Thursday, June 30, 2016

ఉంగరపు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే…!?
నుదుట బొట్టుపెట్టుకునేందుకు పసుపుతో చేసిన కుంకుమ శ్రేష్టమైనది. పసుపు మన శరీరంపై అమితమైన ప్రభావాన్ని చూపుతుంది. రక్తాన్ని శుభ్రపరిచి శరీరకాంతిని ఇనుమడింప జేస్తుంది. కురుపులను, గాయాలను మాన్పుతుంది. కుష్ఠు రోగాన్ని కూడా రూపుమాపే శక్తి పసుపుకు ఉంది. కఫాన్ని అరికడుతుంది. కుంకుమను అమ్మవారి ప్రసాదంగా భావించి,
“సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే” అని జగన్మాతను ప్రార్థిస్తూ నుదుటన పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగుతాయి. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడిమి వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అసలు నొసటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. మన శరీరంలో జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన మిగిలిన అవయవాలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు. వారిలో లలాట అధిదేవత బ్రహ్మ. పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మ ముఖకమలం నుండి వెలువడ్డాయి. అందుకే బొట్టు పెట్టుకోవడానికి బ్రహ్మ స్థానమైన లలాటం స్థానమైంది. ద్వాదశ పుండ్రాలను పెట్టుకోక పోయినా, కనీసం బొట్టు అయినా పెట్టుకోవాలి. అప్పుడు దేవుని పూజించినట్లే అవుతుంది.
చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నొసటిపై ఎరుపురంగు వ్యాప్తిలోకి వచ్చింది. ఇందులో నిగూఢార్థముంది. మనలోని జీవుడు జ్యోతి స్వరూపుడు. ఆ జీవుడు జాగ్రదావస్థలో భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రంలో సంచరిస్తుంటాడు.
మన నొసటిపై పెట్టుకున్న కుంకుమబొట్టుపైన సూర్యకాంతి ప్రసరిస్తే, కనుబొమల మధ్య నుండే ఇడా పింగళ నాడులు సూర్యశక్తిని గ్రహించి శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్రస్థానము కనుబొమల మధ్య నుండే ఆజ్ఞాచక్రము. కుంకుమ బొట్టును పెట్టుకోవడం వల్ల ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్లే అవుతుందని పెద్దలంటారు. మానసిక ప్రవృత్తులను నశింపజేసేదే ఆజ్ఞాచక్రమని పురోహితులు అంటున్నారు.

               మనము తులసిని ఎందుకు పూజిస్తాము?

సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది తులసి (దాని లక్షణాలలో) అని అర్ధము. భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి.

వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు.

ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత. ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య. ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు. తులసి ఆకుని సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే. అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని పూజలలో తులసి వాడకూడదు అంటారు. విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).

ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగ వరమిచ్చాడు. అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం జరుపుతాము. ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి ప్రతీక. ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు.

ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారము చేస్తుంది. కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు. ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర పోషించినది.

తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది. జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది.

తులసి మాల తో జపం చేస్తే చిత్తశుద్ది త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది. చిత్తశుద్ది కి తులసి మాల ఉత్తమం.

తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:

యాన్మూలే సర్వ తీర్ధాణి యన్మధ్యే సర్వ దేవతాః
యదాగ్రే సర్వవేదాశ్చ తులసీత్వామ్  నమామ్యహమ్

ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.
భారత దేశీయ ఆవు పాలు: -
1.కొంచెం పలుచగా ఉంటాయి.
2.త్వరగా అరుగును.
3.చిన్న పిల్లలకు తల్లిపాలతో సమానం.
4.మనిషికి చలాకీని పెంచును.
5.ఉదర సంబంధమైన జబ్బులు తగ్గును.
ప్రేగులోని క్రిములు నశించును.
6.జ్ఞాపక శక్తిని పెంచును.
7.చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే
వ్యక్తులకు తెలివిని పెంచి వారిని
నిష్ణాతులను చేయును.
8.మనస్సును, బుద్ధిని
చైతన్యవంతం చేయును.
9.సాత్విక గుణమును పెంచును.
10.సాధువులు, రుషులు,
మునులు ఆవు పాలనే సేవిస్తారు.
11.యజ్ఞమునకు,
హొమమునకు ఆవుపాలను వాడుతారు.
12.దేవాలయాలలో పూజకు, అభిషేకానికి
ఆవుపాలు వాడుతారు.
13.కార్తీక పురాణములో ఆవునెయ్యితో దీపారాధన
చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని
చెప్పారు.
14.గోవు దేవతా స్వరూపము, కైలాసం దగ్గరలోని
గోలోకమునుండి వచ్చినది. ఆవుపాలు, ఆవునెయ్యి
సేవించిన మనకు దేవతా శక్తి వస్తుంది.
15.ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే
బంగారు తత్వముతో కూడిన విటమిన్ ఎ అధికముగా
కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ ఉన్నది. దీని వలన ఆ
పాలు పచ్చగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని
బాగా పెంచుతుంది.
16.తెల్లఆవు పాలు వాతాన్ని, పిత్తాన్ని, నల్ల
(కపిల) ఆవు పాలు పిత్తాన్ని,
ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17.ఆవుపాలు సర్వలోగ నివారిణి.
18.… ఆవుపాలు వ్రుద్దాప్యాన్ని
దూరం చేస్తాయి.
19.ఘ్రుతేన వర్ధతే బుద్దిః క్షీరేణాయుష్య
వర్ధనం.
ఆవునెయ్యి బుద్ది బలమును పెంచును.
ఆవుపాలు ఆయుష్షును పెంచును.
20.ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండంలో
చెప్పారు.
21.ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
22.మనం భుజించిన తేజో (అగ్ని) సంబందమైన
ఆవునెయ్యి, నూనె, వెన్న, వగైరాలలోని
స్ధూలభాగం శరీరంలోని ఎముకలుగా
మారుతుంది. మధ్యభాగము మజ్జ (మూలుగ) గా
మారుతుంది.
సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన
ఎముకలు, మజ్జ (మూలుగ), మంచి సాత్వికము,
శ్రావ్యము అయిన వాక్కు-వీటి కోసం ఆవునెయ్యి,
వెన్న తప్పక తినవలెను.
ఛాందోగ్య ఉపనిషత్ (6-5-3)
23.భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ
మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో
సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో
కూడిన 'స్వర్ణనాడి' (సూర్యకేతు నాడి) అనే
సూక్ష్మ నాడీ ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది.
సూర్యకిరణములు ఆవు మూపురముపై
పడినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై
సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో
కూడిన పసుపు పచ్చని 'కేసిన్' అనే
ఎంజైమ్ను తయారు చేసి దానిని ఆవు పాలలో
పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి,
వెన్న పసుపుపచ్చని పసిమి రంగులో ఉంటాయి
పాశ్చాత్య గోవులైన జర్సీ, H.F.వంటి
గోవులకు మూపురం ఉండదు. అవి
సూర్యశక్తిని గ్రహించలేవు. ఇవి శీతల
ప్రదేశములలో చలికి తట్టుకోనే విధంగా
పరిమాణాము చెందినవి.
వీటికి మన దేశీయ ఆవువలే సూర్యశక్తిని
గ్రహించగల స్వర్ణ నాడి ఉండదు. అందువలన
వీటి పాలు మంచివి కావు. ఇవి కేవలం అధిక
పాలఉత్పత్తికై యాంత్రిక జీవులుగా
మనము భావించవచ్చును.
అక్షరాలలో స్త్రీ కి నిర్వచనమిది
-----------------------------------
అ - అపురూపమైనది
ఆ - ఆప్యాయత పంచేది
ఇ - ఇంటికి దీపం వంటిది
ఈ - ఈశ్వరుడి మూడోకన్నులాంటిది
ఉ - ఉన్నంతలో సర్దుకుపోయేది
ఊ - ఊరటనిచ్చేది
ఋ - ఋణం తీర్చుకోలేని సేవచేసేది
ఎ - ఎన్ని ఇబ్బందులు ఎదురైనా
ఏ - ఏకాగ్రత కోల్పోకుండా
ఐ - ఐనవారికోసం
ఒ - ఒంట్లో శక్తినంతా ధారపోస్తూ
ఓ - ఓరిమితో నేరిమితో
ఔ - ఔదార్యం చూపేది
అం - అందరి అవసరాలూ తీర్చేది
అః - అః అనిపించేది

