Monday, April 30, 2018

పరీక్ష రిజల్ట్స్

ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే!

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..

వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..

రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు.
ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ..

నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..

కట్ చేస్తే..

ఇప్పుడు...
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..??

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు.. 


ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి..

వృక్షోరక్షతి రక్షితః

చెట్లునాటండీ అంటూ ఇప్పుడు శాస్త్రవేత్తలు గగ్గోలుపెడుతున్నారు. కానీ ఆనాడే మన మహర్షులు ఎంత ముందుజాగ్రత్తతో చెట్లునాటకపోతే నరకానికిపోతావూ అని హెచ్చరించారంటే వృక్షాలకు మన హైందవమిచ్చే విలువేంటో తెలుస్తోంది.

మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు
మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.
శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı
ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు
మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.

వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది.
శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı
మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı
ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.

వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి. గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది. మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి. మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ద్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం. నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.

సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.

నలభై ఏళ్ల వయసులో..
ఉన్నతవిద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలనే సమాజం గమనిస్తుంది.

ఏభై ఏళ్ల వయస్సులో..
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.

అరవై ఏళ్ల వయసులో..
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే. పదవీవిరమణ తర్వాత బంట్రోతుకూడా పలకరించకపోవచ్చు.

డెబ్బై ఏళ్లవయస్సులో..
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే.. కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.

ఎనభైఏళ్ల వయస్సులో..
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు. ఎంత డబ్బున్నా .. స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.

తొంభైఏళ్ల వయస్సులో..
నిద్ర మెలుకువ రెండూ ఒకటే. సూర్యోదయం.. సూర్యాస్తమయం.. రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.

అందంతో వచ్చే మిడిసిపాటు..
ఆస్తులతోవచ్చే అహంకారం..
విద్యాధికతతో గౌరవాన్ని ఆసించటం..
కాలగమనంలో మనకళ్లముందే కనుమరుగయ్యే సత్యాలు.

సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.

అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ..
అనుబంధాలను  పదిలపరుచుకుంటూ..
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం.

🙏

శుభసాయంత్రం

మంచిదైనట్టి తలపుల మర్మమంత
స్నేహితుల కెల్ల తెల్పుట శ్రేయమౌను;
అట్లు కాకుండ మదిలోన నణచి యుంచి
కుమ్మ బెట్టుట జనులకు కూడదెపుడు.

🌻మంచి ఆలోచనలు స్నేహితులతో పంచుకొనుము. అంతే కాని వాటిని మనసునందే అణచి యుంచటం ఎవరికీ కూడదు.🌻

భయము నెరుగని వాడు నిబ్బరము తోడ
జయము పొందును లక్ష్యపు జాడ నెరిగి;
భయము చేతనె సందేహ పడెడి వాడు
నెట్లు ఛేదించు లక్ష్యంపు టెరుక లేక.

🌹భయం తెలియనివాడు ఎంతో ధైర్యంతో లక్ష్యాన్ని ఛేదించి జయం పొందుతాడు. భయంతో సందేహించేవాడు ఏ విధంగాను లక్ష్యం సాధించలేడు.🌹

పెక్కుమంది జనులు భీతులై తమకంత
శక్తి లేదటంచు జాటు చుంద్రు;
ఉన్న శక్తి నైన నుపయోగ పరచని
వారి పైన జాలి పడగనేల?

🌻చాలామంది తమకు, శక్తి లేదని చాటుకొంటారు. ఉన్న శక్తిని ఉపయోగించలేని అట్టివారిపై జాలి పడరాదు.🌻

పెక్కు ఆలోచనల తోడ భీతి చెంది
కుమిలిపోవుచు మదిలోన నమితమైన
చెడ్డ తలపులు చేరంగ చింతపడుచు
వగవ ఫలమేమి, జనులకు దిగులు తప్ప?

🌻అనేకమైన ఆలోచనలతో భయం చెందుతూ మనసులో కుమిలిపోతూ, చెడ్డ ఆలోచనల వల్ల చింతిస్తూ విచారించి ప్రయోజనం లేదు.🌻

పరీక్ష రిజల్ట్స్

ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే!

ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.

ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..

వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.

ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..

రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు.
ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ..   మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ..

నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..

హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.

ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..

ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..

గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..

ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.

ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..

ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..

స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల  పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..

కట్ చేస్తే..

ఇప్పుడు...
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..??

ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!

అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న

ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?

ప్చ్..

చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.

చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..

విద్యార్థులు మాయం అవుతున్నారు..

మిషన్లులా మిగులుతున్నారు.. 


ఈనాటి పరిస్థితులు తప్పక  మారాలి..

Friday, April 27, 2018

మన వస్త్రధారణ ఎప్పుడు ఏవిధంగా ఉండాలి గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ఈ మాటలు చదువుదాం! ఆచరిద్దాం! తరిద్దాం!!

