Sunday, July 30, 2017

Vedas & Abstracts: *కుటుంబ గొడవలు హరించుటకు*

Vedas & Abstracts: *కుటుంబ గొడవలు హరించుటకు*: శ్రీ మహా గణపతి అనుగ్రహ స్తోత్రముభార్యాభర్తల మధ్య గొడవలు గాని, అన్నదమ్ముల మధ్యగొడవలు గాని, తల్లిదండ్రుల బిడ్డల మధ్య గొడవలు గాని,సమసి పోవుటకు...

Saturday, July 29, 2017

తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:

తిరుమలకు అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చిందా? అన్లైన్ లో రూం బుక్ చేయడం కుదరలేదని దిగులు వద్దు. తిరుమలలో ఉన్న వివిధ మఠాలలో మీరు గదిని పోందవచ్చు.
వాటి వివరాలు ఇక్కడ....
మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:
Mool Mutt Ph:0877-2277499.
Pushpa Mantapam Ph:0877-2277301.
Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.
Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.
Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.
Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.
Sri Vaykhanasa Divya Siddanta
Vivardhini Sabha Ph:0877-2277282.
Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.
Sri Pushpagiri Mutt Ph-0877-2277419.
Sri Uuttaradi Mutt Ph-0877-2277397.
Udupi Mutt Ph-0877-2277305.
Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.
Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.
Sri Tirupati Srimannarayana Ramanuja
Jeeyar Mutt Ph:0877-2277301.
Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.
Sri Ahobita Mutt Ph:0877-2279440.
Sri Tirumala Kashi Mutt phone : 222 77316
Udipi Mutt Ph:0877 222 77305
Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)
Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)
Sri Vallabhacharya Mutt phone : 222 77317
Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302
Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436
Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826
Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282
Sri Ahobila Mutt Ph:0877-2279440
Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269
Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445
Hotel Nilarama Choultry Ph:0877 222 77784
Sri Srinivasa Choultry Ph:0877 222 77883
Sri Hathiramji Mutt Ph:0877 222 77240
Karnataka Guest House Ph:0877 222 77238
Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245
Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435
Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

Thursday, July 27, 2017

కథా మంజరి: తగునా యిది మీకూ ?!

రస హృదయులకు శ్రీనాధ మహాకవి గారి ఒక సరస పద్యంతో శుభోదయం! 
యుక్తం కిం తవ శర్వరీశ ముఖ  మద్వేణీసమాకర్షణమ్ ? 
వధ్యాయా వంహరత్తవ కుచ ద్వంద్వం మదేయం మన:
వ్యత్యస్తం నను శిక్షితం జహి జహి స్వామిన్ వచ: సాధు తే ? 
ఆశోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు. 

మరి అర్ధం కావాలంటే?  ఆగాల్సిందే సర్! 
 .           .. 




 ..........



......... . 




......... 
  
  


   .. .......   

  .. ....... 




 ....... 





----------------














భావం: ‘‘ఓ అందగాడా  నా జడను లాగుతావేం ? నీకిది తగునా ? ’’ ‘‘ నీ ఉన్నతమైన వక్ష స్థలం నాచేత ఆ పని చేయించింది మరి. ’’ ‘‘చిత్రం ! తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాథిని ( జడను) దండిస్తారా ’’

కథా మంజరి: అమ్మాయి పెళ్ళి చేయ బోతున్నారా ? ఏయే సామాన్లు సమకూర...

కథా మంజరి: అమ్మాయి పెళ్ళి చేయ బోతున్నారా ? ఏయే సామాన్లు సమకూర...: శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వివాహ సమయంలో వరుసగా జరిపించే కార్యక్రమాలు, వాటికి సమకూర్చుకో వలసిన సామగ్...

చిన్న కథ - పెద్ద పాఠం

చిన్న కథ - పెద్ద పాఠం
---------------------------------------------

తొమ్మిది ఎనిమిదిని లాగి లెంపకాయ కొట్టింది.
ఎనిమిదికి దిమ్మదిరిగి పోయింది.
"ఎందుక్కొట్టావ్?"
"నేను నీకన్నా పెద్దదాన్ని. అందుకే కొట్టాను."
ఎనిమిది పక్కకి చూసింది. ఏడు నిలబడి ఉంది. ఏడుని లాగి లెంపకాయ కొట్టింది.
"ఎందుక్కొట్టావ్?"
"నేను నీకన్నా పెద్దదాన్ని. అందుకే కొట్టాను."
ఏడు ఆరుని కొట్టింది.
ఆరు అయిదుని కొట్టింది.
అయిదు నాలుగుని కొట్టింది.
నాలుగు మూడును కొట్టింది.
మూడు రెండును కొట్టింది.
రెండు ఒకటిని కొట్టింది.

ఒకటి పక్కకు చూసింది.
అర్భకపు సున్నా అక్కడ ఉంది.
అది దాన్ని కొట్టలేదు. ఎత్తుకుని ఎడమ పక్క కూర్చోబెట్టుకుంది.
ఒకటి సున్నా కలిస్తే పది అయ్యాయి.
పది కన్నా తొమ్మిది తక్కువ. అది పెద్దోడిని చూసి దణ్ణం పెట్టి పక్కకి ఒదిగింది.
ఎనిమిది తొమ్మిదిని అనుసరించింది.
ఏడు ఎనిమిదిని అనుసరించింది.
ఆరు ఏడుని అనుసరించింది.
అయిదు ఆరుని అనుసరించింది.
నాలుగు అయిదుని, మూడు నాలుగుని, రెండు మూడుని అనుసరించాయి.

పది నిదానంగా చెప్పింది.
"పదిమందీ కలిసి బతకండి!"

