Tuesday, May 29, 2018

ఆధునిక వ్యసనం!

ఇదొక ఆధునిక వ్యసనం!
అసహనం! అశ్లీల లీలలే దాని నైజం
ఇది నిత్యం వార్తల్లో వస్తున్న నిజం!
జాతి నిర్వీర్యానికి బీజం!
సత్వరం మేలుకుందాం!
మన పిల్లలని యువతని రక్షించుంకుందాం!
నిర్లక్ష్యం వహిస్తే కూర్చున్న కొమ్మను నరుక్కునే మూర్ఖుల్లా
వారి వినాశనానికి మనమే బాటలు వేసినట్లు 

మార్టిన్ సన్ పద్యాల్నికొన్నైనా తెలుగు చెయ్యగలిగాను.Vadrevu chinaveerabhadrudu

హమ్మయ్య. మొత్తానికి మార్టిన్ సన్ పద్యాల్ని కొన్నైనా తెలుగు చెయ్యగలిగాను.
నా చిన్నప్పుడు మా ఊళ్ళో కంసాలి సోమలింగం బంగారపు పని చేస్తుంటే చూసేవాణ్ణి. ప్రతి చిన్న బంగారపు తునకనీ, గాలి వీయకుండానే ఎగిరిపోయేటంత పలచని బంగారు రేకుల్ని వేళ్ళతొ దారాలు అల్లినట్టుగా, శ్రద్ధగా, పసిపాపల్ని లాలించినంత జాగ్రత్తగా అతికేవాడు, పొదిగేవాడు. అట్లాంటి కవితా శిల్పం మార్టిన్ సన్ ది.
పూర్తిగా మొద్దుబారిపోయిన జీవితంలో, సౌకుమార్యం సన్నగిల్లిపోయిన కాలంలో ఆ కవితల్ని ముందు చదవడానికే ఎంతో మెలకువ కావాలి. దేవాలయంలో తీర్థం తీసుకునేటప్పుడు మన సమస్తాంగాలూ ఒక్క దోసిట్లోకి ఒదిగిపోయినట్టుగా, మన ప్రాణమంతా మన కళ్ళల్లోకి నింపుకుని మరీ ఆ కవితలు ఒక్కొక్కటీ చదవాలి. చదివినతరువాత, చెట్టునీడనకూచుని ఆవు నెమరువేసుకున్నట్టుగా ఆ పదచిత్రాల్ని స్వానుభవంలోకి ఒంపుకుని మరోమారు చర్వితచర్వణం చెయ్యాలి.
ఇక వాటిని అనువదించాలంటే ఆ కష్టమెట్లాంటిదో ఎట్లా చెప్పేది!
హారీ మార్టిన్ సన్ (1904-78) కవిత్వం Chickweed Wintergreen (2010), The Procession of Memories (2009) చదివిన తరువాత, ఆయన Wild Bouquet(1985) కోసం ఉవ్విళ్ళూరాను.కానీ అవుటాఫ్ ప్రింట్. అట్లాంటిది ఆ పుస్తకాన్ని సోమయ్యగారి అబ్బాయి రావెల మనోహర్ నా కోసం అమెరికా అంతా గాలించి ఒక యూజ్డ్ కాపీ సంపాదించి పంపించేరు.ఎవరో ఎవరికో 87 లో with love and best wishes కానుకచేసిన పుస్తకం. సముద్రాలు దాటి మరీ నన్ను చేరింది.
ఆ పుస్తకం అందినప్పటినుంచీ ఆ 61 చిన్న చిన్న కవితల్నీ ఎన్నిసార్లు చదివానో. ఆ కవితలు చదివినప్పుడల్లా నాలుకమీద పడగానే కరిగిపోయే నేరేడుపళ్ళలానే ఉంటాయిగాని, అనువదించాలంటే, ఊదారంగు చార తప్ప మరేదీ పట్టు చిక్కదు. ఎన్నోసార్లు విఫల ప్రయత్నం చేసి వదిలేసాను.
దుర్భరమైన అతడి బాల్యం, భయానకమైన సముద్రప్రయాణాలూ, జీవితమంతా వదలని ఒంటరితనం-వీటి గురించి నేనింతకుముందు రాసాను. అతడు స్వీడిష్ అకాడెమీలో సభ్యుడైనందుకే నోబెల్ ప్రైజు వచ్చిందన్న విమర్శ తట్టుకోలేకనే అతడు మరణించాడు,లేదా తనని తాను చంపుకున్నాడు. కాని ఒక విమర్శకుడు రాసినట్టుగా, నోబెల్ ప్రైజు వచ్చినందువల్ల మార్టిన్ సన్ కవిత్వానికి విలువ పెరగలేదు, విమర్శించినందువల్ల విలువ తగ్గలేదు. ఆ మాట నిజం. నా దృష్టిలో నోబెల్ ప్రైజుకి టాగోర్ ఎంత అర్హుడో మార్టిన్ సన్ కూడా అంతే అర్హుడు. కానీ అతడికి నోబెల్ ప్రైజు రాకపోయిఉంటే ఆ అద్భుతమైన కవిత్వం మనదాకా చేరిఉండేది కాదేమో.
చూడండి, సాలీడుదారపు పోగుల్లాంటి ఆ కవితావాక్యాల్ని నా బండ వేళ్ళతో ఎంతో కొంత తెలుగు చేసాను.
1.
సుళ్ళు తిరిగే మంచు
_____________
మెరిసే హిమఫలకాల మీద
సుళ్ళు తిరుగుతూ మంచు నాట్యం.
దాని పాదాలు కనబడవు,
కప్పుకున్న వస్త్రం తప్ప.
మంచు అల్లిన లేసులాగా
చలించే ఉత్తరధ్రువకాంతులు,
చల్లగాలి సూదులతో దగ్గరగా
లాగి కుట్టిన కుచ్చిళ్ళు.
2.
బాల్యకాననం
_________
ఆవుల్ని వెతుక్కుంటూ బోసిపాదాలతో
అడవినుంచి అడవికి పరుగెడుతున్నప్పుడు
కొండమీద కొలనులో చూసాను
అంతరిక్ష మేఘరథచక్రాన్ని.
వేసవి కాననాల్లో ఆడుకున్న జీవితం
పిట్టలపాటలతో లోతెక్కిన సాయంసంధ్య
పక్షిగానంతో మరింత పైకి జరిగిన ద్యులోకం
నా కలలు, కాపట్యాలన్నిటినుంచీ నేను పొందిందేమీ లేదుగాని,
జ్ఞాపకం నా జీవితానికి ప్రాణం పోస్తున్నది.
జ్ఞాపకాలు సంపూర్ణ స్వప్నాలు.
అప్పుడప్పుడు వేసవి దివ్యప్రాంగణంలో
చైత్రమాసపు కొంగలాగా
నా కల ఒకటి గాల్లోకి తేలుతుంది
పచ్చికబయళ్ళమీదుగా.
3
వేసవి
____
అట్లా అని వేసవిలో పెద్ద బాధా ఉండదు.
అడవుల్లో తియ్యటి చిట్టీతపళ్ళు ఏరుకోవచ్చు.
ఎర్రటిపళ్ళు నాలుకమీద పెట్టుకోగానే రక్తం చిమ్ముతాయి,
కాని నెత్తుటివాసన ఉండదు.
అప్పుడే జీవితం పూర్తిగా జీవించినట్టుంటుంది.
అంటే ఎలా ఉందో అలా.
స్వర్గం వైపు ఒక అడుగువెయ్యడమన్నమాట
4
పాము
____
వాక్కాయ పొదలమధ్య ఒక పాము
తన చర్మం వదిలించుకుంది.
ఇరుగ్గా ఉన్న చొక్కాలోంచి
అటూ ఇటూ మెలికెలు తిరుగుతూ
లోపలనుంచి బయటకొచ్చేసింది,
ఇక వెనుతిరిగి చూడలేదు.
అక్కడ అడవిలో తెల్లగా పొడుగ్గా మెరుస్తున్న
చొక్కా అంచు.
5
మైదానగీతం
_________
పూర్తిగా వికసించిన ఒక పచ్చికబయలుని
దాని సీతాకోకచిలుకలతో మాత్రమే వివరించగలం,
దాని తేనెటీగల్తో మాత్రమే గానం చెయ్యగలం.
వేలరెక్కల మిరుమిట్లు అందుకోవాలన్నా
తేనెటీగల పాట అర్థం కావాలన్నా
అప్సరసలకే సాధ్యమవుతుంది.
ఆ పాటలు వినడమెట్లానో
అవి మటుకే నేర్చుకుంటున్నాయి
అనంతకాలంగా .
6
సీతాకోకచిలుకలు
____________
సీతాకోక చిలుకలకి రెక్కలుండవు,
తూర్పుదేశాల శాలువాలు కప్పుకుని ఎగురుతాయవి.
ప్రకృతి కూడా ఈ విధంగా వాటికి సాయపడింది
వాటినెవరూ ఒక్క గుక్కలో మింగేయకుండా
వాటికంత పెద్ద శాలువాలు తగిలించింది.
7
బాతు
____
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన నాచులోకి
కొడవలిలాంటి తన తెల్లటి మెడ
ఏటవాలుగా చాపింది బాతు.
ముఖమల్లాంటి బురదలో
ఈటెలాగా ముక్కు చాపి కెలుకుతోంది,
కలల ఒడ్డు మీద తలెత్తి చూస్తున్నది
చల్లగా పాములాగా.
8
నీటిలోపలి చిత్రం
___________
నీటి చిత్తడి మధ్య రెల్లుపొదలు
పతాకల్లాగా రెపరెపలాడుతున్నాయి.
కానుగచెట్టు గుబుర్లలో పులకింత,
దాని ఆకుల గుసగుసలప్పటికే
అదృశ్యంగా లంకల్లోకి చేరుకున్నాయి.
ఒకామె స్నానం చేస్తున్నది.
ఈదుకుంటూ పోతున్నదొక బాతు,
అది వెనక్కి చూసినప్పుడు
గాలిమర పూర్తిగా తిరిగినట్టుంది
9
చిమ్మెటలు
_______
కనుపాపలోని అందమైన తెలుపులాగా
వేసవి సాంధ్యగగనం.
కూనిరాగం తీస్తున్న చిమ్మెటలు
వాటి సుదీర్ఘగానం.
అవి నేలమీద వాలినప్పుడు
పాతకాలపు విచిత్ర శోభ చూస్తావు,
వాటి ఆకుపచ్చ-బంగారపు రెక్కలమీద
కిలుంపట్టిన భారతీయ ఇత్తడి వన్నె.
10
దు:ఖమూ, సంతోషమూ
________________
కోల్పోయిన ఏదో సంతోషం కోసమే
తీవ్రమైన ప్రతి దు:ఖమూ వెతుక్కుంటుంది
దాన్ని ఆ దారి తప్పిపోనివ్వకు
బాధ తన వెతుకులాట మాననివ్వకు.
దు:ఖమే సంతోషం పొందగల అతిగొప్ప సత్కారం.

Monday, May 28, 2018

కులతత్వంపై శ్రీ వాసిరెడ్డి అమర్నాధ్ గారి పోస్ట్

స్లేట్ విజయవాడ లో తమ పిల్లల్ని చేర్పించాలనుకొన్న ఒక పేరెంట్ నుంచి ఇందాకే ఫోన్ " సర్ విజయవాడ లో చాలా విద్య సంస్థల్లో కులతత్వం హద్దులు దాటుతోంది . పిల్లలు కులాల వారీగా విడిపోయి ఘర్షణలకు దిగుతున్నారు . మీ పాఠశాలలో కూడా అలాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఏమిటి ?"
" ప్రపంచ జనాభా 760 కోట్లు . వీరందరూ నా వారే అనుకొన్న వాడు ప్రపంచానికి నాయకుడు అయ్యే అవకాశాన్ని పొందుతాడు . ప్రపంచం లో ఎక్కడైనా స్థిర పడగలుగుతాడు . తానూ ఎంపిక చేసుకొన్న రంగం లో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాన్ని పొందుతాడు . సున్నా ను కనిపెట్టిన ఆర్యభట్టు , పెన్సిలిన్ ను కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ , అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపిన గాంధీ .. ఇలా ఎందరో మహనీయులు ప్రపంచ నాయకులుగా స్లాగించబడుతున్నారు .
డాక్టర్ అయినా , రోబోటిక్ ఇంజనీర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా , సొంత వ్యాపారం చేసుకొన్నా .. ఒక వ్యక్తి సమాజం లోని అన్ని కులాలు మతాలు ప్రాంతాలు వారితో వ్యవహరించాల్సి ఉంటుంది . అంతా మనవారే అనుకొన్న వ్యక్తిని సమాజం అలాగే ఓన్ చేసుకొంటుంది . ప్రపంచం మన ముందు నిలిచిఉన్న ఒక పెద్ద అద్దం. ప్రపంచం లో ని వీరు .. మా మతం వారు కారు .. మా ప్రాంతం వారు కారు .. మా కులం వారు కారు అంటూ అధిక శాతం జనాభా ని దూరం చేసుకొని సంకుచిత స్వభావం తో బావి లో కప్ప లా కూలతత్వాన్ని ఒంట పట్టించుకొన్న వ్యక్తి మహా అంటే ఆ కులానికి నాయకుడు కాగలుగుతాడు . అంతకన్నా ఎదగలేడు. రేపటి రోబోటిక్ యుగం లో ఇలాంటి వారికి మనుగడ కూడా కష్టం అవుతుంది . ... ఈ విషయాలను లైఫ్ స్కిల్స్ లో భాగంగా మా పిల్లలకు బోధిస్తాము . పిల్లలు మనం చెప్పే నీతి సూత్రాలు వినరు . మనల్ని చూసి అనుకరిస్తారు . మేము స్లేట్ పేరుతొ స్కూల్ నడుపుతున్నాము . అక్కడ టీచర్స్ స్టాఫ్ ఇంకా పిల్లలు వుంటారు . ఫలానా టీచర్ ది ఏ కులం .. ఏ మతం అనేది వారి ఇంటిలోని వ్యక్తి గత విషయం . ఇక స్కూల్ వస్తే వారు టీచర్స్ . టీచర్స్ ఎంపిక లో కానీ ప్రమోషన్ విషయం లో కానీ వారి ప్రొఫెషనల్ సామర్థ్యము ఏమిటి అనే విషయం తప్ప వారి సామజిక స్థితి ఏమిటి , కులం ఏమిటి మతం ఏమిటి అనేది పరిగణ లోకి తీసుకోము .
" అని చెప్పను .
సర్ మా పిల్లల్ని మీ స్కూల్ లో చేర్చమంటారా ? అని ఆయన చివరిగా అడిగారు . మా స్కూల్ ఏమిటో నేను చెప్పను . చేర్చాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది మీరు . చేర్చండి అని నేను చెప్పను " అన్నాను .

Sunday, May 27, 2018

మృత్యువు ఎక్కడ ఉంది?:

మృత్యువు ఎక్కడ ఉంది?

Where is the death?