Wednesday, June 29, 2016

కిరణ్ కి వివాహం అయిన రెండు సంవత్సరాల తరువాత ఒక పండంటి బాబు పుట్టాడు.
కిరణ్ కి ఇప్పుడు ఆ బాబే ప్రపంచం.
ఆఫీస్ కి వెళితే గంటకోసారి భార్య కు ఫోన్ చేసి బాబు ఎలాఉన్నాడు అని అడగనిదే నెమ్మది లేదు తనకు.
మాటలు రాకపోయినా ఫోన్ చెవిలో దగ్గరలో పెట్టమని బాబు అరుపులు వింటూంటే స్వర్గం లో ఉన్నట్టు అనిపిస్తుంది తనకు.
ఇక బాబు కి జలుబు గాని జ్వరం గాని వస్తే నిదురే ఉండదు తనకు.
బాబు ఆరోగ్యం పాడవుతుందని తాతయ్య దగ్గరకు కూడా పంపడట.
---------------------------------------,,-
బాబు కిరణ్ ఇంతకన్నా అదికమైన ప్రేమ తో నీ తల్లితండ్రులు నిన్ను చూశారు చిన్నప్పుడు.నీ అవసరాలు తీర్చటం కొరకు వారి ఆశలు,అవసరాలు ఎన్నో వదులుకున్నారు.నీకు కొత్త డ్రస్ తీసుకోవడం కొరకు తమకు నూతన వస్త్రాల మీద ప్రేమ ను చంపుకున్నారు నీ తల్లితండ్రులు.నీ స్వరం వింటే చాలు అని ఎదురు చూస్తున్న నీ తల్లితండ్రులకు నీవు కనీసం వారానికి ఒకసారి అయిన ఫోన్ చేస్తున్నావా మరి ?????????

Tuesday, June 28, 2016

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు.
"లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.
మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.
భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా," అని అడిగింది." లేదు..... కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం" అన్నారు.
ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన" నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఈయన పేరు 'ఐశ్వర్యం'. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్యనించు" అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది.
సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని" అన్నాడు.
దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వనిద్దాం" అని అంది.
వీరి ఇద్దరి మాటలు వింటున్న్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి" అంటూ సలహ ఇచ్చింది.
వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.
ఆముగ్గురూ "మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది .ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ" అన్నారు......కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి
సాధించాలంటే సాహసించాల్సిందే ...!!!
‘సాహసం చేయరా డింభకా రాజకుమారి దక్కుతుంది...’ అంటూ అలనాడు ‘పాతాళభైరవి’ సినిమాలో యస్వీ రంగారావు, రామారావును ప్రేరేపించటం మనకు గుర్తుంది. సాహసంతోనే అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచుకొని, తాను వలచిన రాజకుమారిని పెళ్లాడాడు సాధారణ తోటరాముడు. అది సినిమా కావొచ్చు. కల్పన కావొచ్చు. కాని.. సాహసాలు చేసి ఎందరో కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు తెర తీశారనటం వాస్తవం.
సాంకేతికపరమైన అంశాలు అందుబాటులో లేని కాలంలో సముద్ర మార్గం ద్వారా ఐరోపా ఖండం చుట్టి.. భారతదేశం చేరుకున్న పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా సాహస యాత్ర.. చరిత్రను ఎన్ని మలుపులు తిప్పిందో మనందరికీ తెలుసు. ఆనాడు ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో నావికులు చేసిన సాహస యాత్రల మూలంగా ఎన్నో చీకటి ఖండాలు వెలుగులోకి వచ్చాయి.
సాహసించకపోతే.. టెన్సింగ్ నార్కే మహోన్నత హిమగిరి ఎవరెస్ట్‌ను అధిరోహించి ఉండేవాడా? యూరీ గగారిన్ అంతరిక్ష యాత్ర చేసి ఉండేవాడా? నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపగలిగేవాడా?.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో సాహసవంతమైన విజయాలు మనకు కనిపిస్తాయి.
అయితే.. ప్రతి సాహసం వెనుక విజయం ఉండకపోవచ్చు. జయాపజయాలు సాధారణం. సాహసించే ప్రతివారూ విజయం కోసమే తపిస్తారు. విజయ లక్ష్యంగానే సాహసానికి పూనుకుంటారు. ఒక్కోసారి దురదృష్టం వెంటాడి.. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి.
కొన్ని రకాల సాహసాలలో పాల్గొనే వారికి.. అదెంత ప్రమాదకరమైనదో తెలుసు. అదుపు తప్పితే జరిగే పరిణామాలేమిటో తెలుసు. అయినా వారు ఆ సాహసం పట్ల ఆసక్తిని కనపరుస్తారు. అంతేకాదు దానిని వారు ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటారు.
విజయం తమదేననే భరోసాతోనే ముందుకు సాగుతారు. అపజయాన్ని, ప్రమాదాన్ని ఎవరూ ముందుగా ఆశించరు. తమకన్నా ముందు అలాంటి సాహసకృత్యాలలో ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలైన లేదా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినా.. అదే సాహసకృత్యానికి పూనుకునేవారూ ఉన్నారు.
అంతరిక్ష నౌక పేలిపోయినంత మాత్రాన అమెరికా అంతరిక్ష ప్రయోగాలు ఆగిపోయాయా..? మరింత సాంకేతిక జాగ్రత్తలు పెంచుకుంటూ ముందుకు సాగటం లేదా? కల్పనా చావ్లా దుర్మరణం చూసి భయపడి వుంటే.. సునీతా విలియమ్స్ సక్సెస్ సాధించి ఉండేదా? మరి కొంతమంది వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యేవారా? అందుకే సాహసికులు జరిగిన సంఘటనలకు భీతి చెందరు. అలా భీతి చెందేవారు అసలు అలాంటి సాహసానికి సిద్ధపడరు.
సాహసమే నా ఊపిరి.. విజయమే నా లక్ష్యం అనే సిద్ధాంతం వారిది. అయితే చాలామంది అనుకోవచ్చు - ప్రాణాంతకమైన సాహసకృత్యాలు అవసరమా అని? మరి అవే లేకపోతే.. మానవ జాతి ఇంత ప్రగతి సాధించేదా? అందుకే ప్రతి విజయం వెనుక ఓ సాహసం, ఓ ఉత్సాహం, ఓ ప్రేరణ తప్పనిసరి.
అయితే ప్రతి సాహసం పాజిటివ్ దృక్పథం కలిగినదై ఉండాలి.
అయితే సాహసాలకు పూనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
తాము పూనుకోబోతున్న సాహసం వెనుక ఎలాంటి ప్రమాదాలు ఉండగలవో ముందుగా ఒక అవగాహనకు రావాలి. గతంలో ఏ లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయో పరిశీలించాలి. వాటిని లోతుగా విశే్లషించుకోవాలి.
దానికి తగిన విధంగా వ్యూహాలను ఆలోచించాలి. ముందస్తు ప్రణాళికను సమగ్రంగా రూపొందించుకోవాలి.
అనుకోకుండా సంభవించే ప్రమాదాలను ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యాన్ని గుండెల నిండా నింపుకోవాలి. చాలినంత టెక్నాలజీని అందుబాటులో ఉంచుకోవాలి. అది అపాయకర వేళ సహకరించేలా చూసుకోవాలి. స్వతహాగా ప్రమాద సమయంలో..
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం మంచిది. సాహసకృత్యాల సమయంలో భయాందోళనలకు గురి కాకూడదు.
ఒక్కో సమయానికి అవే ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. సాధించాలనే స్థిరత్వం, తపనలే చాలావరకు విజయం వైపు నడిపించగలవు.
కాబట్టి సాహసం చేయటం తప్పు కాదు. సాహసాలే విజయానికి సోపానాలు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి. చక్కటి ప్రణాళికతో, వ్యూహాత్మక నిర్ణయాలతో.. ముందుకు సాగితే.. మంచి ఫలితాలను సమాజానికి అందించవచ్చు. భావితరాలకు మార్గదర్శకులుగా నిలువవచ్చు.
(వానవల్లప్పలువానవల్లప్పలు.)
.
వానా వానా వల్లప్ప!
వాకిలి తిరుగూ చెల్లప్ప!
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు?
వేపాకు పసుపూ,
వెల్లుల్లిపాయ,
నూనె లోమడ్డి (నూనెమ్మ బొట్టు,)
నూటొక్కసారి,
పూయవోయి నూరి,
పూటకొక్కతూరి.
..
వల్లప్పా! వల్లప్పా! వాన కురుస్తున్న దంటుంది చెల్లెలు.
బయటకుపోక చెల్లెలును
వాకిట్లోనే ఆడుకోమంటాడు వల్లప్ప.
వానలో తిరిగితే కొండమీదినుండి (ఆకాశం నుండి)
గుండురాళ్లు (వడగళ్లు) పడి కొక్కిరాయి (అల్లరి పిల్లవాడు) కాలు విరిగింది -
కాబట్టి వానలోకి పోవద్దని వల్లప్ప అంటే,
కాలు విరిగితే మందు ఏమిటని చెల్లెలు అడుగుతుంది.
వేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ నూనెలో మడ్డి - ఇవన్నీ కలిపి,
నూటొక్క సారిపిండి (ఆవర్తితతైలము)
ఆ తైలమునుపూట కొకసారి విరిగిన కాలుకు రాస్తే,
కూడు కొంటుందంటాడు వల్లప్ప.
🌧 వానా వానా వల్లప్ప అని పాడుకుంటారు మన చిన్నారులు.. 🌚 రెయిన్ రెయిన్ గో అవే అని నేర్పిస్తుంది పాశ్చాత్య విద్యా విధానం..
🌾వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి, అందరికీ తిండి దొరుకుతుంది.. అని మనం కోరుకుంటాం.. మన విశాల దృక్పథానికి, శ్రమ సంస్కృతికి ఇది నిదర్శనం..
👺కానీ తాము బాగుంటే చాలు అని కోరుకొని, ఇతరులను దోచుకు తినే వారికి వానలతో పనేముంది..
🤔ఇంతకూ మన పిల్లలకు ఏమి నేర్పిద్దాం.. వానా వానా వల్లప్పా లేక రెయిన్ రెయిన్ గో అవేనా..  ఆలోచించండి..
బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి .!