Tuesday, July 25, 2017

నచ్చిన అయిదు పుస్తకాల పేర్లు

మీకు నచ్చిన అయిదు పుస్తకాల పేర్లు చెప్పండి అని అడిగాడో మిత్రుడు. 'నచ్చినవా? మెచ్చినవా? తెలుగులోనా? ప్రపంచ సాహిత్యంలోనా ' అనడిగాను.
'ప్రపంచసాహిత్యంలోంచే చెప్పండి ' అన్నాడు.
ఆలోచించాను, ఒక రోజంతా. నచ్చినవీ, మెచ్చినవీ చాలానే ఉన్నాయి. ఎంచడం కష్టమే కాని, ఏదోలా ఎంచి చూపించవచ్చు.
కాని, ఆ ప్రశ్న నేను మరోలా వేసుకున్నాను. నిన్ను ప్రభావితం చేసిన పుస్తకాలేవి? నీ జీవితాన్ని మార్చిన పుస్తకాలు? ఏ పుస్తకాలు చదవకపోయి ఉంటే నీ జీవితం మరోలా ఉండేదో, కనీసం ఇప్పట్లాగా ఉండేది కాదో ఆ పుస్తకాలు. ఏ పుస్తకాలు నీ వ్యక్తిత్వపు మూలధాతువులో భాగమైపోయాయో,ఆ పుస్తకాలు.
అసలు మనిషి ఏదన్నా చదివో, వినో, ఎవరినయినా చూసో ప్రభావితమయ్యేది ఎప్పుడు? చిన్నప్పుడు అని చెప్పవచ్చు. ఎంతదాకా? బహుశా ఇరవయ్యేళ్ళ వయసు వచ్చేదాకా. నేను మరొక అయిదేళ్ళు కలుపుకున్నాను. నా పదేళ్ళ వయసునుంచి పాతికేళ్ళ వయసు దాకా చదివినవాటిలో నన్ను అప్పటికప్పుడు ఉద్వేగపరిచినా ఆ తర్వాత వాటివైపు మళ్ళా చూడాలనిపించని పుస్తకాలు పక్కన పెట్టేసాను. నా జీవితాన్ని తొలిరోజుల్లో మలుపు తిప్పిన రెండు మూడు పుస్తకాలున్నాయి. వాటిని మళ్ళా చదవలేదు. కాని, వాటిని చదవకపోయుంటే, నా జీవితమిట్లా ఉండేది కాదని చెప్పగలను. ఇక మరికొన్ని పుస్తకాలు నా జీవితసారాంశాన్ని రూపొందించాయి,నా రక్తంలో కలిసిపోయాయి. వాటిని జీవితం పొడుగునా మళ్ళీ మళ్ళీ చదువుకోవలసి ఉంటుంది. అంతేకాదు, ఆ పుస్తకాల వల్ల నాకు విస్తృత ప్రపంచ సాహిత్యంలోకి, ఆధ్యాత్మిక వాజ్మయంలోకి తలుపులు తెరుచుకున్నాయి. కాబట్టి, వాటిని నేను నా పారాయణగ్రంథాలుగా లెక్కించుకున్నాను.
రెండు వారాలుగా నన్ను నేను శోధించుకున్నాక, అన్ని వడపోతల తర్వాత నేను ఎంచుకున్న పుస్తకాలివీ:
1. శ్రీ మహాభక్తవిజయము
నా చిన్నప్పుడు,అంటే పదేళ్ళ వయసుకన్నా ముందే, మా ఇంట్లోనూ, రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీలోనూ నాకు దొరికిన పుస్తకాలన్నిటిలోనూ నన్ను గాఢంగా ఆకట్టుకున్న పుస్తకం శ్రీ మహాభక్తవిజయము. ఆ పుస్తకాన్ని కొన్ని వందలసార్లేనా చదివి ఉంటాను. తర్వాత రోజుల్లో ఆ పుస్తకాన్ని రెండు భాగాలుగా మా నాన్నగారు బైండు చేయించారు. ఆ పుస్తకం ముందు పుటలు పోవడంతో నాకు కొద్దిగా సాహిత్య జ్ఞానం వచ్చేటప్పటికి ఆ రచయిత ఎవ్వరో తెలియకుండా పోయింది. చాలా కాలం పాటు అది మహీపతి రాసిన భక్తవిజయానికి అనువాదమేమో అనుకున్నాను. కాదని తెలిసింది. ఎన్నాళ్ళుగానో నన్ను వేధిస్తున్న ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో నని, ఈ మధ్య నెట్ లో బ్రౌజు చేస్తే,ఆశ్చర్యం, డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా లో ఆ పుస్తకం కనిపించింది. ఆ రచయిత పేరు చూస్తే ఆశ్చర్యానందాలు ముంచెత్తాయి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి! వావిళ్ళవారి ప్రచురణ (1952). ఆ పుస్తకం నాలో ఇంకిపోయిందని చెప్పవచ్చు. నా తదనంతర జీవితమంతా ఆ భక్త కవుల్ని ఒక్కొక్కరినీ వెతుక్కుంటూ ఉండటమేనని ఇప్పుడు తెలుస్తోంది నాకు.
2. ఉపనిషత్తులు
నేను డిగ్రీ మొదటిసంవత్సరంలో ఉండగా, గాంధీజీ ఈశోపనిషత్తు మీద రాసిన కొన్ని వాక్యాలు చదివాను. ఆ వాక్యాలు కలిగించిన ప్రేరణతో నేను రాజమండ్రిలోఉండగా, దశోపనిషత్తులురామకృష్ణమఠం వారి తెలుగు అనువాదాలు చదివాను. ఈశ, కఠ, తైత్తిరీయ ఉపనిషత్తులు నన్ను వెంటనే ఆకట్టుకున్న ఉపనిషత్తులు. ఆ తర్వాత రోజుల్లో ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు మరింత వివరంగా చదువుకున్నాను. మాండూక్య, ముండక, కేన, ఐతరేయ, ప్రశ్నోపనిషత్తులు ఆ తర్వాత చదివాను. కాని ఉపనిషత్తుల్ని ఒకసారో లేదా పదిసార్లో చదివి చదివాం అని చెప్పేవి కావు. అవి జీవితకాలం అధ్యయనం చెయ్యవలసిన పాఠాలు.
3. సువార్తలు
నా చిన్నప్పుడు తాడికొండ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లో ఎవరికో సువార్తలు పోస్టులో వచ్చాయి. ఆ పుస్తకాల్ని చిలకలూరిపేట నుంచి ఎస్.జాన్ డేవిడ్అనే ఆయన ఉచితంగా పంపుతున్నాడని తెలిసాక, పిల్లలం అందరం ఆ పుస్తకాలు తెప్పించుకున్నాం. అందమైన రంగుల ముఖచిత్రాలతో ఆ పుస్తకాలు మమ్మల్ని చాలా సమ్మోహపరిచేవి. తర్వాత రోజుల్లో పాతనిబంధన, సామగీతాలు, సొలోమోన్ గీతంతో పాటు చదివినప్పటికీ, జెరిమియా, యోబు, ఇషయ్యా, డానియేలు, జోనా వంటి ప్రవక్తల వేదన హృదయానికి సన్నిహితమయినప్పటికీ, సువార్తల వెలుగు మాత్రం అద్వితీయమైంది అని చెప్పగలను. కాలం గడిచేక అగస్టయిన్, ఎక్కార్ట్, టాల్ స్టాయి వంటి వారిమీద సువార్తలు చూపించిన ప్రభావం గురించి తెలుసుకుంటున్న కొద్దీ, సువార్తలు పసితనంలోనే నా హృదయం మీద వదిలిపెట్టిన గాఢముద్ర తక్కువేమీకాదని అర్థం చేసుకున్నాను. మొదట్లో యోహాను సువార్త అన్నిటికన్నా గొప్పదని అనుకునేవాణ్ణి కాని, బైబిల్ పరిజ్ఞానం మరింత అందుబాటులోకి వస్తున్నకొద్దీ, నాలుగు సువార్తల్లో ప్రతి ఒక్కటీ దానికదే అద్వితీయమైందని బోధపడుతూ ఉంది.