సర్వకాల సర్వావస్థలయందు ముక్కు చివరన ఉంటుంది. ఎలాగంటే శ్వాస తీసిన తరువాత విడవక పోతే మృత్యువు. విడిచిన శ్వాస తీయక పోయినా మృత్యువు.
1. శరీరము ఎక్కడనుండి వచ్చినది?
ఈ శరీరము పంచ భూతముల నుండి వచ్చినది. మరలా పంచ భూతములలో కలిసిపోతుంది. మనలోని పంచ భూతములు తిరిగి పంచ భూతములలో కలిసిపోతాయి.
“పురత్రయే క్రీడతి జీవయo తః” కైవల్యోపనిషత్తు.
త్రికూటములు.
1. స్థూల, 2. సూక్ష్మ 3. కారణ
1. స్థూల శరీరము:- జాగృత్- నిద్రలలో స్థూల శరీరముఉండును.
2. సూక్ష్మ శరీరము:- నిద్ర, నిద్రలోని స్వప్నము లో ఉంటుంది.
3. కారణ శరీరము :- సుఘప్తి, నిద్రలో ఉంటుంది.
ఈ ఉపాదిలోని జీవుడు జీవితకాలమంతా ఇందులో ఈ మూడింటిలో తిరుగుచుంటాడు.
సాక్షి చిత్రగుప్తుడు ఎవరు?
ఈ ఉపాదిలో గుప్తంగా కూర్చొని చిత్రంగా లెక్కలు వ్రాయువాడు పంచేంద్రియములు తమ పని తాము చేస్తున్నా,చేయలేక పోయినా అవి పనిచేస్తాయి, పని చేయలేవు అని చూచే ఆత్మ సాక్షి, లోపల నున్న జీవుడు.
1. అనుభవములు రెండు.
1.సుఖము 2. దుఃఖము మరొకటిలేదు.
మనకు ఇష్టపడినది, నచ్చినది సుఖము, మనకు నచ్చనిది బాధకలిగించేది దుఃఖము మరొకటిలేదు.
1. గుణములు మూడు.
1. సత్యము 2. రజస్సు 3. తమస్సు
2. చతుర్విద పురుషార్థములు.
1. ధర్మము 2. అర్థము 3. కామము 4.మోక్షము
3. తన్మాత్రులు ఏవి?
1. శబ్దము 2.స్పర్శ 3. రసము 4.రూపము 5. గంథము
4. ఉపాధి (శరీరము)
పంచేంద్రియములు + ఒక మనస్సు =మానవ ఉపాధి
(పంచేంద్రియములు + మనస్సు ఈ ఆరింటి సంఘతామే ఉపాధి)
సప్తధాతువులు
1)చర్మము 2)రక్తము 3)మాంసము 4)క్రొవ్వు 5)అస్థి 6)శుక్ల 7)మేధ
తొమ్మిదిరంధ్రములు
1)రెండు కళ్ళు ........................2
2) రెండు చెవులు ...................2
3)ముక్కుకు రెండు రంధ్రాలు......2
4)నోరు .................................1
5)మలద్వారము......................1
6)మూత్రద్వారము....................1
మొత్తము 9
పది వాయువులు
1)ప్రాణ 2)అపాన 3)వ్యాన 4)ఉదాన 5)సమాన 6)నాగ 7)కూర్మ 8)కృకర 9)ధనంజయ 10)దేవదత్త
ఇందులో ఈ వ్యాన వాయువు మాత్రం వెళ్ళదు. మరణించిన తర్వాత ఈ వ్యాన వాయువు శరీరమును పట్టుకొని ఉంటుంది. అపుడు తనూభవుడు (కుమారుడు) అంత్యేష్టి సంస్కారముతో మంత్ర బద్ధముగా ఈ వాయువును మరణించిన శరీరం నుండి విడగొట్టుతాడు.
భగవంతుని పూజ విషయంలో మనస్సుతో కలువని పంచేంద్రియము+కర్మేంద్రియములు చేయు పనులు నిష్ప్రయోజనం.
దేహాభిమానము, అహము తగ్గనిదే భగవంతుని చూడలేవు. మానవ జాతికి ధర్మ పథాన్ని నిర్దేశించడానికి యోగ్యమైన రీతిలో మహాభారతమును అనుగ్రహించిన వ్యాసుల వారి ధర్మ విషయములు.
ధర్మనిరతుడు:-
ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయువాడు.
మధ్యాహ్న సమయంలో డబ్బు సంపాదించే మార్గములు అన్వేషించువాడు.
రాత్రి వేళలో సాంసారిక జీవితము సాగించేవాడు.
కేవలం ఇంద్రియ సుఖాల ఆలోచన వలననే విచారం ఆరంభమవుతుంది.
ఇంద్రియ వాంఛలు తీర్చుకొనడానికి శ్రమించే వారికి దుఃఖమే ప్రాప్తిస్తుంది. పాపాలకు అవకాశం కల్పిస్తుంది. నరకానికి పీటలు వేసి సర్వ నాశనానికి దారి తీస్తుంది.
ఈ భూమండలం అంతా మనకు స్వాధీనమైనా జనన మరణాలు నుండి తప్పించుకోగలమా?కోటీశ్వరులు, బిలీనియర్స్ ICU లో ఉంటే మనమంతా ఎంత వారుగాని చివరకు ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రసిడెంట్ ఆఫ్ చైనా, ప్రసిడెంట్ ఆఫ్ USA ఐనా ఎవరినైనా సరే ICU లో ఉంచితే మనము బయట(అద్దాలు బయట)నిలబడి I See You అంటూ చూస్తూ ఉండాలే కానీ ఏమి చేయలేము

చక్కని ఎద్దు...( కధ..)

చక్కని ఎద్దు... కధ..
‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘’‘‘‘‘‘’’’’’‘’’’’’’’’’’’’’‘’’’’’’’’’
అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.
గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.
ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.
పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.
గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.
గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.
"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!
దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'
గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.
తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!
గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.
చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...
జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.
ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి.
ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.. సమాజంలో మార్పుకోసం కృషి చేయండి..🙏🙏🙏

అమరవీరుని ఉత్తరం.


మనిద్దరమూ 18 వ ఏటే ఇంట్లోంచి బయటకు వచ్చాం...
నువ్వు నీ JEE క్లియర్ చేశావ్...
నేను ARMY కి సెలక్ట్ అయ్యాను...
నువ్వు ఐఐటి లో చేరావ్...
నేను training centre లో చేరాను...
నువు డిగ్రీకోసం రేయింబవళ్ళూ కష్టించావ్...
నేను ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్తితుల మద్య
ట్రైన్ అయ్యాను...
నువ్వు బి.టెక్ పూర్తి చేశావ్...
నేను the best soldier అయ్యాను...
నీకు రోజూ ఉదయం 7 తో మొదలయ్యి
సాయంత్రం 6 తో ముగుస్తుంది ....
నాకు ఉదయం 4 తో మొదలయ్యి
రాత్రుళ్ళు కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది...
నీకు కాలేజీ లో స్నాతకోత్సవం ఉంటుంది ...
నాకు పాసింగ్ ఔట్ పెరేడ్ ఉంటుంది..
నువ్వు బెస్ట్ కంపెనీలో బెస్ట్ ప్యాకేజీతో చేరతావ్...
నేను నా ప్లటూన్ లో చేరతాను..
నీకు ఉద్యోగం వచ్చింది....
నాకు జీవన పరమార్ధం దొరికింది...
ప్రతి సందర్భంలోనూ నువ్వు నీ నీకుటుంబాన్ని కలుస్తావు... నేను నా తల్లితండ్రులను చూసే సమయం కోసం ఎదురుచూస్తాను ..
నువ్వు పండగలన్నీ
ఆనందోత్సాహలతో జరుపుకుంటావ్...
నేను నా సహచరులతో బంకర్లలో జరుపుకుంటాను..
మనిద్దరికీ పెళ్లయింది.....
నీ భార్య నిన్ను రోజూ చూస్తుంది....
నా భార్య నన్ను ఈరోజు ప్రాణాలతో చూస్తే చాలనుకుంటుంది..
నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలు వెళ్తావ్...
నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళ్తాను..
మనిద్దరమూ తిరిగొస్తాము...
చాలా రోజుల తర్వాత చూసిన
నీ భార్య కన్నీళ్ళు నువ్వు తుడుస్తావు..
నేను తుడవలేను...
తనకు ఆత్మీయ కౌగిలి ఇస్తావ్..
నేను ఇవ్వలేను...
ఎందుకంటే ....
నేను శవపేటికలో ఉన్నాను...
నా చాతీ మీద మెడల్స్ ఉన్నాయ్..
వాటి బరువుకు నేను లేవలేను..
నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక మీద
నా జీవన సాఫల్యమైన '' భారత త్రివర్ణ పతాకంతో ''
అందంగా చుట్టబడి ఉంది...
ఆ గర్వించే క్షణాలు వదులుకొని
నేను శవపేటిక లోనుంచీ బయటకు రాలేను....
మాతృభూమి రక్షణలో నా జీవితం సార్ధకమైంది ...
మళ్ళీ సైనికుడిగా నే పుడతాను ...
నా జీవితం ఇంతటితో సమాప్తం
ఎందుకంటే నేను సైనికుణ్ణి ...... అమరుడ్ని ..
నీ జీవితం ముందుకే వెళ్ళాలని ఆశిస్తూ .....
''నీ మితృడైన ఒక సైనికుడు '' ....
భారత్ మాతాకి ... జై... జై హింద్...

Wednesday, May 23, 2018

వర్ణమాల వల్ల తెలియకుండానే వ్యాయామం .

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు

తెలుగంటే........

తెలుగంటే....గోంగూర
తెలుగంటే....గోదారి
తెలుగంటే....గొబ్బిళ్ళు
తెలుగంటే....గోరింట
తెలుగంటే...గుత్తొంకాయ
తెలుగంటే....కొత్తావకాయ
తెలుగంటే....పెరుగన్నం
తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం
తెలుగంటే...పోతన్న
తెలుగంటే...బాపు
తెలుగంటే...రమణ
తెలుగంటే...అల్లసాని పెద్దన
తెలుగంటే...తెనాలి రామకృష్ణ
తెలుగంటే...పొట్టి శ్రీరాములు
తెలుగంటే...అల్లూరి సీతారామరాజు
తెలుగంటే...కందుకూరి వీరేశలింగం
తెలుగంటే....గురజాడ
తెలుగంటే....శ్రీ శ్రీ
తెలుగంటే...వేమన
తెలుగంటే...నన్నయ
తెలుగంటే...తిక్కన
తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ
తెలుగంటే...గురజాడ
తెలుగంటే...క్షేత్రయ్య
తెలుగంటే...శ్రీనాధ
తెలుగంటే...మొల్ల
తెలుగంటే...కంచర్ల గోపన్న
తెలుగంటే....కాళోజి
తెలుగంటే...కృష్ణమాచార్య
తెలుగంటే...సిద్ధేంద్ర
తెలుగంటే....గౌతమీ పుత్ర శాతకర్ణి
తెలుగంటే...రాణీ రుద్రమదేవి
తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు
తెలుగంటే...రామలింగ నాయుడు
తెలుగంటే...తిమ్మనాయుడు
తెలుగంటే...రామదాసు
తెలుగంటే...ఆచార్య నాగార్జున
తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం
తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి
తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి
తెలుగంటే...సింగేరి శంకరాచార్య
తెలుగంటే...అన్నమాచార్య
తెలుగంటే...త్యాగరాజ
తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన
తెలుగంటే...విశ్వేశ్వరయ్య
తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్
తెలుగంటే...చిన్నయ్య సూరి
తెలుగంటే....సర్వేపల్లి రాధాకృష్ణన్
తెలుగంటే...పీవీ నరసింహారావు
తెలుగంటే...రాజన్న
తెలుగంటే...సుశీల
తెలుగంటే...ఘంటసాల
తెలుగంటే...రామారావు
తెలుగంటే...అక్కినేని
తెలుగంటే...సూర్యకాంతం
తెలుగంటే... ఎస్.వీ.రంగారావు
తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు
తెలుగంటే...పండుమిరప
తెలుగంటే...సంక్రాంతి
తెలుగంటే...సరోజిని నాయుడు
తెలుగంటే....భద్రాద్రి రామన్న
తెలుగంటే....తిరుపతి ఎంకన్న
తెలుగంటే...మాగాణి
తెలుగంటే...సాంబ్రాణి
తెలుగంటే...ఆడపిల్ల ఓణి
తెలుగంటే...చీరకట్టు
తెలుగంటే....ముద్దపప్పు
తెలుగంటే..ఓంకారం
తెలుగంటే...యమకారం
తెలుగంటే....మమకారం
తెలుగంటే...సంస్కారం
తెలుగంటే...కొంచెం ఎటకారం
తెలుగంటే...పట్టింపు
తెలుగంటే...తెగింపు
తెలుగంటే....లాలింపు
తెలుగంటే...పింగళి వెంకయ్య
తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు
తెలుగంటే....టంగుటూరి ప్రకాశం
తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం
తెలుగంటే...భాస్కరుడు
తెలుగంటే...దేవులపల్లి
తెలుగంటే...ధూర్జటి
తెలుగంటే...తిరుపతి శాస్త్రి
తెలుగంటే...గుఱ్ఱం జాషువ
తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ
తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య
తెలుగంటే...కోరాడ రామచంద్రకవి
తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం
తెలుగంటే...మల్లన్న
తెలుగంటే...నండూరి
తెలుగంటే...పానుగంటి
తెలుగంటే...రామానుజం
తెలుగంటే...రావి శాస్త్రి
తెలుగంటే...రవి వర్మ
తెలుగంటే...రంగనాధుడు
తెలుగంటే...కృష్ణదేవరాయలు
తెలుగంటే...తిరుపతి వెంకటకవులు
తెలుగంటే...విశ్వనాథ
తెలుగంటే...నన్నే చోడుడు
తెలుగంటే...ఆరుద్ర
తెలుగంటే...ఎంకి
తెలుగంటే...ఆదిభట్ల
తెలుగంటే...గాజుల సత్యనారాయణ
తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ
తెలుగంటే...ఆర్యభట్టు
తెలుగంటే...త్యాగయ్య
తెలుగంటే...కేతన
తెలుగంటే...వెంపటి చిన సత్యం
తెలుగంటే...ఉషశ్రీ
తెలుగంటే...జంధ్యాల
తెలుగంటే...ముళ్ళపూడి
తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ
తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం
తెలుగంటే...తిలక్
తెలుగంటే...అడివి బాపిరాజు
తెలుగంటే...జక్కన
తెలుగంటే...అచ్చమాంబ
తెలుగంటే...దాశరథి
తెలుగంటే...తెలంగాణ,ఆంధ్ర
తెలుగంటే...ముక్కుపుడక
తెలుగంటే...పంచెకట్టు
తెలుగంటే...ఇంటిముందు ముగ్గు
తెలుగంటే...నుదుటిమీద బొట్టు
తెలుగంటే...తాంబూలం
తెలుగంటే...పులిహోర
తెలుగంటే.... సకినాలు
తెలుగంటే....మిర్చి బజ్జి
తెలుగంటే...బందరు లడ్డు
తెలుగంటే....కాకినాడ ఖాజా
తెలుగంటే.....జీడిపాకం
తెలుగంటే...మామిడి తాండ్ర
తెలుగంటే ....రాగి ముద్ద
తెలుగంటే ......జొన్న రొట్టె
తెలుగంటే........అంబలి
తెలుగంటే ....మల్లినాథ సూరి
తెలుగంటే ......భవభూతి
తెలుగంటే..... ప్రోలయ నాయకుడు
తెలుగంటే .......రాళ్ళపల్లి
తెలుగంటె .......కట్టమంచి
తెలుగంటే.......మోహన రాగాలు
తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట
తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ
తెలుంగు గణమంటే తెలంగాణ
తెలుగంటే..... నీవు నేను మనం
తెలుగంటే తెగులెందుకు?
తెలుగు వెలుగులు చూపలేని జన్మెందుకు?
తెలుగు వీర లేవరా
దీక్ష బూని సాగరా
దేశానికి నీవెంతో నింగి కెగిసి చూపరా!