Monday, June 27, 2016

🍇🌿కాశీ అన్నపూర్ణే శ్వరీ దేవీ ప్రదక్షిణ మహత్యం🌿🍇

కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కోడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.
 కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు.
కాశీ నగర మహాత్మ్యాన్ని తెలిపే కథ ఒకటి దేవీభాగవతం పదకొండో స్కంధంలో కనిపిస్తుంది.

🌿కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.🌿

పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.
అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది.
ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది.
ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది.
 అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.
ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది.
 రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.
 ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.
పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు.
పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.
 వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి.
గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.
యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.

🌿ప్రదక్షిణ ఫలితమే🌿
అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు.

 గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి .

 కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండ,  విశ్వనాధ, అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం , చెయ్యండి . . .

🍇🌿ఓం నమః శివాయై చ నమః శివాయ🌿 🍇

Sunday, June 26, 2016



హర హర మహా దేవ శంభో శంకరా:
త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం;
త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ||1||
త్రిసాఖైః బిల్వపత్రైశ్ఛ, అస్ఛిద్రై కోమలై శుభైః;
తవ పూజాం కరిష్యామి.ఏక బిల్వం శివార్పణం. ||2||
కోటి కన్యా మహా దానం, తిల పర్వత కోటయః;
కాంచనం శైలదానేన, ఏక బిల్వం శివార్పణం. ||3||
కాశీ క్షేత్ర నివాసంచ,కాల భైరవ దర్శనం;
ప్రయాగే మాధవం దృష్ట్వా,ఏక బిల్వం శివార్పణం. ||4||
ఇందు వారే వ్రతమస్థిత్వ, నిరాహారో మహేశ్వర;
నర్థం ఔష్యామి దేవేశ, ఏక బిల్వం శివార్పణం. ||5||
రామ లింగ ప్రతిష్ఠాచ, వైవాహిక కృతం తధా;
తటాకాచిద సంతానం,ఏక బిల్వం శివార్పణం. ||6||
అఖండ బిల్వ పత్రంచ, ఆయుతం శివ పూజనం;
కృతం నామ సహస్రేన, ఏక బిల్వం శివార్పణం. ||7||
ఉమయా సహదేవేశ, నంది వాహన మేవచ;
భస్మ లేపన సర్వాగం,ఏక బిల్వం శివార్పణం. ||8||
సాలగ్రామేషు విప్రాణాం, తటాకం దశ కూపయో;
యజ్ఞ కోటి సహస్రస్య, ఏక బిల్వం శివార్పణం. ||9||
దంతి కోటి సహశ్రేషు, అశ్వమేవ శతకృతౌ;
కోటి కన్యా మహా దానం, ఏక బిల్వం శివార్పణం. ||10||
బిల్వనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాప నాశనం;
అఘోర పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ||11||
సహస్ర వేద పాఠేషు, బ్రహ్మ స్థాపన ముచ్చతే;
అనేక వ్రత కోటీనాం, ఏక బిల్వం శివార్పణం. ||12||
అన్నదాన సహశ్రేషు, సహస్రోప నయనంతాధా,
అనేక జన్మ పాపాని, ఏక బిల్వం శివార్పణం. ||13||
బిల్వాష్టక మిదం పుణ్యంయః, పఠేచ్ఛివ సన్నిధౌ;
శివలోక మవాప్నోతి, ఏక బిల్వం శివార్పణం. ||14||



స్టేషన్ ఎప్పుడొస్తుందో? (పెద్దలకు మాత్రమే) Duvvuri Vn Subbarao

స్టేషన్ ఎప్పుడొస్తుందో?
(పెద్దలకు మాత్రమే)

పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ
హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?
నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా
అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!
ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే
తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!
నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి,
పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి,
ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !
అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే,
నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, ‘మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !
అయినా ఏం లోటయిందని ?
వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ,
వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!
ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !
ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు!
చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?
పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!
మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…
ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు…
గజ గజ లాడ
Duvvuri Vn Subbarao

Saturday, June 25, 2016

ఉదయం 9 గంటలు ...
హైదరాబాద్ లో ఒక కార్పోరేట్ హాస్పిటల్.
అంతిమ గడియల్లో ఒక వ్యక్తి తన భార్యా పిల్లల్ని పిలిచి చివరి మాటలు మాట్లాడుతున్నాడు.

