రక్షించాలనేదే రక్షాబంధన భావం
యేన బద్ధో బలీ రాజ దానవేంద్రో మహాధనః
తేన త్వామి పరిబద్నామి రక్షే మాచల మాచల
మహాబలవంతుడు, రాక్షస రాజైన బలిచక్రవర్తి దేవతల కోరికపై తన శక్తితో విష్ణువును తన బంధించాడు. అంతటి విష్ణుశక్తి గల రక్షను నీకు కడుతున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఓ రక్షాబంధనమా..నీవు మా సోదరున్ని కాపాడు అని పై శ్లోకానికి అర్థం.
రక్ష అన్న పదమే క్రమంగా రాఖీ అయింది. తన సోదరుని క్షేమం కాంక్షించే ప్రతి సోదరి పై శ్లోకాన్ని చదువుతూ పవిత్ర రక్షను అతని మణికట్టుకు ముడి వేస్తుంది. ఈ రక్ష ఏ ఆపద సమయంలోనైనా తన సోదరుడిని రక్షించాలని ఆమె ఆకాంక్ష. సోదరి ప్రేమకు సంకేతంగా ఉండే ఈ సూత్రం సోదరుడికి తన అక్కా లేదా చెల్లెలి విషయంలో బాధ్యతలను గుర్తుచేస్తుంది. సోదరి సుఖసౌభాగ్యాల కోసం అతను ఎలాంటి త్యాగాలు చేయటానికి అవసరమైన ప్రోత్సాహం కల్గిస్తుంది. అయితే నేడు చాలా రకాల రాఖీలు దొరుకుతున్నాయి కానీ నూలుపోగుతో చేసిన రాఖీనే శ్రేయస్కరం అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే అసలు రాఖీపండుగ అంటే కేవలం సోదర సోదరీ ప్రేమ అనుబంధాలకు గుర్తుమాత్రమే కాదు ఈ పండుగ. మనం అనే భావనను ప్రజలందరిలో కల్పించడమే ఈ రాఖీ పండుగ ఉద్దేశం
ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి అస్తిత్వానికి ఆధారం తల్లి. సమాజం మనుగడ సాధించాలంటే మాతృభావన తప్పనిసరి..అలాగే సోదరి భావన కూడా..ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి భావజాలాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజం మనుగడ సాధించటానికి మాతృభూమి ప్రాతిపదిక. ఒక జాతిలోని మాతృభక్తి భావనే ఆ జాతి ఉన్నతికీ, పతనానికీ హేతువు. ఈ భావం జాగృతమై ఉన్న జాతి వైభవ శిఖరాలకు చేరుకొంటుంది. ఈ భావం అడుగంటిన జాతి అథ:పతనం చెందుతుంది. మనదేశ చరిత్రే దీనికి నిదర్శనం. ఉత్థాన పతనాలను రెండింటిని అనేకసార్లు చూసిన జాతి మనది.
మాతృభక్తి అనే భావాన్ని పెంపొందిచండి . వ్యక్తి సమాజంలో ఒక భాగమే, కుటుంబము, గ్రామము, దేశం, విశ్వం,సృష్టి ఈ అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఎలా అంటే వ్యక్తి కుటుంబంలో భాగం,కుటుంబం గ్రామంలో భాగం, గ్రామం దేశంలో దేశం విశ్వంలో ఇలా ఈ విషయాని్న గుర్తించే మన పూర్వీకులు వసుధైక కుటుంబకం అనే భావనను కల్పించారు. అంటే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబంగా వ్యవహరించాలి అని చెప్పారు.
నిత్యజీవితంలో ఎవరికి వారం మన వ్యవహారాలలో చిక్కుకొని నడుస్తున్నప్పుడు ఆశయ విస్మరణ జరగకుండా ఏ విద్యా, విజ్ఞానాల మీద మన ధర్మం,సంస్కృతి సాంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తు చేసేది శ్రావణ పూర్ణిమ. ఆ ధర్మం,సంస్కృతి సాంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు మనందరం పరస్పరం కలయికతో రక్షకులమై నిలబడాలని గుణపాఠం నేర్పించేదే రక్షాబంధన్. ధర్మో రక్షతి రక్షిత:, ధర్మం యొక్క స్వభావం అది. ధర్మరక్షణలోనే మన రక్షణ ఉంది అని చాటి చెప్పే పండుగే రక్షా బంధన్.
సామాజిక సంబంధాలను పటిష్టపరచాలంటే సమాజంలో సామరస్య భావన నిర్మాణం కావాలి. ఆ భావన నిర్మాణం చేయటానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులాల మధ్య సంఘర్షణలు,మతాల మధ్య సంఘర్షణలు అంతరించి మనం అనే భావం దేశంలో నిర్మాణమైనప్పుడు ఈ దేశంలో జాతీయ సమైక్యత నిర్మాణమవుతుంది. ఈ దిశలో ప్రయత్నాలకు ప్రేరణగా శ్రావణ పౌర్ణమి పర్వదినాన మనం నిర్వహించుకొనే పండుగ రక్షాబంధన్.అందుకే నీవు నాకు రక్ష నేను నీకు రక్షా మనిద్దరం కలిసి ఈ దేశానికీ , ధర్మానికీ, సమాజానికీ రక్షా అనే భావనను పెంపొందించేలా సమాజంతో కలిసి ముందుకు సాగుదాం. విశ్వ గురు పీఠం పై భగవాద్వజాన్ని ఎగురవేద్దాం..

No comments:
Post a Comment