Monday, July 10, 2017

ఈ లింక్ నొక్కి ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి వాడు మా అబ్బాయి చి. సాయి వైభవ్ విస్సా.

ఈ లింక్ నొక్కి ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి వాడు మా అబ్బాయి చి. సాయి వైభవ్. నాకు తెలియకుండా ఎంత ఎదిగిపోయాడో అందనంత ఎత్తుకు ఎదిగిపోయి నాకు అందకుండా పోయాడు. చిన్న వయసులోనే ఎన్నో ఆదర్శభావాలు, స్నేహశీలత, నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వం,భగవతారాధన, పెద్దలయెడల గౌరవం వినయవిధేయతలు కలిగి ఎంతో మంచిపేరు తెచ్చుకున్నావు. బి.టెక్ 3 వ సంవత్సరం చదువుతూనే ఉద్యోగం చేయవలసిన అవసరం లేకపోయినా ...నాన్నకు తోడుగా ఉండాలి, నా చదువు నా సొంతంగా చదువుకోవాలి..అని "  Interview Air " అనే సంస్థలో ఉద్యోగంలో చేరి తెలంగాణ రాష్ట్రానికి               "  రీజనల్ మేనేజర్ " గా చేస్తూ ఎంతోమంది పెద్దల మన్ననలు పొందావు. ఇటు స్కూల్ లోను, కాలేజీ లోను, ఊరిలోను  మంచిపేరు సంపాదించుకున్నావు. నువ్వు చదువుకుంటూనే నీతోటి విద్యార్థులకు చదువు నేర్పుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వైభవ్ ఉంటేచాలు మాకు కొండంత దైర్యం ఉంటుంది అని నీ  స్నేహితుల తల్లితండ్రుల చేత అనిపించుకున్నావు.నా ప్రతి  పుట్టినరోజు కి న చదువుకునే రోజుల్లోంచే డబ్బు దాచుకుని నాకు ఏదో ఒక బహుమతి తెచ్చేవాడివి. ఈ సంవత్సరం పట్టుచీర, వచ్చి కొన్నావు. అమ్మా...ని కొడుకు పెద్దవాడయ్యాడు నీకు బంగారం కూడా కొంటాను అని గోల్డ్ స్కీమ్ లో డబ్బులు కట్టడం మొదలు పెట్టావు. ని జీవితంఎలా ఉండాలో...మన అందరి జీవితాలు ఎలా ఉండాలో ఉండబోతాయో ఎన్నో కళలు కన్నావు. సత్యసాయి బాలవికాస్ తరగతులకు వెడుతూ సాయి బాబా పుట్టినరోజు కార్యక్రమాలలో  నాటికలు, భజనలు,సేవ ఎన్నో చేసావు. అన్నగా తమ్ముడిని ఆప్యాయంగా చూసుకున్నావు. అందరూ నేను ఏడుస్తుంటే వాడు " కారణజన్ముడు." మీరు ఏడవకూడదు వాడు మీకడుపున పుట్టినందుకు, అంత మంచి పిల్లాడిని కన్నందుకు గర్వపడాలి అని అన్నారు. ప్రతి తల్లి తండ్రి పిల్లలకు ఇలా పద్దతిగా ఉండాలి అని చెపుతారు. విని వదలక ఆచరించి ఆదర్శవంతుడివయ్యావు. నీవంటి కొడుకు కన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇన్ని  మంచిపనులు చేస్తుంటే ఆ భగవంతుడు చూడలేకపోయాడు. మానుండి నిన్ను దూరం చేసి ఆయనలో ఐక్యం చేసుకున్నాడు. ఇంత  చిన్న వయసులోనే అదీ ఏవిధంగా  తీసుకెళ్లాలో తెలియక చిన్న ఆటో యాక్సిడెంట్ ద్వారా నిన్ను మానుండి దూరం చేసి మాకు తీరని భాధ కలిగించాడు ఆ భగవంతుడు. నిన్ను తనదగ్గరకి తీసుకెళ్లిపోయాను అనుకుంటున్నాడు ఆ దేవుడు. కానీ నువ్వు ఎక్కడికీ వెళ్ళలేదు మా అందరి గుండెల్లో స్థిరంగా మంచి మనిషిగా ఉన్నావు. నేను ఏపని చేసినా....చేస్తున్నా ....చేయబోతున్నా నా వెన్నంటే ఉన్నావు, ఉంటావు.  నువ్వు కన్న కళలన్నీ నెరవేరాలని కోరుకొంటూ  అశ్రుతప్త నయనాలతో  మీ అమ్మ.

                        https://youtu.be/Y37dZc-MyWY

ఈ లింక్ నొక్కి ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి వాడు మా అబ్బాయి చి. సాయి వైభవ్ ఇంత చేసినా నాకు చెప్పలేదు. నాకు తెలియకుండా ఎంత ఎదిగిపోయాడో అందనంత ఎత్తుకు ఎదిగిపోయి నాకు అందకుండా పోయాడు... నాన్నకు ఆశ్చర్యం, విస్మయం. కలిగించాలని నాకు చెప్పకుండా ఇంతచేసి ఇంత ఆశ్చర్యం, విస్మయం చేసావా నాన్నా, నిన్ను నేను ఇంకా నా చేయి పట్టి నడిచిన నా చిట్టి తండ్రి గానే అనుకున్నాను కానీ నీ చిన్ని గుండెలో విశ్వమంత ఆశయాలను ఆదర్శాలను దాచుకున్నావని తెలుసుకోలేని మూర్ఖుణ్ణి నన్ను క్షమించు నాన్నా నానిబాబు - 
అశ్రుతప్త నయనాలతో 
నీ మూర్ఖత్వపు నాన్న సత్యసాయి విస్సా

No comments:

Post a Comment

Total Pageviews