"చూడండి జీవితంలో యేదీ శాశ్వతం కాదు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. యెవ్వరితోను గొడవలు పెట్టుకోవద్దు.
నా స్వయం శక్తితో ఎన్నో మేడలు ఇళ్ళు సంపాదించాను వాటిని జాగ్రత్తగా కాపాడండి.
పెద్ద కొడుకుని చూస్తూ ... నాయనా హిమాయత్ నగర్ లోని నా 15 బంగళాలు ఇక నీవే.
కూతురితో .. ఖైరతబాద్ లోని 14 బంగళాలు నువ్వు తీసుకో.
చిన్న కొడుకుని చూస్తూ ... నువ్వు చిన్నవాడివి నీ భవిష్యత్తు చాలా బాగుండాలి అందుకే దిల్ శుక్ నగర్ లో నాకున్న 20 కమర్షియల్ బిల్డింగులు నువ్వు తీసుకో.

పెళ్ళాం వైపు చూస్తూ .. రాజ్యం నేను లేను లోటు నీకస్సలు తెలియకూడదు.. అందుకే అందరు మన ఆత్మీయులే ఉండే నల్లకుంటలోని మన జనప్రియ అపార్ట్ మెంట్ లోని 15 ఫ్లాటులు నువ్వు తీసుకో అని చెప్పి తన కష్టపడీ సంపాదించుకున్న యావదాస్తిని సమానంగా పంచానన్న తృప్తితో  ప్రాణాలు విడిచి దైవలోకానికి ప్రయాణమయ్యాడు.

ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న నర్స్, మీరందరూ అదృష్టవంతులమ్మ ఇంత మంచి వ్యక్తి చివరి నిమిషంలో అందరినీ తృప్తి పరుస్తూ ఆఖరికి ఇంత పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ కి 5 లక్షల బిల్లు చేసి మరీ చనిపోయారు అంది...

అప్పుడా పెళ్ళాం అవునమ్మా...

!

!

!

!

!

!

!

!

!

!

!

!

వాడు పంచి ఇచ్చింది .....వాడు తెల్లారగట్ల నిద్రలేచి పాల పాకెట్ లు వేసే గిరాకీల కొంపలు..
ఇక మీ హాస్పిటల్ బిల్లు ఆరోగ్యశ్రీ కార్డు. తల్లీ...

నర్స్ స్పృహ కోల్పోయి కింద పడుంది.

Thursday, June 23, 2016

*ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న:*
*నాశనమయ్యే ఈ శరీరంలో నాశం లేని ఆత్మ ఎలా ఉంటుంది?*
👤 *దానికి గురువుగారు అన్నారు,*
*పాలు ఉపయేగపడేవే, కాని ఒక్క రోజుకు మించితే పాడైపోతాయి*.
*పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. పెరుగు మరొక రోజు వరకు ఉపయోగపడుతుంది*.
*కాని పెరుగు మరొక రోజుకి పాడైపోతుంది*.
*పెరుగును మదిస్తే వెన్న అవుతుంది*.
*వెన్న మరొక రోజు వరకే ఉంటుంది.*
*తరువాత అదికూడా పాడైపోతుంది*.
*ఆ వెన్నను మరిగిస్తే నెయ్య అవుతుంది.*
*ఈ నెయ్య ఎన్నటికి పాడవ్వదు*.
*ఒక్కరోజులో పాడైపోయే పాలలో, ఎన్నటికి పాడవ్వని నెయ్యి దాగివుంది.*
*అలాగే అశాశ్వతమైన ఈ శరీరమునందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది*.
*మానవ శరీరము పాలు*
*సంకీర్తన మజ్జిగ*
*సేవ వెన్న
*సాధన నెయ్యి*.
*మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే*
*ఆత్మ పవిత్రత పొందుతుంది. 💐💐

శుభోదయం 💐💐💐💐



Thursday, June 16, 2016


ఓం శ్రీ మాత్రే నమః 




సామెతలు లేదా లోకోక్తులు!!
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి!!!
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి పుర్రె అనే మాటను మెదడు అనే అర్ధం లో వాడారు. జిహ్వ అంటే నాలుక. ఏ ఇద్దరి ఆలోచన ఒక తీరుగా ఉండదు. అంటే ఏ రెండు మెదళ్లూ ఒకరకంగా అలోచించవు, ఒక విషయానికి ఒకేరకంగా స్పందించవన్నమాట. అలాగే ఏఇద్దరికి ఒక రుచి నచ్చదు, ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రుచిని ఇష్టపడతారు. ఒకరు తీపి, ఒకరు పులుపు, మరొకరు కారం... అలాగే అమ్మకు గులాబీరంగు ఇష్టమైతే, నాన్నకు నీలం రంగు ఇష్టం, పాపాయికేమో ఎరుపంటే తగని మురిపెం. ఇలా రుచుల్లోనూ, అభిరుచుల్లోనూ ఒకరిని పోలి మరొకరు ఉండరు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక టేస్ట్‌ ఉంటుంది అని చెప్పడానికి వాడుకలోకి వచ్చిన నానుడి ఇది. ఏ రెండు నాలుకలు ఒక రుచిని ఇష్టపడవన్న సంగతి అనుక్షణం నిరూపణ అవుతూనే ఉంటుంది కాని రెండు మెదళ్లు ఒక విధంగా ఆలోచించవన్న విషయం సందర్భానుసారంగా నిరూపణ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ మాటను వాడతారు.
                                                                        శుభోదయం!!

Wednesday, June 15, 2016

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి రోజు మనవైన..ఘనసాహితీ,సంపదలనుపంచుకుని...పెంచుకుందాం.
" అంతా మన మంచికే "
ఎప్పుడు ఏది జరిగినా అది మన మంచికే అనుకోవడం లో హాయి ఉంటుంది. మనిషిలో సానుకూల దృక్పదం అలవాటు అవుతుంది. ఒకసారి ఓ రాజుతో మంత్రి ' ఏది జరిగినా మన మంచికే ' అన్నాడు. అలా అన్నందుకు రాజుకు కోపం వచ్చి మంత్రిగారి వేలు తీయించేశాడు. ' ఇప్పుడు కూడా అంతా మన మంచికేనా?' అని రాజు అడిగిన ప్రశ్నకి మంత్రి ' అవున ' ని అన్నాడు. కోపంతో రాజు మంత్రిని అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. అడవిమనుషుల నరబలి కోసమని వెతుకుతూ మంత్రి కనపడగానే ఆయనని బలి ఇవ్వడానికి తీసుకువెళ్లారు. తీరా చూస్తే ఆయన చేతికి నాలుగు వేళ్లే ఉన్నాయి. అందుకని బలికి పనికిరాడని విడిచిపెట్టేశారు. కాబట్టి అంతా మన మంచికే అని మంత్రి అను కున్న మాట ఎంత కరెక్టో అర్ధం అయ్యిందా . అందుకే ఎప్పుడయినా ఏది జరిగినా అది ' అంతా మన మంచికే ' అనుకోవడం అలవాటు చేసుకుందాం!!


