ఆహారం గురించి ప్రముఖుల, మహాత్ముల అభిప్రాయాలూ , అనుభవాలూ...!!!!!!!
1. ఆకలిగొన్నవాడికి ' దేవుడు కనపడేది అన్నం రూపంలోనే !
మహాత్మా గాంధీ
2. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని !
ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే !
జంధ్యాలగారు
3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం !
విశ్వనాధ సత్యనారాయణ గారు
4. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !
వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి !
రేలంగి వెంకట్రామయ్య గారు
5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !
ముళ్ళపూడి వెంకటరమణ గారు
6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు అన్నీ మనవికావు నాయనా అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు.
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ
అర్ధం కాలేదు !
ఆత్రేయ గారు
7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం !
అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు !
చాగంటి కోటే శ్వర రావుగారు
8. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు !!
గౌతమ బుద్దుడు
9. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది
మాతా అమృతానందమయి
10. మీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు......!!!!!
అన్నం పరబ్రహ్మ స్వరూపం
ఇది కొన్ని వేలమంది కష్టానికి ప్రతిఫలం
కావున వృధా చేయకండి

No comments:
Post a Comment