స్త్రీ మూర్తులందరికీ శ్రావణ శుభ శుక్రవార శుభాకాంక్షలతో...
"ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్..అన్నారు చిలకమర్తి వారు
అంటే ముద్దుగా నేర్పిస్తే ఆడవాళ్ళు దేన్నయినా నేర్చకోగలరు - అని దీని భావం. మా మరిది గారి అమ్మాయి చి. మహాలక్ష్మి (మహీ) పూజ ఎంత శ్రధ్ధా భక్తులతో చేస్తోందో...
మరి నేడు చదువులు పేరు చెప్పి మన పిల్లలకు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు నేర్పటంలేదు. చదువు ముఖ్యమే కానీ దానితో పాటు మన భారతీయ విలువలు పట్ల చిన్నప్పటి నుంచి చెప్పి, నేర్పి, ఆచరించ చెయ్యడం మన కర్తవ్యం. ఎందుకంటే?
ఇవాళ అమ్మాయిల చెయ్యి ఖరీదైన సెల్ ఫోన్ కు నోచుకుంటోంది కానీ ముఖం మాత్రం రెండు రూపాయిల బొట్టు బిళ్లకు నోచుకోలేక పోతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు టి. వి, సినిమా మాధ్యమాలు కూడా మగ, ఆడా విలన్లకు పెద్ద పెద్ద బొట్లు పెడుతున్నారు పాపం హీరోయిన్లకు మాత్రం ముఖాన బొట్టు, కట్టుకునే బట్ట కూడా కరువవుతోంది. ఇక మనం హక్కుల కోసం పోరాడుతాం కానీ మన భాద్యతలు విస్మరిస్తున్నాం! మంగళహారతి పళ్లెం లో కానుకలు తక్కువ వేశారని సోదరులను నిందిస్తాం! కానీ పట్టుమని పది చరణాల మంగళహారతి పాట నేర్చుకోము, నేర్చుకున్నా పడటానికి నామోషీ... "నా అక్షరాలు వెన్నెల్లో ఆదుకునే అందమైన ఆడపిల్లలు" అన్నారు తిలక్. "స్త్రీ ...స్త్రీత్వం నుండి విడివడి ఆకారంలో పురుషునికి దగ్గరై అతని అనురాగానికి దూరమైపోతోంది" అని గొప్ప గా రాశారు యండమూరి మనం ఎన్ని రంగాలలో రాణించినా! స్త్రీకి మాత్రమే సాధ్యమైన, సహజమైన స్త్రీత్వాన్ని పదికాలాలు కాపాడుకుందాం! "ఒక వ్యక్తిని విద్యావంతుణ్ణి చేస్తే ఒకరినే చేసినట్లు అలా కాకుండా ఒక స్త్రీమూర్తిని విద్యావంతురాలిని చేస్తే ఒక వంశాన్ని చేసినట్లు" అన్న సూక్తిని మనం మన మన భాష, సంస్కృతి, సంప్రదాయాలకు వర్తింపచేసి తర తరాలకు తరలిద్దాం! ఆచారాలు వ్యహారాలు పట్ల అలంకారాలు, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా శ్రధ్ధాభక్తులకు అధిక ప్రాధాన్యత ఇఛ్చి శ్రీ శ్రీ వరలక్ష్మీ మాత సంపూర్ణ అనుగ్రహనికి పాత్రులు కాగలరని మనసారా కోరుకుంటూ శుభాభివందనములతో మీ...... మణి సాయి విస్సా ఫౌండేషన్.

No comments:
Post a Comment