Wednesday, August 31, 2016

వినాయక చవితి 21 రకాల పత్రాలు ---- వాటిలో గల మూలికలు.
నిన్న 7 రకాల పత్రులు గురించి తెలుసుకున్నాం మరి
మరికొన్ని రకాల పాత్రుల గురించి తెలుసుకుందామా!!
8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా,
తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.
కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మరోగాలను నయం చేస్తుంది. తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుంది. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు.
కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు.
9) చూత పత్రం : మామిడి ఆకులను చూత పత్రం అని సంస్కృత బాషలో అంటారు. మామిడి మంగళకరమైనది.
లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడీచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.
10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.
11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకబాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.
12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అధుపులో ఉంచుతుంది. దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.
దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేచ్సితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దేని ఆకులకు నూనె రాసు వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.
13) దేవదారు : ఇది వనములలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండిల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.
పోలాల అమావాస్య
                                   లేదా
                            పోలాంబ వ్రతం.


 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు

 తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు

అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం
నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను ( కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకుంటారు.)అక్కడ వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను( ఆనవాయితీ ప్రకారం కొంతమందికి 4 తోరాలు వుండవు 2 తోరాలే ఉంటాయి.) అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి,

 ఆతర్వాతఆకందమొక్కలోకిమంగళగౌరీదేవినిగానీ,సంతానలక్ష్మీదేవినిగానీఆవాహనచేసి,షోడశోపచారాలతోఅర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు   ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక

 తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో
 కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు.  ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ  పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. వీటినే పొట్టిక్క బుట్టలు అని అంటారు.  ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాలో చేస్తాము.

 కొన్ని ప్రాంతాలలో ఇదే రోజున పితృదేవతలను పూజించడం,వాళ్లకి తర్పణాలు వదలడం ... పిండ ప్రదానాలు చేయడం  చేస్తూఉంటారు.  ఆవులను ఎద్దులను పూజించడం  కుడా చేస్తారు. దానికి కారణం ఒకానొకప్పుడు నందీశ్వరుడి సేవకు మెచ్చిన పరమశివుడు, ఆవులను ... ఎద్దులను శ్రావణ బహుళ అమావాస్య రోజున పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆవులను ... ఎద్దులను పూజిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎంతో కష్టం చేసే ఎద్దులకు ఈ రోజున పూర్తి విశ్రాంతిని కల్పిస్తారు.
మన అందరిపైనా ఆ అమ్మ ఆశీర్వాదములు సదా ఉండాలని కోరుకొంటున్నాను.




