుతాయి మన వేదాలు , శ్రుతులు,ఇతిహాసాలు. మన ధర్మం అహింస అన్నాము కదా అని కనీసం నీ మీద ఉద్ధేశ్యపూర్వక దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తే అది చాతకాని తనమే అవుతుంది తప్ప అహింస అనిపించదు. ధర్మాగ్రహం తప్పని సరి.. ఎవరి పాపానికి వారు పోతారులే అనుకుంటే పాము గతే పడుతుంది.

వాస్తవంగా జరిగిన కథ

ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు......
" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా 
కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది.
" ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది 
పెద్దకోడలు.
" ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది.
కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ
చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని
ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>"
అంది చిన్నకోడలు.
" ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు.
" మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో
చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో
ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం
మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు.
" దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు.
" మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు.
ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని 
 ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు. తల్లి లేకపోయినా తండ్రిని తమ వద్దే ఉంచుకుని
చూసుకోవలని వారి ఉద్దేశ్యం. కానీ రోజూ భార్యల నస భరించలేక
ఇద్దరు కొడుకులు తండ్రితో ఇలా చెప్పారు.
" నాన్నా! ఈ పిల్లలగొడవతో మీకు సమయానికి ఏవీ అందించలేకపోతున్నాం.
మీకు కూడా వయస్సు అయింది. అమ్మ ఉన్నప్పుడు అన్నీ దగ్గరుండి
చూసుకునేది. దగ్గరిలోనే మంచి ఆశ్రమం ఉంది. మిమ్మల్ని అక్కడ
చేరుద్దామని అనుకుంటున్నాము. మీరేమంటారు? "
" నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎన్నిరోజులని మీరు నన్ను చూసుకుంటారు. మంచి విషయం చెప్పారు. పెట్టే, బేడా సర్ధుకుని 
బయలు దేరండి ఇద్దరూ!? అన్నారు తండ్రి.
షాక్ కొట్టినంత పనైంది కొడుకులకు నాన్న అలా అనేసరికి.
" అదేంటి నాన్నా ! అలా అనేశారు. మేము వెళ్ళడం ఏంటి? బయట
బాడుగలు పెట్టి మేము వేరు కాపురాలు ఎలా వెలగబెట్టాలి.
ఆస్తిని మాకే కదా ఇవ్వాలి. ఆలోచించండి ఒకసారి."
" నిజమే! మీకే ఇవ్వాలి నా ఆస్తిని. కానీ మీ అమ్మ నేను ఎంతో ఇష్టంగా
కట్టుకున్న ఇల్లు ఇది. ఆమె బ్రతికి ఉన్నన్నాళ్ళూ చాలా సంతోషంగా
ఉన్నాం. ఆమెను తలచుకుంటు నేను ఈ ఇంట్లోనే కన్నుమూయాలి.
నా తదనంతరం ఈ ఇల్లు మీకే! పైన ఇంటి బాడుగతో,నాకు వచ్చే 
pension తో ఎలాగోలా బ్రతికేస్తాను. బయలుదేరండి త్వరగా" అన్నారు
తండ్రి.
" అదేంటి మామగారూ! వూర్లో్ జనాలు ఏమనుకుంటారు? బయటికివెళ్ళి
అరకొర జీతాలతో ఎలా బ్రతకాలి. ఆలోచించండి" అన్నారు కోడళ్ళు.
ఊర్లో జనాలు ఎప్పుడూ మనకు వ్యతిరేకంగానే మాట్లాడుకుంటారు.
ఇది నా ఇల్లు. నా భార్య నాతో ప్రేమగా జీవించిన ఇల్లు. నేను పోయేదాకా
ఇది నా సొంతం. నా గురించి ఆలోచించని మీరు జనాల గురించి
ఆలోచిస్తున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఈ ఆలోచన
మీదేనని నాకు తెలుసు. మరోదారిలేదు. మీరు ఇక్కడినుండి
వేరే కాపురానికి వెళ్ళడమే మంచిది. బయలుదేరండి." అంటూ
తండ్రి చెప్పులు వేసుకుని గుడికి బయలుదేరి వెళ్ళిపో్యారు.
షాక్ తో తల దిమ్మెక్కింది ఆ కొడుకులకూ......కోడళ్ళకు.....
తల్లిదండ్రులను భారంగా అనుకోవద్దు. వారు మిమ్మల్ని బాధపెట్టకుండా
ఆశ్రమాలకు వెళ్ళిపోతు్న్నారు. వారు ఇలా తి్రగబడితే తప్ప
గౌరవంగా బ్రతకలేరు. ఏమీ లేనివారి పరిస్థితి సరే! ఆధారం ఉన్న
తల్లిదండ్రులను, ఆస్తిపాస్తి ఉన్న తల్లిదండ్రులు కూడా అనాధ 
శరణాలల్లో ఉంటున్నారు. వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఇది.
తల్లిదండ్రులను బిడ్డల్లా కాపాడండి. చివరి దశలో వారిని చిత్రవధ
చేయకండి. వారికంటే మించిన దేవుళ్ళు లేరని తెలుసుకోండి.

