Saturday, February 27, 2021

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే - తానాకి ఆధ్యక్షుడైనా తల్లికి తనయుడే!


 రావణ సంహారం అనంతరం యుద్ధం ముగిసి అందరూ సేద తీరుతున్న సందర్భంలొ విభీషణుడు రాముని చెంతకు వచ్చి విజయఫలమైన లంకను పరిపాలించమంటాడు. సున్నితంగా తిరస్కరిస్తాడు శ్రీ రామ చంద్రుడు, ఆ తర్వాత లక్ష్మణుడు 

ధనమార్జాయ కాకుత్స్థ !

ధన మూల మిదం జగత్

అంతరం నాభి జానామి

నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనం తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం అంటాడు దానికి సమాధానంగా

అపి స్వర్ణ మయీ లంకా

న మే రోచతి లక్ష్మణ !

జననీ జన్మ భూమిశ్చ

స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కన్నతల్లితో జన్మభూమితో ఎంత అనుబంధం ఉంటుందో మాటల్లో చెప్పలేం. కన్నతల్లి తాను ఉన్నంతవరకూ బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటే.. తర్వాత పుట్టిన నేల మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ వాక్యాలు రాముడు లక్ష్మణుడికి చెప్పుతున్నప్పటికీ ఇది మొత్తం లోకానికి వర్తించాలని చెప్పాడు. కాబట్టే రామాయణం మనకు అత్యంత పూజనీయమైంది.

రామాయణం అందరూ చదువుతాం కానీ ఆచరణ ఇదిగో ఇలాంటి మహనీయులు చేస్తారు.

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపంలో తల్లి రుణం తీర్చుకునే పువ్వుల గురించి ఒక చోట ఇలా అంటారు

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు

"ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి

జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన

స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము

ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము

ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై" ఎన్ని జన్మలేత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిది అని నమ్మి

ఆస్తులు ముఖ్యం కాదు అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్న తమ్ముళ్లు..

ఒకరు అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ లో ఒకరు రాజా శ్రీనివాస్.. మరొకరు అమెరికా తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్.. కోట్ల డాలర్ల సంపాదనకన్నా కన్న తల్లి మిన్న కన్నతల్లికోసం కొడుకులు, కూతురు

 కరోనాతో కోన ఊపిరితో పోరాడుతున్న తల్లి బారతమ్మ పాటు ఉండి అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మ కు  పునర్జన్మ నిచ్చిన వీరు ఆ రామ లక్షణుల వారసులు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి, తల్లిదండ్రులను మించిన దైవం లేదు అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని ఎన్ని ఎంత పొగిడినా తక్కువే..

నేటి తరానికి ఆదర్శమూర్తు లారా మీకు మా హృదయపూర్వక శుభాభినందనలు, శుభాభివందనాలు --

మీ సత్యసాయి విస్సా ఫౌండేషన్‌! 

Total Pageviews