వేదాంత వీధులలో విహరించు గిరిధారి

శ్రీ వినాయక భజనలు

Tuesday, August 30, 2016

మా బ్లాగ్ విజయోత్సాహం!!. 24 దేశాల1,08,643 మంది

మా బ్లాగ్ విజయోత్సాహం!!. 24 దేశాలకు చెందిన 1,08,643 మంది మా బ్లాగ్ వీక్షకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనములు …. ఇదిగో చూడండి ఈ రోజు  2 సంవత్సరాల, రెండు నెలలు పూర్తిచేసుకుంది. 2014 జూన్ నెలలో 30 వ తేదీ, సోమవారం నాడు ' విస్సా ఫౌండేషన్' బ్లాగ్ తెరిచాము మా బ్లాగ్ విజయోత్సాహం!! ఇదిగో చూడండి. ఈ రోజు  2 సంవత్సరాల, రెండు నెలలు పూర్తిచేసుకుంది. 24 దేశాలకు చెందిన 1,08,643 మంది వీక్షకులు ( యునైటెడ్ స్టేట్స్ 81,985 మందితో మొదటి స్థానంలో, ఇండియా 19,601 మందితో రెండవ స్థానం లో ఆ తరువాత వరుసలో రష్యా (2793), పోర్చుగల్(1814), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(325), సౌత్ కొరియా(320) కువాయిట్ (213) యునైటెడ్ కింగ్ డం (206), ఆస్ట్రేలియా (149),  ఫ్రాన్స్(144), సింగపూర్ (48), సౌదీ అరేబియా (43),  ఐర్లాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, మారిషస్, యుక్రెయిన్, వియత్నాం, బొలివియా, ఒమన్, స్పెయిన్, కెనడా, చైనా, పోలాండ్, బహరేన్ దేశాల్లో ఇంతమంది  మా ' విస్సా ఫౌండేషన్ బ్లాగ్' సందర్శించడం ఒక పక్క మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది...మరోపక్క మా వీక్షకుల అబిమానం నిలుపుకోనేలా, వారి ఆకాంక్షలు, అంచనాలకు తగినట్లు రూపెందించేలా మా బ్లాగ్ ను నిర్వహించే భాద్యతను మరింత పెంచుతోంది. ఈ శుభ సందర్భంలో వీక్షకులందరికీ మా హృదయ పూర్వక శుభాభివందనాలు!! భాష సంస్కృతి సంప్రదాయాల పునరుజ్జీవనానికి నాంది, పునర్వికాసానికి పునాది...అనే నినాదంతో ఏర్పడిన మా విస్సా ఫౌండేషన్ గురించి మరింత తెలుసుకోవాలంటే లంకె మీద నొక్కండి, https://vissafoundation.blogspot.com మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా బ్లాగ్ ను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా సహకరించమని విశ్వవ్యాప్త వీక్షకులకు మా వినమ్ర విన్నపం!!.... ఆనందోత్సవ శుభవేళ...మా విస్సా ఫౌండేషన్ 'యు ట్యూబ్ లో' 63 వీడియో లను వీక్షకుల ఆనందం కోసం ఉంచడం జరిగింది. లంకె మీద నొక్కండి.https://www.youtube.com/channel/UCqz6Qi6b8UuK-hiIs-6np_Q
అలాగే మా పినపళ్ళ గ్రామ విశేషాలు, తెలుగు వికీపీడియా లో లంకె మీద నొక్కండి.https://te.wikipedia.org/…/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8%E0%B…
మా విస్సా ఫౌండేషన్ గురించి, తెలుగు వికీపీడియా లో లంకె మీద నొక్కండి. 
https://te.wikipedia.org/…/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B8%E0%B… 
ఇంకా టోరీ ఇంటర్నేషనల్ రేడియో లో, రేడియో కేక లో మా విస్సా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల ప్రసారాలు కూడా యు ట్యూబ్ లో వినవచ్చు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపి మా విశ్వవ్యాప్త విస్సా పీఠం కార్యక్రమాలను మరింత సర్వజన మనోరంజకంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడ వలసిందిగా మా వినమ్ర

విన్నపం! .....ధన్యవాదములతో. సత్యసాయి - విస్సా ఫౌండేషన్.
నిన్న పోలాలఅమావాస్య పూజకి సంబంధించిన విషయాలు 

తెలుసుకున్నాం కదా....కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

వ్రత కథ.

ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములుండేవారు. వారికి పెళ్లిళ్లయి భార్యలు కాపురానికి వచ్చారు. చాలామంది పిల్లలతో వారంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. కొంతకాలానికి ఆ ఏడుగురు తోడికోడళ్లూ పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు. కానీ అదేరోజు చివరి కోడలి బిడ్డ మరణించడంతో నోచుకోలేకపోయారు. ఆ విధంగా వారు ఆరేళ్లు నోము నోచుకునే ప్రయత్నాలు చేయటం, చివరి కోడలి బిడ్డ మరణించటమూ జరిగాయి. మిగిలిన ఆరుగురూ ఏడవ ఆమెను దుమ్మెత్తి పోయటం జరుగుతున్నది. అదేవిదంగా  ఏడవ ఏడాది కూడా అందరూ నోము నోచుకొనుటకు అన్ని ప్రయత్నములు చేసుకొన్నారు. పూర్వమువలె ఆఖరి ఆమె బిడ్డ మరణించేను.  అలాగే జరగటంతో చివరికి ఆమె భయపడి, తనని అందరూ తిట్టిపోయుదురని బయపడి  మరణించిన బిడ్డను  గదిలోపెట్టి తాళంవేసి, తక్కినవారితో కలసి నోము నోచుకున్నది వేడుక ముగిసి ఇంటికి తిరిగివచ్చి చివరి కోడలు, తన బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఏడుస్తూ ఊరి చివరికి వెళ్ళి అక్కడున్న పోలేరమ్మ గుడి దగ్గర శవాన్ని పడుకోబెట్టి ఏడవసాగింది.అంతలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి " ఎందుకేడుస్తున్నావు" అని అడిగెను. అందుకామె " అమ్మా! ఏడవక ఏమి చేయమంటావు? ఏడేళ్ళ నుంచి ఏడాది కొకరి  చొప్పున  ఈ పోలేరమ్మకు అప్పగిస్తున్నాను. ఈ  బిడ్డ నేటి ఉదయమే చనిపోయెను. కానీ ప్రతి ఏడు నా పిల్లలు చనిపోవుట.. నోము ఆగిపోవుట   నా తోడి కోడళ్ళు  నన్నుతిట్టుట జరుగుతుండడంతో ఈ ఏడు వారి నోము ఆపుట ఇష్టంలేక చచ్చిన బిడ్డను ఇంటిలో దాచి ,  వారితో కలసి నోమునోచుకొని  ఇప్పుడు శవమును తీసుకుని ఇక్కడకి వచ్చాను "  అన్నది. ఆమాటలను విని పోలేరమ్మ జాలి కలిగి ఆమెకు అక్షింతలను ఇచ్చి, వాటిని ఆమె బిడ్డలను పూడ్చిన చోట జల్లి.. పేర్లతో చచ్చినవారిని పిలువమని చెప్పి వెళ్ళిపోయెను. ఆమె అమ్మవారు చెప్పినట్లు తనపిల్లలను పాతిన గోతులు మీద అక్షతలను చల్లి , చచ్చినవారిని పేర్లతో పిలువగా ఆ పిల్లలందరూ సజీవులై బయటకి వచ్చిరి. అంట ఆమె సంతోషించి ఆ ఏడుగురు పిల్లలను వెంటపెట్టుకొని ఇంటికి వెళ్ళెను. తెల్లవారేసరికి ఆమె తోడికోడళ్ళు, ఊరిలోనివారు ఆ పిల్లలని చూసి " వీళ్ళు ఎక్కడనుండి వచ్చిరి ? " అని అడుగగా ఏడవకోడలు గతరాత్రి జరిగిన విశేషములను చెప్పెను. ఆమె చెప్పిన మాటలకు అందరూ ఎంతో ఆశ్చర్యపడి  ప్రతి సంవత్సరము " పోలాల అమావాస్య " నోమును  నోచుకొనుచు సుఖసంతోషాలతో ఉండిరి.

కథ చదివినవాళ్ళు, విన్నవాళ్ళు అమ్మవారికి ఈ క్రింది విధంగా దణ్ణం పెట్టుకుని 

"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు మల,మూత్రాలతో  అలుకు", అంటారు.వినడానికి కొం వింతగావుంటుంది.కాని  అదివారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగాకనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

దీనికి ఉద్యాపన ఏమీ లేదు. ఇది అందరూ చేసుకోవచ్చు. ఈ " పోలాల అమావాస్య " నోమును నోచుకొనుట వలన సంతానంలేనివారికి సంతానం కలుగును. సంతానం ఉన్నవారికి కడుపుచలువ కలుగుతుంది.

కనుక మాతృత్త్వాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన, సౌభాగ్యాలు పొందాలి.
రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.
రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!

ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..
" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.
"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.
" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.
చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.
ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."
"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.

ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.

కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....

ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....

ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...
" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.
ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.
ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.
అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...
"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.
మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.
కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."
...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.
ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది...........

వికలాంగులను కించపరచవద్దు...గౌరవించి సహాయపడదాము.

పొట్టిక్క బుట్టలు

పొట్టిక్క బుట్టలు, వీటినే "కొట్టెక్క బుట్టలు", " పనస బుట్టలు అనికూడా అంటారు.

దీనికి కావలసిన పదార్ధాలు

ఇడ్లీ  పిండి ( ఎలా చెయ్యాలో మీకు నేను చెప్పక్కర్లేదు ఇది అందరికీ తెలిసిందే )

పనస ఆకులు, పుల్లలు,

ఇడ్లీ పాత్ర.

