సామెతలు లేదా లోకోక్తులు!!
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి!!!
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి పుర్రె అనే మాటను మెదడు అనే అర్ధం లో వాడారు. జిహ్వ అంటే నాలుక. ఏ ఇద్దరి ఆలోచన ఒక తీరుగా ఉండదు. అంటే ఏ రెండు మెదళ్లూ ఒకరకంగా అలోచించవు, ఒక విషయానికి ఒకేరకంగా స్పందించవన్నమాట. అలాగే ఏఇద్దరికి ఒక రుచి నచ్చదు, ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రుచిని ఇష్టపడతారు. ఒకరు తీపి, ఒకరు పులుపు, మరొకరు కారం... అలాగే అమ్మకు గులాబీరంగు ఇష్టమైతే, నాన్నకు నీలం రంగు ఇష్టం, పాపాయికేమో ఎరుపంటే తగని మురిపెం. ఇలా రుచుల్లోనూ, అభిరుచుల్లోనూ ఒకరిని పోలి మరొకరు ఉండరు. ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక టేస్ట్ ఉంటుంది అని చెప్పడానికి వాడుకలోకి వచ్చిన నానుడి ఇది. ఏ రెండు నాలుకలు ఒక రుచిని ఇష్టపడవన్న సంగతి అనుక్షణం నిరూపణ అవుతూనే ఉంటుంది కాని రెండు మెదళ్లు ఒక విధంగా ఆలోచించవన్న విషయం సందర్భానుసారంగా నిరూపణ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ మాటను వాడతారు.
No comments:
Post a Comment