శుభోదయం! శుభోదయం! మన వస్త్రధారణ ఎప్పుడు ఏవిధంగా ఉండాలి గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ఈ మాటలు చదువుదాం! ఆచరిద్దాం! తరిద్దాం!!
సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ . కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది?

కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి. పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు.

వస్త్రధారణ నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. పంచ గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు.

దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు.

ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.

మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. ‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి.

అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు.

అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.

పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది.

అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

Thursday, April 26, 2018

సాహితీ నందనం: యతో భావః తతో రసః

సాహితీ నందనం: యతో భావః తతో రసః: యతో భావః తతో రసః సాహితీమిత్రులారా! రసం ఎలా పుడుతుందంటే ఈ శ్లోకం చూడాల్సిందే ఇది అభినయ దర్పణంలోనిది- యతో హస్త స్తతో దృష్టిః ...

Saturday, April 14, 2018

హైదరాబాద్ నగరం లో గల ఏ శాఖకు , ఏ ప్రాంతానికి , ఏ భాషకు చెందినా బ్రాహ్మణులకు అయినా ప్రమాదము జరిగి యాక్సిడెంట్ ఐనచో ఈ సదుపాయములు లభించును

ఒక ముఖ్య గమనిక :
హైదరాబాద్ నగరం లో గల ఏ శాఖకు , ఏ ప్రాంతానికి , ఏ భాషకు చెందినా బ్రాహ్మణులకు అయినా ప్రమాదము జరిగి యాక్సిడెంట్ ఐనచో ఈ సదుపాయములు లభించును :
1 వెంటనే వెయ్యి రూపాయలు ఇవ్వబడును , తదుపరి వెంటనే బ్రాహ్మణ దాతలకు వివరాలు పంపబడును ..
2. ఎవరు లేరు , ఇంటి పెద్దకు అలా జరిగింది అంటే.. వారికి మూడు నెలలు నిత్యవసర వస్తువులు ఇవ్వబడును
3. హాస్పిటల్ కు భోజనము క్యారియర్ పంపబడును ..
కాని ఇవన్ని నిజంగా ఆర్ధిక బాధలు , ఆదాయం లేని చిరు ఉద్యోగులు, పురోహితులు , అర్చకులు, చిరు వ్యాపారులకు మాత్రమే.
వారు అడ్మిట్ అవ్వడానికి మలక్పేట్ లోని కేజీహెచ్ హాస్పిటల్ లో మంచి సౌకర్యము కూడా కలదు.. కనుక మీకు ప్రమాద సమయంలో సహాయం చెయ్యడానికి భారత బ్రాహ్మణ సంస్థాన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది.
Address.
Brahmana Bhavan ,Beside APR Gardens, Champapet, Hyderabad 500078.
24 Hrs help line... 8978455644 or 8686681516 or send reports to WhatsAPP 9908496399 Giri prasad Sarma
బ్రాహ్మణ కుటుంబాలకు ధైర్యం , బలం ఇవ్వడమే మా లక్ష్యం.
గిరి ప్రసాద్ శర్మ ...

Friday, April 13, 2018

అతిలోక సుందరి శ్రీదేవి


అతిలోక సుందరి క్షితి వీడి నందన
....వని కేగె చూపుల తనుప సురల
వాసంత కోకిల స్వర్గ సీమను పాడ
....వలస పోయెను వీడి వసుధ వనుల
తెర పైన దేవత పరలోక వేదిక
....నలరించ పయనించె నిలను విడచి
కార్తీక దీపమ్ము వర్తిని గోల్పోయి
....దీప్తుల మాసెను తిమిర మంట
వృద్ధయై కుమిలె పదహారేళ్ళ వయసు
వాడె వజ్రాయుధము వీడి వాడి వేడి
శిక్ష అభిమాన తతికి క్షణక్షణమ్ము
బావురనె చిత్రసీమ శ్రీదేవి లేక.

దువ్వూరి వారి దవ్వుల వేణువు

లేత తమలముల రీతి చెన్నొందెడి
........పాదముల్ గనినంత మోదమగును
మోదమ్ము కలిగించు పాదాల చుట్టుక
........వెండి నూపురములు వేడ్క జేయు
వేడ్కను జేసెడి వెండి యందెల పైన
.......పట్టుపావడ సౌరు వన్నె లద్దు
వన్నెల నద్దెడు పట్టుపావడకున్న
.......బంగరు టంచులు భ్రాంతి గొలుపు
భ్రాంతి గొలిపెడి సొగసుల పదిలమైన
యడుగులకు రమ్ము పారాణి నలదుకొమ్ము!
అలరు పారాణి పదముల తెలుగు బిడ్డ!
నర్తనప్రియవై నీవు నాట్యమాడు.

Wednesday, April 11, 2018

పద్య సాహిత్యం

1. కులకాంత తోడ నెప్పుడుఁ
    గలహింపకు వట్టి తప్పు ఘటియింపకుమీ
    కలకంరి౮ కంట కన్నీ
    రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ!   