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

 ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"
                                 ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"
                                       ఆవకాయలో వేసే పసుపు,మెంతులు---
"గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

 ఆవకాయ తినగానే కలిగే ,              అలౌకికానందం---"కేతువు"

తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"
                           ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"
                              ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,
సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.😛😜😆😄

 శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!
〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు,
మామిడి
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

ఇందువలదందు బాగని
సందేహము వలదు;
ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును,
గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, తెలుగువాడు  కాడోయ్!!!

నేటి పల్లెటూరు!!!!

విత్తనాల్లో ఉండాల్సిన  మాత్రృబిందువు కూడా ఎక్కడా ...ఎవ్వరికీ కనబడకుండా...మాయంచేస్తూ....ఏదో దుష్టశక్తి పల్లె టూళ్ళన్నింటినీ దురాక్రమణ చేసిందా!!!!!!!!!!!!!!
....................................................


ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఏ మాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు.. ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుకుతున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
ఇది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆ పల్లెటూళ్లలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ఊళ్లల్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.

మోదుగాకు విస్తరాకుల బదులు.. బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు 
గొప్పతనంగా ఇళ్ళకి  తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు...వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు...ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు...షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలని...
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రె పాలని ..
డైరీ ఫాం లకు పోసి..
అంతా బలం కోసం
రోజుకో బీ.కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..ఖాతాలుపెట్టి...
క్వార్టర్లు తాగుతుంటే...
తెల్లకార్డు... వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పల్లె.‌. నేల నిండా ఏదో విషాదం దాక్కోని ఉన్నది.
చెట్ల ఆకులక్కూడ ఏదో గుర్తించలేని
మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు
బ్రతకలేక బ్రతుకుతున్నాయి .

కంది చేను ..శెనగ చేను..
వరి చేను..జొన్న చేను..
అన్నీ ..రైతుల కన్నీళ్ళతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలు గింజలే .

ఎటు చూసినా దిక్కుతెలియని స్తబ్దత...
ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత.‌..
ఎటు చూసినా అర్ధం కాని  ఆమ్ల  క్షారత...

విత్తనాల్లో ఉండాల్సిన
మాతృబిందువు కూడా ఎక్కడా.. ఎవ్వరికీ.. కనిపించకుండా..
మాయం చేస్తూ...ఏదో దుష్ట శక్తి పల్లెటూర్లనన్నీటినీ.. దురాక్రమణ చేసింది.

రచ్చబండ లేదు...
ఊరిపెద్దలంటూ ఎవ్వరూ లేరు...
పెద్దవాళ్ళంతా ..కొత్త తరాలకి
వెర్రివాళ్ళైపోయారు.

ఏవడికి వాడే గాంధీ.‌.
ఏవడికి వాడే సూపర్ హీరో...
అడ్దగోలు దొంగ వ్యాపారాలు చేసినోడు
అడ్డ దారిలో దేవుడయిపోయాడు.
పైకి రావాలంటే అడ్డదారినే రావాలనంటూ
రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి
యువకులంతా సిద్ధమై పోయారు.

ప్రభుత్వ పాఠశాలలన్నీ..
పనిచెయ్యకుండా ప్రభుత్వపు సొమ్ము తినే
పనికి రాని ..మనుషులకు
పనికి ఆహర పథకాలయ్యాయి.

చదువు చెప్పే టీఛర్లు..పిల్లలకు
తాము చదువు చెప్పుతున్నట్లు విపరీతంగా నటిస్తున్నారు.
పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్లు
విపరీతంగా నటించేస్తున్నారు.
తమ పిల్లలు  చదువు నేర్చుకుంటున్నట్లు
తల్లిదండ్రులు విపరీతంగా నమ్మేస్తున్నారు.

ఏటు చూసినా అంతా నటనే..
నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా.. మాట్లాడకుండా
అందరూ నటించటానికి అలవాటయిపోయారు

పశువుల డాక్టర్ వుద్యొగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
మనుషుల డాక్టర్ కూడా వుద్యోగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
కూలి పనికొచ్చిన వాళ్ళు
కూలి పనిచేస్తున్నట్టు నటించేస్తున్నారు..

పల్లెటూర్లు ఇప్పుడు
అమాయకపు పల్లెటూర్లు కావు..
పల్లెటూర్లన్నీ ఫిల్మ్ ఇన్సిట్యూట్లయ్యాయి
ప్రతిమనిషీ నటన నేర్చుకున్న మహా నటుడే.

పల్లెటూర్లల్లో ఒకప్పుడు 
గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండే వాళ్ళు.
ఇప్పూడు హీరోలు లేరు.
కన్న తల్లి కడుపులో ఉండగానే..
తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు  చూసి..చూసి..
పళ్ళు పటపట కొరుకుతూ
పుట్టటమే విలన్లుగా పుడుతున్నారు.
మనుషులంతా  తమ అసలు రూపాలను
మర్చిపోయి మారువేషాలనే ..
అసలువేషాలుగా చేసుకోని..
నటన తెలీని వాళ్ళని పిచ్చివాళ్ళని
ప్రచారం చేస్తూ సుఖంగా  బ్రతుకు తున్నారు.

అర్ధరాత్రి దాక వచ్చేనిద్రని ఆపుకుంటూ
టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటయిపోయింది.
ఆంతరంగికంగా పీడకలలు కంటూ..
నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
బాహ్యశబ్దాలని చర్మేంద్రియాలద్వారా వింటూ
పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ పంపునీళ్ళొస్తున్నాయని
వీధిబావుల్ని చెత్త చెదారాలు వేసి మరీ
పూడ్చేసుకున్నారు.
ఇప్పుడు ఊరు తగలబడిపోయినా
ఫైరింజన్ రావాల్సిందే..
అందరూ ఏడుస్తూ
నీళ్ళు లేక  కట్టుబట్టలతో నిలబడాల్సిందే.
కరెంటు లేకపోతే
అందరూ వీధి బావుల్ని
పల్లెటూర్లల్లో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే.
ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళెప్పుడో పోయారు..
అందరూ నేను బాగుండాలని కోరుకునే వాళ్ళే...
నన్ను బాగుచేసేదే న్యాయం...
నాకు లాభాన్ని తెచ్చేదే ..ధర్మం .
నాకు డబ్బులోచ్చేలా చేసేదే నీతి.

పల్లెటూర్లల్లో కూడా మనిషి మనుగడకు
అర్ధాలు ..వ్యర్ధాలెప్పుడో అయిపోయాయి.
ప్రభుత్వం దెగ్గిరనించి ఏ పథకం వస్తుందా
ఏంత నొక్కేద్దామా
అని ఆలొచించేవాళ్ళే అందరూ..

పల్లెటూర్లు నాశనమవ్వటానికి
అగ్గి రాజేస్తున్నదెవ్వరు?
బుగ్గి పాలవుతున్నదెవ్వరు?
పల్లెటూర్లు నాశనమవ్వటానికి
మంటలు మండిస్తున్న దెవ్వరు?
మంటల్లో పడి నాశన మవుతున్నదెవ్వరు? 

ఇళ్ళల్లో గడ్డి వాములు లేవు.
ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు.
దాన్యాన్ని అటునించి అటే మార్కెట్ కి పంపేసి
స్టొర్ నించి కేజీ రెండు రూపాయల బియ్యాన్ని
తెచ్చుకోని మరీ..పొదుపు చేసినందుకు ఆనంద పడుతున్నారు.
పాడి బర్రెను మేపే ఓపిక లేక... చాలామంది
పొట్లాలపాలు తెచ్చుకోని
టీలు చేసుకుంటున్నారు.

జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి
అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూచోని
ప్రభుత్వం మాకేమీ చేయటల్లేదని
సామూహికంగా ఏడుస్తున్నారు

పల్లెటూర్లల్లో ఒకప్పటి ప్రాకృతిక
హృదయంగత  సంగీతం లేదు.
నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద
సౌందర్యమూ లేదు.
ఒకప్పటి నిశ్శబ్దపు
కవిత్వమూ లేదు.
అనాదిగా కనిపించిన పురాతన
ప్రేమత్వమూ లేదు.

ఊళ్లల్లో బావులు ఎండిపొయాయి
ఊళ్ళల్లో మనుషులు ఎండిపొయారు.
ఊళ్ళల్లో చెరువులూ ఎండిపోయాయి.
పూవులు లేవు..పండ్లూ లేవు.

మనుషులు కేజీల లెక్కన అమ్ముడయి పోతున్నారు.
మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు.

తారు రోడ్ల పక్కన పొలాలన్నీ...
రియల్ ఎస్టేట్ దెయ్యాల  వెంచర్లు అవుతున్నాయి.

పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన
కాంక్రీటు ముళ్ళలా... పొలాలల్లో
ఎటు చూసిన సరిహద్దు రాళ్ళే దర్శనమిస్తున్నాయి.

తరాలు మారకమందే ..
చూస్తూండగానే..
పల్లెటూర్లకు వృద్ధాప్యమొచ్చింది.

మనుషులందరూ బతికుండగానే
ఊరు మాత్రం కళేబరమయిపోయింది

మనుషుల అస్థిత్వం అబద్ధమయిపోయాక
ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక
ఊర్లన్నీ...అస్థిపంజారాలుగా మిగిలి పోతున్నాయి
మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి..
పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు..

భవిష్యత్తులో..
పల్లెటూర్లంటే..
కాలిపొయిన పున్నాగ వృక్షాలు..
పాడు పడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే.......
..........................................................
నా ఈ రాజ్యం లో పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మ లు అనడం మర్చి పోవాలేమో.

Tuesday, May 22, 2018

రుమలలో ఏం జరిగింది, ఏమి జరుగుతోందీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము

తిరుమలలో ఏం జరిగింది, ఏమి జరుగుతోందీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము



పూర్వం నుండి తిరుమల ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు నిర్వహించే అర్చక కుటుంబాలు నాలుగు ఉన్నాయి. ఈ నాలుగుకుటుంబాల వారు తిరుమలకు నడకదారి కూడా సరిగాలేని రోజులనుండీ అర్చకత్వం చేస్తున్నారు.



1900 దశకంనుండి ఆదాయం బాగారావడం ప్రారంభమైనది. అప్పటి బ్రిటిష్ పాలకులు కూడా స్వామివారి పట్ల మంచిశ్రద్ధనే చూపారు. క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో, ఆలయనిర్వహణకు కొంతమంది అధికారుల అవసరం ఉందని గుర్తించి, కలెక్టర్ స్థాయి అధికారిని బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది.



 తరువాత వారే హథీరాంజీ మఠానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఆలయానికి వచ్చేభక్తులకు సౌకర్యాలు చేయడం, దర్శన వేళలు పర్యవేక్షణా వారి బాధ్యతలు. స్వాతంత్రం వచ్చాక, మన భారత ప్రభుత్వాలు రావడం జరిగింది.



 1950 లో తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనకు ప్రత్యేక పాలకమండలి అధికారులను, ప్రభుత్వం నియమించడం, వారు వచ్చే హుండీ ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించడం, జరుగుతూ ఉండేది. కానీ ఎవరు కూడా స్వామివారి కైంకర్యాల విషయాలలో కలుగజేసుకునేవారు కాదు.



ఆ బాధ్యతలు అర్చకులు, జీయర్ స్వాములు, ఆచార్యపురుషులు మాత్రమే నిర్వహించేవారు. సందేహాలు వస్తే, ఆస్థానపండితులు ఉండేవారు. స్వామివారి కైంకర్యానికి వచ్చే ద్రవ్యములు, ప్రసాదములు అర్చకులకు వచ్చేవి. ప్రత్యేక జీతభత్యాలు ఏమి లేవు.



ఆద్రవ్యములు, ప్రసాదాల ఆదాయంతోనే అర్చకులు జీవనం చేసేవారు. రానురానూ ఆలయంలో భక్తులు పెరగడం, ద్రవ్య లాభం పెరుగుతుండటంతో అర్చకులకు మంచి ఆదాయం సమకూరేది. ఇలా ఉండగా శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అర్చక వ్యవస్ధ గురించి ఒక కమీషన్ ను వేశారు.



ఆ కమిషన్ ఇచ్చిన సిఫార్సు ఏమంటే "అర్చకులు వంశపారంపర్య హక్కు ద్వారా, వారికుటుంబాలవారే అర్చకులుగా ఉంటున్నారు.. ఇది తప్పు! ఆలయాలలో అర్చకులకు జీతభత్యాలు ఇచ్చి, అక్కడ ద్రవ్య ఆదాయం తీసివేయాలి!" అని సిఫార్సు చేశారు.



ఆ సిఫార్సుని పరగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, అర్చకులకు వంశపారంపర్య హక్కు తీసివేసి, ద్రవ్యఆదాయం స్థానంలో జీతాలు ఇస్తామన్నారు. ఇది తిరుమలకు మాత్రమేకాదు- రాష్ట్రవ్యాప్తంగా వర్తించినది. అప్పుడు అర్చకులు వారి వాదన ఇలా వినిపించారు.



"ఈ నిర్ణయమ్ వలన దేవాలయాన్ని నమ్ముకొని కొన్నితరాలుగా మనది అదేవృత్తి అని చిన్ననాటి నుండి ఈ శాస్త్రాన్ని గుడిని నమ్ముకున్న వారికి, తమ తదనంతరం, ఈ అర్చకత్వం మన అబ్బాయికి రాదు అనిఅంటే, మరి ఆలయాలను ఎవరు చూస్తారు?



ప్రతిఒక్క ఆలయ సంప్రదాయాలు ఎలా కాపాడబడతాయి? పురాతన ఆలయాలలో ఉన్న అనేక కట్టుబాట్లు ఎవరు అర్థం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళాలి? తిరుమల ఆలయానికి అయితే రాబడివస్తుంది కాబట్టి జీతాలు ఇస్తారు.