ముందుగా ముందురోజే పనస ఆకులు తెచ్చుకుని శుభ్రం చేసుకుని పుల్లల సాయంతో  బుట్టల్లా కుట్టుకోవాలి. పూజరోజు ఇడ్లీ పిండి ఆ బుట్టలో వేసి ఇడ్లీస్టాండ్ లో పెట్టి ఇడ్లీ లాగే ఆవిరికి ఉడికించాలి....అంతే.............. పొట్టిక్కలు రెడీ!
 ఎ౦త బాగు౦టు౦దో చెప్పలేను....ఇడ్లీలానే కాని పనసఆకు
ప్లేవర్ కలిసి భలే రుచిగా ఉ౦టు౦ది. దీనికి తోడు కొబ్బరిపచ్చడి, అల్లం పచ్చడి మరింత రుచినిస్తాయి.నోరు ఊరుతోంది నాకు మరిమీకు?

01-09-2016 న పోలాలఅమావాస్య

పోలాలఅమావాస్య
 01-09-2016 న పోలాలఅమావాస్య అయ్యింది.
 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకుఅనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను ( కందమొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకుంటారు.) ఈ నోమును నోచుకొనుట వలన సంతానంలేనివారికి సంతానం కలుగును. సంతానం ఉన్నవారికి కడుపుచలువ కలుగుతుంది.  మరి ఈ పూజకి కావలసినవి ఏంటో చూద్దామా!!
మామిడి తోరణం
కందమొక్క లేదా కంద పిలక
పసుపు, కుంకుమ పువ్వులు, అక్షింతలు
 దీపారాధనకు నూనె,కుందులు, వత్తులు
తోరానికి దారం, పువ్వులు, ఆకులు
పళ్ళు, కొబ్బరికాయ
పూర్ణం బూరెలు , గారెలు, తొమ్మిదిరకాలతో కూరలతో చేసిన పులుసు ( దప్పళం )
పొట్టిక్క బుట్టలు,
తమలపాకులు, వక్క, దక్షిణ.
పొట్టిక్క బుట్టల తయారీ దీని తర్వాత పోస్టులో చెపుతాను. చూడండి.

Monday, August 29, 2016

మాతృ పంచకం :-
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.
ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం స్మరించుకొందాం.
ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.1
తాత్పర్యము :-
అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి" అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు.
అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.2
తాత్పర్యము :-
పంటిబిగువున నా ప్రసవ కాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.3
తాత్పర్యము :-
అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను (కడుపునొప్పి) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? నీకు నమస్కారం చేస్తున్నాను.
గురుకులముప సృత్య స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.4
తాత్పర్యము :-
కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను
న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.5
తాత్పర్యము :-
అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ.

Sunday, August 28, 2016

|| మన తెలుగు ||
నన్నయ నేర్పిన నవనీతాక్షారాల భాష తెలుగు
భారతాన్ని భావాత్మకంగా అందించింది తెలుగు
శ్రీనాధుని సీసపద్యాలతో సింగారించింది తెలుగు
శృంగార నైషధంలో రసరమ్యభావాలను అందించింది తెలుగు
పోతన పద్యాలలో పరిమళించింది తెలుగు
భాగవతంలోని కృష్ణలీలకి మురిసింది తెలుగు
కృష్ణదేవరాయని భువనవిజయంలో భాసించింది తెలుగు
ఆముక్తమాల్యదలో మౌక్తికమై మెరిసింది తెలుగు
అల్లసాని అల్లిక జిగిబిగికి వెండితీవెలందించింది తెలుగు
హిమగిరుల అందాలకు రంగులలదినది తెలుగు.
తిమ్మన పలుకులలో పారిజాతాలు కుమ్మరించింది తెలుగు
సత్యభామ అలుకలో కొత్త అందాలు చూపింది తెలుగు
రామకృష్ణుని వికటకవిత్వంలో హాస్యమైనది తెలుగు
పాండురంగని భక్తికి పరశించింది తెలుగు
ధూర్జటి చాటువులలో చరితార్ధమైనది తెలుగు
కన్నప్ప మూఢభక్తికి ముగ్ధమైనది తెలుగు
విశ్వనాథుని వేయిపడగల మణిమయమైనది తెలుగు
కిన్నెరసానిలో వడివడిగా పరుగులు తీసింది తెలుగు.
కల్పవృక్షములో కమనీయమైనది తెలుగు
కృష్ణశాస్త్రి భావగీతమినది తెలుగు
నారాయణుని విశ్వంభరమైనది తెలుగు
అజంతము మన తెలుగు.
అనంతము మన తెలుగు
అక్షయము మనతెలుగు.
విశ్వ భాషలలో...అద్భుతమైనది మనతెలుగు
అన్ని భాషలలో అమరమైనది మన తెలుగు 

ఓం నమః శివాయ .....
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ
ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ
ఢమఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ
ధిమిధిమి తాండవకేళీ లోలాయ ...
ఓం నమశ్శివాయ ...
హర హర మహదేవ శంభో శంకర..