4. సురా అల్ ఫాతిహా
మా తాడికొండ గురుకుల పాఠశాలలో ఒక సంప్రదాయం ఉండేది. నరసింగరావుగారనే గొప్ప ఉపాధ్యాయుడు ప్రారంభించిన సంప్రదాయం అది. రోజూ సాయంకాలం ఆరుగంటలకి ప్రార్థనాసమావేశం ఉండేది. ఆ సమావేశంలో పిల్లలందరం హిందూ, క్రైస్తవ, మహ్మదీయ ప్రార్థనలు చేసేవాళ్ళం. మా స్కూల్లో ఒకే ఒక్క మహ్మదీయ బాలుడు ఉండేవాడు. అతడు మాత్రమే ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మేమంతా అతడి వెనకనే ఆ ప్రార్థన అప్పచెప్పేవాళ్ళం. కాని ఒకసారి సెలవుల తర్వాత, ఆ పిల్లవాడు తిరిగి పాఠశాలకు వచ్చాక ఆ ప్రార్థన చెయ్యడానికి నిరాకరించాడు. తన తండ్రి అట్లా చెయ్యొద్దని చెప్పాడన్నాడు. కాని మా ఉపాధ్యాయుడికి ఆ ప్రార్థన లేకుండా ఆ సమావేశాలు నడపడం ఇష్టం లేకపోయింది. అతడి బదులు మరెవరైనా ఆ ప్రార్థన చెయ్యగలరా అనడిగాడు. అప్పటికెన్నో రోజులుగా ఆ ప్రార్థన చేసి చేసి ఆ వాక్యాలు నాకు కంఠతా వచ్చేసాయి. నేను లేచి నిల్చున్నాను. ఆ తర్వాత ఆ పాఠశాల నుంచి వచ్చేసాదాకా, మూడునాలుగేళ్ళ పాటు ప్రతి సాయంకాలం ఆ ప్రార్థన నేనే చేస్తూండేవాణ్ణి. కేవలం పదాలు పలకడమే కాని, అర్థం తెలియని ఆ ప్రార్థన, దివ్య ఖొరాను లోని మొదటి సూక్తమనీ, సురా అల్ ఫాతిహా అని నాకు తెలిసిన రోజున నాకు కలిగిన ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఆ దివ్యప్రార్థనకి మౌలనా అబుల్ కలాం ఆజాద్ తర్జుమన్ ఉల్ ఖురాన్ పేరిట వ్యాఖ్యానం రాసారని తెలిసినప్పుడు, ఆ పుస్తకం వెతికి పట్టుకుని మరీ చదివాను. ఆ వ్యాఖ్యానం చదువుతుంటే, అది ఈశోపనిషత్తు మీద శంకరాచార్యుల భాష్యంలానే అనిపించింది. తర్వాత రోజుల్లో రూమీ, తబ్రీజీల దివ్యపారవశ్యం నన్ను ఆకట్టుకోవడానికి ఆ ప్రార్థన ఆ పసితనంలో నా రక్తంలో ఇంకిపోయినందువల్లనే అని నిస్సంకోచంగా చెప్పగలను.
5. గౌతమబుద్ధుడు
నేను డిగ్రీ రెండవసంవత్సరంలో ఉండగా, కాకినాడ కేంద్ర గ్రంథాలయంలో 'గౌతమ బుద్ధుడు ' అనే పుస్తకం చూసాను. దామోదర ధర్మానంద కోశాంబి రాసిన పుస్తకానికి పుట్టపర్తి నారాయణాచార్యుల అనువాదం. ఆ పుస్తకం చదివిన తర్వాత బుద్దుడు నాకెంతో సన్నిహితంగానూ, అత్యంత మానవీయంగానూ తోచాడు. బౌద్ధసాహిత్యం చదవాలన్న గాఢమైన ఉత్సాహం రేకెత్తింది. అందుకని, తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేయాలనుకున్నప్పుడు, రెండవ సంవత్సరం రెండు స్పెషల్ పేపర్లు రాయవలసి ఉంటే, అందులో ఒకటి బౌద్ధదర్శనం ఎంచుకున్నాను. తర్వాతి రోజుల్లో బుద్ధుడి దీర్ఘ, మధ్యమ సంభాషణలు, దమ్మపదం, జాతకకథలు, థేరీగాథలు, వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం, సద్ధర్మపుండరీక సూత్రం, బుద్ధ చరిత్ర, మిళింద ప్రశ్న వంటివి చదివినప్పుడు, నా పక్కన ఒకరు నిల్చుని దీపం ఎత్తిపట్టుకున్నట్టుగా అనిపించేదంటే, అది కోశాంబి-పుట్టపర్తి రచననే.
6.బనగర్ వాడి
మా తాడికొండ స్కూలు పెట్టిన చోట అంతకు ముందు బేసిక్ ట్రయినింగ్ స్కూలు నడిచేది. బేసిక్ ట్రయినింగ్ స్కూలంటే, గాంధేయ విద్యావిధానానికి అనుగుణంగా నడిచే పాఠశాల అన్నమాట. ఆ స్కూలుకి నుంచి మా స్కూలుకి భవనాలతో పాటు మంచి లైబ్రరీ కూడా దక్కింది. అందులో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన మేలిమి గ్రంథాలు కూడా మాకు లభించాయి. వాటిలో బనగర్ వాడి కూడా ఒకటి. వ్యంకటేశ మాడ్గూళ్కర్ అనే మరాఠీ రచయిత రాసిన పుస్తకం అది. తర్వాత రోజుల్లో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. ఒక నిరక్షరాస్య కుగ్రామంలో పిల్లల్ని అక్షరాస్యుల్ని చెయ్యడంకోసం ఒక ఉపాధ్యాయుడి ప్రయత్నాలకీ, పోరాటానికి సంబంధించిన కథ అది. అది నాకు తెలియకుండానే నన్ను తీవ్రాతితీవ్రంగా ప్రభావితం చేసింది. ఎంత ప్రభావితం చేసిందంటే, నాకు పదవతరగతిలో రాష్ట్రంలో పదవ రాంకు వచ్చినప్పటికీ, లెక్కలు, సైన్సు గ్రూపుల్లో ప్రవేశం ఉచితంగా ఇస్తామన్నప్పటికీ, కావాలని సియిసి లో చేరాను. ఇంజనీరింగ్, మెడిసిన్ కాక సాంఘికశాస్త్రాలు చదువుకోవాలనీ, గ్రామాలకు పోయి, పేదప్రజల కోసం పనిచెయ్యాలనీ కోరుకున్నానంటే అందుకు కారణం బనగర్ వాడి అని స్పష్టం గా చెప్పగలను.
(ఇంకా ఉంది)

