పురోహితునికి భార్యవ్వడం భగవత్‌సంకల్పం
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
" వద్దు మమ్మీ.. ఎన్నిసార్లు చెప్పాలి? ? "
" మళ్ళీ ఆలోచించమ్మా.. అబ్బాయికి ఏ దురలవాట్లూ లేవు.. "
" ఐతే? "
" మంచి కుటుంబం, సొంత ఇల్లు, కళ్ళెదుటే ఉంటారు. సంఘంలో మంచి గౌరవస్థులు.. "
" అబ్బా..ఎన్నిసార్లు చెప్తావ్ అరిగిపోయిన రికార్డులా.. ఆపంచె, నామాలూ..ఉఫ్ఫ్..
" అదికాదమ్మా, మీరిద్దరూ ఈడూజోడూ బావుందని మన సిద్ధాంతిగారు చెప్పారు జాతకాలు చూసి.. "
" ఛ..మీరు మారరా? జాతకాలట జాతకాలు.. "
" అదేంటమ్మా అలా అంటావు? సంబంధం నచ్చకపోతే వదిలేయ్, సంప్రదాయాలను దూషించకు. "
" మీ ఛాదస్తం మీదిలే. న్యూజెర్సీ సంబంధమే ఖాయం చేయండి. ఇదే ఫైనల్. "
" అంతదూరం పంపాలంటే బాధగా ఉందిరా.. "
" నేను బావుండాలా? హ్యాపీగా ఉండాలా? లేదా ఆ పూజారితో పొద్దున్నే మడికట్టుకొని పూజలు చేసుకోవాలా? "
" వద్దులేమ్మా.. నీ ఆనందమే మాక్కావాలి. వాళ్ళతో మాట్లాడమంటా మీ నాన్నని. అనవసరంగా ఆ అబ్బాయిని ఏమనొద్దు. మంచివాడు పాపం. "
" సరే.. ఆపనిలో ఉండండి. "
... ... ...
" ఏమందండీ మీ అమ్మాయి? ఒప్పుకుందా ఒదినగారూ? "
" లేదు వదినగారూ.. మీ అబ్బాయిని చేసుకోడానికి ససేమిరా అంటోంది "
" అయ్యో మావాడికేమిటమ్మా తక్కువ? " రోజూ ఆలయానికొస్తూంటారు కదా.. ఏవైనా అవలక్షణాలున్నాయా? పైగా వేదం కూడా చదివాడు "
" ఎంతమాట వదినగారూ..మీ అబ్బాయికి పేరుపెట్టడం అంటేనే మహా పాపం.. మాకే అదృష్టం లేదనుకుంటాను. అమెరికాసంబంధమేకావాలట మాదానికి "
" సరేలేమ్మా, పిల్లల మనస్సు నొప్పించకూడదు. కలిసిబ్రతకాల్సింది వాళ్ళు. ఇంక మీ అమ్మాయిని బలవంతపెట్టకండి. "
... ... ...
" ఏమ్మా ఎమయ్యింది ? "
" నువ్వు నచ్చావు, నీ పద్ధతులు నచ్చాయి కానీ నీ వృత్తే నచ్చలేదట.. "
" అర్ధమయ్యినమ్మా. దిగులుపడకు. నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయి చులకనభావన "
" బాధపడకురా. ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తాను అన్నాడు పేరయ్య "
" మంచి సంబంధం కాదమ్మా, మంచి అమ్మాయి ఐతే చాలు. నీతో కలిసిపోయి ఉండగలిగితే చాలు.
... ... ...
" అన్నీ సర్దుకున్నావా? మళ్ళీ సంవత్సరం దాకా రావాయె. అల్లుడు పెళ్ళవ్వగానే మరుసటిరోజేవెళ్ళిపోయాడు.. పట్టుమని పదిరోజులు కూడా లేడు "
" మమ్మీ, పెద్ద జాబ్. ఊపిరిసలపని పని. ఇదేమైనా గుడి ఊడ్చే పని అనుకున్నావా? శెలవుదొరకడమే పెద్ద విషయం ఆయనకి "
" సర్లేమ్మా.. మళ్ళీ ఆ సంబంధాన్ని దెప్పడం ఎందుకు? ఐనా మంచి పిల్ల వాళ్ళ చుట్టాల్లోనే చూసి చేసేసారు పోయిన వారం. చిలకాగోరువంకల్లాగున్నారు జంట.
" వాటెవర్. క్యాబ్ వచ్చేసింది. ఏడవకు. నేనేమీ జైలుకి పోవట్లేదు. జస్ట్ అమెరికా అంతే. స్కైప్ లో రోజూ మాట్లాడుతూంటాకదా.. వెళ్ళొస్తా మమ్మీ, వెళ్ళొస్తా డాడీ.. "
... ... ...