భార్యతో ఎప్పుడూ తగాదా పడవద్దు. ఆమెపై లేనిపోని నేరాలను ఆరోపించవద్దు. ఉత్తమ ఇల్లాలు కంట నీరు కింద పడిన ఇంటిలో లక్ష్మిదేవి ఉండదు.

2. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
    మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌
   నొప్పించక, తా నొవ్వక,
   తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ.   

 ఏ సమయములో ఏ మాటలాడితే సరిపోవునో ఆలోచించి,దానికి తగినట్టుగా ఇతరులని భాదించకుండా సమయోచితముతో మాట్లాడి వ్యవహారములను పరిష్కరించువాడే వివేకవంతుడు.

3.  చుట్టములు గానివారలు
    చుట్టములము నీకటంచు సొంపుదలర్పన్‌
   నెట్టుకొని యాశ్రయింతురు
   గట్టిగఁ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!   

 ధనం ఎక్కువగా ఉన్నట్లయితే బంధువులు కాని వారు కూడా మేము మీకు బంధువులమే అంటూ పట్టుదలతో గట్టిగా మనల్ని ఆశ్రయించడానికి వస్తారు.

4.   కమలములు నీట బాసిన
      కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌
      తమ తమ నెలవులు దప్పిన
     తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.   

ఏ వస్తువయైనా సరే తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వాటి మద్య స్నేహ భాందవ్యం చక్కగా సాగుతుంది.ఎపుడయితే ఆ స్థానాలు విడిచిపెడతారో తమ మిత్రులే శత్రువులుగా మారతారు.కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసించును.ఎపుడైతే నీటిని విడుచునో అదే సూర్యకాంతికి వాడిపోవును.

5.   అప్పుగొని చేయు విభవము
     ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
     ద ప్పరయని నృపురాజ్యము
    దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ.

అప్పుచేసి చేయు వేడుకయు, ముసలితనమందు పడుచు పెండ్లామును, మూర్ఖుడు చేయు తపమును, తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును - సహింపరానివై, తరువాత చెడును గలిగించును.

6.   అడిగిన జీతం బియ్యని
     మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‍
    వడిగల యెద్దుల గట్టుక
    మడి దున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.

అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుట కన్న చురుకైన యెద్దులను గట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు.

7. అన్ని విషయాలు తెలిసిన యట్టివాడు
   తనకు కొంచెమైన తెలియ దనును గాదె!
   ఏమి యును లేని విస్తరి ఎగిరిపడగ
   అన్ని యున్నట్టి విస్తరి అణగి యుండు

అన్ని విషయాలు తెలిసినవాడు తనకేమీ తెలియదంటాడు. అన్నీ వడ్డించిన విస్తరి అణిగి ఉంటే ఏమీలేని (ఖాళీ) విస్తరి ఎగిరెగిరి పడటం లేదా.

ఆదిశంకరుల మాతృ పంచకం-

మనస్సును  కదిలించే  ఆదిశంకరుల మాతృ పంచకం---------------
కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యా౦బ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.

1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి
    రాజేతి జీవేతి చిరం సుతత్వం
    ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః
    దదామ్యహం తండులమేవ శుష్కం.
తా:--అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం
యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు.

2 .   అంబేతి తాతేతి శివేతి తస్మిన్
       ప్రసూతి కాలే యాదవోచ వుచ్యై :
       కృష్ణేతి గోవింద హరే  ముకుందే
       త్యహో జననై రచితోయమంజలి.

తా:--పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా!
అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.

3 .  అస్తాం తావదియం ప్రసూతి సమయే
      దుర్వార శూలవ్యథా నైరుచ్యం
      తను శోషణం మలమయీ శయ్యాచ
      సంవత్సరీ ఏకస్యాపినగర్భభార భరణ క్లేశస్య
     యస్యాక్షమః దాతుం నిష్కృతి
     మున్నతోసి తనయ:తస్యై జననై నమః

తా:-- అమ్మా! నన్ను కన్న సమయం లో నువ్వు ఎంతటి శూల వ్యథను అనుభవించావో కదా! శరీరం కళను కోల్పోయి శుష్కించి వుంటుంది. మలముతో శయ్య మలినమైనా
ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా!ఎవరూ అలాంటి బాధను భరించలేరు.ఎంత గొప్ప వాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా?నీకు నమస్కారం చేస్తున్నాను

4 .  గురుకులముపసృ త్యస్సప్న కాలేతు దృష్ట్వా
     యతిసముచితవేషం ప్రారుదోత్వముచ్చె:
     గురుకుల మథ సర్వ౦ ప్రారుదత్తే సమక్షం
     సపది  చరణ యోస్తే మాతరస్తు ప్రణామః

తా:--కలలో నేను సన్యాసి వేషం లో కనబడేసరికి బాధపడి, మా గురుకులానికి వచ్చి ఏడ్చావు. ఆ సమయం లో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్ప దానివైన నీ పాదాలకు నమస్కరిస్తుంన్నాను.

