Thursday, June 2, 2016

జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం....తెలంగాణా ఆవిర్భావ శుభదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలుతెలంగాణా ఆవిర్భావ శుభాదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు




తెలంగాణా ఆవిర్భావ శుభదినోత్సవ సందర్భంగా తెలంగాణా సోదరీ సొదరీమణులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలుగు రాష్రాలు రెండూ అభివృద్ది పదంలో పయనించి భారతావనికి ఆదర్శం కావాలని ఈ శుభవేళ ఆశిస్తూ మా ఆత్మీయ కవిమిత్రుడు  శ్రీ అందెశ్రీ గారు ఎంతో ఆర్తితో రాసిన...అదే ఆర్తితో ...తన దైన సహజ గళ మాధుర్యంతో ప్రసిద్ధ నేపధ్యగాయకుడు శ్రీ రామకృష్ణ గారు ఎంతో హృద్యంగా ఆలపించిన ఈ మహాద్భుత గీతం..."మిలేసురు మేరా తుమ్హారా" గీతం మన దేశాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో...అలా తెలంగాణా రాష్ట్ర గీతం ప్రతిబింబిస్తోంది...ఈ గీతం వింటున్నప్పుడల్లా మనసు ఒకసారి ఒక అలౌకిక ఆనందానుభూతి...కలుగుతుంది.  అమ్మని ఆర్తితో ఆలింగనం చేసుకున్న అనుభూతిని అందిస్తుంది...ఆస్వాదించండి...ఎప్పుడైనా ఈ లంకె నొక్కి ఆ పారవశ్యాన్ని...తనివి తీరా అనుభూతించండి...సత్యసాయి విస్సా ఫౌండేషన్.        
http://www.youtube.com/watch?v=VlQ81OFwPi0

జయజయహే తెలంగాణ... జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పదిజిల్లల నీపిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమరం భీముడే నీబిడ్డ
కాకతీయ కళాప్రభాల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాల జనజాతర
అనునిత్యం నీ గానం... అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద
సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ యెద
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలె
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలే
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలె
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

No comments:

Post a Comment

Total Pageviews