Good morning


Tuesday, September 12, 2017

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన

పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. దానికి కారణం, భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారని అనేకుల అభిప్రాయం.
ఇందుకు శ్రీ రామాయణం నుంచి కొన్ని విశేషాలు చూద్దాం. సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.
ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాడు కాలిఫోర్నియగా పిలువబడుతోందని నడిచేదేవుడుగా పిలువబడిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు.
కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland) (సగర పుత్రులు బూడిద కుప్పలు గా మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horseland) ( యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన #గంగోత్రి హిమానీనదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.
వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే అని, దానికి పురాతన నామం మహాబలిభూమి అని, ఇప్పుడది #మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందిందని కొందరు పండితులు చెప్తారు. ఈ మలిపునగర్ కు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం. ఇక్కడే అలుమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఈనాటి హిందువులు నిర్మించుకున్నారు.
అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన ప్రదేశం ఇండోనేషియాలోని బాలీ అనే వాదన కూడా ఉంది. బాలీకు అడుగు భాగాన, భూమికి అవతలివైపు దక్షిణ #అమెరికా ఖండం ఉంది. (చిత్రంలో చూడవచ్చు) అక్కడి నుంచే వామన మూర్తి బలిచక్రవర్తిని త్రొక్కిన కారణంగా ఆ ప్రదేశం పేరు బాలిగా రూపాంతరం చెందిందని అక్కడి హిందువులు చెప్తారు. ఎలా చూసినా బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు పాతాళానికి అధిపతిగా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళంలో అధికంగా కనిపించేది విలాసవంతమైన జీవనం. అందుకే అక్కడ ఆధ్యాత్మికత కంటే భౌతికతకే (materialism) ప్రాధాన్యం లభించింది.
ఇంకో ఆసక్తికరమైన విషయం రామ-రావణ యుద్ధ సమయంలో రావణుడికి సోదర వరుస అయిన మహిరావణుడు, రామలక్ష్మణులను అపహరించి, సొరంగ మార్గం ద్వారా పాతాళానికి తీసుకునివెళతాడు.
ఇంతకుముందు చెప్పుకున్నట్లే పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా సొరంగ్రం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.
మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళానికి తీసుకువెళ్ళిన సొరంగం మధ్యప్రదేశ్‌లో ఛింద్వారా జిల్లా పాతాల్‌కోట్ లోయలో ఉందని అక్కడి స్థానికులు చెప్తారు. ప్రాంతం ఏదైనా ప్రస్తుతానికి మనకది అప్రస్తుతం. అదే సొరంగం ద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు, అక్కడ తన స్వేదం ద్వారా పుట్టిన, తన పుత్రుడైన మకరధ్వజుని కలవడం, వారిద్దరి మధ్య యుద్ధం జరగడం, మకరధ్వజుడు ఒడిపోవడం, ఆ తర్వాత #ఆంజనేయస్వామివారు పంచముఖ ఆంజనేయునిగా అవతారం స్వీకరించి, మహిరావణుడిని సంహరించి, రామలక్ష్మణులను కాపాడుతారు.
రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజిస్తారు.
మధ్య అమెరికా, #హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని ‘Lost City of the Monkey God‘ గా పిలుస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారని Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు వెళ్ళడించారు. అది అతను 1939 లో కనుగొన్నాడు. దాని గురించి ఆయన పూర్తి వివరాలు వెళ్ళడించే లోపే మరణించారు.
హిందువులకు మెక్సికన్లకు సంబంధం వున్నదా? అమెరికా అంటే పాతాళమా?
“సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ:” – అనగా #సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. దేవతలకు మన మానం ప్రకారం వారి పగలు ఆరు నెలలు, రాత్రి ఆరు నెలలు. వారి ఒక దినం మన ఒక సంవత్సరం. అలాగే మానవులకు పగలయినప్పుడు పాతాళంలో అది రాత్రి. (ఇప్పుడు మనకు పగలయితే వారికి రాత్రి అవుతుంది, సరిగ్గా 12 గంటలు ఆ పైనే మనకు వారికి సమయ వ్యత్యాసం)
రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగర కుమారులు 60వేల మంది కూడా ఎలా భూమిని వెదుకుతూ వెళ్ళారో, భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు. వారు అలా పాతాళంలో కపిల ముని ధ్యానభంగం చెయ్యడం, ఆయన ఆగ్రహం చవి చూసి భస్మమై పోవడం, వారి భస్మాల పైన భూమి నుండి గంగను అవతరింప చేసి పారించి పాతాళంలో వారి భస్మరాశులపై ప్రవహింప చేసి వారిని తరింపచేస్తాడు భగీరధుడు.
మన భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం వున్నట్టు చెబుతారు. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది.
#అహిరావణుని వృత్తాన్తంలో కూడా హనుమంతుడు పాతాళానికి ప్రయాణించి అక్కడ అతడిని మట్టు పెట్టి రామలక్ష్మణులను విడిపించినట్టు ఐతీహ్యం. అలాగ మరెన్నో కధలు భూ-పాతాళ రాకపోకల గురించి వున్నాయి. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, #oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.
ఒకానొకప్పుడు అంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు అక్కడ వున్న తెగను దునుమాడి, వారిని హతమార్చి, అక్కడ శిధిలాల నిర్మితమైన నవ శకం నేడు మనం చూస్తున్న శక్తివంతమైన దేశం అమెరికా. ఇత:పూర్వం నివశించేవారిని నేటివ్ ఇండియన్స్ అని, ఇండియన్ అమెరికన్ అని, నేడు కొత్తగా నేటివ్ అమెరికన్స్ అని పిలుస్తున్నారు. వారు ఒకప్పుడు విగ్రహారాధన చేసేవారు. ఇప్పటికీ #హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. చరిత్రలో మరొక ఐతీహ్యం కూడా చెప్పబడుతూ వున్నది.
మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడుతుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. #Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార చాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు, కొన్ని దురాచారాలయిన చేతబడులు(sorcism ) నమ్ముతారు చేస్తారు. #ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం “the light of india” లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు ఆఖరికి మానవ బలులు కూడా చేసేవారు.
వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఇంచుమించి వారు పూజించే Quetzalcoatl ( పాలను మనం క్షీరం అని పిలుస్తాం, ఆంగ్లంలో milk అంటాం. అలాగే వారి పిలుపులో తేడా వున్నా వారి ఇతిహాసం మన కధనే చెబుతుంది.) . అలాగే అర్జున, పాతాళ యువరాణి ఉలుపివృత్తాంత౦ కూడా వారి వాంగ్మయంలో చిల్లి పెప్పర్ man గా కనబడుతుంది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరిపోతుంది.
వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్యవలసిన అవసరం వున్నది.
ఒకసారి నడిచే దేవుడు కంచి #పరమాచార్య వారు ఒక israel దేశస్తుడిని ఉద్దేశించి వారి మంత్రాలకు మన మంత్రాలకు వున్న సంబంధం వివరిస్తారు. వారు అన్నారు ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది. అప్పుడు సంస్కృతానికి పూర్వం వున్న దేవభాష గురించి చెబుతారు. అప్పుడు వారన్నారు మీకందరికీ తాళం కనబడుతోంది. కేవలం మా ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా వున్నాయి అని. ఎంత సత్యమో కదా ......
Like

Total Pageviews