5 .    న దత్తం మాతస్తే మరణ సమయే
       తోయమపివా న్యథా నా నో దత్తా మరణ దివసే
      శ్రాద్ధ విధినా న జప్త్యా మాతస్తే మరణ సమయే
      తారకనామ మనురాకాలే సంప్రాప్తే మయి కురు దయాం
      మాతురు తులామ్ 

తా:--అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు
కూడా నేను గొంతులో పొయ్యలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి "స్వధా ను" యివ్వలేదు
 ప్రాణము పోయే సమయము లో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కానీ దయ చూపించుము తల్లీ!

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా

ఈపాట తెలియని తెలుగువారు లేరంటే విచిత్రం కాదు.ఈపాటను ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు రచించారు.తన కుమార్తె ను మెట్టింటికి పంపుతూ ఆ ప్రేమ , కుమార్తె మీద అభిమానం తో వారు వ్రాసిన ఈ పాట అత్యద్భుతంగా ప్రజాదరణ పొందినది.ఇంక ఈ పాటను ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారు మృదుమంద్రంగా అత్యద్భుతంగా ఆలపించారు.వేదవతీ ప్రభాకర్ రావు గారు తెలియని వారు కూడా ఉండరు.అవిడ ఆకాశవాణి మరియు దూరదర్శన్ లో అనేక లలిత గీతాలు ఆలపించారు.

సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను...
చూడకుంటే.. నాకు బెంగా...

||అమ్మ దొంగా||

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా
కధ చెప్పే దాకా నన్ను కదలనీక.
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...

||అమ్మ దొంగా||

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...

||అమ్మ దొంగా||

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా కలకాలము
నీ బ్రతుకు కలల దారి నడవాలి...

||అమ్మ దొంగా||

Thursday, April 5, 2018

తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు,

 తెలుగు వారికి మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకతలు,

తెలుగు భాష: గొప్ప చెప్పుకోకూడదు కానీ, అసలు తెలుగు భాషే తీయనైనది, కమ్మనైనది. అందుకే రాయల వారు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు విశిష్టతను చెప్పకనే చెప్పారు. గోదారి గలగలలు, కృష్ణమ్మ ఉరవళ్ళు కలగలిపి, కొంచెం తేనె, కొంచెం పంచదార కలిపితే అది తెలుగు భాష అవుతుందని ఒక కవి హృదయం.

నాటకాల్లో పద్యాలు: తెలుగు వారి నాటకాల్లో ప్రత్యేకత పద్యాలు. 'బావా ఎప్పుడు వచ్చితీవు' అని రాయబారం పద్యం ఆలపించినా,   'చెలియో చెల్లకో' అంటూ హరిశ్చంద్ర కాటిసీను పద్యం ఆలపించినా, తెలుగు వారు మైమరచిపోతారు. ఒకసారి ఒకటో కృష్ణుడు పద్యం ఆలపించి, దాని చివర ఆ..ఆ......ఆ........ఆ....... అంటూ రాగం ఆలపించడం మొదలు పెడితే ఇక నాటకం పూర్తయే సరికి తెల్లారిపోవలసిందే. తెలుగు అజంత భాష అవ్వడం వలన పద్యం చివర రాగం తీసినా మధురంగానే ఉంటుంది.

శ్రీ  వేంకటేశ్వరుడు / అన్నమయ్య కీర్తనలు : తెలుగు వారికే ప్రత్యేకమైన ఇష్ట దైవం తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. అందరు దేవతలకి అన్ని చోట్ల దేవాలయాలు ఉండొచ్చు గాని, సాక్షాత్తు విష్ణువు వేంకటేశ్వరునిగా కొలువై వున్న తిరుమలగిరి తెలుగు వారి వరాల కొండ. 'ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే' అంటూ ఆ స్వామిని నోరారా కీర్తించిన అన్నమయ్య కీర్తనలు మనకు మాత్రమే సొంతం. 'చందమామ రావే, జాబిల్లి రావే' అంటూ అచ్చ తెలుగు సొగసులద్దిన అన్నమయ్య మన తెలుగు వాడు కావడం మనం చేసుకున్న అదృష్టం కాక మరేమిటి?

వేమన పద్యాలు: చిన్న చిన్న పద్యాలలో కొండంత భావాన్ని పొదిగిన వేమన పద్యాలు జీవిత సారాన్ని విశదీకరిస్తాయి. వేయి మాటల్లో చెప్పలేని విషయాన్ని నాలుగు వరుసల్లో చెప్పగలగడం, అదీ అతి చిన్న తెలుగు వాక్యాల్లో ఇమిడిపోవడం తెలుగు భాష గొప్పదనమైతే, అలా ఇమడ్చగలగడం వేమనకే సాధ్యం. తెలుగు వారి హృదయాలలో వేమన స్థానం ఎప్పటికీ పదిలం.