Monday, July 24, 2017

శ్రావణమంగళవార వ్రతం.


మరి రేపే 25 - 07 - 2017 న శ్రావణమాస మొదటి మంగళవారం. మరి దానికి సంబందించిన విశేషాలను, వ్రతవిధానాన్ని తెలుసుకుందామా?
"అరుణాం కరుణాo తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం వయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్."
అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పెద్దలు చెపుతారు.కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణంలో వచ్చే మొదటి మంగళవారం ఈ వ్రతాన్ని ప్రారంభించి, ఆ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఎదురైనా లేదంటే, ఏదైనా ఒక వారం గానీ, రెండు వారాలు గానీ చేయలేకపోయినా,..అందుకు ప్రత్యామ్నాయంగా భాద్రపద మాసంలో వచ్చే మంగళవారల్లో వ్రతాన్ని చేసుకోవచ్చు అని పురాణాలు సూచిస్తున్నాయి. శ్రావణంలో ఎన్ని మంగళవారాలు వ్రతం చేయడానికి వీలు కలగదో, అన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాల్లో చేయవచ్చు. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. 

శ్రావణమంగళవార వ్రతం మొదలు పెట్టిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ( కొన్ని ప్రాంతాలలో ముత్తయిదువులు పెరిగారు 5  గురికి మాత్రమే ఇస్తారు.) ముత్తయిదువులు పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుక ఇచ్చి, శనగలూ, చనివిడి, తాంబూల సహితంగా  వాయనం ఇవ్వాలి.
శ్రావణంలో ఎన్ని మంగళవారాలు వ్రతం చేయడానికి వీలు కలగదో, అన్ని భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాల్లో చేయవచ్చు. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి.

వ్రతానికి ఏమేం కావాలి? 




మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెగుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారం, కొబ్బరికాయ  దీపం కుందులు 2,  దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరుబత్తులు, బియ్యం, బెల్లం, శనగలు మొదలైనవి. 

ఎలా చేయాలి?

 వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలి. తర్వాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి.ముగ్గులు వేసి పూజా మంటపంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి మామిడి తోరణాలతో అలంకరించాలి. గౌరీదేవి పూజ ప్రారంభానికి ముందు పసుపుతో వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ నిర్వహించాలి. అందుకోసం..పసుపు కుంకుమ, గంధం, తమలపాకులు, అక్షతలు పూలు, పండ్లు మొదలైనవన్నీ ముందుగానే సిద్దం చేసుకోవాలి. గౌరీదేవి ఆవాహన చేసి,దూప దీప , అష్టోత్తర శతనామాలతో పూజించి 9 పోగులదారానికి పసుపురాసి పువ్వులు ఆకులు కలిపి తొమ్మిది ముడులు వచ్చేలా తోరం తయారుచేసుకుని  కథ చదివేముందు ఒకటి అమ్మవారికి, ఒకటి నోమునోచినవారికి, ఒకటి కాటుక పెట్టె గరిటకి కట్టాలి.అమ్మవారికి పెట్టినదానిని బుట్టవయినం ఇచ్చే వారికి కథ అనంతరం వాయినం ఇచ్చేటప్పుడు  కట్టాలి. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరవాన్నం, పులగం నైవేద్యంగా పెట్టాలి. నోము నోచుకునేవారు ఆరోజు తరిగిన కూర తినకూడదు. చనివిడి తయారీకి ముందుగా బియ్యం నానబెట్టి నీరు ఓడ్చేసి కొంచెం తడిగా ఉండగానే మెత్తటి  పిండిలా మిక్సీలో వేసుకుని దానికి తగ్గ బెల్లం వేసి కలిపితే చనివిడి తయారవుతుంది.దానిని సంవత్సరానికి ముత్తయిదువులు పెరిగేవారు ముందు సంవత్సరం 5 ఉండలు చేసుకుని జ్యోతులులా చేసి అందులో ఆవునెయ్యి వేసి వత్తి వేసి వెలిగించి ఒక గరిటెకి నెయ్యిరాసి  కథ చదువుతున్నంత సేపు ఆ దీపాలపై పెట్టి పట్టుకోవాలి. కథ పూర్తయిన తరువాత అక్షింతలు  వేసుకుని  ఆ గరిటకు పారిన కాటుకను  నోము నోచినవారు కళ్ళకు పెట్టుకుని బుట్టవాయినం ఇచ్చిన ముత్తయిదువుకు, మిగిలిన  ముత్తయిదువులకు శనగలు, చనివిడి, దక్షిణ తాంబూలంతో పాటు ఇవ్వాలి.

 వ్రత కథ.

అనగనగా బ్రాహ్మణ దంపతులు. పెళ్ళయి చాలా కాలమయినా సంతతి కలగని కారణంగా, ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై " అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అయిదవతనం లేని కూతురు కావాలా?” అని అడిగాడు.

అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే యిమ్మ" ని ప్రార్థించారు వారు. “తథాస్తు" అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన అచిరకాలంలోనే, ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి, సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది.

తక్షణమే యమభటులు వచ్చి, ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాక ఆగి, తదుపరి తీసుకువెళ్ళ" మని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి, పురుడు తీరగానే వచ్చారు.

అప్పుడామె "తండ్రులారా! మాటలు రానిదే. మానవుడు కాలేడు గనుక, మా శిశువు నోరార అమ్మా, నాన్నా అని పిలిచే వరకూ ఆగి, ఆ ముచ్చటయినాక గైకొమ్మంది. “సరే" అని వెళ్ళిపోయారు కింకరులు.

ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి - బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది.

తల్లి విచారిస్తున్నందని తెలుసుకున్న బిడ్డ "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడగగా, ఆమె జరిగినదంతయు వివరించింది.

విషయం తెలుసుకున్న ఆ బాలుడు " అమ్మా! ఎలాగూ అల్పాయుష్కుడి నయ్యాను. పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్లి రావాలని వుంది. కనుక, నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే, నేను వచ్చేదాకా ఆగమను ” అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లితండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు.

అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన, ఆ ఊరి రాజు కూతురూ, ఆమె చెలుల మధ్య తగవు వచ్చి, ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు "నాకీ రాత్రి పెండ్లి కాబోతూ వుంది. అదీగాక, మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు, తిట్లు ఫలించవు ” అంటూ చేతిలో పూలను నేలమీద పారబోయగా, ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు "ఆ పిల్ల తన భార్యయైతే బాగుండును" అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్ళి కుమార్తెను చేయించాడు. రాణీ ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్ళివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్ళి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్ళి మరొక ముహుర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెళ్ళివారి నుండి కబురు అందుతుంది.

వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి, పొరుగూరికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లుళ్ళలను ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్ళి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళ గౌరీ కనిపించి "అమ్మాయీ! ఈ రాత్రే నీ భర్తకు పాము గండము వుంది. జాగ్రత్తగా వుండి, ఆ పామును... నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది.

ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి, అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటకమీద వున్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా, వరుని తొడపై నిలిచి, ఆ కుండను దింపి, పాము నందులోనికి పట్టి, ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసెనకట్టు కట్టి, మరలా అటకపై భద్రపరిచి, తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ, మేనమామ వచ్చి, పెండ్లి కుమారుడిని నిద్రలేపి, తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు.

కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా, రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి గట్టినవాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. “ అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు" అని పెద్దలు అడిగారు.

అందుకా చిన్నది "తండ్రీ ! నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనా సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను. అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను" అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదాన మీయసాగింది.

ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా, కాశీకి వెళ్ళిన మేనమామా మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు పట్టి అతని చేతిని పట్టుకొని "ఇతడే నా పెనిమిటి అని యెలుగెత్తి పలికింది. పెద్దలందుకు ఋజువు కోరగా, పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి, అటు తరువాత పామును దాచి వుంచిన కుండను తీసి చూపించగా, అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని ఋజువులూ సరిపోవడం వలన, పెద్దలామె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుక నొక భరిణిలోభద్రపరిచి ఇచ్చింది.

అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి, ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు గానీ క్షేమమడిగేవారు లేక నిత్య దుఃఖితులై వున్నారు. అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో వూరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి, గ్రామస్థులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్లి "మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు.

ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు.

అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభినందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కాని, కొడుకునీ కోడలినీ చూసుకునే అదృష్టం లేనందుకు దిగులుపడగా, రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది.అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి, కొడుకునూ, కోడల్నీ చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహాత్మ్యానికి ఆశ్చర్యపడిన యిగురుపొరుగు వారంతా "ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచేవమ్మా" అని అడగగా "శ్రావణ మంగళవారపు నోము"అని చెప్పిందామె.

అది మొదలా వూరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యలతో చెప్పలేనంత కాలం సుఖసౌభాగ్యలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు.

ఉద్యాపన

అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్ధతి లోపించినా ఫలితం లోపించదు.

సర్వేజనా సుఖినోభవంతు.

కర్పూరంతో ఆరోగ్య లాభాలు:

కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.

2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.

5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.

6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.

7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.

8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.

9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.

11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.

12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.

14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమికీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి, కర్పూరాన్ని విరివిగా వాడుతారు.

15. తేలుకుట్టిన చోట ఆపిల్ రసంలో అరగ్రాము కర్పూరము కలిపి అరగంటకొకసారి బాధితునికి పట్టిస్తే తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటకు వచ్చేస్తుంది.

16. పెయింటింగ్, బాణాసంచా, సహజమైన పరిమళాలు, సబ్బులు తయారీలో కర్పూరం వాడుతారు.

17. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు.

18. అలానే అరబకెట్నీళ్లలో రెండు గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకూ మరిగించి ఇంటిని తుడిస్తే ఫ్లోర్మీద ఈగలు వాలవు.

19. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మజీవులు నశిస్తాయి.

20. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని త్రాగే నీటిలో కూడా కలుపుకుని మరీ త్రాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట.

కర్పూరం

కర్పూరం గురించి..

కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా Cinnamomum camphora (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.

పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.

హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.

రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.

సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు.

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం
 శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం
 మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.



శుక్లచవితి-నాగులపంచమి
 మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి 
 ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ
 సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి
 వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి 
 క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి
 ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
 ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.                        

శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన పుణ్యప్రదమైనవి.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి - బ్రహ్మదేవుడు
 విదియ - శ్రీయఃపతి
 తదియ - పార్వతీదేవి
 చవితి - వినాయకుడు
 పంచమి - శశి
 షష్టి - నాగదేవతలు
 సప్తమి - సూర్యుడు
 అష్టమి - దుర్గాదేవి
 నవమి - మాతృదేవతలు
 దశమి - ధర్మరాజు
 ఏకాదశి - మహర్షులు
 ద్వాదశి - శ్రీమహావిష్ణువు
 త్రయోదశి - అనంగుడు
 చతుర్దశి - పరమశివుడు
 పూర్ణిమ - పితృదేవతలు



*పరమ పవిత్రం శ్రావణమాసం*

*శ్రావణమాసం నేటి నుండి ప్రారంభం*
*పరమ పవిత్రం శ్రావణమాసం*
శ్రావణమాసం వచ్చిందంటేచాలు ప్రతీ ఇల్లు దేవాలయాన్ని తలిపిస్తుంది. నెల రోజుల పాటు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణ వినిపిస్తుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి దైవ కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు వేదపండితులు. అంత గొప్ప పవిత్రమాసం నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానుంది.
అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టపండుగలు సైతం రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవదైన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు ఏర్పడింది. ఈ శ్రావణమాసంలోనే వర్షరుతువు ప్రారంభమవుతుంది. త్రీమూర్తులలో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి (భార్య) అయినటువంటి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణం. మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణనక్షత్రం కావడం, అటువంటి శ్రావణనక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైన మాసం. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. నెల రోజులు నిష్ట, నియమాలతో పూజలు నిర్వహించినట్లయితే కోరిన కోరికలు తప్పక నేరవేరుతాయానేది భక్తుల ప్రగాఢవిశ్వాసం.
శ్రావణ మాసంలోని మరిన్ని విశిష్టతలు...
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే ఎంతో మోక్షం లభిస్తుంది. శుక్లపక్ష పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, రాఖీపౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ, వేదాభ్యాసాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన లాంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటి ముఖ్య పండుగలు సైతం శ్రావణమాసంలో రావడం శ్రావణమాసానికున్న ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ మాసంలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచాతప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయంటున్నాయి మన పూరాణాలు.
శివారాధనకు ఎంతో విశిష్టత కలిగిన మాసం..
శ్రావణమాసంలోని దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైన మాసం. శ్రావణమాసం ముఖ్యంగా భగవారాధనలో శివ, కేశవ బేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏ చిన్న కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుంది. ఈ మాసంలో సోమవారాలు పగలంత ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రభిషేకాలు, బిల్వార్చనలు జరిపినట్లయితే సకల పాపాలు కూడా నశిస్తాయాని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉపవాసం ఉండి దీక్షను పూర్తిచేయాలి. అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి సమయంలో పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని బుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణశుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఈ పక్షంలోని ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్ర్తాలు చెబుతున్నాయి. భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉటుందంటున్నారు పండితులు. అందుకే శ్రావణమాసంలోని అన్ని సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది.

Sunday, July 23, 2017

శ్రావణమాస శుభ శుభోదయం../\..


శుభోదయం!
ఓం శ్రీ మాత్రే నమ:!!
పదునాలుగు లోకాల మంగళ మూర్తీ .. సతతం నీకు నమస్కరిస్తున్నాము 
గాడర భక్తితో నీముందు నిలుచున్నాము .. నీ మహాశక్తిలోని తేజస్సు మమ్ము ఆవహించుగాక నిన్ను కొలచినవారు సౌభాగ్యవంతులు ... నిన్ను మరచిన వారు అభాగ్యులు.నీ అనుగ్రహం సదా మాపై ఉండాలని కోరుకొంటున్నాము.!!!




Saturday, July 22, 2017

గీతకు 18 పేర్లు ఉన్నాయి.

గీతకు 18 పేర్లు ఉన్నాయి. అవి:
1. గీతా గంగేచ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ|
బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహినీ||
2. అర్ధమాత్రా చిదానందా భవఘ్నీ భ్రాంతినాశనీ|
వేదత్రయీ పర అనన్తా తత్వార్ధ జ్ఞానమంజరీ||
3. ఇత్యేతాని జపేన్నిత్యమ్ నరో నిశ్చలమానస:|
జ్ఞానసిద్ధిం లభేచ్చీఘ్రం తధాన్తే పరమం పదమ్||
గీతకు ఈ క్రింది పేర్లు కలవు:
1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత
5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి
9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద
13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి
16. పర 17. అనంత 18. తత్వార్ధజ్నానమంజరి
ఈ పదునెనిమిది గీతానామములను ఎవరు నిశ్చలచిత్తుడై సదా జపించుచుండునో అతనికి శీఘ్రముగా జ్నానసిద్దియు, తుదకు పరమాత్మ పదప్రాప్తియు లభించును.