" ఏమోయ్.. ఏంటి దిగాలుగా ఉన్నావు ? "
" నేనొచ్చి అప్పుడే రెండేళ్ళైపోతోందండీ..సెలవుకు సీరియస్ గా ప్రయత్నించండి. మా చెల్లాయ్ పెళ్ళ్కి రెండునెలలముందైనా లేకపోతే ఎలా? "
" చూస్తున్నావు కదా.. ఆదివారాలు కూడా వెళ్ళాల్సొస్తోంది. ఉదయం ఆరింటికి బయల్దేరితే ఆరింటికి ఇంటికొస్తున్నాను. తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సెలవు దొరకట్లేదు "
" అదేంటండీ.. ఏడెనిమిది నెలలనుంచీ ఇదే చెప్తున్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతోంది. ఇండియా చాలా మిస్సౌతున్నాను. "
" సరేలే. ఒక నెలముందు నువ్వెళ్ళు. సెలవు దొరకకపోతే ఒక వారమైనా ఎమర్జెన్సీ లీవు పెట్టుకొని పెళ్ళికొస్తాను. ఫ్రెష్ అవ్వు, గుడికెళ్దాం. మా బాసు, వాళ్ళావిడా రమ్మన్నారు "
" ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళాము. మళ్ళీ దీపావళి వచ్చేసింది. మీ బాసు పుణ్యమా అని ఇన్నాళ్ళకి వెళ్తున్నాం. మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఇంటిపక్కనే గుడి. రోజూ వెళ్ళేవాళ్ళం "
" నువ్వు రెడీ అయ్యి గుడికి పక్కింటావిడతో వచ్చేయ్ ఎప్పటిలా.. నేను పూజా సామాన్లు షాపింగ్ చేసి గుడికి వచ్చేస్తాను. టైం లేదు మళ్ళీ మధ్యలో ఆగి షాపింగ్ చేయడానికి.
... ... ...
" అరే..ఇతను ఇక్కడున్నాడేంటి ?"
" నీకుతెలా ఆయన? మొన్ననే ఇండియానుంచి తీసుకొచ్చారట, వేదపండితుడట "
" తెలుసు. నాకు ముందర ఇతనితోనే ఇచ్చి చేద్దామనుకున్నారు మావాళ్ళు హ..హ.. మా ఇంటిపక్కన గుడి అని చెప్పాను కదా.. ఈయన అందులోనే పనిచేసేవారు.
" ఎందుకే నవ్వుతావు.. ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నావే.. ఆయనకేమి తక్కువ? రెండునెలలకోసారి ఇండియాకి సెలవుమీద వెళ్ళొస్తారు. మనం ఇండియాకెళ్ళడం మాట దేవుడెరుగు. నెలకొకసారైనా ఇల్లుదాటి బయటకెళ్ళలేకపోతున్నాం.
మా ఆయనా మీ ఆయనా సంపాదించేదానికన్నా ఎక్కువ ఈయన జీతం. మనమే కాదు, మీ ఆయన బాసు కూడా ఈయనకాళ్ళమీదే పడతాడు చూడు. ఆ పక్కన విల్లా చూడు. అదే ఈయనకి ఇచ్చిన ఫ్యామిలీ ఎకామొడేషన్. మనలా అగ్గిపెట్టిల్లాంటి గదులుకావు "
" అంటే పూజారి అనీ.. "
" నీ ఖర్మ. పురోహితుణ్ణి చేసుకోవాలంటే నువ్వు కావాలంటే చేసుకోలేవు. పెట్టిపుట్టుండాలి. వచ్చిన లక్కుని వద్దనుకొని బాధపడితే ఏమి లాభం? అదిగో..మీ ఆయనా, మా ఆయనా సామాన్లు తీసుకొస్తున్నారు. పద పద మన భర్తల ప్రమోషన్లకోసం, జీతం పెరగడం కోసం, ఉద్యోగాలు పీక్కుండా ఉండాలనీ వెళ్ళి ఆయనకాళ్ళమీదే పడి ఆశీర్వాదాలు తీసుకోవాలి.
... ... ... ... ... ... ... ... ...... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
బ్రాహ్మణస్త్రీమూర్తులారా, అర్చకుల్నీ, వారివృత్తినీ చిన్నచూపు చూసి వారితో సంబంధాలను తిరస్కరించేముందు మరోసారి ఆలోచించండి. మీకు మరోజన్మంటూ ఉందో లేదో తెలీదు. ఈజన్మలో అత్యంత పవిత్రమైన, భగవంతుని సేవకుడితో పెళ్ళయ్యే అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దు. డబ్బూ దస్కం, విదేశాల్లో ఉద్యోగం, ఆస్థీ అంతస్థూ ఇవేమీ శాస్వతంకావు. ఉద్యోగాలు ఉండొచ్చు, ఊడొచ్చు. ఉన్నా అదొకరిదగ్గర పనిచేయడమే ఎంత పెద్ద ఉద్యోగమైనా. అర్చకత్వమంటే భగవంతునికే సేవచేయడం. అలాంటి అర్చకునికి భార్యగా సేవలుచేసుకొనే భాగ్యం పుణ్యవతిలకు దేవుడిచ్చే భాగ్యం, భగవత్‌సంకల్పం. స్నేహితురాళ్ళముందు చులకనౌతామనో లేదా చెప్పుకోవడానికి బావుండదనో లేదా ఏహ్యభావంతోనో అలాంటి సంబంధాలు తిరస్కరించొద్దు. ఎందుకంటే అలా వెటకరించేవాళ్ళందరూ పురోహితుని పాదాలను పట్టుకోవాల్సినవాళ్ళే. కనుక పురోహితుని భార్యగా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకొనే భాగ్యాన్ని కోల్పోవద్దు.

No comments:
Post a Comment