చీర / పంచెకట్టు: భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లండి, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళండి. అచ్చ తెలుగు వాళ్ళని ఇట్టే పసిగట్టవచ్చు. తెలుగు వారి పంచెకట్టు, ఆడవారి చీరకట్టు జగత్‌ ప్రసిద్ధమైనది. పంచె కట్టుకుని, నుదుటన బొట్టు పెట్టుకుని, భుజాన ఉత్తీరీయం వేసుకుని తెలుగు పెద్దాయన నడిచి వెళుతుంటే, అప్రయత్నంగా చేతులు జోడించ బుద్దేస్తుంది. అలాగే చీర కట్టులో మగువ అందాన్ని వర్ణించడం మహాకవులకయినా సాధ్యం కాదేమో కదా..



రాగి పాత్రలలోని ఆరోగ్యం :


మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వార శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది. కాని ఈమధ్య చేసిన సర్వేలలో తేలిన విషయం ఏమంటే నీళ్ళలో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ లా అమ్ముతున్నారు. దీనివలన ప్రమాదమే కాని ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే!

భారతదేశంలో ఉన్న మన పూర్వికులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుబ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

ఈమధ్య జరిగిన ఒక ప్రయోగంలో ''రోబ్ రీడ్'' అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారి అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24గంటల తరువాత పరిశీలించగా ఇత్తడి రాగి పాత్రలలో వేసిన క్రిములు శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99శతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్, పాత్రలలో వేసిన క్రిమి 24గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది. అని కనుగొన్నారు.

ఈమధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలని వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కష్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.

కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

కొబ్బరి నీళ్ళతో ఆరోగ్యం



ఆరోగ్యానికి కొబ్బరి నీళ్ళు శ్రేష్టం అనే సంగతి జగమెరిగిన సత్యం. వేసవిలో తాగే పానీయాలలో ముఖ్యమైనవి, ఆరోగ్యాన్నిచ్చేవి కొబ్బరి నీళ్ళు. అందరికి అందుబాటులో ఉండే మధురమైన లేత కొబ్బరిబొండం నీటిలో అనేక ఔషధ విలువలు ఉన్నాయి. కొబ్బరి నీటిని ఏ కాలంలో అయినా అందరూ తాగవచ్చు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం రోజుకు ఒక కొబ్బరి బొండం తాగితే వేసవి రుగ్మతల నుంచి రక్షణ లభిస్తుంది.

1.రక్త శుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర ఆమోఘం ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీరు గ్లాసు పాలకంటే కూడా పుష్టికరం.

2.పైగా ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌యాసిడ్‌ లాంటి సుగునాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి.

3.చక్కెర పదార్థాలు, ఖనిజలవణాలు విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది.

4.కమిలిపోయి పొడిబారిపోయినట్లుండే చర్మానికి కొబ్బరి నీళ్లు మంచి మందు. కొబ్బరి నీళ్ళలో దూదిని ముంచి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

5.వేసవి కాలంలో ప్రతిరోజు అల్పాహారానికి ముందు లేత కొబ్బరినీళ్ళు తాతిగే అంతర్ గాయాలు త్వరగా మానిపోతాయి

6.లేత కొబ్వరినీళ్ళను ఆరునెలలపాటు రాస్తుంటే స్మాల్‌పాక్స్‌ మచ్చలు పోయే అవకాశం ఉంది.

7.వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి, శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి.



"అమ్మ ప్రేమ"

"అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుండా అబద్దమే... ఎందుకంటే...తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నావిలువ అయినది మరొకటిలేదుకాబట్టి.  మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".  అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ? కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే.. ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ". "ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు . ..కాదు అనగలరా ఎవరైనా? ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే. అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి " వందనం అభివందనం ...../\.....

Wednesday, April 4, 2018

గరికపాటివారి మార్కు హాస్యం !

గరికపాటి మార్కు హాస్యం !
గరికపాటి వారి ప్రవచనం పూర్తికాగానే ఓ గడుగ్గాయి లేచి అయ్యా ..పాండవులలో నలుగురికి "డు" కారంతో అంతం అయ్యే పేర్లు ఉన్నాయి కానీ కేవలం వొక్క ధర్మరాజు కి మాత్రం" డు" కారం లేని పేరు ఎందుకు ఉందనే సందేహాన్ని లేవనెత్తాడు. దానికి గరికపాటి వారు భలే చమత్కారమైన జవాబు నిచ్చారు. అదేమిటో ఇక్కడ చదవండి.
ధర్మజుడు పాండవులకి పెద్ద అంటే రాజు లేదా నాయకుడు. నాయకుడు ఎప్పుడూ తన క్రింద వారికి [తమ్ములకు] వారు చేయదగిన పనిని చెప్పి చేయిస్తూండడమే పెద్ద పని.
పనిని చేయమని చెప్పడాన్ని ఆంగ్లంలో "డు" (DO) అనిఅంటారు కనుక అయన ఆజ్ఞలను జారి చేసేటపుడు... భీమా"డు"- భీమా చెయ్యి-[భీముడు అయ్యింది కదా] నకులా "డు" [నకులుడు]... అర్జున "డు"[అర్జునుడు] సహదేవా"డు" [సహదేవుడు]..అంటూ ఉండటంతో వారి వారి పేర్ల చివర "డు" కారం వో అలంకారమైంది నాయనా అంటూ చమత్కరించారు....
రాజు పని చేయ"డు" కనుక అయన పేరు చివర "డు" లేదు పొమ్మన్నారు అయన నవ్వేస్తూ..

