Wednesday, June 15, 2016

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి రోజు మనవైన..ఘనసాహితీ,సంపదలనుపంచుకుని...పెంచుకుందాం.
" అంతా మన మంచికే "
ఎప్పుడు ఏది జరిగినా అది మన మంచికే అనుకోవడం లో హాయి ఉంటుంది. మనిషిలో సానుకూల దృక్పదం అలవాటు అవుతుంది. ఒకసారి ఓ రాజుతో మంత్రి ' ఏది జరిగినా మన మంచికే ' అన్నాడు. అలా అన్నందుకు రాజుకు కోపం వచ్చి మంత్రిగారి వేలు తీయించేశాడు. ' ఇప్పుడు కూడా అంతా మన మంచికేనా?' అని రాజు అడిగిన ప్రశ్నకి మంత్రి ' అవున ' ని అన్నాడు. కోపంతో రాజు మంత్రిని అడవిలో వదిలేసి వెళ్లిపోయాడు. అడవిమనుషుల నరబలి కోసమని వెతుకుతూ మంత్రి కనపడగానే ఆయనని బలి ఇవ్వడానికి తీసుకువెళ్లారు. తీరా చూస్తే ఆయన చేతికి నాలుగు వేళ్లే ఉన్నాయి. అందుకని బలికి పనికిరాడని విడిచిపెట్టేశారు. కాబట్టి అంతా మన మంచికే అని మంత్రి అను కున్న మాట ఎంత కరెక్టో అర్ధం అయ్యిందా . అందుకే ఎప్పుడయినా ఏది జరిగినా అది ' అంతా మన మంచికే ' అనుకోవడం అలవాటు చేసుకుందాం!!

No comments:

Post a Comment

Total Pageviews