Monday, July 17, 2017

" చిదంబర రహస్యం "

  ఏమిట్రా విషయం...అంటే....
అదా...
ఓ " చిదంబర రహస్యం " అంటారు చాలా మంది.

 ఇంతకి...ఆ చిదంబర రహస్యం...ఏమిటంటే...

                  చిదంబర రహస్యం !
             ( ఆలయం ఒక అద్భుతం )

తమిళనాడులోని
చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ ,
అక్కడున్న నటరాజ విగ్రహం
ప్రపంచ ప్రసిద్ధమైనదని
మనలో చాలా మందికి తెలుసు.

చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు,
భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల
పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .

ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో
ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.

ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం !

 ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది

" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు .

అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!

ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి .
అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి .
ఇది ఆశ్చర్యం కదూ !

 చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి

చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 )

ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .

 దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి .
అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.

" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు
.
పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు
.
9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు .
అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .
ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు
..
నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు .
మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

ఓమ్ నమశ్శివాయ.                        

చమత్కారం

                        చమత్కారం

గరికపాటి వారి ప్రవచనం పూర్తికాగానే ఓ గడుగ్గాయి లేచి "అయ్యా ..పాండవులలో చివరి నలుగురికి "డు" కారంతో అంతం అయ్యే పేర్లు ఉన్నాయి కానీ  కేవలం వొక్క ధర్మరాజుకి మాత్రం" డు" కారం లేని పేరు ఎందుకు ఉందనే సందేహాన్ని లేవనెత్తాడు.

దానికి గరికపాటి వారు భలే చమత్కారమైన జవాబు నిచ్చారు.
అదేమిటో ఇక్కడ చదవండి.

ధర్మజుడు పాండవులకి పెద్ద అంటే రాజు లేదా నాయకుడు.  నాయకుడు ఎప్పుడూ తన క్రింద వారికి [తమ్ములకు] వారు చేయదగిన పనిని చెప్పి చేయిస్తూండడమే పెద్ద పని.

పనిని చేయమని చెప్పడాన్ని ఆంగ్లంలో  "డు" (DO) అనిఅంటారు కనుక అయన ఆజ్ఞలను జారి చేసేటపుడు... భీమా"డు"- భీమా చెయ్యి-[భీముడు అయ్యింది కదా] నకులా "డు" [నకులుడు]... అర్జున "డు"[అర్జునుడు] సహదేవా"డు" [సహదేవుడు]..అంటూ ఉండటంతో వారి వారి పేర్ల చివర "డు" కారం వో అలంకారమైంది నాయనా అంటూ చమత్కరించారు....

రాజు పని చేయ"డు" కనుక అయన పేరు చివర "డు" లేదు పొమ్మన్నారు అయన నవ్వేస్తూ..

నేటి కథ.

ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది . ఆడుతూ పాడుతూ పని చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది . సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు . ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు . చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది , దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని . ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గ నియమించాడు . బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది . వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గ నియమించుకుంది . సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది , పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు . ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది . అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు , ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి . ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్ ,వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు మొదలైనాయి . క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది . ఉత్పత్తి పడిపోయింది . సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్తితిగతులని అద్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు . వెంటనే సింహం ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి
తొలగించాలని తీర్మానించాయి.
.ప్రస్తుతం ఏ ఆఫీస్ లో చూసినా అడ్మినిస్ట్రేషన్ ఇలాగే ఉంది.

సప్త ఋషులు ఎవరు?

సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ 
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.
ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు.
వీరు ఏడుగురు పూజనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. కశ్యప మహర్షి:- 
సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

⭐ 2. అత్రి మహర్షి:- 
 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

⭐ 3. భరద్వాజ మహర్షి:- 
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

⭐ 4. విశ్వామిత్ర మహర్షి:- 
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

⭐ 5. గౌతమ మహర్షి:- 
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

⭐ 6. వశిష్ఠ మహర్షి:- 
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.

⭐ 7. జమదగ్ని మహర్షి:- 
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.

శివుడు.. విష్ణువుల్లో ఎవరు గొప్ప ..?

శివుడు.. విష్ణువుల్లో ఎవరు గొప్ప ..?

సాధారణంగా శివుడు గొప్పా? లేక విష్ణువు గొప్పా? అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక అధ్బుతమైన కధ ఉంది.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అనే సందేహం కలిగింది. 'రామస్య ఈశ్వరః' అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం (శివుడే గొప్పవాడని) చెబుతుంది. శివ ధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అని వైకుంఠం వెళ్ళారు దేవతలు. విషయం చెప్పారు, మీరు, ఇంకా శివుడిలో ఎవరు గొప్పా అని అడిగారు. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది, రామస్య ఈశ్వరః, ఈశ్వరుడే రామునికి అధికారి, నాకంటే శివుడే గొప్పవడు అని అన్నాడు విష్ణువు.

ఈ విష్ణువు వినయంతోనో, అహంభావం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి, తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు. దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహాఇంచడానికి ఏముంది? రాముడె ఈశ్వరుడుగా గలవాడు (రాముడు (విష్ణువు) తనకు అధికారి అని, విష్ణువు తనకంటే గొప్ప అని) అన్నాడు.

వీళ్ళిద్దరితో పెట్టుకుంటే కుదరదు అని, దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు "రామేశ్వరుడంటే రాముడొకడూ, ఈశ్వరుడొకడు అని అర్దం కాదయ్య, రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారు.

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః |
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్ ||

అసలు వీళ్ళిద్దరికి బేధం లేదు అని బ్రహ్మగారు సెలవిచ్చారు.

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః ||

శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు. అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని, విష్ణువును దూషిస్తే, వారు శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తుంది.

శివుడు, విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి. ఇద్దరూ ఒక్కటే. శివుడు నిత్యం కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానిస్తే, విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు. వారిద్దరిని కలలో కూడా వేరుగా భావించరాదు.....

ఓం నమఃశివాయ 

ప్రలోభం

ప్రలోభం

ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు.
చాలా చక్కని వాక్పటిమ గలవాడు.
ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే
వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు.
ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.
ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది.
ఆ ఊరు వెళ్ళే  బస్సు ఎక్కి  టికెట్ తీసుకున్నాడు.
అయితే పొరపాటున బస్సు కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు.
పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు.
కానీ బస్సునిండా జనం కిక్కిరిసి ఉండటంతో,
దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.
కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి.
'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.
ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా! ఎంత మంది తినటంలేదు?
నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి?
ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా......'
అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.
అంతలో వూరు వచ్చింది.... బస్సు ఆగింది.
కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే
తన ప్రమేయం ఏమాత్రం లేకుండా  అసంకల్పితంగా
కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి
"మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.
దానికి ఆ కండక్టర్ "అయ్యా! నేను  మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను.
మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా
అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.
పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి
'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో
నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను...
నా అదృష్టం బాగుంది.
నా మనస్సాక్షి  సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని
నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.

*జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా
 సర్వనాశనం కావడానికి క్షణం చాలు.

