Thursday, August 4, 2016

భక్తి తొమ్మిది విధములు.
1) శ్రవణమ్ 2) కీర్తనమ్ 3) స్మరణమ్ 4)పాదసేవనమ్ 5) అర్చనమ్ 6) వందనమ్ 7) దాస్యమ్ 8) సఖ్యమ్ 9) ఆత్మార్పణమ్
భక్తిపుష్పములు ఎమిమిది రకములు:
అహింసా ప్రథమోపుష్పః పుష్పమింద్రియనిగ్రహః
సర్వభూతదయాపుష్పం క్షమాపుష్పం విశేషతః
శాంతిపుష్పం తపఃపుష్పంధ్యానపుష్పంతథైవచ సత్యమష్ఠవిధంపుష్పంవిష్ణోఃప్రీతికరంభవేత్
1) అహింస 2) ఇంద్రియనిగ్రహం 3) సర్వభూతదయ 4) తపస్సు 5) క్షమ 6) శాంతి 7) ధ్యానం 8) సత్యం
అనెడు ఎమిమిది రకముల పుష్పములు భగవంతునికి ప్రీతికరము అయిన పుష్పములు.
శుభంభూయాత్ ప్రియం బ్రూయాత్ ప్రియంచ నానృతం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం ఏతత్ ధర్మసనాతనమ్
సత్యం పలకాలి. ప్రియం పలకాలి. కాని అసత్యం పలక రాదు. కాని సత్యం అప్రియంగా పలకరాదు. దీనినే సనాతన ధర్మము అందురు.
నవవిధ భక్తిమార్గములలో చిత్తశుద్ధితో ఏ మార్గమును ఆచరించినా ఆమార్గము చేర్చేది సచ్చితానంద స్వరూపమైన పరమాత్మనే...

No comments:

Post a Comment

Total Pageviews