 కానీ మిగిలిన ఆలయాలకు జీతాలు ఎలా ఇస్తారు?" ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తారు కానీ ప్రభుత్వ నిర్ణయం మారలేదు. దానితో తిరుమల అర్చకులు కోర్టుమెట్లు ఎక్కారు. 1987నుండి 1996 వరకు (9సంవత్సరాల కాలం) కోర్టులో కేసు జరిగింది. ఈ 9సంవత్సరాలు టీ.టీ.డీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉన్నారు.



హుండీ డబ్బు ఖర్చుపెట్టి, దర్జాగా ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఈ 9సంవత్సరాలు తిరుమల అర్చకులు ద్రవ్యఆదాయాన్ని తీసుకుంటూనే ఉన్నారు.



1996 లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ "వంశ పారంపర్య హక్కు అర్చకులకు లేదని, కానీ ప్రస్తుతం ఉన్నవారిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, వారికి ద్రవ్య ఆదాయం మినహా అన్ని గౌరవమర్యాదలు ఇవ్వాలని, ఆగమకైంకర్యాలు వారు చెప్పినట్లే నిర్వహించాలని" సూచించారు. దానితో అర్చకకుటుంబాలకు నిరాశ ఎదురైంది. దానినే మిరాశీవ్యవస్థ రద్దుగా చెప్తారు.



 రోజురోజుకూ కేసు ప్రభుత్వం వైపు మొగ్గుతూండడంతో, ఎంతోమంది లాయర్లు చక్కగా అర్చకుల దగ్గర డబ్బులు స్వాహాచేయడం జరిగిపోయింది కానీ, ప్రయోజనం దక్కలేదు.



దీనివల్ల తిరుమల అర్చకులమాట ఎలాఉన్నా, మిగిలిన దేవాలయాల అర్చకుల పిల్లలు ఎవరూ ఆగమశాస్త్ర అధ్యయనం చేయడం మానేశారు. మనకు ఆలయం లేనప్పుడు, అన్నం దొరకాలంటే వేరొక వృత్తి చేయాలికదా! అని ఇతర లౌకిక విద్యలకు వెళ్లిపోయారు.



చాలా ఆలయాలు అర్చకులులేక మూతపడ్డాయి. టీ.టీ.డీవారు ఇంతటితో వదలక, కేసుజరుగుతున్న రోజులలో ద్రవ్యఆదాయాన్ని అర్చకులు తీసుకున్నారు గనుక, దానిని తిరిగికట్టాలని కోర్టులో కేసువేసి గెలిచారు.



దానితో అప్పటినుండీ, అర్చకులకు సంబంధించిన నలుగురి ఇళ్ళు తనఖాపెట్టుకొని, వారికి ఇచ్చే జీతంలో ప్రతినెలా డబ్బు పట్టుకొని (మినహాయించుకుని) మరీ ఇస్తున్నారు. ఇప్పటికీ 9మంది అర్చకుల జీతంలో ఈడబ్బు కట్ అవుతుంది.



సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అప్పుడు ఉన్న అర్చకులను తీసివేయకూడదు. అలాగే వారు చెప్పినట్లే కైంకర్యాలు నిర్వహించాలి.



వారి గౌరవం వారికి ఉండాలి అని చెప్పినందున ఆతీర్పు వచ్చేనాటికి ఎంతమంది దేవాలయంలో పనిచేస్తున్నారో వారిని టీటీడీ తమ ఉద్యోగులలాగా భావిస్తూ జీతాలు ఇవ్వడం ప్రారంభించింది.



శ్రీరాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, వంశపారంపర్య హక్కుకు సంబంధించి ఎండోమెంట్లో ఒక జీ.వో తెచ్చారు. దాని సారాంశం ఏమంటే- పూర్వమునుండి దేవాలయాన్ని నమ్ముకున్న అర్చక కుటుంబాలలో సమర్థులైన (అంటే) ఆగమ శాస్త్రాన్ని చదువుకున్న వారసులు ఉంటే, ఇప్పుడు వారు చేస్తున్న అర్చక ఉద్యోగాన్ని తన కుమారుడికి ఇవ్వమని సిఫార్సు చేయవచ్చు.



అతను సక్రమంగా చదువుకొని ఉంటే, ఆఉద్యోగం అతనికే ఇవ్వాలి అన్నారు. దానివల్ల తిరిగి అర్చక కుటుంబాలలో మళ్ళీ ఆగమశాస్త్ర అధ్యయనం జరగడంకూడా కొంత పెరిగింది.



శుభపరిణామం అని అందరూ సంతోషించారు. 2010లో శ్రీకృష్ణారావు గారు తిరుమల మరియు గోవిందరాజస్వామి అర్చకుల జీతాలను కొంతమందికి ₹33000 చేసి పుణ్యం కట్టుకున్నారు. అప్పటిదాకా ₹8000 మాత్రమే ఉండేది.



 ఇప్పటికి టీ.టీ.డీ లో పనిచేసే 350మంది అర్చకుల జీతం ₹17000 మాత్రమే. ఇది ఇలా ఉండగా, 1999లోనే అర్చకులు సుప్రీంకోర్టు 3జడ్జీల బెంచికి కేసు పునఃపరిశీలనకు అడిగారు. 3 జడ్జీల బెంచ్ దానిని విచారణకు స్వీకరించింది.



2012 దాకా దాని విచారణ కొనసాగుతూనే ఉంది. 2012లో సుబ్రమణ్యం గారు ఈ.ఓ గా ఉండగా, "మీకు మంచి జీతాలు ఇస్తున్నాం గౌరవంగా చూస్తున్నాం! మీతరువాత యోగ్యులైన మీకుమారులకు కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కదా!



 మరి మీరెందుకు ఇంకా కేసు వాదిస్తారు? వెనక్కి తీసుకోమని" కోరారు. దానితో అర్చకులు కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ జడ్జిగారు అడిగారు- "మీకు అన్ని మర్యాదలు జరుగుతున్నాయా?



మీ కుమారులకు అర్చకత్వం ఇస్తున్నారా? ఒకవేళ మీకు ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా 3బెంచి జడ్జీల దగ్గరకు రావచ్చ"ని చెప్పి, కేసు వెనక్కు ఇచ్చారు.



సాధారణంగా ఒకకేసు లో ఎవరూ అలా అనరు కానీ ఇప్పటికీ అర్చకుల హక్కులైన ఆలయ కైంకర్యాల నిర్వహణ, ఉత్సవాల నిర్వహణ, వంశ పారంపర్య హక్కు ద్వారా గల మర్యాదలు, అర్చకులకు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పింది.



వంశపారంపర్య హక్కు గురించి కూడా మేము చదివాము అది తీసివేయడం వల్ల వచ్చిన పరిణామాలు కూడా బాగులేవని సుప్రీం కోర్టు అన్నారు.



తరువాత కేసు ఆగిపోయింది కానీ చిలుకూరు దేవాలయం అయ్యవారు శ్రీ సౌందరరాజన్ గారు వేరొక కేసువేసి దీని గురించి పోరాడుతూనే ఉన్నారు.



ఇంకొక కేసు అయిన చిదంబరం గుడి అర్చకులకేసులో 2016లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ- "ఆగమశాస్త్రాలనుఅనుసరించి మాత్రమే, ఆలయాలలో అర్చక నియామకం ఉండాలి- ఎవరిని కావాలంటే వారిని నియమించకూడదని" అన్నది.



 మొత్తానికి తిరుమల అర్చకులకేసు సుప్రీంకోర్టు నుండి బయట పడ్డాక, అధికారుల రాక్షస క్రీడ ప్రారంభమైనది. ఆలయం లోపలి అన్నివిషయాలలో అధికారుల హవా మొదలైనది.



 భక్తులరద్దీ సాకుగా కైంకర్యాలు వేళలు మార్చడం, స్వామివారికి ఏ ఆభరణాలు అలంకరించాలి? బ్రహ్మోత్సవాలు ఎవరు చేయాలి? పవిత్రోత్సవాలు ఎవరుచేయాలి? ఇటువంటి ఎన్నో ఆగమపరమైన నిర్ణయాలను అవగాహనారాహిత్యం తో తీసుకున్నారు.



ప్రధాన అర్చకులు వ్యతిరేకించినా లెక్కపెట్టలేదు. ప్రస్తుతం తిరుమలలో అర్చకుల సంఖ్య గణనీయంగా పెరగాల్సిన పరిస్తితి ఉంది.



మిరాశీ అర్చకులు మా కుమారులు ఉన్నారు కదా? వారిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ వారు ఒప్పుకోలేదు. జి.ఓ. ప్రకారం మీరు టీటీడీ ఎంప్లాయిస్ గా ఉంటే, మీకు మేము స్కెలు జీతం ఇచ్చి, అప్పుడు మీరు 65 ఏళ్ళు వచ్చాక విరమణ చేస్తే ఇస్తాము, లేకపోతే లేదు అన్నారు.




మేము ఉద్యోగులం కాదు, గౌరవస్తానంలో ఉండే అర్చకులము, మాకు ఇచ్చే డబ్బుని జీతం అనవద్దు- సంభావన ఆనండి. మాకు ఇది ఉద్యోగం కాదు - ఇది ఒక బాధ్యత మాకు - మీ రూల్స్ ఎలా పెడతారు? అని అడిగి, హైకోర్టులో వేశారు.



హైకోర్ట్ తీర్పుచెప్తూ, మిరాశీ అర్చకుల కుమారులను వెంటనే విధులలోకి తీసుకోవాలని, సుప్రీంకోర్టు వారికి ఆ విధమైన సౌకర్యాలు ఇచ్చిందని, కైంకర్యాలు ఉత్సవాలు వారు చెప్పినట్టే చేయాలని వారి గౌరవం కాపాడాలని మళ్ళీ తీర్పు ఇచ్చింది.



ఇలా ఉండగా, అధికారగణం మెల్లగా ఆ అర్చక వర్గాలలో చీలిక తెచ్చింది. మీకు మీరు చేరినప్పటి నుండీ స్కేలు జీతం ఇస్తాము, మీరు 65 ఏళ్ళ వరకు ఉద్యోగం చేయొచ్చు.



తరువాత మీ పిల్లలు ఉంటే, వారికి ఇస్తాము కదా! మీకు ఒక 20లక్షలు అరియర్స్ వస్తాయి. రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది ఎందుకు మీకీ హక్కులు? వీటివల్ల మీకు ఏమి ఒరిగిందీ?? దేవుడికి జరిగేది జరుగుతుందీ.. ఎవరో ఒకరు చూస్తారూ.. ఇలాంటి మాయ మాటలు చెప్పి అర్చకులలో ఒక వర్గాన్ని ఉద్యోగులుగా మార్చడానికి రంగం సిద్ధం చేసింది.




దీని వల్ల బాధ ఏమిటంటే, ఎప్పుడైతే అర్చకుడు ఉద్యోగిగా మారతాడో, అపుడతను తనకన్నా ఎక్కువ జీతం తీసుకునే ప్రతిఒక్కరికీ అతను సబ్-ఆర్డినెట్ అవుతాడు.



సర్వీస్ రూల్స్ ప్రకారం తిరుపతిలోని అర్చకులను బొంబాయికి, ఢిల్లీకి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు! వారు చెప్పినది వినక పోతే ఏమైనా చేయొచ్చు!!. కైంకర్యాలు వారు చెప్పినట్టు చేయాలి..



 ఉత్సవాలు వాళ్లు చెప్పినట్టు చేయాలి.. మొత్తం అధికారుల చేతులలోకి వెళ్ళి పోతుంది. అప్పుడు ఈ రాజకీయ నాయకులు, దొంగలు, ఆఫీసర్ చేతికి మొత్తం వెళ్ళిపోతే, ఇప్పటికే కొన్ని దేవాలయాలు ఏరకంగా ఎండోమెంట్ వారు నాశనం చేస్తున్నారో చూస్తున్నాం కదా!



అదే గతి మన తిరుమలకూ, పట్టబోతోంది.. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఆలయ కైంకర్యాలూ, అర్చకుల విషయంలో అధికార జోక్యం ఎంతప్రమాదమో గుర్తించిన రమణదీక్షితులు గారు ఎదురు తిరిగారు.



తరువాత ఎం జరుగుతోందో మీకు తెలుసు !!



ధర్మో రక్షతి రక్షితః



$$$$$$$$$$$$$$$$$

ఇంటర్ ఫలితాలు 750 వచ్చినా, 850 వచ్చినా, 985 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు.

మొన్న ఇంటర్ ఫలితాలు వచ్చాయి.  నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు.  వారి రిజుల్త్స్ కనుక్కుందామని కొందరికి ఫోన్ చేసాను.  ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ రిసీవ్ చేసుకింది.  "అమ్మాయి కు మూడ్ బాగా లేదు. పడుకుంది"  అని చెప్పింది ఆమె.  ఆ పిల్ల చాలా తెలివికలది.  పొరపాటున తప్పిందా అని అనుమానం వచ్చి "ఎన్ని మార్కులు వచ్చాయి?" అని అడిగాను.  975 అని జవాబిచ్చిది ఆమె.  అబ్బో.... చాలా మంచి మార్కులు... మరి మూడ్ బాగా లేకపోవడం ఏమిటి?  అన్నాను.  985 ఎక్స్పెక్ట్ చేసింది.  దాంతో డిప్రెషన్ లో ఉంది.  మాకు కూడా తృప్తి లేదు. అందుకే ఎక్కడికీ వెళ్ళలేదు"  అని చెప్పింది ఆమె.

  మరొకరికి ఫోన్ చేసాను.  ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తున్న సౌండ్ వినిపించింది.  వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుంది.  " మార్కులు బాగా తక్కువ వచ్చాయి.  పొద్దుటినుంచి ఏడుస్తున్నది. ఓదార్చడం మా వల్ల కావడం లేదు"  అన్నది ఆమె.  "ఎన్ని వచ్చాయి?" అడిగాను. " 985 వచ్చాయి."  చెప్పింది ఆమె.  నాకు చిరుకోపం వచ్చింది.  "పార్టీ అడుగుతాము అని మీరు అలా అంటున్నారు.  985 అంటే చాలా గొప్ప మార్కులు కదా? "  అన్నాను.  "మార్కులు రాగానే వాళ్ళ కాలేజి నుంచి ఎవరో ఫోన్ చేసారు.  ఇంకొక్క రెండు మార్కులు వచ్చినట్లయితే, నీ పేరు, ఫోటో ఫ్లెక్సీ లకు ఎక్కేది.  మంచి చాన్స్ మిస్ చేసుకున్నావు.  ఇంత తక్కువ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యలేదు"  అని అన్నదట ఆమె ఎవరో...దాంతో దిగులు పడింది."  అన్నది ఆ తల్లి. 

 మరొకరికి ఫోన్ చేస్తే వాళ్ళ దాడి మాట్లాడాడు.  "ఎన్నో ఆసలు పెట్టుకున్నాం. డాక్టర్ని చేయ్యాలనుకున్నాము.  20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనిచ్చాము.  అయిదారు వేల రూపాయల్ డ్రస్సులు అడిగితె కొనిపెట్టాము.  లక్షల ఫీజులు కట్టాము.  కాలేజి కి వెళ్ళడానికి హోండా ఆక్తివా కావాలంటే కొనిపెట్టాము.  చివరకు 965 మార్కులు తెచ్చుకుని మా ఆశలు నీరు కార్చింది.  వాళ్ళ అమ్మ కోపం పట్టలేక చీపురు కట్టే తో చితక కొట్టింది.  ఇద్దరు ఏడుస్తూ గదిలో పడుకున్నారు. "  చెప్పాడు ఆ జనకుడు. 