 ఈ రోజు తెలుగు భాషకు ఎనలేని సేవచేసిన గిడుగు వారి జయంతి ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వారు అందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో  సంబరాలు జరుపుకుంటున్న వేళ!  ప్రపంచంలోని తెలుగు బంధు మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు! తెలుగు తల్లి కి  వినమ్ర పూర్వక పాదాభివందనములు!! మన అమ్మభాషా దినోత్సవ శుభాకాంక్షలతో...మన భాషా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుందాం! ఈ దిగువ యూట్యూబ్ లింక్ క్లిక్ చేసి  తెలుగు కవిత విని ఆనందించండి.

https://www.youtube.com/watch…

మణిసాయి  - విస్సా ఫౌండేషన్! 

Wednesday, August 24, 2016

అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.


మిత్రులందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !
మా ఇంటి చిన్ని కృష్ణుడి సందడి చూసి శ్రీ కృష్ణాష్టమి విశేషాలు చదవండి!!
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండుగ అనికూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణజయంతి, శ్రీ జయంతి అనికూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే క్షిష్ణాష్టమిగానూ నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణజయంతిగానూ వ్యవయరించాలని ధర్మశాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి. తిథీ నక్షత్రం కలిసి వచ్చి ఆ రోజు సోమవారం గానీ బుధవారం గానీ అయితే మరీ ప్రసస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తోంది. అట్టి మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలు) లేచి, తలస్నానము చేయాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి.
పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
ఇంకా పూజ సమయంలో బాలకృష్ణా స్తోత్రమ్, శ్రీ కృష్ణ సహస్రనామములు, శ్రీ మద్భావవతములతో శ్రీకృష్ణుడిని
స్తుతించవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడికి నైవేద్యాలు ( పాలు, పెరుగు, వెన్న,మీగడ , అటుకులు, బెల్లం,
కొబ్బరి, శొంటి మొ  .సమర్పించి, దీపారాధన గావించుకుని పూజను ముగించాలి.
ఇంకా కృష్ణష్టామి రోజున ఒంటిపూట భోజనం చేసి, శ్రీ కృష్ణుడికి పూజచేసి, శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.
గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.మాతృహృదయాల్లో మమతను పెంపొందించే పండుగ ఇది. శ్రీ కృష్ణుని బాల్యచేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజా భాజనం చేసే పర్వదినమిది. పాపపుణ్యాల వాసనేలేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి. కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణపాదాలు చిత్రిస్తారు.కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్యక్రీడలయిన ఉట్లమీది పాలు, పెరుగు, వెన్న దొంగిలించుటను అనుకరించే, జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు. గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు చిన్నికృష్ణుడు ఎక్కికూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి ఈ ఉత్సవం. పోన్నపూలంటే ఆ కృష్ణునినికి ఇష్టమని ఆ పూలతో పూజచేస్తారు. దీనినే "పొంనమాను సేవ'' అని అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!!!



అమ్మ పాలు,పెరుగు,వెన్న, మీగడ ఇవన్ని ఎక్కడ దాచేసిందో ఏమో.... వెతుకుతున్నా 





అమ్మో అమ్మవచ్చేస్తోందేమో? చూద్దాం ఒకసారి.. 




                                     హమ్మయ్య! వెన్నదొరికింది ఒక పట్టు పడతాను.

మీరు చూసేసారు కదా..మా అమ్మకి చెప్పకండే నేను వెన్న తింటున్నానని!!  

మరొకసారి  అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

మణిసాయి - విస్సా ఫౌండేషన్. 

Monday, August 22, 2016

పెద్దలమాట చద్దిమూట


ఓం శ్రీమాత్రే నమః

మణిద్వీప వర్ణన : 
మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి.
ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది.
సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు.
పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు.
వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది.ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది.
చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు.
శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.
శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.

Total Pageviews