అంతా సాయిమయం ఈ జగమంతా
సాయిమయం అంతా సాయిమయం
సాయి సాయి అని వేడుము మనసా..మనసా..ఆ..ఆ...(2)
సాయి నీడనే కోరుమో మనసా
సాయిపదములూ వీడకు మనసా
సాయే మనకు మార్గము మనసా ||అంతా||
ఏ రూపులో నున్నా సాయిని గనుమా
ఏ పేరుతో నున్న సాయిని గనుమా
ఏ చోట ఎందున్న సాయిని గనుమా
కనుపాపలా నిన్నూ కాయును మనసా || అంతా||
సత్యములోనున్నా సాయినీ చూడూ
ధర్మములోనున్న సాయినీ చూడు
సహనంలోనున్న సాయినీ గాంచీ
శాంతి సాధనంతో సాయిని గనుమా..||అంతా||
ప్రేమే ప్రేమకు మార్గము మనసా
ప్రేమే భక్తికి మార్గము మనసా
ప్రేమే శక్తి ప్రేమే సంపదా
ఈ జగమంతా ప్రేమమయంరా...||అంతా||





Tuesday, June 14, 2016

అనగనగా ఒక ఊరిలో ఆనపకాయంత అడవి ఉండేది. అందులో ఓ ములక్కాడంత ముసలమ్మ..అలా దారిలో వెళ్తూ ఉంటే ఆమెకి బంగాళదుంపంత బంగారం దొరికింది. అది ఇంటికి తెచ్చుకుని బీరకాయంత బీరువాలో దాచి, తాటికాయంత తాళం వేసింది. ఆ రోజు రాత్రి దొండకాయంత దొంగోడు ఆ తాటికాయంత తాళం బద్దలుకొట్టి బీరకాయంత బీరువాలో ఉన్న బంగాళదుంపంత బంగారాన్ని దోచుకుని పారిపోతాడు. ములక్కాడంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకి చెప్తే, వాళ్ళు జీలకర్రంత జీపేసుకుని దొండకాయంత దొంగ ని పట్టుకుని జీడిపప్పంత జైల్లో పెట్టారు. ఆ దొంగోడు....కరక్కాయంత కన్నం పెట్టి పారిపోయాడు.
రెండు మూడేళ్ళ పిల్లలకి వంటగదిలో కూర్చోపెట్టి ఈ కథ చెప్పండి. కూరగాయలు గుర్తు పెట్టుకోవటం తేలిక అవుతుంది 
మన తెలుగువాళ్ళకు 'కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.
1. మొదలు పెట్టె కారం -- శ్రీకారం
2. గౌరవించే కారం ----సంస్కారం,
3. ప్రేమ లో కారం --- మమకారం 
4. పలకరించేకారం ----నమస్కారం,
5. పదవి తో వచ్చే కారం ---అధికారం,
6. అది లేకుండా చేసే కారం------ అనధికారం,
7. వేళాకోళం లో కారం ---- వెటకారం
8. భయం తో చేసే కారం ---- హాహాకారం,
9. బహుమతి లో కారం --- పురస్కారం,
10. ఎదిరించే కారం --- ధిక్కారం
11. వద్దని తిప్పికొట్టే కారం-----తిరస్కారం,
12. లెక్కల్లో కారం --- గుణకారం,
13. గుణింతం లో కారం -- నుడికారం
14. గర్వం తో వచ్చే కారం ---- అహంకారం,
15. సమస్యలకు కారం ----- పరిష్కారం,
16. ప్రయోగశాల లో కారం------- ఆవిష్కారం,
17. సంధులలో కారం --- 'ఆ'కారం,
18. సాయం లో కారం --- సహకారం
19. స్రీలకు నచ్చే కారం--- అలంకారం,
20. మేలు చేసే కారం ----ఉపకారం,
21. కీడు చేసే కారం -- అపకారం
22. శివునికి నచ్చే కారం ---- ఓం కారం,
23. విష్ణువు లో కారం ----శాంతాకారం,
24. ఏనుగులు చేసేది --- ఘీంకారం
25. మదం తో చేసే కారం --- హూంకారం,
26. పైత్యం తో వచ్చే కారం --వికారం,
27. రూపం తో వచ్చే కారం --ఆకారం
28. ఇంటి చుట్టూ కట్టే కారం -- ప్రాకారం,
29. ఒప్పుకునే కారం --- అంగీకారం,
30. చీదరించుకునే కారం ---చీత్కారం
31. పగ తీర్చుకునే కారం---- ప్రతీకారం,
32. మిత్రులందరికీ -----నమస్కారం

శుభోదయం ../\...


Monday, June 13, 2016

1960 - 1990 మధ్యలో
మీరు పుట్టినవారే అయితే

ఇది
మనకోసం..

వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది
మనదే చివరి తరం.

పోలీస్ వాళ్ళని
నిక్కర్లలో చూసిన
తరమూ మనదే.

స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని
కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే

చాలా దూరం అయితే
సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు

స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.

మనమే మొదటగా వీడియో గేములు ఆడటం.
కార్టూన్స్ ని రంగులలో చూడటం.

అమ్యూజ్ మెంట్ పార్కులకి
వెళ్లటం.

రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్
చేసినవాళ్ళం.

అలాగే
వాక్ మ్యాన్ తగిలించుకొని
పాటలు వినేవాళ్ళం.

VCR ని ఎలా వాడాలో తెలుసుకొని
వాడిన తరం మనదే..

అలాగే
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన
తరం కూడా మనదే.

అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.

సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..

సైకిల్లకి బ్రేకులు లేకుండా
రోడ్డు మీద ప్రయాణించిన
ఆ రోజులు మనవే.

మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.

స్కూల్ కి
కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా,
జుట్టు కూడా దువ్వుకోకుండా
మామూలు బట్టలతో వెళ్ళాం

ఇప్పటి తరం
అలా ఎన్నడూ వెళ్ళలేదు

స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.

స్నేహితుల మధ్య
" కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.

ఎవరూ
ఆస్తులు, అంతస్థులు చూడకుండా
స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,

చెరువు గట్ల వెంట,
కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.

జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.

సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల
కుప్పలు ఆడిన తరము మనదే.

శుక్రవారం సాయంత్రం
" చిత్రల హరి" కోసం
ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే

ఆదివారం ఉదయం
9 కి పనులు
తప్పించుకుని
"మహాభారతము"
" రామాయణం"
" శ్రీకృష్ణ" చూసిన
తరమూ మనదే...

ఉషశ్రీ గారి
భారత రామాయణ ఇతిహాసాలు
రేడియోలో విన్నది మనమే,

అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా
చూసుకున్న ఘనతా మనదే ..

ఆదివారం ఒక గంట
అద్దె సైకిల్ కోసం
రెండు గంటలు వేచి ఉన్నది మనమే...

పలకలని వాడిన
ఆఖరు తరం కూడా మనదే.

రుపయికు
థియేటర్ లో సినిమా చూడడానికి
రెండు కిలోమీటర్ లు
నడిచిన కాలం..

గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన
కాలం..
మనమే.. మనమే
అమ్మ 5 పైసలు ఇస్తే
బఠానీలు తిన్నదీ మనమే..

గోర్లపైన కొంగ గోరు గుర్తులు
చువ్వాట..
సిర్రగోనే ఆట..
కోతి కొమ్మ...
అష్ట చెమ్మ...
ఆడిన
తరము మనదే.

క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,
కనీసం 20 ఫోన్
నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.

ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..

మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ,
ఫ్లాట్ స్క్రీన్స్,
సరౌండ్ సౌండ్స్,
MP3, ఐ ప్యాడ్స్,
కంప్యూటర్స్,
బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్...
లేకున్నా
అంతులేని ఆనందాన్ని పొందాం.