Saturday, July 15, 2017

బంధుమిత్రులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలతో... 🌹🌹🌷🌷🌺💐💐


బంధుమిత్రులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలతో... 🌹🌹🌷🌷🌺💐💐
హైద్రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో, ఇంకా ఇతర తెలంగాణా ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు బోనాలు ముఖ్యమైన పండుగ. ఏటా ఆషాఢమాసంలో వచ్చే బోనాలు మూడు వారాలపాటు సందడిగా కొనసాగుతాయి. 
ఆషాఢమాసంలో కాళీమాత పుట్టింటికి వెళ్తుందని విశ్వసించే భక్తులు బోనాలు వేడుకల సందర్భంలో దేవి గుడికి వెళ్ళి దర్శించుకుంటారు. అమ్మవారు తమ ఇంటికి వచ్చిందని తలచి, ప్రేమగా బోనాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాలకు మేకపోతును లేదా కోడిపుంజును బలి ఇచ్చే సంప్రదాయం ఉంది.బోనాలు సంబరాలు ఎల్లమ్మ దేవతను పూజించడంతో మొదలౌతాయి. ఆఖరి రోజున కూడా ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇతర రోజుల్లో పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ తదితర కాళీమాత రూపాలను పూజిస్తారు. బోనాల వేడుకలకు ఈ గుళ్ళను ఘనంగా అలంకరిస్తారు. రెండవ రోజు జరిగే పండుగను రంగం అంటారు. ఈ కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. కోపోద్రిక్తుడైన పోతరాజు చేతికి మేకపోతును ఇస్తారు. అతడు దంతాలతో మేకపోతును కొరికి, తల, మొండెం వేరుచేసి పైకి ఎగరేస్తాడు.
బోనం అనే పదం ఖచ్చితంగా భోజనం నుండి వచ్చినదే. మహంకాళికి కుండల్లో అన్నం వండి, పాలు, బెల్లం, ఉల్లిపాయలు మొదలైనవి జతచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని మట్టి లేదా రాగి పాత్రల్లో మాత్రమే తీసికెళ్ళాలనేది నియమం. పాత్రలకు పసుపు, కుంకుమ, సున్నపు బోట్లు పెట్టి, వేప ఆకులు లేదా చిన్న వేప మండలు కట్టి, తలపై పెట్టుకుని, లయబద్ధమైన డప్పులు మొగిస్తుండగా తీసుకు వెళ్తారు.అమ్మవారి సోదరుడు పోతరాజుకు ప్రతిగా ఒక వ్యక్తిని అలంకరిస్తారు. ఆ పోతరాజు సమక్షంలో బృందాన్ని నడిపిస్తారు. పోతరాజుగా బలంగా ఉన్న వ్యక్తిని ఎన్నుకుని, ఎర్రటి ధోవతి కడతారు. శరీరమంతా పసుపు రాసి, నుదుటిమీద కుంకుమ పెడతారు. ఈ పోతరాజు కాలికి గజ్జెలు కట్టుకుని, దప్పులకు అనుగుణంగా నర్తిస్తాడు.
బోనాల ఉత్సవాలకు ఎక్కడికక్కడ బృందాలుగా సమకూరి దేవి ఆలయాలకు వెళ్తారు. కొందరు పూనకం వచ్చిన స్త్రీలు మహంకాళిని స్మరిస్తూ, డప్పు మోతలకు అనుగుణంగా నర్తిస్తారు. బోనాలు వేడుకలకు ప్రత్యేకంగా పొడవాటి కర్రలకు రంగు కాగితాలు అమర్చిన ''తొట్టెలు'' రూపొందిస్తారు. ఒక్కో బృందం ఒక్కో తొట్టెను దేవికి కానుకగా సమర్పిస్తుంది.
మహంకాళికి బోనాలు నివేదించడం పూర్తయిన తర్వాత, దాన్ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుని బంధుమిత్రులతో కలిసి మాంసాహార విందు ఆరగిస్తారు.



నవ్వు నవ్వించు.

ఒక స్టూడెంటు ఇంగ్లీషు ప్రొఫెసర్ని 'నటూరే' కి మీనింగు ఏంటి అని అడిగాడు. ప్రొఫెసర్ అ వర్డ్ ఎపుడూ విని ఉండకపోవడం వల్ల కంగారు పడి అర్ధం రేపు చెపుతానన్నాడు.
ఇంటికి పోయి ఇంగ్లీషు ప్రొఫెసర్ ఎన్నో డిక్షనరీలు రాత్రంతా వెతికినా 'నటూరే' అనే పదమే ఎక్కడా కనపడలేదు.
మర్నాడు క్లాసుకి వస్తూనే ఆ స్టూడెంటు మీనింగు చెప్పమని అడగ్గానే గాభరాపడి రేపు చెప్తానని తప్పించుకున్నాడు. రోజూ స్టూడెంటు అడగడం ప్రొఫెసర్ తప్పించుకోడం జరిగిపోతుండేది. ఆ స్టూడెంటు కనపడితే చాలు ప్రొఫెసర్ కి
భయంతొ కాళ్ళూ చేతులు వణికేవి.
ఆఖరికి ప్రొఫెసర్ స్టూడెంటుని అడిగాడు. "నటూరే కి స్పెలింగ్ ఏంటో చెప్పు?"
స్టూడెంటు చెప్పాడు 'NATURE' అని.
ప్రొఫెసర్ పిచ్చికోపంతో తిట్టసాగాడు.
వెధవన్నర వెధవ! నేచర్ ని నటూరే అంటూ నా ప్రాణం తీసావు కదా! నిన్ను కాలేజి నుంచి వెంటనే బర్తరఫ్ చేస్తున్నాను.
అలా అనగానే ప్రొఫెసర్ కాళ్ళ మీద పడి స్టూడెంటు ఏడవసాగాడు.
సార్ ! కనికరించండి. అంత పని చేయొద్దు ! నా 'ఫుటూరే' నాశనం చేయకండి సార్ !!
ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు!!!
('ఫుటూరే' = FUTURE)
---------------------------------------

Friday, July 14, 2017

సింధూరం.

సింధూరం.
తెలుగింటి సింగారం.. సంప్రదాయానికి ప్రతి రూపం
నుదుటిన సింధూరం మమతల మణిహారం
సిగ్గుల సిరి మోముపై కుంకుమ ఆభరణం 
అవని ప్రతీకముపై విరిసే సూర్యుని ప్రతిబింబం
వెన్నెల వదనంపై చంద్రలేఖ వయ్యారం
చిటెకెడు కుంకుమ సౌభాగ్యపు సిరిమంత్రం
పరమ పవిత్ర సింధూరానికి సాటి రాని బంగారం..
పుట్టింటి అడుగులు మెట్టినింటి సవ్వడులు..
గాజుల గలగలా మువ్వల సిరితో పూల పరిమళాల
మెట్టెల స్వరాలే..ముత్తైదువుకి పంచాప్రాణాలు ..
వర్ణపు వెలుగులే జీవితానికి భాగ్యం ..సౌభాగ్యం ..