ఆవునెయ్యి ప్రత్యేకత

 ఆవు పాలు ఆవు (గో)మూత్రం గొప్ప ఆరోగ్య గుణములతో వున్న దాఖలాలు రుజువు అయ్యాయి, ఇపుడు ఆవు నెయ్యి లో ప్రత్యేక ఓషది గుణాలతో వివిధ రోగాలపై పనిచేయు విధము ఆవునెయ్యి ప్రత్యేకత చూడండి...
🐄ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది . మతిభ్రమణం తగ్గుతుంది
2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది .
3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది
4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది
5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు
7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది
8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది
9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
10. 20 – 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాతి బెల్లం కలిపి తినిపిస్తే భంగు , గంజాయి , మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది
11. అరచేతులు , అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి
12. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి
13. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ , మల బద్ధకం రావు . ఉంటె పోతాయి
14. ఆవు నెయ్యి బల వర్ధకము , వీర్య వర్ధకము . మానసిక బలాన్ని పెంచుతుంది
15. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి వీపుకీ మాలిష్ చెయ్యండి .
16. మీరు బలహీనంగా , సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు
17. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు , వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది
18. హృద్రోగులకు ఆవునెయ్యి వరం .
18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది . బ్రెస్ట్ కేన్సర్ , పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది
19. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు
20. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది . ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది .
22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి .
ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుదాము 

పూరి జగన్నాధ ఆలయంలోని రత్న భాండాగారం

పూరి జగన్నాధ ఆలయంలోని నగల భాండాగారం తాళాలను 34 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత తీస్తున్నారు. 800 ఏళ్ళ నాటి ఈ పురాతన ఆలయంలో స్వామివారి నగలను భద్ర పరిచిన గదిని రత్నభండార్ అంటారు. 1984లో ఈ రత్న భాండారాన్ని తెరిచి స్వామి వారి సంపదను చూసిన తర్వాత మూసివేశారు.
మళ్ళీ ఇన్నాళ్ళకు బుధవారం నాడు (04-04-2018) పది మంది సమక్షంలో ఈ తలుపులు తెరవబోతున్నారు. ఈ పది మంది మాత్రమే ఆ గదిలోకి ప్రవేశిస్తారు. ఇందులో పురావస్తుశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు ఉంటారు. 34 ఏళ్ళుగా తలుపులు తీయకపోవడంతో లోపల పాములు వుండే అవకాశాలున్నాయి. అందువల్ల వీరితో పాటు పాములు పట్టే ఇద్దరిని లోపలికి అనుమతిస్తారు.
ఒరిస్సా హైకోర్టు ఆదేశాల మేరకు రత్న భాండాగారం నిర్మాణం లోపల ఎలా వుందో చూసేందుకు ఈ ప్రత్యేక బృందం ఆ తలుపులు తెరవబోతోంది.
రత్న భాండాగారంలో లైట్లు కూడా వుండవు. కేవలం టార్చి లైట్ల సహాయంతోనే ఆ గదిలోకి ప్రవేశించి గోడలు, ఫ్లోరింగ్ ఎలా వుందో పరిశీలిస్తారు. పది మందిని లోపలికి పంపేముందు.. బైటికొచ్చిన తర్వాత క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
గదిలో స్వామివారి ఆభరణాలను లెక్కించడంగానీ, వాటిని తాకడం గానీ చేయకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ భాండాగారం ఎలా వుందో చూడడం వరకే వీరి బాధ్యత. రత్న భాండాగారంలోకి ప్రవేశించే పది మందిలో ఒరిస్సా మహరాజు గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్, లేదా రాజు పంపే ప్రతినిధి, ఇద్దరు ఆర్కియాలజీ శాఖ అధికారులు, హైకోర్టు నియమించిన న్యాయవాది, వార్తా సంస్థల నుంచి పీటీఐ ప్రతినిధి వుంటారు.
రత్న భాండాగారంలో ఏడు అరలు వుంటాయి. 1984లో ఈ ఏడింటిలో మూడింటిని మాత్రమే తెరిచారు. మిగిలిన నాలుగు అరలను గత 98 ఏళ్ళుగా తెరవలేదు. వాటిలో ఏముందో కూడా ఎవరికీ తెలియదు. పూరి జగన్నాధుడికి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రవైఢూర్యాల నగల సంపద వుందని ఎప్పటి నుంచో ప్రచారంలో వుంది. అయితే ఆ సంపదను ఇంతవరకు కంటితో చూసిన వారెవరూ లేరు. స్వామి వారి సంపద వున్న ఆ రత్నాభాండాగారం పటిష్టమైన భద్రతను కలిగి వుంటుంది.
ఈరోజుకు కూడా హైకోర్టు ఆదేశాలతో ఆ గది తలుపులు తీస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళే ప్రత్యేక బృందం కూడా స్వామి నగలను తాకకుండా, చూడకుండా, కనీసం టార్చి లైట్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంటే, పూరి జగన్నాధుడి సంపదను ఊహించడమే తప్ప ఎవరూ లెక్కకట్టలేనిది.
త్రివేండ్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో లక్షల కోట్ల ఆభరణాల సంపదను మదింపు వేసిన తర్వాత దానిని కేంద్ర భద్రతా దళాల నిఘాలో పెట్టి జాగ్రత్త చేశారు. ఇప్పుడు పూరి జగన్నాధస్వామి ఆలయంలో ఖజానా ఒక్కటే ఈ దేశంలో ఇంతవరకు లెక్కించకుండా, చూడకుండా వున్న నిధి. అందువల్ల దాని విలువ ఎన్ని లక్షల కోట్ల విలువ వుంటుందో ఊహకందనిది.

