మనీ మేనేజ్‌మెంట్:
ఒక పడవలో ఒక కాలు, మరో పడవలో ఇంకో కాలు పెట్టి ఎలా ప్రయాణం చేయలేమో అలాగే డబ్బు సంపాదించటం కోసం మనం కొన్ని అభిరుచుల్నీ, ఆనందాల్నీ వదిలి పెట్టి కృషి పద్ధతులను అలవాటు చేసుకోవలసి ఉంటుంది. దానికి నిర్మాణాత్మక కుతూహలం ఉండాలి. ఇది అయిదు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. పాజిబులిటీ థింకింగ్ (అనుమానం). లేటరల్ థింకింగ్ (అవకాశం). ప్రొ-ఆక్టివ్ థింకింగ్ (నిర్మాణం). పాజిటివ్ థింకింగ్ (నమ్మకం). ప్రాక్టికల్ థింకింగ్ (పరిష్కారం).
1. పాజిబులిటీ థింకింగ్ (అనుమానం): ఒక ప్రశ్న. కేవలం ఒకే ఒక ప్రశ్న.
ఎ) కళ్ళు మిరిమిట్లు గోలిపేటంత ధనవంతుల్లో నేనూ ఒక్కణ్ణి అవకుండా చేస్తున్నదేమిటి? నాకన్నా తక్కువ చదువుకున్నవాళ్లు, తక్కువ డబ్బున్న తల్లిదండ్రులు ఉన్నవాళ్లూ ముందుకి సాగిపోయినప్పుడు నేను ఇలా ఎందుకు ఉండిపోయాను. ఒక లాయరవటానికో, డాక్టరవటానికో చదువు కారణమయితే అయి ఉండవచ్చు. నాకు పెద్ద చదువు లేకపోయి ఉండవచ్చు. కానీ కొందరు రాజకీయ నాయకులకీ, పారిశ్రామికవేత్తలకీ నా అంత చదువు కూడా లేదే. మరి ఏ అర్హత వల్ల అలా తయారవగలిగారు?

2. లేటరల్ థింకింగ్ (అవకాశo): రెండు ప్రశ్నలు. రెండే రెండు ప్రశ్నలు.
ఎ) అవకాశం లేకపోవటాన్ని - అవకాశంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? సరి అయిన మనుష్యుల సహాయం తీసుకుంటేనూ, ఆర్థిక వనరులు సమీకరించుకుంటేనూ, కాలాన్నీ గమ్యాన్నీ నిర్దేశించుకుంటేనూ ఈ అవకాశం నాకు సృష్టింపబడుతుందా?
బి) ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? ఆర్థికంగా ఎంత ఖర్చవుతుంది? కాలం ఎంత ఖర్చవుతుంది? శారీరక, మానసిక శ్రమ ఎంత ఖర్ఛవుతుంది?

3. ప్రొ-ఆక్టివ్ థింకింగ్ (నిర్మాణం): మూడు అంశాలు. కేవలం మూడే మూడు అంశాలు.
ఎ) ఏమీ చేయకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి ప్రారంభిస్తే, ఇప్పటి స్థితికన్నా కొంచెం బాగుపడే అవకాశం ఉన్నదా?
బి) ఒక రూపాయి సంపాదించటానికి నాకు పది నిముషాలు పడుతుందంటే పొద్దున ఒక గంట ముందు పని ప్రారంభించి, ఒక గంట ఆలస్యంగా పనిపూర్తి చేస్తే పన్నెండు రూపాయలు నాకు ఎక్కువ దొరుకుతుందన్నమాట. దీనికోసం రెండు గంటలు ఎక్కువ కష్టపడలేనా?
సి) ఏమీ చేయకుండా కూర్చోవటం కన్నా రూపాయి సంపాదిస్తే సంవత్సరం తిరిగేసరికి వడ్డీతో రూపాయి ఆరు పైసలు అవుతుంది. అలాంటి రూపాయలు పదహారు సంపాదిస్తే, ఆపై కాలుమీద కాలు వేసుక్కూర్చున్నా ఏడాదికి రూపాయి వస్తూనే ఉంటుంది. మొదటి రూపాయి సంపాదించటమే కష్టం. పదహారు రూపాయలు సంపాదించాక ఆ తరువాత ‘ఒక రూపాయి’ కోసం కష్టపడనవసరం లేదు. ఒకసారి ఒక స్థాయికి చేరుకున్న తరువాత జీవితం సుఖవంతం అవుతుంది. ఆ స్థాయికి చేరేవరకూ కష్టపడితే చాలన్న చిన్న సత్యం తెలుసుకుంటే ఎంత సింపుల్ థియరీ ఇది!!