Thursday, July 13, 2017

బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు

*శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు:
1⃣ మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం - 1854(వేప చెట్టు - ప్రస్తుత గురుస్థానం)
షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర
2⃣ శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం - Aug 18,1886
3⃣ మహాసమాధి చెందిన సంవత్సరం - Oct 15,1918 ,బూటి వాడాలో మహ సమాది
*షిరిడి లో సాయి బాబావారి" దినచర్య*
శ్రీ సాయిబాబా వారిదినచర్య క్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది.....
1) ప్రతి రోజు ప్రాత:కాల సమయంలో అయిదు గంటలకు ముందే మశీదులో " దుని " అనబడే పవిత్ర అగ్నికి దగ్గరగా సాయి కూర్చూనే వారు.
2) అయిదు గంటల తర్వతకాలకృత్యములను తీర్చుకొని దీనికి దగ్గరగా నిశబ్దముగా కూర్చోనే వారు. భక్తులకు బోధ చేసేవారు.
3) బాబా వారు బోధ కేవలం వాచికంగా అంటే నోటిమాటగా సాగేది. చేతి వేళ్ళసంజ్ఞలతో "యాదే హఖ్" అనుచు తెలియజేసే వారు
4) బాబా వారు ఉ॥8 గం॥లకు గ్రామంలోని ఐదు ఇళ్ళకు బిక్షకై వెళ్లేవారు.
5) బిక్షాన నుండి వచ్చి నాక కొంత ఆహారమును
బక్తులకు, పక్షులకు, జంతువులకు సైతం ఆహరం
పెట్టేవారు.
6) ఉ॥9-30ని॥లకు బాబావారు అబ్దుల్ వెంటరాగా
"లెండి " తోట కు వెళ్లేవారు అక్కడ ఒక గంట గడిపేవారు.
7) అక్కడ నుండి వచ్చి మ॥2 - గం||ల వరకు మశీదులోనే ఉండేవారు, అటైములో భక్తులు హరతి ఇచ్చేవారు.
8) హరతి అనంతరం బాబా ఒంటరిగా కూర్చుని
ఒక చిన్న సంచి బయటకు తీసి 1 పైసా, 1 అణా
బేడా, 4 అణాలు (పావలా), అర్ద 8 అణాలని, బయటకు తీసివేళ్ళతో రుద్ది సంచిలో భక్తుల పేర్లతో మరలా దాచేవారు. ఈ తతంగం అంతాభక్తుల క్షేమం కోసం అనేవారు.
9) బాబా రోజు మొత్తం మీద ఉ॥8-30 - 9 -30
మధ్య, మ॥10-30-11-30లకు, సా॥5-00-6-30
గంటల మధ్య మూడు సమావేశాలు నిర్వహించే వారు అపుడు భక్తులతో మాట్లాడేవారు.
10 ) భక్తుల సందేహాలను తీర్చేవారు.వీరికి అర్దమగు రీతిలో సమాదాన పరచేవారు.
11)రాత్రి కాగానే బాబావారు, చూరుకు ఒకటి లేదా ఒకటిన్నర అడుగుల క్రింద గా నేల నుంచి ఏడు ఎనిమిది అడుగుల ఎత్తులో ఆరడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు కలిగిన చక్క బల్ల చినిగిన గుడ్డపేలికలతో వేలాడదీసి దానిపై నిదురించే వారు.
12) ఈ బల్లమీద విశ్రమించడం వింతగా భక్తులు చూసేవారు, దీనికి బాబా వారు విసికి దానిని విరగ
కొట్టి దునిలో పడేసారు.
13) బాబా వారు ఎల్లపుడు శారీరకంగాను, మానశికంగాను, ఉత్సా హంగా మెలుకువగా
అప్రమత్తంగా ఉండేవారు.

Wednesday, July 12, 2017

చమత్కార సంభాషణ

ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.

ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.

రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.

దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.

అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.
అలాగ, మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే..


అది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎక్కడా సిమెంట్ అన్నమాటకు తావు లేకుండా ఉక్కు అన్నపదం లేకుండా కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆశ్చర్యంతో పాటు ఆసక్తి రేపుతున్న ఆ గుడి గురించిన కొన్ని మిస్టరీ వింతలు.
13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన గుడి. 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి. దాదాపు ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది
పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నులు కలిగి ఉంటుంది. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఇది ఏకశిలా విగ్రహం. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.
ఈ ఆలయానికి ఎటువంటి ఉక్కు గాని సిమెంట్ కాని వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే కట్టారు.
80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఈ గుడికే హైలెట్. 13 అంతస్థుల పైన ఎటువంటి వాలు లేకుండా నిలబడటమనేది ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఇక మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది ఆనాటి రాజుల నైపుణ్యానికి ప్రతీక.
ఈ ఆలయ ప్రాంగణం దాదాపు పర్లాంగు దూరం ఉంటుంది.అంటే చాలా సువిశాలంగా ఉంటుంది. మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్లీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు.
ఇక ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి. ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉన్నాయని అన్ని దారులు మూసేశారు.
అయితే ఇప్పటికీ టెక్నాలజీకి అంతుపట్టని విషయం ఏంటంటే. ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మి. మి కన్నా తక్కువ సైజులో వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం. అవి అలా ఎందుకు పెట్టారు ఇప్పటికీ మిస్టరీనే.
ఈ ఆలయం ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. అయితే గుడి మాత్రం అత్యధ్భుతంగా కొత్తగా నిర్మించినట్లు ఇప్పటికీ కనిపిస్తుంది...

పెద్దలమాట చద్దిమూట.


Tuesday, July 11, 2017

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య పారాయణ శ్లోకాలు💢
మనలో చాలామందికి తెలియని శ్లోకాలు
ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...
 ప్రభాత శ్లోకం :

కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!
ప్రభాత భూమి శ్లోకం : 

సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!
🌝సూర్యోదయ శ్లోకం : 🌝

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!
🍀స్నాన శ్లోకం : 

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

భస్మ ధారణ శ్లోకం

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

🍀భోజనపూర్వ శ్లోకం : 🍀
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!
అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

💢 భోజనానంతర శ్లోకం : 💢
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

🌷సంధ్యా దీప దర్శన శ్లోకం :
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

😔నిద్రా శ్లోకం :😔

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

👍కార్య ప్రారంభ శ్లోకం : 👍
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

🌷హనుమ స్తోత్రం 🌷

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!
బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

💢శ్రీరామ స్తోత్రం : 💢

శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రం : 

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

🔯శివ స్తోత్రం🔯

త్రయంబకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

🕉గురు శ్లోకం : 🕉

గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

🌷లక్ష్మీ శ్లోకం 🌷

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

వెంకటేశ్వర శ్లోకం 

శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

దేవీ శ్లోకమ్ : 

సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

💢దక్షినామూర్తి శ్లోకం💢 : 

గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

అపరాధ క్షమాపణ స్తోత్రం : 

అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!

🔯 
విశేష మంత్రా
🔯

💢
పంచాక్షరి
ఓం నమశ్శివాయ

అష్టాక్షరి ఓం నమో నారాయణాయ
 
🌷ద్వాదశాక్షరి -- ఓం నమో భగవతే వాసుదేవాయ.

                                            ...../\......

Total Pageviews