Tuesday, April 3, 2018

ఇదండీ సంగతి ...

"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు ..."

"ఇచట తెలుగు వార్తాపత్రికలు నిషేధించబడినవి ..."

"తెలుగు వార్తాపత్రికలు చదివినవాడు గాడిద ..."

"ఈ ప్రాంగణమున తెలుగు వార్తాపత్రికలు వీక్షించిన యెడల శిక్షింపబడెదరు ..."

"తెలుగు వార్తాపత్రికలు చదివినచో పరీక్షల్లో మీకు గుండు సున్నా ఇవ్వబడును ..."

అదొక హై స్కూల్ ... ఆ స్కూల్ గోడల నిండా ఇలాంటి వాక్యాలు పెద్దపెద్ద అక్షరాలతో నీతివాక్యాల్లా రాయబడి ఉన్నాయి ...

ఏమిటీ అనర్ధం ..? ఎందుకీ అరాచకం ..? ఇక్కడింత జరుగుతున్నా 'అధికార తెలుగు భాషా సంఘం' ఏం చేస్తుంది ...? హతవిధీ ! ఈ దురాగతాన్ని అరికట్టేవారే లేరా ...?

అసలేం జరిగిందంటే (ఫ్లాష్ బ్యాక్)..

కొన్నాళ్ళ క్రితం ఆ స్కూలుకి స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు వచ్చారు ... పిల్లల హాజరు పట్టీ, ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలించిన పిమ్మట స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు ... అందుకు కారకుడైన హెడ్మాస్టర్ గారిని ఎంతగానో అభినందించారు ...

ఈ స్కూల్ చాలా బాగుంది పిల్లల తెలివితేటలు ఇంకెంత గొప్పగా ఉంటాయో అనుకున్న ఇనస్పెక్టర్ గారికి చివరి క్షణంలో పిల్లల జనరల్ నాలెడ్జ్ పరీక్షిద్దామనే గొప్ప ఆలోచన వచ్చింది ... అందుకు అనుగుణంగా హెడ్మాస్టర్ గారు పిల్లల్ని సమావేశపరిచారు ...

ఆ పిల్లల్లో ఒకడు చురుకుగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు ... ముందుగా వాణ్ని లేపారు ఇనస్పెక్టర్ గారు ...

"నీ పేరేంటి బాబూ?"

నిఖిల్ రెడ్డి ...

"భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరు నడిపించారు?" ఉల్లాసంగా నవ్వుతూ ప్రశ్నించారు ఇనస్పెక్టర్ గారు ...

వై.యస్. రాజశేఖర రెడ్డి ... తడుముకోకుండా చెప్పాడు నిఖిల్ రెడ్డి ...

ఇనస్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు

"రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడెవరు?"

చంద్రబాబు నాయుడు ... ఠకీమని చెప్పాడు నిఖిల్ రెడ్డి

ఇనస్పెక్టర్ గారికి సమాధానం అర్ధం కాలేదు బట్ట బుర్ర గోక్కున్నారు ...

"నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఒక భారతీయుని పేరు చెప్పు."

వై.యస్. జగన్మోహన రెడ్డి బుల్లెట్లా సమాధానం వచ్చింది

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టారుని చిరాగ్గా చూశారు .. హెడ్మాస్టర్ సిగ్గుతో తల దించుకున్నారు ..

ఇనస్పెక్టర్ గారు నిఖిల్ రెడ్డి కూర్చోమని చెప్పి ఇంకొకణ్ని లేపారు ...

"నీ పేరేంటి?"