మన పిల్లలకు అవి తెలియదు
మన పెద్దలకు ఇవి తెలియదు
కానీ
మనం అవి ఇవి చూశాం

ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు.
మీ స్నేహితులందరికి పంపండి ☺😊☺😊
నడిచేదేముడు యవత్తుభారతాన్ని పాదచారిగా రెండుమార్లు పర్యటించి తల్లి భారతని ఆమె పుత్రులని పునీతులనిగావించిన పరివ్రాజకాచార్యులు , చతుర్వేదములు ఒౌపాశన పట్టిన వేదమూర్తులు, పరమవైరాగ్య భావనతో సనాతన సంప్రదాయ వైభవాన్ని ప్రకటింపజేసిన ధర్మమూర్తులు, ఆర్తులైదరిచేరిన పామరపండితుల క్లేశములు చెప్పకుండానే గ్రహించి నివారణ యొనరించిన త్రికాలఙ్ఞలు , చారిత్రక పురావస్తు ఇతిహాస దృక్పధాలతో విశేషమైన విషయాలను అనేక ప్రాచీన దేవాలయాలలో దర్శించి భక్తులకు దిశానిర్ధేశం చేసిన ప్రాఙ్ఞులు, ఆర్షవాఙ్మయ వైఖరిలోపించిన ప్రజకు అపారమైన వివిధశాస్రములు సమన్వయ పరచి అనుగ్రహభాషణము లొసంగిన అపరశారదామూర్తులు, దీనజన ఉద్ధరణకై నిత్యచంద్రమౌళీశ్వర అర్చన జరిపిన తేజోమూర్తులు , సదాచార సంప్రదాయ ధర్మాల ద్వార సర్వజన సంక్షేమము ఎంత సులభముగా సిధ్ధిస్తుందో నిరూపించి స్వధర్మ భ్రష్టులని కాపాడిన తల్లికామాక్షీ వరప్రసాది, లవలేశమంత కలిప్రభావముశోకని  ఙ్ఞాని , ఆధునిక విద్యా భోగలాసతల మరియు వికృత ఆశయాల మాలిన్యంలో మసిబారిన బుద్ధులకి  అసలు గురువంటే ఎలా ఉండాలో ప్రపంచానికి ప్రకటించటం కోసం దేహదారులై భువికేతెంచిన         " శంకరాంశము " శ్రీశ్రీశ్రీ కాంచీపురయత్రీంద్రులు  గురువరేణ్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు  — నేడు మనకళ్ళెదుటే అగుపించే సత్యం దర్శించండి  ఆపదలో వున్న తనశిష్యుడు చేయుంచే హవనములో  పీఠాదిపత్య దండముతో ఇలా సహజముగా విచ్చేసి ఉధ్ధరింపజేసిన                ॐ ॐ బ్మ్రాహీభూతుల సాక్షాత్కారం ॐॐ — పరమాత్ముని పలుకులనాలకిధ్ధాం స్వాభిమాన సంపన్నులమౌదాం  అసలు " గురు" వని ఎవరిని పడితే వారిని సంభోదించవచ్చా ? కనీస విఙ్ఞతలోపిస్తున్న సమాజం మోసగాళ్ళ మాయగాళ్ళ అర్హతలేని శిఖామణుల వెంటపడటం ఎంతటి పాపమో అపచారమో కదా ఈజన్మకాదు ఉత్తర జన్మలకి కూడా వుద్ధరణలేకుండా పోతుంది ఇప్పటికైన గమనించి సరిద్ధికోండి ఈవైభవాన్ని అందరికీ చాటండి కొందరు యోగ్యులైన మార్గాన్ని దిద్ధుకుంటారు " జయ జయ శంకర హర హర శంకర " 
శ్రీమద్భగవద్గీత - కర్మసంన్యాసయోగం

                అనాశ్రిత: కర్మఫలం కార్యం కర్మ కరోతి య: ।
                స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియ: ॥1॥
                   అనాశ్రితః-కర్మఫలం-కార్యం-కర్మ-కరోతి-యః
                   సః-సంన్యాసీ-చ-యోగీ-చ-న-నిరగ్నిః-న-చ-అక్రియః

ఎవడు తను నిర్వర్తించవలసిన కర్మను ఫలాన్ని ఆశ్రయించక చేస్తున్నాడో వాడే సన్యాసి, యోగికూడా. అగ్నులనుంచుకొనక నిష్క్రియంగా వుంటున్నవాడు కాదు.

అనాశ్రితః, ఆశ్రయించనివాడై – దేనిని? కర్మఫలం, కర్మల ఫలాన్ని, ఆశ్రయించనివాడై, కర్మఫలమందు కోరికలేనివాడై; కర్మ ఫలమందు కోరికగలవాడు కర్మఫలాన్ని ఆశ్రయిస్తాడు. కానీ, వీడు అందుకు విరుద్ధమైనవాడు. కాబట్టి, కర్మఫలాన్ని ఆశ్రయించనివాడు.

ఇటువంటివాడై, వాడి కార్యం కర్మ, నిర్వర్తించవలసిన కర్మలను, కర్తవ్యాన్ని, కామ్యకర్మలకు విరుద్ధమైన అగ్నిహోత్రాది నిత్యకర్మలను; య:, యెవడు; కరోతి, చేస్తున్నాడో, నిర్వర్తిస్తున్నాడో - ఈ విధంగా కర్మను ఆచరిస్తున్నవాడు ఇతరవిధమైన కర్మలను ఆచరిస్తున్నవారికంటే విశిష్ఠమైనవాడు. ఈ అర్థాన్నే చెబుతూ భగవాన్, సః, వాడు; సన్న్యాసీ, సన్యాసి; ఇంకా వాడు యోగీ చ, యోగి కూడా; అని చెబుతున్నారు. సన్యాసం అంటే పరిత్యజించడం. ఇది యెవరివద్ద వుంటున్నదో వాడు సన్యాసి. వాడు యోగికూడా. యోగం అంటే చిత్త ఏకాగ్రత. ఎవడికి యిది వుంటున్నదో వాడు యోగి. వీడు యిటువంటి గుణసంపన్నుడని అనుకొనవలెను. కేవలం, అగ్నిని వుంచుకొనని వాడిని, (‘నిరగ్ని:’) కర్మను చేయనివాడిని (‘అక్రియ:’) సన్యాసి అనిగానీ, యోగి అనిగానీ అనుకొనరాదు.

నిరగ్ని:, ఎవడినుండి కర్మలను నిర్వహించడానికి అంగాలైన అగ్నులు® నిష్క్రమించినవో వాడు నిరగ్ని:; క్రియా: అంటే అగ్నిని సాధనంగా లేకుండా ఆచరింపబడే తపస్సు, దానంవంటి కర్మలు. అక్రియా:, నిష్కర్మణ్యుడు, అటువంటి కర్మలుకూడా నిర్వర్తించవలసిన అవసరంలేనివాడు॥1॥

ఆక్షేపణ: వేదాలలో, స్మృతులలో యోగశాస్త్రాలలో అగ్నులను వుంచుకొనని వాడికి నిష్క్రియంగా వుంటున్నవాడికి సంబంధించి మాత్రమేగదా సన్యాసిత్వం, యోగిత్వం ప్రసిద్ధంగా వుంటున్నది. ఎందుకు యిక్కడ ఈ సన్యాసిత్వాన్ని, యోగిత్వాన్ని అగ్నులుంచుకొంటూ కర్మను అనుష్ఠిస్తున్నవాడికి సంబంధించి అప్రసిద్ధమైనదానిని భగవాన్ చెబుతున్నారు?

బదులు: ఇది దోషం కాదు. (సామాన్యంగా వుంటున్న) ఏదో ఒక గుణవిశేషతను తీసుకొని సన్యాసిత్వాన్ని యోగిత్వాన్ని – ఈ రెండు భావనలను గృహస్థుడియందు సంపాదింపజేయడం భగవాన్ యొక్క ఉద్దేశ్యం కావడంచే.

ఆక్షేపణ: అది యే విధంగా?