 మరొకరికి ఫోన్ చేస్తే 750 మార్కులు వచ్చాయట.  వాళ్లకు అప్పటి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పడుకున్నారట.   అయిదారుగురు పిల్లలకు 850-950 మధ్యన మార్కులు వచ్చాయి.  వాళ్ళు  కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయి, ఇక  జీవితం వ్యర్ధం అన్నంతగా కుమిలి పోతున్నారు. 

  750 వచ్చినా, 850 వచ్చినా, 985 వచ్చినా ఎవరికీ సంతోషం లేదు.  అందరూ ఏడుస్తున్నారు. 

 లోపం ఎక్కడుంది?  విద్యా వ్యవస్థ లోనా?  టీచర్ల లోనా, చదువుల లోనా, పిల్లల లోనా, తల్లితండ్రుల లోనా, సమాజం లోనా, ప్రభుత్వం లోనా? 

  ఇప్పుడు 40 ఏళ్ల వయసు దాటి దేశ విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్న వారంతా టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు అత్తెసరు మార్కులతో పాస్ అయిన వారేనని ఈ పిల్లలు, తల్లితండ్రులు ఎప్పుడు తెలుసకుంటారు? ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే  వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది?

ఆ రోజులే బాగున్నాయ్ !

ఆ రోజులే బాగున్నాయ్ !
�----------�----------�

టెన్షన్లు..
ఒత్తిళ్లు... 
డబ్బు సంపాదన...
అతిగా ఆలోచనలు లేకుండా...
ఉన్నంతలో కుటుంబమంతా కలసి...
ఆనందంగా గడిపిన .
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఆదివారం
ఆటలాడుతూ...
అన్నాన్ని మరచిన
�ఆ రోజులు బాగున్నాయ్..!

మినరల్ వాటర్ గోల లేకుండా...
కుళాయి దగ్గర,
బోరింగుల దగ్గర,
బావుల దగ్గర...
నీళ్లు తాగిన...
�ఆ రోజులు బాగున్నాయ్..!

ఎండాకాలం
చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..
ఎర్రని ఎండను సైతం
లెక్కచేయని...
�ఆ రోజులు బాగున్నాయ్..!

వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...
ఉన్న ఒక్క దూరదర్శన్ లో
శుక్రవారం చిత్రలహరి...
ఆదివారం సినిమా కోసం వారమంతా...
ఎదురు చూసిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

సెలవుల్లో
అమ్మమ్మ..
నానమ్మల ఊళ్లకు వెళ్లి...
ఇంటికి రావాలనే ఆలోచన లేని...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఏసీ కార్లు లేకున్నా
ఎర్రబస్సుల్లో...
కిటికీ పక్క సీట్లో నుండి
ప్రకృతిని ఆస్వాదించిన
� ఆ రోజులు బాగున్నాయ్...!

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...
బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ...
చాక్లెట్లు పంచిన
� ఆ రోజులు బాగున్నాయ్..!

మటన్ బిర్యానీ..
చికిన్ బిర్యానీ లేకున్నా...
ఎండాకాలం వచ్చిందంటే
మామిడి కాయ పచ్చడితో...
అందరం కలసి
కడుపునిండా అన్నం తిన్న...
� ఆ రోజులు బాగున్నాయ్..!

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా...
పరుసు నిండా డబ్బులున్నా...
కొట్టుకు పంపితే ...
మిగిలిన చిల్లర కాజేసిన
� ఆ రోజులే బాగున్నాయ్..!

సెల్లు నిండా గేములున్నా...
బ్యాట్ మార్చుకుంటూ
ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..
� ఆ రోజులే బాగున్నాయ్...!

ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా...
రెండు నిక్కర్లతో బడికెళ్లిన...
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .
ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న...
� ఆ రోజులే బాగున్నాయ్...!

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..
పిల్లలం కొట్టుకున్నా
పెద్దలంతా కలసివుండే
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...
నాన్న కొనుక్కొచ్చే ...
చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన..
� ఆ రోజులే బాగున్నాయ్..!

ఇప్పుడు రకరకాల
ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...
అమ్మ చీరకొంగు పైసలతో
పుల్ల ఐసు కొనితిన్న...
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!

పొద్దుపోయేదాకా
చేలో పని చేసుకొచ్చి...
ఎలాంటి చీకూచింత లేకుండా..
ఎండాకాలంలో ఆకాశంలోని
చందమామను చూస్తూ నిదురించిన..
� ఆ రోజులు బాగున్నాయ్..!

�ఆ రోజులు బాగున్నాయ్...�
�ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...�
 ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹మీ ప్రియమైన మిత్రుడు. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.....
💑👨‍👨‍👧👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👩‍👩‍👦🌏💞
Forward to all🙏🙏🙏🙏🙏🙏
రీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు.. ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే..

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు..

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..
వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..

రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు. ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే!
 సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..
మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.. ఆశ..
నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన
హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం..

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..

కట్ చేస్తే..

ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..??

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే !

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు.. 


పరిస్తితులు మారాలి..
😊😊

Central Government Water Committee Analysis

Central Government Water Committee Analysis


BATHING......
By Shower consumes 100  litres.
By Bucket 18 litres..
Saving 82 litres.

FLUSHING after toilet
By Flush is 20 litres
By bucket is 6 litres
Saving is 14 litres.

WASHING CLOTHES
In a running tap - 116 litres
In a bucket .. 36 litres
Saving is 80 litres.

SHAVING
In a running tap..5 litres
In a mug .. 0.5 litres.

Brushing Teeth
In a running tap..5 litres
Closed tap or Bucket .. 0.75 litres.

Washing Car
In running tap water nearly 100 liters....... white with single bucket 2 to 3 cars can be washed with just 18 liters.......

Watering Potted Plants
In running tap water nearly 50 liters...... Bucket less than 10 liters....

Watering Garden
Running tap 100 lites or even more in multiples...... sprinkler system only 25/ 30 liters

Please Use Bucket n You will find a notable difference..
Choice is yours whether to enjoy n be safe with municipality / bore well water or disturb your family health by calling tankers water.


❗Each family can save atleast 300 Liters of water per day with minor changes in life style......


💧Please Help Save Water....
💧Help Save Ur Future......


🙏 Save Water

Please pass this message till it reaches everyone in the world.

‼  ....    It is a wonderful message to save water for the future generations.

ఇవ్వడం నేర్చుకోవాలి..కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్. ✅ గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ముఖ్యం!!! నమ్మడమే శ్రేయస్కరం.

ఇవ్వడం నేర్చుకోవాలి..🌻

ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు.

అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.

 నడుస్తున్నాడు.

నీరు ఎక్కడా కనబడటం లేదు.

 తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది.

ఈ రాత్రి గడవదు.

 రేపు ఉదయం చూడను

అని అనుకుంటున్న దశలో

 ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు.

💧దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది.

 అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో!

💧చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు.

శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు.

 గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది.

💧దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది.

దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు.
నీరు రావడం లేదు.
శక్తినంతా ఉపయోగించి కొట్టాడు.

అయినా ప్రయోజనం లేదు.

 నిరాశ నిస్పృహ ఆవరించాయి.

ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది.

 కళ్లు మూసుకుపోతున్నాయి.

💧ఒక మూలన సీసా కనిపించింది.

దానిలో నీరు ఉంది.

 మూత గట్టిగా బిగించి ఉంది.

 మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు.

💧దానికి ఒక కాగితం కట్టి ఉంది.

దాని మీద ఇలా ఉంది.

ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి.

పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి.

💧అతడికి సందేహం కలిగింది.

ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా?

 ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా?

 ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను?

చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు.

 అందులో పోసేస్తే మరణం ఖాయం.

💧ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు.

💧ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు.

 బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు.

 ఆశ్చర్యం!!!!!

💧పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది.

నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు.

తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు.

గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది.

తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు.

💧_ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి.💧

 ఇవ్వడం వల్ల మనం

 పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి.

ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి.

 కృషి చెయ్యకుండా ఫలితంఆశించకూడదు_

చావు బతుకుల మధ్య
ఇక్కడ తర్కం

🚰 ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్ళు కొద్ది పోస్తే ఎలా వస్తాయి ?

🚰 రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే....
మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు. తరువాతా...??

🚰 అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి.

తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై వుండొచ్చు.

వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి వుండొచ్చు.

✅ కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్.

✅ గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ముఖ్యం!!! నమ్మడమే శ్రేయస్కరం.

మిత్రమా...నువ్వు ఇవ్వకుండా
         దేనినీ పొందలేవు
               గుర్తుంచుకో...

👉🔥అద్భుతమైనది- బ్రహ్మముహూర్తం🔥

👉🔥అద్భుతమైనది- బ్రహ్మముహూర్తం🔥

👉​​పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు.
ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు.

🌻ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు.

🌻ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి.

🌻సూర్యోదయ మునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు.
అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం.

🌹ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది🌹

🌻సూర్యోదయం అవడానికి, 96-48 నిమిషాల మధ్యకాలం ఇది🌻. 

🌻నిజానికి తెల్లవారు ఝామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని 'ఆసురీ ముహూర్తం' అని... ఆసురీ ముహూర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని 'బ్రహ్మముహూర్తం' అని అంటారు.

🌺ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమున లేచి.. భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి🌺

🌻బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు.

🎋ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది🌾

పురాణగాథ:-

🌻బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి.

🌻కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసు కోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు.
ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు.

🌻అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది.

🌸ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువు చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి🌸

🌻ఈ ముహూర్తాన్ని ఉపయోగించాలంటే  ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం.

🌻ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది.
మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, అయిష్టాలు లేని సమయం.

🎋ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది🌾

🌻ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది.

🌻అయితే మనం ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటాము. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండ మంటారు మన పెద్దవాళ్లు.

🌻చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి ఈ బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

🍁బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు🍁

🌻పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది.

యోగా మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం మరియు
5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వంటి వాటి వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

🌻బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది.
 అందుకే ఋషులు, యోగులు,
ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.

🌻సర్వేజనాః
శుఖినోభవంతు💐

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం, ఆవకాయ పై పద్యాలూ

ఆవకాయ 'నవగ్రహ' స్వరూపం

 ఆవకాయలో ఎరుపు--- "రవి"

ఆవకాయలోవేడి, తీక్షణత---"కుజుడు"
                                 ఆవకాయలో వేసే నూనె, ఉప్పు---"శని"
                                       ఆవకాయలో వేసే పసుపు,మెంతులు---
"గురువు"

మామిడిలో ఆకుపచ్చ---"బుధుడు"

మామిడిలో పులుపు---"శుక్రుడు"

 ఆవకాయ తినగానే కలిగే ,              అలౌకికానందం---"కేతువు"

తిన్న కొద్దీ తినాలనే ఆశ---"రాహువు"
                           ఆవకాయ కలుపుకునే అన్నం---"చంద్రుడు"
                              ఇలాంటి ఆవకాయ కంచంలో ఆగ్నేయ మూల వేసుకుని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని, తింటే,
సమస్త గ్రహ దోషాలు ఔట్, హాం ఫట్.😛😜😆😄

 శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,
టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,
ఇష్టముగ ఆవకాయను
సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!

ఊరిన ముక్కను కొరకగ,
ఔరా! అది ఎంత రుచిని అందించునయా,
కూరిమితొ నాల్గు ముక్కలు
నోరారా తినని నోరు నోరవ్వదుపో!

బెల్లము వేసిన మధురము,
పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,
వెల్లుల్లి వేయ మధురము,
పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!
〰〰〰〰〰〰

ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:
చెక్కందురు, డిప్పందురు,
ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్.
డొక్కందురు,
మామిడి
పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!
〰〰〰〰〰〰

ఆవకాయ ఉపయోగాలు:
ఉదయమె బ్రెడ్డున జాముకు
బదులుగ ఇదివాడిచూడు బ్రహ్మాండములే,
అదియేమి మహిమొ తెలియదు,
పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!

ఇందువలదందు బాగని
సందేహము వలదు;
ఊట సర్వరుచిహరం ఎందెందు కలపి చూసిన,
అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!
〰〰〰〰〰〰

ఆవకాయ అవతరణ:
“చప్పటి దుంపలు తినుచును,
తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో గొప్పగు మార్గం బొక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్”

ముక్కోటి దేవులందరు
మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన ముక్క తిననివాడు కొండముచ్చై పుట్టున్!!!

చారెరుగనివాడును,
గోదారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, తెలుగువాడు  కాడోయ్!!!

Dedicated to All Aavakaaya Lovers

పల్లెలపై ప్రపంచీకరణ ప్రభావం అద్భుత కధనం

విత్తనాల్లో ఉండాల్సిన  మాత్రృబిందువు కూడా ఎక్కడా ...ఎవ్వరికీ కనబడకుండా...మాయంచేస్తూ....ఏదో దుష్టశక్తి పల్లె టూళ్ళన్నింటినీ దురాక్రమణ చేసిందా!!!!!!!!!!!!!!
....................................................
నేటి పల్లెటూరు!!!!!!!!
!!!!!!!!

ఎన్నడూ లేనిది..ఆ పల్లెటూర్లో
గుడి ముందు ధ్వజస్థంభం మీద
రాబందులు గూళ్ళు కట్టుకున్నాయి..
ఇళ్ళల్లో ఉన్న తులసి మొక్కల మీద
పిచ్చుకలు గడ్డితో ఆవాసం ఏర్పరచుకున్నాయి.
పట్ట పగలు మనుషులంటే ఏ మాత్రం బెరుకు లేకుండా
గుడ్లగూబలు.. ఇళ్ళల్లో ఆహారాన్ని వెతుకుతున్నాయి.

అది..అక్షరాలా.. కన్నతల్లే
ఇది..అక్షరాలా..  పల్లేటూరే

ఇప్పుడు ఆ పల్లెటూళ్లలో.
మనుషులు నవ్వటం మర్చిపోయారు.
మనుషులు తనివితీరా ఏడవటానికి సదా
యుద్ధ సన్నద్ధంగా ఉన్నారు.

ఇప్పుడు ఆ ఊళ్లల్లో నాగరికత పేరుతో
మనుషులు ప్లాస్టిక్ గ్లాసులతో
నీళ్ళు తాగుతున్నారు.

మోదుగాకు విస్తరాకుల బదులు.. బద్ధకించి రెడీమేడ్ ప్లాస్టిక్ ప్లేట్లు 
గొప్పతనంగా ఇళ్ళకి  తెచ్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆ పల్లెటూరి గాలిలో
ఎవరికీ తెలియకుండా
నగరపు యంత్రభూతాలు..
ఇంటింటికీ జేరిపోయాయి..