4. పాజిటివ్ థింకింగ్ (నమ్మకo): నాలుగు ప్రశ్నలు. కేవలం నాలుగు ప్రశ్నలతో నమ్మకo కలిగించుకోవచ్చు.
ఎ) అతిబీదస్థితి నుంచి అత్యున్నతస్థితికి వచ్చినవాళ్ళలో ఉన్నదేమిటి? నాలో లేనిదేమిటి?
బి) డబ్బున్నవాళ్ళు అందరూ అనైతికంగా, కబ్జాలు, మాఫియా, లంచాల రూపేణా సంపాదించారనీ, డబ్బు సంపాదించాలంటే నేనూ అదే పని చెయ్యాలన్న దరిద్రపు అభిప్రాయం నుంచి నేనెలా బయటపడగలను?
సి) చిన్న వయసులో నా కన్నా పెద్ద తప్పతడుగులు వేసిన వారిని సమాజం ఆదరిoచింది. చివరకి హత్యలు చేసిన నక్సలైట్లు కూడా ప్రభుత్వసహకారంతో నిలదొక్కుకున్నప్పుడు నేనేవో తప్పులు చేశానని ఎందుకు కుమిలిపోతున్నాను? సరిదిద్దుకుని ఎందుకు ముందుకు సాగలేక పోతున్నాను?
డి) ఈక్షణం నుంచీ నా జీవితాన్ని పునర్నిర్మించుకోవాలoటే ఎదురయ్యే అడ్డంకులేమిటి? గత అనుభవాలని పాఠాలుగా చేసుకుని ‘నాలోని నన్ను’ నేను మరింత నిర్దుష్టంగా తీర్చిదిద్దు కోవాలంటే ఏ పనులు చేయాలి?

5. ప్రాక్టికల్ థింకింగ్ (పరిష్కారo): అయిదు ప్రశ్నలు. పరిష్కారానికి కేవలం అయిదే ప్రశ్నలు.
ఎ) డబ్బు సంపాదన కోసం నాకు మానసికంగా, శారీరకంగా ఏ శక్తులు కావాలి? పరిష్కారం తెలియకపోతే ఈ సమస్యకి చక్కటి పరిష్కారాన్ని నాకు చెప్పగలవారెవరు?
బి) నిజంగా డబ్బు సంపాదన క్లిష్టమయినదేనా? నేను అనవసరంగా ఊహిస్తున్నానా?
సి) ఒకవేళ ఈ సమస్య పరిష్కారమవకపోతే ఎక్కువలో ఎక్కువ ఏం జరుగుతుంది? ఎంత విధ్వంసాన్ని కలుగజేస్తుంది? పూర్తిగా నాశనమయిపోతానా? ఒకవేళ నాశనమయిపోతే చివరికి ఎక్కడ తేలతాను? జీరో బేస్డ్ స్థాయినుంచి జీవితాన్నిపునర్నిర్మిoచుకోలేనా?
డి) అక్కడి నుంచి నేను మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితికి రావటానికి ఎంత కష్టపడాలి?
ఇ) నేను పూర్తిగా సర్వనాశనమయిపోయి ఆత్మహత్య చేసుకుంటే జీవితం అసలుండదు కదా! బ్రతికుంటే కనీసం ఊపిరి తీసుకునే శక్తి ఉంటుంది కదా! ఆ శక్తిని నేను క్రమక్రమంగా ఎలా విశ్వవ్యాప్తం చేయగలను?

నిర్మాణాత్మకమైన కుతూహలం అంటే ఇదే. ఇలాంటి కుతూహలంతో ఈ రోజే పని ప్రారంభించండి. పది సంవత్సరాలు తిరిగేసరికల్లా అంత డబ్బుని ఎలా మేనెజ్ చెయ్యాలో తెలియని స్థితికొచ్చేస్తారు. నేను గొప్ప ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట ఇది. కష్టమూ, సుఖమూ సవతులు. రెంటినీ సరిగా చూసుకోలేని మనిషికి సుఖం లభించదు. కలిమిలేముల విషయంలో కూడా అంతే.
FROM: Five steps to success.
FROM: Five steps to success.
No comments:
Post a Comment