కర్మఫలసంకల్పాన్ని సన్యసించడంచే సన్యాసిత్వం, (ధ్యాన)యోగంయొక్క అంగంగా కర్మను అనుష్ఠించడంచే, చిత్త కకావికలతకు కారణమైన కర్మఫలసంకల్పాన్ని పరిత్యజించడం యోగిత్వం. ఈ రెండూ గౌణంగా (అప్రధానంగా) ఉపయోగింపబడినవి. సన్యాసిత్వ యోగిత్వాలను ముఖ్యంగా (ప్రధానంగా) తీసుకోవడం అభిమతంకాదు. ఈ అర్థాన్ని సూచించే దృష్టితో భగవాన్ అంటున్నారు .....
ఇది ప్రతి తండ్రి-కొడుకు కధ ( మని(షు)ల కధ )
---------------------------------------------------
ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.
అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.
కాకి అని చెప్పేడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి
ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో " అది కాకి, కాకి " అని గట్టిగా చెప్పేడు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు" ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా"
కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.
"ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు.ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.".....ఇది తండ్రి మనస్సు
కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు.......
తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.... పిల్లలే శాశ్వతమని ఆశలు పెట్టుకుంటారు ప్రతి తండ్రి.....బిడ్డ ఎదుగుతుంటే ...పట్టరాని సంతోషం పడతాడు తండ్రి ...ఆ ప్రేమను వెలకట్టలేము ఇది నిజం... కాదంటారా.

మా పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మ - జాతర మహోత్సవాలు

మా పినపళ్ళ గ్రామదేవత గోల్లాలమ్మ ఏటా జాతర మహోత్సవాలు జరుగుతాయి.

మన దేశంలో గ్రామదేవతల ఆరాధన అన్నది అనాదిగా వస్తూన్న ఆచారం, ఊరు పొలిమేరలో ఉండి దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని గ్రామప్రజలను కాపాడతారు. అందుకు గ్రామప్రజలు కృతజ్ఞతగా ఏటేటా వారికి కొలుపులు, పూజలు చేసి తమ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. మరి అటువంటి గ్రామ దేవతలు ఎలా ఉద్భవించారు ఇలా అనేక విషయాలు ఆశక్తి కరంగా వుంటాయి. ఒకసారి గతంలోకి తొంగి చూద్దాం! 
ప్రపంచంలో మనిషి జంతువు నుంచి పరిణామం చెంది మానవునిగా మారే క్రమంలో కొన్ని నమ్మకాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యమైనది మానవాతీత శక్తి ఉందనే నమ్మకం. ఈ అతీత శక్తినే దేవత, లేక దేవుడు అని నమ్మేవారు. ముఖ్యంగా అగ్ని, నీరు, వాయువు, సూర్యుడు, చంద్రుడు వంటి ప్రకృతి శక్తులను ఇలా భావించేవారు. తమకు ప్రమోదం కలిగినా, ప్రమాదం కలిగినా కారణం ప్రకృతిలోని ఏదో ఒక శక్తే అని మనిషి నమ్మాడు. అందుకే ప్రకృతిలోనూ, ఆకాశంలోనూ కనిపించే అనేక సహజమైన శక్తులను దైవశక్తులుగా భావించి పూజించడం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఆరాధన ఇప్పటి ఆటవిక జాతుల్లో పెద్దగా మార్పులేమీ లేకుండానే వేల ఏళ్ళుగా కొనసాగుతున్నాయి.
ఇలాగే ప్రకృతి ఆరాధన విషయంలో ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పటికీ మనవారు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, కొండ, గుట్ట, నదీనదాలు, కుక్క, పాము వంటి చరాచర జీవులన్నింటినీ పూజిస్తున్నారు. మన దేశంలో అతి పెద్ద మతంగా ఉన్న హిందూ మతం నిజానికి మతమే కాదు. అది ప్రకృతిలోని ఒక ప్రాంతం పేరు (సింధ్ అనే ప్రాంతం) కాల క్రమంగా హింద్ గా మారటం వల్ల ప్రచారంలోకి వచ్చిన పేరు. హిందూ మతంగా చెప్పుకుంటున్న జీవన విధానంలో ఉన్నదంతా ప్రకృతి శక్తుల ఆరాధనే. ప్రకృతే సృష్టికి మూలంగా భావించి ఒక శక్తిగా కొలవడం మొదట ప్రారంభం అయింది. భూమిపై పెరిగే మొక్కలే మిగిలిన జీవరాసులందరికీ జీవనాధారం కాబట్టి భూమిని భూమాత అన్నారు. సూర్యుడు లేకపోతే జీవ ప్రపంచం మనుగడ కష్టమని అర్థమయిన తరువాత సూర్యభగవానుడన్నారు. బతకడానికి గాలి, నీరు అత్యంత ముఖ్యమైనవి కాబట్టి వాటిని వాయు దేవుడు, వరుణ దేవుడు (వర్షాన్నిచ్చే దేవుడు) అన్నారు. సకల నదులు, ఏరులు గంగాదేవిగా పూజలందుకోవడం ప్రారంభమయింది. ఇక అమ్మవార్ల విషయానికి వస్తే ప్రపంచంలో ఎందరో అమ్మదేవతలు ఉన్నారు. వారిలో మన దేశానికి వచ్చేటప్పటికి అదితి, లజ్జాగౌరి, రేణుక అనేవారు ముఖ్యులు.
మిగతా వివరాలు మరో మారు చెప్పుకుందాం! మొన్న మా పినపళ్ళ గ్రామంలో జరిగిన గోల్లాలమ్మ వారి జాతర దృశ్యాలు తిలకించండి! అమ్మవారిని దర్శించండి సంపూర్ణ అనుగ్రహాన్నిపొందండి. సత్యసాయి విస్సా ఫౌండేషన్.

teluguthesis.com| Download Telugu books and Sanskrit books free: దాశరథి రంగాచార్యుల రచనలు Dasharathi Ranga Acharya ...

teluguthesis.com| Download Telugu books and Sanskrit books free: దాశరథి రంగాచార్యుల రచనలు Dasharathi Ranga Acharya ...: దాశరథి రంగాచార్యుల రచనలు  Dasharathi Ranga Acharya Rachanalu దాశరథి రంగాచార్యుల రచనలను అంతర్జాలంలో లభించిన వాటిని ఒక్కదగ్గర ...

Saturday, June 11, 2016

Kshetra School: మీరు ఇంటి నుంచి ఏమి నేర్చుకోవాలి?

Kshetra School: మీరు ఇంటి నుంచి ఏమి నేర్చుకోవాలి?: `మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?` అనే పేరుతో వాడ్రేవు చినవీరభద్రుడు రాసి, ఎమెస్కో పబ్లికేషన్స్ వాళ్ళు ముద్రించిన పుస్తకం మన స్కూల్ లై...

Kshetra School: అబ్రహం లింకన్ వ్రాసిన లేఖ

Kshetra School: అబ్రహం లింకన్ వ్రాసిన లేఖ: అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన కుమారుడిని స్కూల్‌లో చేరుస్తున్నప్పుడు రాసిన ఉత్తరం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. తన కుమారుడు స్కూ...

Thursday, June 9, 2016

ఒక పండితుడు ఇంకో పండితుడి గ్రామానికి బస్సు లో వస్తున్నానని కబురు చేశాడు.
తన ఇంటికి వస్తున్నఆ పండితుడిని ఆహ్వానించడానికి ఈయన ఎడ్లబండి కట్టుకొని ఆ బస్సు వచ్చే చోటికి వెళ్తాడు.
అది గ్రామానికి 3,4 మైళ్ళ దూరంలో వుంది..వెళ్లి ఆ పండితుడిని సాదరంగా ఆహ్వానించి
బండి లో కూర్చో బెట్టి   బయల్దేరాడు . త్రోవ బాగా లేకపోవడం వల్ల బండి కుదుపులతో నడుస్తూ వుంది.కుదుపులు ఎక్కువవడం తో  .