చాకలితో పని లేదు...వాషింగ్ మెషీన్ ఉన్నది.
కుమ్మరితో పని లేదు...ఫ్రిజ్ ఉన్నది.
మంగలితో పనిలేదు...షేవర్లు ఉన్నాయి.

దొడ్లో విశాలంగా పెరగాల్సిన మొక్కలని కూడా
చాకిరీ ఎవడు చెయ్యాలని...
కుండీలల్లోకి మార్చేసి..
వారానికోసారి చావకుండా నీళ్ళు పడుతున్నారు.

ఇంట్లో బర్రె పాలని ..
డైరీ ఫాం లకు పోసి..
అంతా బలం కోసం
రోజుకో బీ.కాంప్లెక్స్ గొలీలని మింగుతున్నారు.

మొగాళ్ళంతా బెల్టు షాపుల్లో ..ఖాతాలుపెట్టి...
క్వార్టర్లు తాగుతుంటే...
తెల్లకార్డు... వాళ్ళ ఆరోగ్యాలకి జవాబుదారీగా మారిపోయింది.

ఇప్పుడు ఆ పల్లె.‌. నేల నిండా ఏదో విషాదం దాక్కోని ఉన్నది.
చెట్ల ఆకులక్కూడ ఏదో గుర్తించలేని
మాయదారి రోగం పీక్కు తింటున్నట్లు
బ్రతకలేక బ్రతుకుతున్నాయి .

కంది చేను ..శెనగ చేను..
వరి చేను..జొన్న చేను..
అన్నీ ..రైతుల కన్నీళ్ళతో పండుతున్నట్లు ధాన్యంలో అంతా తాలు గింజలే .

ఎటు చూసినా దిక్కుతెలియని స్తబ్దత...
ఎటు చూసినా అంతు తెలియని విష సాంద్రత.‌..
ఎటు చూసినా అర్ధం కాని  ఆమ్ల  క్షారత...

విత్తనాల్లో ఉండాల్సిన
మాతృబిందువు కూడా ఎక్కడా.. ఎవ్వరికీ.. కనిపించకుండా..
మాయం చేస్తూ...ఏదో దుష్ట శక్తి పల్లెటూర్లనన్నీటినీ.. దురాక్రమణ చేసింది.

రచ్చబండ లేదు...
ఊరిపెద్దలంటూ ఎవ్వరూ లేరు...
పెద్దవాళ్ళంతా ..కొత్త తరాలకి
వెర్రివాళ్ళైపోయారు.

ఏవడికి వాడే గాంధీ.‌.
ఏవడికి వాడే సూపర్ హీరో...
అడ్దగోలు దొంగ వ్యాపారాలు చేసినోడు
అడ్డ దారిలో దేవుడయిపోయాడు.
పైకి రావాలంటే అడ్డదారినే రావాలనంటూ
రుజువు చేసిన అతడి దారిలో దేశాన్ని అమ్మటానికి
యువకులంతా సిద్ధమై పోయారు.

ప్రభుత్వ పాఠశాలలన్నీ..
పనిచెయ్యకుండా ప్రభుత్వపు సొమ్ము తినే
పనికి రాని ..మనుషులకు
పనికి ఆహర పథకాలయ్యాయి.

చదువు చెప్పే టీఛర్లు..పిల్లలకు
తాము చదువు చెప్పుతున్నట్లు విపరీతంగా నటిస్తున్నారు.
పిల్లలు తాము చదువు నేర్చుకుంటున్నట్లు
విపరీతంగా నటించేస్తున్నారు.
తమ పిల్లలు  చదువు నేర్చుకుంటున్నట్లు
తల్లిదండ్రులు విపరీతంగా నమ్మేస్తున్నారు.

ఏటు చూసినా అంతా నటనే..
నిజాలు తెలిసినా ఎవరూ నమ్మకుండా.. మాట్లాడకుండా
అందరూ నటించటానికి అలవాటయిపోయారు

పశువుల డాక్టర్ వుద్యొగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
మనుషుల డాక్టర్ కూడా వుద్యోగాన్ని
చేస్తున్నట్టు నటిస్తాడు.
కూలి పనికొచ్చిన వాళ్ళు
కూలి పనిచేస్తున్నట్టు నటించేస్తున్నారు..

పల్లెటూర్లు ఇప్పుడు
అమాయకపు పల్లెటూర్లు కావు..
పల్లెటూర్లన్నీ ఫిల్మ్ ఇన్సిట్యూట్లయ్యాయి
ప్రతిమనిషీ నటన నేర్చుకున్న మహా నటుడే.

పల్లెటూర్లల్లో ఒకప్పుడు 
గ్రామ వ్యక్తిత్వానికి హీరోలు ఉండే వాళ్ళు.
ఇప్పూడు హీరోలు లేరు.
కన్న తల్లి కడుపులో ఉండగానే..
తెలుగు టీవీ సాడిస్ట్ సీరియళ్ళు  చూసి..చూసి..
పళ్ళు పటపట కొరుకుతూ
పుట్టటమే విలన్లుగా పుడుతున్నారు.
మనుషులంతా  తమ అసలు రూపాలను
మర్చిపోయి మారువేషాలనే ..
అసలువేషాలుగా చేసుకోని..
నటన తెలీని వాళ్ళని పిచ్చివాళ్ళని
ప్రచారం చేస్తూ సుఖంగా  బ్రతుకు తున్నారు.

అర్ధరాత్రి దాక వచ్చేనిద్రని ఆపుకుంటూ
టీవీ సీరియల్స్ చూస్తూ మేల్కోవటం అలవాటయిపోయింది.
ఆంతరంగికంగా పీడకలలు కంటూ..
నిద్రని వెతుక్కోవటానికి అలవాటు పడిపోయారు.
బాహ్యశబ్దాలని చర్మేంద్రియాలద్వారా వింటూ
పగటిపూట కోడి నిద్రని అలవాటు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ పంపునీళ్ళొస్తున్నాయని
వీధిబావుల్ని చెత్త చెదారాలు వేసి మరీ
పూడ్చేసుకున్నారు.
ఇప్పుడు ఊరు తగలబడిపోయినా
ఫైరింజన్ రావాల్సిందే..
అందరూ ఏడుస్తూ
నీళ్ళు లేక  కట్టుబట్టలతో నిలబడాల్సిందే.
కరెంటు లేకపోతే
అందరూ వీధి బావుల్ని
పల్లెటూర్లల్లో అప్పటికప్పుడు కొత్తగా తవ్వుకోవాల్సిందే.
ఊరు బాగుండాలని కోరుకునే వాళ్ళెప్పుడో పోయారు..
అందరూ నేను బాగుండాలని కోరుకునే వాళ్ళే...
నన్ను బాగుచేసేదే న్యాయం...
నాకు లాభాన్ని తెచ్చేదే ..ధర్మం .
నాకు డబ్బులోచ్చేలా చేసేదే నీతి.

పల్లెటూర్లల్లో కూడా మనిషి మనుగడకు
అర్ధాలు ..వ్యర్ధాలెప్పుడో అయిపోయాయి.
ప్రభుత్వం దెగ్గిరనించి ఏ పథకం వస్తుందా
ఏంత నొక్కేద్దామా
అని ఆలొచించేవాళ్ళే అందరూ..

పల్లెటూర్లు నాశనమవ్వటానికి
అగ్గి రాజేస్తున్నదెవ్వరు?
బుగ్గి పాలవుతున్నదెవ్వరు?
పల్లెటూర్లు నాశనమవ్వటానికి
మంటలు మండిస్తున్న దెవ్వరు?
మంటల్లో పడి నాశన మవుతున్నదెవ్వరు? 

ఇళ్ళల్లో గడ్డి వాములు లేవు.
ధాన్యాన్ని దాచే కొట్లు కూడా లేవు.
దాన్యాన్ని అటునించి అటే మార్కెట్ కి పంపేసి
స్టొర్ నించి కేజీ రెండు రూపాయల బియ్యాన్ని
తెచ్చుకోని మరీ..పొదుపు చేసినందుకు ఆనంద పడుతున్నారు.
పాడి బర్రెను మేపే ఓపిక లేక... చాలామంది
పొట్లాలపాలు తెచ్చుకోని
టీలు చేసుకుంటున్నారు.

జీవితాల్లో ప్రొడక్టివిటీ ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి
అందరూ టైంపాస్ కోసం టీవీల ముందు కూచోని
ప్రభుత్వం మాకేమీ చేయటల్లేదని
సామూహికంగా ఏడుస్తున్నారు

పల్లెటూర్లల్లో ఒకప్పటి ప్రాకృతిక
హృదయంగత  సంగీతం లేదు.
నిశ్శబ్దంగా వినిపించే ఒక అసాధారణ శబ్ద
సౌందర్యమూ లేదు.
ఒకప్పటి నిశ్శబ్దపు
కవిత్వమూ లేదు.
అనాదిగా కనిపించిన పురాతన
ప్రేమత్వమూ లేదు.

ఊళ్లల్లో బావులు ఎండిపొయాయి
ఊళ్ళల్లో మనుషులు ఎండిపొయారు.
ఊళ్ళల్లో చెరువులూ ఎండిపోయాయి.
పూవులు లేవు..పండ్లూ లేవు.

మనుషులు కేజీల లెక్కన అమ్ముడయి పోతున్నారు.
మనుషులని కేజీల లెక్కన కొంటున్నారు.

తారు రోడ్ల పక్కన పొలాలన్నీ...
రియల్ ఎస్టేట్ దెయ్యాల  వెంచర్లు అవుతున్నాయి.

పల్లెటూరి గుండెల్లోంచి పైకి తన్నుకొచ్చిన
కాంక్రీటు ముళ్ళలా... పొలాలల్లో
ఎటు చూసిన సరిహద్దు రాళ్ళే దర్శనమిస్తున్నాయి.

తరాలు మారకమందే ..
చూస్తూండగానే..
పల్లెటూర్లకు వృద్ధాప్యమొచ్చింది.

మనుషులందరూ బతికుండగానే
ఊరు మాత్రం కళేబరమయిపోయింది

మనుషుల అస్థిత్వం అబద్ధమయిపోయాక
ఊర్లన్నీ ఊసర క్షేత్రాలయ్యాక
ఊర్లన్నీ...అస్థిపంజారాలుగా మిగిలి పోతున్నాయి
మనుషులందరూ ఆదిమానవుల కాలం నాటికి..
పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్నారు..

భవిష్యత్తులో..
పల్లెటూర్లంటే..
కాలిపొయిన పున్నాగ వృక్షాలు..
పాడు పడ్డ రామాలయాలు..
నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు మాత్రమే.......
..........................................................
నా ఈ రాజ్యం లో పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మ లు అనడం మర్చి పోవాలేమో.

Monday, May 21, 2018

పురోహితునికి భార్యవ్వడం భగవత్‌సంకల్పం

పురోహితునికి భార్యవ్వడం భగవత్‌సంకల్పం
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...

" వద్దు మమ్మీ.. ఎన్నిసార్లు చెప్పాలి? ? "
" మళ్ళీ ఆలోచించమ్మా.. అబ్బాయికి ఏ దురలవాట్లూ లేవు.. "
" ఐతే? "
" మంచి కుటుంబం, సొంత ఇల్లు, కళ్ళెదుటే ఉంటారు. సంఘంలో మంచి గౌరవస్థులు.. "
" అబ్బా..ఎన్నిసార్లు చెప్తావ్ అరిగిపోయిన రికార్డులా.. ఆపంచె, నామాలూ..ఉఫ్ఫ్..
" అదికాదమ్మా, మీరిద్దరూ ఈడూజోడూ బావుందని మన సిద్ధాంతిగారు చెప్పారు జాతకాలు చూసి.. "
" ఛ..మీరు మారరా? జాతకాలట జాతకాలు.. "
" అదేంటమ్మా అలా అంటావు? సంబంధం నచ్చకపోతే వదిలేయ్, సంప్రదాయాలను దూషించకు. "
" మీ ఛాదస్తం మీదిలే. న్యూజెర్సీ సంబంధమే ఖాయం చేయండి. ఇదే ఫైనల్. "
" అంతదూరం పంపాలంటే బాధగా ఉందిరా.. "
" నేను బావుండాలా? హ్యాపీగా ఉండాలా? లేదా ఆ పూజారితో పొద్దున్నే మడికట్టుకొని పూజలు చేసుకోవాలా? "
" వద్దులేమ్మా.. నీ ఆనందమే మాక్కావాలి. వాళ్ళతో మాట్లాడమంటా మీ నాన్నని. అనవసరంగా ఆ అబ్బాయిని ఏమనొద్దు. మంచివాడు పాపం. "
" సరే.. ఆపనిలో ఉండండి.  "

... ... ...

" ఏమందండీ మీ అమ్మాయి? ఒప్పుకుందా ఒదినగారూ? "
" లేదు వదినగారూ.. మీ అబ్బాయిని చేసుకోడానికి ససేమిరా అంటోంది "
" అయ్యో మావాడికేమిటమ్మా తక్కువ? " రోజూ ఆలయానికొస్తూంటారు కదా.. ఏవైనా అవలక్షణాలున్నాయా? పైగా వేదం కూడా చదివాడు "
" ఎంతమాట వదినగారూ..మీ అబ్బాయికి పేరుపెట్టడం అంటేనే మహా పాపం.. మాకే అదృష్టం లేదనుకుంటాను. అమెరికాసంబంధమేకావాలట మాదానికి "
" సరేలేమ్మా, పిల్లల మనస్సు నొప్పించకూడదు. కలిసిబ్రతకాల్సింది వాళ్ళు. ఇంక మీ అమ్మాయిని బలవంతపెట్టకండి. "

... ... ...

" ఏమ్మా ఎమయ్యింది ? "
" నువ్వు నచ్చావు, నీ పద్ధతులు నచ్చాయి కానీ నీ వృత్తే నచ్చలేదట.. "
" అర్ధమయ్యినమ్మా. దిగులుపడకు. నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయి చులకనభావన "
" బాధపడకురా. ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను అన్నాడు పేరయ్య "
" మంచి సంబంధం కాదమ్మా, మంచి అమ్మాయి ఐతే చాలు. నీతో కలిసిపోయి ఉండగలిగితే చాలు.

... ... ...

" అన్నీ సర్దుకున్నావా? మళ్ళీ సంవత్సరం దాకా రావాయె. అల్లుడు పెళ్ళవ్వగానే మరుసటిరోజేవెళ్ళిపోయాడు.. పట్టుమని పదిరోజులు కూడా లేడు "
" మమ్మీ, పెద్ద జాబ్. ఊపిరిసలపని పని. ఇదేమైనా గుడి ఊడ్చే పని అనుకున్నావా? శెలవుదొరకడమే పెద్ద విషయం ఆయనకి "
" సర్లేమ్మా.. మళ్ళీ ఆ సంబంధాన్ని దెప్పడం ఎందుకు? ఐనా మంచి పిల్ల వాళ్ళ చుట్టాల్లోనే చూసి చేసేసారు పోయిన వారం. చిలకాగోరువంకల్లాగున్నారు జంట.
" వాటెవర్. క్యాబ్ వచ్చేసింది. ఏడవకు. నేనేమీ జైలుకి పోవట్లేదు. జస్ట్ అమెరికా అంతే. స్కైప్ లో రోజూ మాట్లాడుతూంటాకదా.. వెళ్ళొస్తా మమ్మీ, వెళ్ళొస్తా డాడీ.. "

... ... ...

