Wednesday, April 11, 2018

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా

ఈపాట తెలియని తెలుగువారు లేరంటే విచిత్రం కాదు.ఈపాటను ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు రచించారు.తన కుమార్తె ను మెట్టింటికి పంపుతూ ఆ ప్రేమ , కుమార్తె మీద అభిమానం తో వారు వ్రాసిన ఈ పాట అత్యద్భుతంగా ప్రజాదరణ పొందినది.ఇంక ఈ పాటను ప్రముఖ లలిత సంగీత గాయని శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గారు మృదుమంద్రంగా అత్యద్భుతంగా ఆలపించారు.వేదవతీ ప్రభాకర్ రావు గారు తెలియని వారు కూడా ఉండరు.అవిడ ఆకాశవాణి మరియు దూరదర్శన్ లో అనేక లలిత గీతాలు ఆలపించారు.

సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను...
చూడకుంటే.. నాకు బెంగా...

||అమ్మ దొంగా||

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా
కధ చెప్పే దాకా నన్ను కదలనీక.
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...

||అమ్మ దొంగా||

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతే...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...

||అమ్మ దొంగా||

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా కలకాలము
నీ బ్రతుకు కలల దారి నడవాలి...

||అమ్మ దొంగా||

No comments:

Post a Comment

Total Pageviews