పోరుగూరినుంచి  వచ్చిన శాస్త్రి గారు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.
 దానికి ఆ బండి యజమాని శాస్త్రి గారూ
మీరంటున్నది షష్టీ తత్పురుష మా లేక కర్మధారయమా?అన్నాడు నవ్వుతూ
 షష్టీ తత్పురుషము అంటే వెధవ యొక్క బండి
అనే అర్థము వస్తుంది
 కర్మధారయ మైతే 'వెధవ యైన బండి' అని అర్థము వస్తుంది.(బండి యొక్క యజమాని వెధవనా?బండి వెధవదా?)
ఆ శాస్త్రి గారు నవ్వుతూ యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి.
 (అంటే వెధవ కొరకు యిలాంటి బండి) అన్నాడు.
యిద్దరూ హాయిగా నవ్వుకున్నారు..
 ఆ కాలం పండితులు అలాంటి చెణుకులు విసురుకునేవారు.

ఒక శిష్యుడు గురువుగారి దగర విద్య నభ్యసించి,పెళ్ళిచేసుకొని ఊరిబయట ఇల్లు కట్టుకొని స్థిరపడినాడు.

ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద ఆ దారిలో వెడుతూ శిష్యుడి యింటికి వచ్చినారు.
శిష్యుడు అతడి భార్య
ఆయనకు చక్కని ఆతిథ్య మిచ్చి పంచల చాపు యిచ్చి కాళ్ళకు నమస్కారము చేసినారు.
అప్పుడు గురువు
ఒక శార్దూల వృత్తము(పద్యము) లోమధ్యలో ఒక వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు శిష్యుడు నవ్వుతూ
 గురువుగారూ! మా ఆతిథ్యము స్వీకరించి మా యింట శార్దూలమును(పులిని) విడిచి
వెళ్ళుట మీకు న్యాయమేనా?
అన్నాడు.
 గురువు గారు నవ్వుతూ ఆ శార్దూలమును మంత్రించి వదిలానులే
నీకు యేమీ అపకారము చెయ్యదు.
పైగా నీవు ఊరిబయట ఇల్లు కట్టుకున్నావు.
పంచమీ తత్పురుషము
లేకుండా ఈ షష్టీ తత్పురుషము కాపలా పెట్టాను..అన్నారు.

పంచమీ తత్పురుషము నకు అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగ వలన భయము'
షష్టీ తత్పురుషము నకు
ఉదాహరణ 'కుక్క యొక్క కాపలా'
ఈ గురువుగారు దొంగ వలన భయము లేకుండా శార్దూలము యొక్క కాపలా పెట్టారు.

ఇప్పటి లాగా అప్పటి వాళ్ళు గుమ్మం దగ్గరనుండే టాటా బై బై చెప్పేవారు కాదు.
గురువుగారిని బండీలో ఎక్కించి మీరు మళ్ళీ మా యింటికి దయచేయ్యాలి అన్నాడు శిష్యుడు.
 అందుకు గురువు గారు నవ్వుతూ
నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే అన్నాడట.
ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ
'భార్యా భర్తలు' 'తల్లిదండ్రులు'యిస్తారు మామూలుగా.
ద్వంద్వా తీతుడంటే మీ భార్యాభర్తలు తల్లిదండ్రులైనప్పుడు అంటే మీకు సంతానము కలిగినప్పుడు మళ్ళీ వస్తాను.అని అర్థము.


పూర్వము అంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


క్షీరాబ్ది కన్యకకు శ్రీమహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం॥
జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు
నెలకొన్నకప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువమాణిక్యముల నీరాజనం॥
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం॥
పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం॥





మంచిమాట



శుభోదయం../\..
దేవుడు ఎక్కడో లేడు నిన్ను కన్న అమ్మ రూపం లోనే అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ వుంటాడు.దేవుళ్ళు తాగిన అమృతం కంటే గొప్పది అమ్మ ప్రేమ. ప్రపంచం కూడా చిన్నబోతుంది అమ్మ ప్రేమ ముందు.అలాంటి అమ్మను మనం ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేము. మరో జన్మ వుందో లేదో తెలీదు, కనీసం ఈజన్మలోనైన అమ్మను మనస్పూర్తిగా ప్రేమిద్దాం.... గౌరవిద్దాం. మన ముందు తరానికి ఆదర్శంగా నిలుద్దాం. ఏమంటారు మిత్రులారా ?




Thursday, June 2, 2016

జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం....తెలంగాణా ఆవిర్భావ శుభదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలుతెలంగాణా ఆవిర్భావ శుభాదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు




తెలంగాణా ఆవిర్భావ శుభదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలుగు రాష్రాలు రెండూ అభివృద్ది పదంలో పయనించి భారతావనికి ఆదర్శం కావాలని ఈ శుభవేళ ఆశిస్తూ మా ఆత్మీయ కవిమిత్రుడు  శ్రీ అందెశ్రీ గారు ఎంతో ఆర్తితో రాసిన...అదే ఆర్తితో ...తన దైన సహజ గళ మాధుర్యంతో ప్రసిద్ధ నేపధ్యగాయకుడు శ్రీ రామకృష్ణ గారు ఎంతో హృద్యంగా ఆలపించిన ఈ మహాద్భుత గీతం..."మిలేసురు మేరా తుమ్హారా" గీతం మన దేశాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో...అలా తెలంగాణా రాష్ట్ర గీతం ప్రతిబింబిస్తోంది...ఈ గీతం వింటున్నప్పుడల్లా మనసు ఒకసారి ఒక అలౌకిక ఆనందానుభూతి...కలుగుతుంది.  అమ్మని ఆర్తితో ఆలింగనం చేసుకున్న అనుభూతిని అందిస్తుంది...ఆస్వాదించండి...ఎప్పుడైనా ఈ లంకె నొక్కి ఆ పారవశ్యాన్ని...తనివి తీరా అనుభూతించండి...సత్యసాయి విస్సా ఫౌండేషన్.        
http://www.youtube.com/watch?v=VlQ81OFwPi0

జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదిజిల్లల నీపిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమరం భీముడే నీబిడ్డ
కాకతీయ కళాప్రభాల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యం నీ గానం... అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలె
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

Wednesday, June 1, 2016

అల్లరి చేద్దాం రండి!

అల్లరి చేద్దాం రండి! 
నేను నా బలమిత్రులు, ప్రతిరోజూ ఉదయం గం. 6.30 ని.లకు పార్క్ లో అశ్వత్థ వృక్ష (రావి చెట్టు) క్రింద ఆ రావి ఆకుల గలగలలు వింటూ కోయిల ఇతర పక్షుల కూజితాలు వింటూ చరవాణిలొ సంగీతం వింటూ యోగా, తెలుగు తరగతి, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ మరియు సాయంత్రం తెలుగు తరగతి, చిత్రలేఖనం, నృత్యాలు, శనివారం టోరీ రేడియో కార్యక్రమం, ఆదివారం ఉదయం పార్క్ లో స్వచ్చ భారత్, మొక్కలకు నీళ్ళు పెట్టడం, తెలుగు ఆటలు, పాటలు, మాటలు ఓహ్ ఒకటేమిటి అల్లరే అల్లరి, ఇదిగో ఆ చిత్రాలు చూడండి, తెలుగు మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రావచ్చు మా విస్సా ఫౌండేషన్ బాలమిత్రుల్లో చేరవచ్చు. ఇదే మా ఆహ్వానం!





























 సత్య సాయి విస్సా ఫౌండేషన్.

Total Pageviews