" ఏమోయ్.. ఏంటి దిగాలుగా ఉన్నావు ? "
" నేనొచ్చి అప్పుడే రెండేళ్ళైపోతోందండీ..సెలవుకు సీరియస్ గా ప్రయత్నించండి.  మా చెల్లాయ్ పెళ్ళ్కి రెండునెలలముందైనా లేకపోతే ఎలా? "
" చూస్తున్నావు కదా.. ఆదివారాలు కూడా వెళ్ళాల్సొస్తోంది. ఉదయం ఆరింటికి బయల్దేరితే ఆరింటికి ఇంటికొస్తున్నాను. తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సెలవు దొరకట్లేదు "
" అదేంటండీ.. ఏడెనిమిది నెలలనుంచీ ఇదే చెప్తున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది. ఇండియా చాలా మిస్సౌతున్నాను. "
" సరేలే. ఒక నెలముందు నువ్వెళ్ళు. సెలవు దొరకకపోతే ఒక వారమైనా ఎమర్జెన్సీ లీవు పెట్టుకొని పెళ్ళికొస్తాను. ఫ్రెష్ అవ్వు, గుడికెళ్దాం. మా బాసు, వాళ్ళావిడా రమ్మన్నారు "
" ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాము. మళ్ళీ దీపావళి వచ్చేసింది. మీ బాసు పుణ్యమా అని ఇన్నాళ్ళకి వెళ్తున్నాం. మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఇంటిపక్కనే గుడి. రోజూ వెళ్ళేవాళ్ళం "
" నువ్వు రెడీ అయ్యి గుడికి పక్కింటావిడతో వచ్చేయ్ ఎప్పటిలా.. నేను పూజా సామాన్లు షాపింగ్ చేసి గుడికి వచ్చేస్తాను. టైం లేదు మళ్ళీ మధ్యలో ఆగి షాపింగ్ చేయడానికి.

... ... ... 

" అరే..ఇతను ఇక్కడున్నాడేంటి ?"
" నీకుతెలా ఆయన? మొన్ననే ఇండియానుంచి తీసుకొచ్చారట, వేదపండితుడట "
" తెలుసు. నాకు ముందర ఇతనితోనే ఇచ్చి చేద్దామనుకున్నారు మావాళ్ళు హ..హ.. మా ఇంటిపక్కన గుడి అని చెప్పాను కదా.. ఈయన అందులోనే పనిచేసేవారు.
" ఎందుకే నవ్వుతావు.. ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావే.. ఆయనకేమి తక్కువ? రెండునెలలకోసారి ఇండియాకి సెలవుమీద వెళ్ళొస్తారు. మనం ఇండియాకెళ్ళడం మాట దేవుడెరుగు. నెలకొకసారైనా ఇల్లుదాటి బయటకెళ్ళలేకపోతున్నాం.
మా ఆయనా మీ ఆయనా సంపాదించేదానికన్నా ఎక్కువ ఈయన జీతం. మనమే కాదు, మీ ఆయన బాసు కూడా ఈయనకాళ్ళమీదే పడతాడు చూడు. ఆ పక్కన విల్లా చూడు. అదే ఈయనకి ఇచ్చిన ఫ్యామిలీ ఎకామొడేషన్. మనలా అగ్గిపెట్టిల్లాంటి గదులుకావు "
" అంటే పూజారి అనీ.. "
" నీ ఖర్మ. పురోహితుణ్ణి చేసుకోవాలంటే నువ్వు కావాలంటే చేసుకోలేవు. పెట్టిపుట్టుండాలి. వచ్చిన లక్కుని వద్దనుకొని బాధపడితే ఏమి లాభం? అదిగో..మీ ఆయనా, మా ఆయనా సామాన్లు తీసుకొస్తున్నారు. పద పద మన భర్తల ప్రమోషన్లకోసం, జీతం పెరగడం కోసం, ఉద్యోగాలు పీక్కుండా ఉండాలనీ వెళ్ళి ఆయనకాళ్ళమీదే పడి ఆశీర్వాదాలు తీసుకోవాలి. 

... ... ... ... ... ... ... ... ...... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...

బ్రాహ్మణస్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి. మీకు మరోజన్మంటూ ఉందో లేదో తెలీదు. ఈజన్మలో అత్యంత పవిత్రమైన, భగవంతుని సేవకుడితో పెళ్ళయ్యే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు. డబ్బూ దస్కం, విదేశాల్లో ఉద్యోగం, ఆస్థీ అంతస్థూ ఇవేమీ శాస్వతంకావు. ఉద్యోగాలు ఉండొచ్చు, ఊడొచ్చు. ఉన్నా అదొకరిదగ్గర పనిచేయడమే ఎంత పెద్ద ఉద్యోగమైనా. అర్చకత్వమంటే భగవంతునికే సేవచేయడం. అలాంటి అర్చకునికి భార్యగా సేవలుచేసుకొనే భాగ్యం పుణ్యవతిలకు దేవుడిచ్చే భాగ్యం, భగవత్‌సంకల్పం. స్నేహితురాళ్ళముందు చులకనౌతామనో లేదా చెప్పుకోవడానికి బావుండదనో లేదా ఏహ్యభావంతోనో అలాంటి సంబంధాలు తిరస్కరించొద్దు. ఎందుకంటే అలా వెటకరించేవాళ్ళందరూ పురోహితుని పాదాలను పట్టుకోవాల్సినవాళ్ళే. కనుక పురోహితుని భార్యగా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకొనే భాగ్యాన్ని కోల్పోవద్దు. 

... ... ... ... ... ... ... ... ...... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...