నవీన్ చౌదరి

"ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?" మృదువుగా అడిగారు ఇనస్పెక్టర్ గారు.

ఎన్టీరామారావు ... గర్వంగా చెప్పాడా కుర్రాడు

ఇనస్పెక్టర్ గారికి కళ్ళు తిరిగాయి

"భారతదేశ ప్రధాన మంత్రిగా ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పనిచేశారు ఎవరాయన?"

చంద్రబాబు నాయుడు ... బల్ల గుద్దినట్లు చెప్పాడు నవీన్ చౌదరి

ఇనస్పెక్టర్ గారికి గుండె పట్టేసినట్లైంది నీరసంగా అడిగారు ...

"జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడెవరు?"

వై.యస్.జగన్మోహన రెడ్డి ... సమాధానం బాణం కన్నా వేగంగా దూసుకొచ్చింది

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టార్ని కొరకొరా చూశాడు ... ఆయన చూపులకి హెడ్మాస్టర్ గారు విలవిలలాడిపొయ్యారు ... ఒక్క ఉదుటున లేచి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపొయ్యారు ఇనస్పెక్టర్ గారు ... రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు హెడ్మాస్టర్ గారు ...

పది రోజుల్లో స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారి కార్యాలయం నుండి తాఖీదు ... మీ స్కూల్ విద్యార్ధుల నాలెడ్జ్ బిలో యావరేజ్ గా ఉన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదంటూ షో కాజ్ నోటీస్ ... హెడ్మాస్టర్ గారు లబోదిబోమన్నారు ...

నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలని పిలిపించారు.

"మీ అమ్మ కడుపులు మాడ ! మీరు చక్కగా చదివే స్టూడంట్లే కదర్రా ! ఆ ఇనస్పెక్టర్ కి తలతిక్క సమాధానాలు చెప్పి నా కొంప కొల్లేరు చేసారేం ...?" అంటూ ఎగిరారు ...

నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలు ముఖముఖాలు చూసుకున్నారు .. తమ తప్పేమీ లేదనీ.. తాము తమ ఇంట్లో తెప్పించే తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నామని.. అందులో రాసిన విధంగానే సమాధానాలు చెప్పామని బావురుమన్నారు ...

"వార్తాపత్రికల్లో అలా రాశారా!? ఏం పేపర్లురా అవి?"

"......" అని ఒక పేపర్ పేరు చెప్పాడు నిఖిల్ రెడ్డి ...

"....." అని ఇంకో పేపర్ పేరు చెప్పాడు నవీన్ చౌదరి ...

హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు ... ప్యూన్ రామయ్యతో ఆ రెండు పేపర్లు తెప్పించారు ... పావుగంట పాటు రెండు పేపర్లు తిరగేశారు ...

'నిజమే! పాపం పసిపిల్లలు! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ...? ఆ పేపరోళ్ళు రాసిందే నిజమని నమ్మారు ... నమ్మిందే చెప్పారు.' అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డారు హెడ్మాస్టర్ గారు ...

అటు తరవాత ఇనస్పెక్టర్ గారి షో కాజ్ నోటీస్ కి ఏదో సమాధానం చెప్పుకుని బయటపడ్డారు ...!

ఇదండీ సంగతి ...

ఆహారం గురించి ప్రముఖుల, మహాత్ముల అభిప్రాయాలూ , అనుభవాలూ.

ఆహారం గురించి ప్రముఖుల, మహాత్ముల  అభిప్రాయాలూ , అనుభవాలూ...!!!!!!!

1. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు కనపడేది అన్నం రూపంలోనే !
 
            మహాత్మా గాంధీ

2. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !

              జంధ్యాలగారు

3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !

విశ్వనాధ సత్యనారాయణ గారు

4. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !

వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !

రేలంగి వెంకట్రామయ్య గారు

5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

ముళ్ళపూడి వెంకటరమణ గారు

6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవికావు నాయనా అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
అర్ధం కాలేదు !

                ఆత్రేయ గారు

7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !
 చాగంటి కోటే శ్వర రావుగారు

8.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!

గౌతమ బుద్దుడు

9. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది

మాతా అమృతానందమయి

10. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు......!!!!!

అన్నం పరబ్రహ్మ స్వరూపం

ఇది కొన్ని వేలమంది కష్టానికి ప్రతిఫలం

కావున వృధా చేయకండి

హాలిడేస్ లో పిల్లలకు ఇలా కూడా చేసి చూడండి.

దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........
1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.
2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........
3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........
4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........
5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...
6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......
7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......
8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........
9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............
10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........అన్ని మతాలు ప్రేమించమనే
చెప్పాయని,ద్వేషించమని ఏ మతమూ చెప్పలేదని వారికి తెలియచేయండి........
వీటిలో మీరు కొన్ని అయినా చేస్తే..........
మీ పిల్లలకు మంచిని చేసినవారు
అవుతారు.......
ప్లీజ్..
చేస్తారని ఆశిస్తూ.........

Total Pageviews