Thursday, May 17, 2018

కానుక

కానుక
పూజ్యులైన అమ్మానాన్నలకు ప్రదీప్‌ నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం దొరికింది. నేనూ మీ కోడలూ ఇక్కడి ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకు తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం.
ఇట్లు
మీ కుమారుడు
ప్రదీప్‌
క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య, వైదేహీల ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆరు అంకెల జీతంలో ఉన్న కొడుకూ అయిదంకెల జీతంలో ఉన్న కోడలూ
ఉద్యోగాలకు రిజైన్‌ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటీ..? ఇక్కడ... ఈ హైదరాబాద్‌లో అంత జీతం ఎక్కడుందీ? ఎవరిస్తారూ? అయినా చుట్టపుచూపుగా ఇండియాకి రావడమేగానీ, తాము
అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్‌ కచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా! మరి ఈ ఉత్తరం ఏమిటీ? వాడు పనిచేసేచోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు.
‘‘ఏమిటండీ ఇది?’’ భర్తని అడిగింది వైదేహి.
‘‘ఉత్తరం’’ సింపుల్‌గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి మొహంచూసి చిన్నగా నవ్వి ‘‘నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి’’ అన్నాడు.
ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్య
మనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుంవాల్చి అదే ఆలోచనల్లో
ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్‌ తానిచ్చినదాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా? ఒకవేళ చూసినా, వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికీ
దానికీ ఏమన్నా సంబంధం ఉందా?
ఎటూ తేల్చుకోలేకపోతున్నాడాయన. దానిని ప్రదీప్‌కి అందజేసిన రోజు జ్ఞాపకం
వచ్చిందాయనకు. ఆరోజు...
రెండేళ్ళక్రితం తల్లిదండ్రులను చూడటానికి
కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్‌. నెలరోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటిరోజే తిరుగుప్రయాణం. వైదేహి కోడలినీ పిల్లలనూ తీసుకుని తెలిసినవారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రీకొడుకులు మాత్రమే ఉన్నారు.
‘‘బాబూ... దీపూ!’’ గదిలో బ్యాగ్‌ సర్దుకుంటున్న ప్రదీప్‌ తలెత్తిచూశాడు. ఎదురుగా తండ్రి.
‘‘ఏమిటి నాన్నగారూ’’ అన్నాడు ప్రదీప్‌.
తన చేతిలోని ఒక ప్యాకెట్‌ కొడుకుకి అందిస్తూ ‘‘ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు’’ అన్నాడు
సీతారామయ్య.
‘‘ఏమిటిది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్‌.
‘‘అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేనూ మీ అమ్మా మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. ‘మేము లేము’ అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటివరకూ దీన్ని ఓపెన్‌ చేయకు’’ అన్నాడు సీతారామయ్య. కొడుకు మరోమాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలోనుండి ఇవతలకి వచ్చేశాడు.
కొడుకు ‘ఆ ప్యాకెట్‌నుగాని తెరిచి చూశాడా?’ అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకి వచ్చింది. ఆయనకి వచ్చిన సందేహం యధార్థమే... జరిగింది అదే.
ప్రదీప్‌ని గత కొద్దికాలంనుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. స్వంత ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలన్స్‌... జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా, వాటి తాలూకు ఆనందం మనసుని తాకడంలేదు. ఇవేవీకావు, ఇంకా... ఇంకా... ఏదో కావాలని ఆరాటం... ఏమిటది? ఏసీ గదిలో భార్యాపిల్లలు ఒళ్ళెరగకుండా నిద్రపోతున్నా, తనకిమాత్రం కంటిమీద కునుకురాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం
ఉద్యోగంమీద పడుతోంది. అసలు తన అసంతృప్తికి కారణం ఏమిటో తెలిస్తే కదా, పరిష్కారం గురించి ఆలోచించడానికి.
చిన్నప్పటినుండి ప్రదీప్‌ చదువులో ఫస్ట్‌.
ఇంటర్‌లో ర్యాంక్‌ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలని ఎంతో ఉబలాటపడ్డాడు. స్కూల్‌ టీచరైన తండ్రి తనకంత శక్తిలేదంటే
అతి కష్టంమీద ఒప్పించి, తరతరాలనుండి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే
అంకితమైపోయాడు. ఇంజినీరింగ్‌లో కూడా ర్యాంక్‌ రావడం... అతడి మరో చిరకాలవాంఛ- అమెరికాలో ఉద్యోగం... అన్నీ చకచకా జరిగిపోయాయి.
తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి, తన చదువుకోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్‌లోకి వచ్చాడు. ఆరంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్‌
శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగ్‌... తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల... ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు- రమ్య, సిద్ధార్థ... భార్యాభర్తలిద్దరి ఆర్జన... ‘జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను. నాకింక లోటేమీలేదు’ అని భావించిన ప్రదీప్‌లో అసంతృప్తి అదృశ్యరూపంలో వెన్నాడటం మొదలయింది.
ఆరోజు... ఇండియా నుండి వచ్చిన ఇరవైరెండు నెలల తరవాత... అర్ధరాత్రి పన్నెండయ్యింది.
ఎప్పటిలాగానే నిద్రపట్టక బెడ్‌రూంలో పచార్లు చేస్తున్నాడు. భార్యాపిల్లలు ప్రశాంతంగా నిద్ర
పోతున్నారు. బెడ్‌రూం నుండి రీడింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం
విని రిలాక్సవుదామని క్యాసెట్‌ కోసం షెల్ఫ్‌ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్‌ శ్రీనివాస్‌ పాటల క్యాసెట్‌ కన్పించింది. ఆ క్యాసెట్‌ తీస్తుండగా, షెల్ఫ్‌లో కన్పించింది తండ్రిచ్చిన ప్యాకెట్‌.
ఇండియా నుండి వచ్చిన తరవాత ఒకటి రెండుసార్లు ‘ఆ ప్యాకెట్‌ ఓపెన్‌చేసి చూద్దామా?’ అని అనిపించింది. కానీ తండ్రిమీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్‌లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనబడేసరికి మళ్ళీ కుతూహలం మొదలయింది. ప్యాకెట్‌ చేతిలోకి తీసుకున్నాడు. ‘ఒక్కసారి తీసిచూస్తే’ అన్పించింది. కానీ తండ్రి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో ‘భావ్యం కాదు’ అనుకుని తిరిగి షెల్ఫ్‌లో పెట్టేయబోయి ఆగాడు. ‘తప్పేంటీ? ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పినదానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు... అంతేగా’ మనసుకి సంజాయిషీ ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది.
‘నాన్నగారూ! మీ మాటను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి’ అని మనసులోనే అనుకుని సీల్‌ చేసిన ఆ ప్యాకెట్‌ని ఓపెన్‌ చేశాడు. ‘తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది’ అనుకుని ఆశపడ్డ ప్రదీప్‌కి తీవ్ర ఆశాభంగమే
ఎదురైంది. ప్యాకెట్‌లో రెండు సీడీలూ ఒక లెటరూ
ఉన్నాయి. అంతే... నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్‌ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకుని చదవసాగాడు.
‘‘బాబూ, దీపూ! మీ అందరికీ మా ఇద్దరి ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేనూ అమ్మా ఈ లోకంలో ఉండమని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చేముందు ఎటువంటి హెచ్చరికలూ చేయకుండా సడెన్‌గా వచ్చేయవచ్చు. మా మరణవార్త తెలిసిన తరవాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా, ఆఫీసులో సెలవు దొరికి, ఫ్లైట్‌లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్మమే తప్ప, మా భౌతికకాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించేముందు ప్రతీ తల్లికీ తండ్రికీ తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం... ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేంకాదు. కానీ ఆ అవకాశం మాకులేదు. ఎలా..? ఒకసారి టీవీలో ‘మాయాబజార్‌’ సినిమా చూస్తున్నా. ఎప్పుడో యాభై ఏళ్ళనాటి సినిమా. అందులో నటించిన యస్వీఆర్‌, యన్టీఆర్‌, సావిత్రి, రేలంగి... వీళ్ళల్లో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనాకౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికీ మన గుండెలోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించే ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక ఆలోచన స్ఫురించింది. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫొటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు ‘అదిగోరా మీ తాతయ్య... అదిగో మీ నాన్నమ్మ...’ అని చూపిస్తారు. అంతేగా! కానీ మా కంఠస్వరాలు
వినలేరు కదా! ఎప్పుడో ఏళ్ళనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలూ పాటలూ వినగలుగుతున్నప్పుడు, మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం?
నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీముందుంటుంది. అమ్మానాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికీ?
సీడీలు చూడూ...
ఇట్లు
నీ నాన్న’’
విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రదీప్‌ ఉత్తరాన్ని మడిచి, ‘అమ్మ’ అని లేబుల్‌ అంటించిన సీడీ తీసి, డి.వి.డి.ప్లేయర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.
తలలో పూలు, నుదుట రూపాయి కాసంత బొట్టు, పట్టుచీర, చేతులనిండా గాజులు... మూర్తీభవించిన ముత్తైదువ రూపంలో చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ అమ్మ...
‘బాబూ, దీపూ... మీ నాన్నగారు- అబ్బాయితో ఏమన్నా మాట్లాడు’ అన్నారు. ‘ఏం మాట్లాడనురా కన్నా? దీపూకి నా మాటకంటే పాటే ఇష్టం. నా పాటే వినిపిస్తాను’ అన్నాను. ‘మరి నా పాట వింటావా?’ వైదేహి అడుగుతోంది ప్రదీప్‌ని.
అవును... అమ్మ అద్భుతంగా పాడుతుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. రేడియో ఆర్టిస్ట్‌ కూడానూ. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది? అమ్మంత గొప్పగా కాకపోయినా, తనుకూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్శిటీ... పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమస్థానం తనదే. దానికి కారణం అమ్మపెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడీ యాంత్రిక జీవితంలో పడిన తరవాత తనకి సా...పా...సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచనలనుండి తేరుకుని స్క్రీన్‌ వంక చూశాడు.
పూజా మందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన ఆలపిస్తోంది. తరవాత ‘నగుమోము కనలేని’ కీర్తన... అలా వరసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి కీర్తనలు... హాలులో నటరాజ విగ్రహం ముందు కూర్చుని తంబుర మీటుతూ ‘కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ’ అంటూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి, రామదాసు, పురందరదాసు కీర్తనలు... పెరట్లో పూలమొక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన ‘అమ్మదొంగా! నిన్ను చూడకుంటే నాకు బెంగ’ వంటి
లలితగీతాలు పాడుతూ...
సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసిముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్‌కి వూపిరి
పీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు... అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు... అమ్మేగా నేర్పిందీ..? పసితనంలో ఒళ్ళొ కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా... ఎదిగిన తరవాత ఒక గురువులా ఎన్ని పాటలు నేర్పిందీ? ఏవీ ఆ పాటలూ... ఏవీ ఆ మధురానుభూతులూ..? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ... స్నానం చేసినట్టు స్వేదంతో శరీరమంతా తడిసిపోయింది. వణుకుతున్న చేతులతో ‘నాన్న’ అన్న లేబిల్‌ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్‌లోపెట్టి ఆన్‌ చేశాడు. మల్లెపూవులాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
‘‘దీపూ... బాగున్నావురా బాబూ? ‘నాన్న ఏం చెబుతారులే- ధర్మపన్నాలూ నీతిబోధలూ చేసి ఉంటారు’ అనుకుంటున్నావు కదూ. అవన్నీ చెప్పడానికి నేనెవరినిరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతలివారు కోరుకున్నట్లు తానుండలేని మనిషి, ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్లు ఉండాలనుకోవడం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరి సందేశాలూ హితబోధలూ అవసరమా? మరి నీకు ఏం చెప్పాలి? ఆ... లోకంలో సంపదనంతా గుమ్మరించినా కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు. అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాలకంటే మధురమైన నీ బాల్యస్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళముందే కదలాడుతుంటే నీ స్మృతిపథంలో మేం కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులౌతామేమోనన్న చిన్న ఆశ. దీపూ... నీకు గుర్తుందా..?’’ అంటూ సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంగతులు ఒక్కొక్కటీ చెప్పనారంభించాడు...
పదినెలల వయసులో అతి కష్టంమీద లేచినిలబడి అడుగులు వేయడం... తండ్రి ‘ఒకటి, రెండు, మూడు’ అంటూ లెక్కపెట్టడం... నాలుగు అడుగులువేసి పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతూ ఉంటే, తండ్రి వారించడం... అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బాకోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టంమీద లాక్కొచ్చి డబ్బా అందుకోబోతే, మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం నెత్తిమీదగా తలంబ్రాల్లా పడటం... తండ్రి మెడచుట్టూ చేతులువేసి ఉప్పుమూటలా వూగుతూ- వేమన, సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవడం... ఇంటిపని చేసుకుంటూ తల్లి పాడుతూ ఉంటే, వచ్చీరాని మాటలతో వంతపాడాలని ప్రయత్నించడం... రెండోక్లాస్‌ చదువుతున్నప్పుడు రోడ్డుమీద దొరికిన రోల్డ్‌గోల్డ్‌ గుళ్ళగొలుసులో ఒక పూస పట్టుకొచ్చి ‘అమ్మా! నీకోసం బంగారం పట్టుకొచ్చా’ అంటే, తల్లిదండ్రులు పగలబడి నవ్వడం... అదిచూసి బుంగమూతి పెట్టుకుని ‘పో అమ్మా, నీకోసం ఎంతో కష్టపడి తెస్తేనూ...’ అంటున్న ప్రదీప్‌ అమాయకత్వానికి తల్లి అక్కున
చేర్చుకుని ముద్దాడటం... తండ్రి ఒళ్ళొ కూర్చోబెట్టుకుని ‘ల, ళ, ర, ఱ, శ, ష, స’ అక్షరాలు స్పష్టంగా పలికే విధానం నేర్పించడం... నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో చెయ్యి విరక్కొట్టుకుంటే, ‘అసలే డబ్బుకి ఇబ్బందిగా ఉందనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వెయ్యి రూపాయలు ఖర్చు; నాన్న ఎక్కడ్నించి తెస్తారు?’ అని తల్లి మందలిస్తే, ప్రదీప్‌ చిన్నబుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకొచ్చి ‘నాన్నా, అమృతాంజనం రాసుకుని కాపడం పెట్టుకుంటా, అదే తగ్గిపోతుంది. డాక్టరు దగ్గరికి వద్దు’ అని అంటే- తండ్రి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగి
ప్రదీప్‌ని దగ్గరకు తీసుకోవడం... రేపు సెవెన్త్‌క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షలనగా, వీధిలో పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్‌ ఆటని ప్రదీప్‌ చూస్తుండగా, క్రికెట్‌బంతి వచ్చి ప్రదీప్‌ మోకాలిచిప్పకు బలంగా తగిలి, మోకాలు బత్తాయిపండు సైజులో వాచిపోతే, పరీక్షకి వెళ్ళలేనేమోనని ప్రదీప్‌ ఏడుస్తుంటే, తండ్రి రిక్షాలో స్కూల్‌కి తీసుకెళ్ళి, అక్కడినుండి పరీక్ష రాసేగదికి రెండు చేతులతో ఎత్తుకెళ్ళి పరీక్ష రాయించడం...
ఇలా ఒకటేమిటి, సీతారామయ్య ప్రదీప్‌ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటీ వివరించి చెబుతూ ఉంటే, ఒక్కొక్క సంఘటనా, ఒక్కొక్క మిస్సైల్‌లా ప్రదీప్‌ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్‌ ఒక కంటినుండి నయాగరా, మరో కంటినుండి శివసముద్రం జలపాతాలు. కంట్రోలు చేసుకోవడం అతని శక్తికి మించిన పనే అయింది.
ఏమిటా కన్నీళ్ళకి అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? సీడీ మొత్తంలో
తండ్రి ఎక్కడా కూడా ప్రదీప్‌ని మందలించలేదు... విమర్శించలేదు... హితబోధలు చేయలేదు.
మరి ఎందుకీ కన్నీరు? అవి... ఆనందబాష్పాలా? కాదు... యాంత్రికజీవనం, కృత్రిమత్వంతో హృదయంలో నిర్మించిన ఆనకట్ట, మానవ అనుబంధాలనే వరదతాకిడికి బద్దలై, అనురాగం, అభిమానం,
ఆత్మీయతా ఆప్యాయతా వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి గుక్కతిప్పుకోనివ్వకుండా, వూపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది. అక్షరాలకు అందని అనుభూతి అది.
అలా ఎంతసేపు వెక్కివెక్కి ఏడ్చాడో ప్రదీప్‌... చాలాసేపైన తరవాత, కొద్దిగా తేరుకుని, మనసు కంట్రోల్‌ చేసుకోవడానికి ‘గజల్‌ శ్రీనివాస్‌’ పాటల క్యాసెట్‌ టేప్‌రికార్డర్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు.
‘‘ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయ్‌
నా సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయ్‌...’’
టేప్‌లో గజల్‌ శ్రీనివాస్‌ గొంతు మధురంగా విన్పిస్తోంది. ‘ఎంత కోఇన్సిడెన్స్‌... నాన్న చెప్పిన బాల్యం సారాంశం ఒక్క పాటలో కళ్ళముందుంచాడు... పాదాభివందనం శ్రీనివాస్‌’ అనుకుంటున్న ప్రదీప్‌ మెదడులో తటిల్లంటూ మెరిసింది ఒక పెద్దమెరుపు. తనని ఇంతకాలం పీడిస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది.
మానవ సంబంధాల లేమితో తను బాధపడుతున్నాడు... యస్‌... కమ్యూనికేషన్‌ గ్యాప్‌...
ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టూ ఎవరో భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్టూ ఉరుకులు
పరుగులు... కేర్‌టేకర్‌కి పిల్లల్ని అప్పగించి తనో దిక్కుకూ తన భార్యో దిక్కుకూ మారథాన్‌ రన్నింగ్‌. అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరటం, ఏదో తిన్నామన్న పేరుకి అన్నం మెతుకులు కతికి, ఎప్పుడు పక్కమీదకు చేరి విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం... మొక్కుబడి పలకరింపులు...
అతికించుకున్న ప్లాస్టిక్‌ చిరునవ్వులు... తమ ధనవ్యామోహాన్ని కప్పిపుచ్చుకుంటూ ‘ఇదంతా సంతానం ఉజ్వల భవిష్యత్‌ కోసమే’నంటూ ఆత్మవంచన స్టేట్‌మెంట్స్‌... వీకెండ్‌కి అందరూ కలసి ఎక్కడికన్నా వెళ్తే, ఈ ఆరురోజులు కలిసిలేమన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి... తల్లిదండ్రులకూ
పిల్లలకూ మధ్యగానీ భార్యాభర్తల మధ్యగానీ
కరువైపోయిన ఆప్యాయతా ఆత్మీయతా.
తన అసంతృప్తికి కారణం తెలిసిన తరవాత
ప్రదీప్‌కి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ‘ఏ తల్లీతండ్రీ ఇస్తారు తమ సంతానానికి ఇంతటి అపురూపమైన కానుక... పరుషంగా ఒక్కమాట కూడా అనకుండా తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు’ అనుకున్నాడు. సమస్యేమిటో తెలిశాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద
కష్టమేమీకాలేదు.
అప్పటికే తెల్లవారిపోయింది. భార్య లేచిన
తరవాత ‘‘నేనివ్వాళ ఆఫీసుకి సెలవు పెట్టేస్తున్నాను. నువ్వూ సెలవు పెట్టేయ్‌’’ అన్నాడు.
‘‘ఎందుకూ?’’ ఆశ్చర్యంగా అడిగింది మంజుల.
‘‘చెబుతాగా’’ అన్నాడేగానీ వివరాలు చెప్పలేదు. స్నానం, టిఫిన్‌ కానిచ్చి, కొలీగ్‌కి తన సెలవు గురించి చెప్పి, తండ్రిచ్చిన సీడీలూ ఉత్తరం భార్య చేతిలోపెట్టి తాను మంచమెక్కాడు ప్రదీప్‌. పడుకున్న వెంటనే పట్టేసింది నిద్ర. చాలాకాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు లేచాడు. భార్యవంక చూశాడు. మంజుల మొహం బాగా ఏడ్చినట్లు ఉబ్బి కళ్ళు
ఎర్రబారి ఉన్నాయి.
‘‘మనం... మనం... ఇండియా వెళ్ళిపోదామండీ!’’ భోజనం చేస్తున్న ప్రదీప్‌ మీద చెయ్యివేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పేముందు భార్యని మానసికంగా సిద్ధంచేయాలన్న తలంపుతో, సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్‌, తన నిర్ణయమే భార్య నోటివెంట వెలువడేసరికి ఆశ్చర్యంతో తలమునకలవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలూ సంఘటనలూ వేరుకావచ్చు... కానీ అనుభూతి ఒక్కటేగా!
‘‘ఇండియా వెళ్ళిన తరవాత నేను నా పిల్లలకి తల్లిగా, నా భర్తకు భార్యగా ఉండదలచుకున్నాను. ఏటియం మిషన్‌లా కాదు. అందుకే ఉద్యోగం
చేయదలచుకోలేదు’’ అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ.
ఫారిన్‌లో జాబ్‌ చేస్తున్న ప్రదీప్‌కి ఇండియాలో జాబ్‌ రావడం కష్టంకాలేదు. జీతం అక్కడకంటే తక్కువే అయినా భార్యాభర్తలకది బాధ
అనిపించలేదు.
ఇండియా వచ్చాక హైదరాబాద్‌లోనే ఆఫీసుకి దగ్గర్లో ఫ్లాట్‌ తీసుకోవాలనిపించినా, మళ్ళీ వద్దులే అనుకుని, దూరమైనా తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా తమ స్వంత ఇంటినే రీమోడల్‌ చేయించాడు.
ఆరోజు ఆఫీసులో వర్క్‌ త్వరగా పూర్తికావడంతో ప్రదీప్‌ ఇంటికి త్వరగా వచ్చేశాడు. అప్పుడు సాయంత్రం అయిదున్నర అవుతోంది.
అరుగుమీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య పొట్టమీద కూర్చున్న రమ్య, తాతయ్య చెబుతున్న ‘అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను’ పద్యాన్ని వల్లెవేస్తోంది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు
సీతారామయ్య.
తన గదిలోకి వెళ్ళి డ్రెస్‌ మార్చుకుని హాల్‌లోకి వచ్చాడు ప్రదీప్‌. వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడి చేస్తున్నట్లుంది. ఘుమఘుమల వాసన ముక్కుని అదరగొట్టేస్తుంది. హాలులో స్తంభానికి చేరగిలబడి వైదేహి కూర్చొనుంది. ఆమె ఒడిలో
తలపెట్టుకుని సిద్ధార్థ పడుకుని నాన్నమ్మ పాడుతున్న రామదాసుకీర్తన చెవులప్పగించి వింటున్నాడు.
‘‘ఇరవుగ నిసుకలోన బొరలిన యుడుతభక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి
పలుకే బంగారమాయెరా’’
‘ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ గొంతులో శ్రావ్యత అలానే ఉంది’ అనుకుంటూ మెల్లిగావచ్చి తల్లి ఒడిలో రెండోవైపు తలపెట్టి పడుకున్నాడు. పాలసంద్రమైపోయింది మనసు. ఎంత హాయి అమ్మ ఒడి... ఈ సంతృప్తిముందు తాను
అమెరికాలో తొలిసారిగా ఆరంకెల జీతం అందుకున్నప్పటి తృప్తి మేరుపర్వతం ముందు ఇసుక
రేణువులా అన్పించింది. ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతుతో శృతి కలిపాడు.
‘‘ఎంతో వేడిన నీకు సుంతైన దయరాదు
పంతంబుసేయ నేనెంతటి వాడను తండ్రీ
పలుకే బంగారమాయెరా!’’
భర్తకి ప్లేట్‌లో పకోడీలు పట్టుకొచ్చిన మంజుల అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది.

Total Pageviews