చెన్నై: ప్రముఖ గీత రచయిత నా.ముత్తుకుమార్ తన కుమారుడికి రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. కామెర్ల సమస్యతో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనకు సినీ ప్రమ ుఖులు కన్నీటి తుదివీడ్కోలు పలికారు. ముత్తుకుమార్‌కు తొమ్మిదేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం తన కుమారుడికి ఆయన రాసిన ఓ లేఖ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. అందులో..
‘‘ప్రియమైన కుమారుడికి నాన్న రాస్తున్నది.. ఇది నేను రాసే తొలి లేఖ. దీన్ని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు. భాష వేళ్లు పట్టుకుని.. నడుస్తున్నావ్. నా దగ్గర నుంచి మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే.. నువ్వూ వెతుకుతావు. కానీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చెయ్. ఆ ప్రయాణాలే నీకు విలువైన అనుభవాన్నిస్తాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కో పుస్తకం.. ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మీ తాత, నాన్న పుస్తకాల ప్రపంచంలోనే కనుమరుగయ్యారు. నీ రక్తంలోనూ ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. దక్కిన పని కన్నా.. నచ్చిన పని చెయ్. ఆనందమైన జీవితాన్ని కొనసాగించు. ఎవరైనా సహాయం కోరితే.. అప్పు చేసి అయినా సహాయపడు. అందులో లభించే ఆనందం అద్వితీయమైనది. బంధువులతో సన్నిహితంగానూ ఉండు; దూరంగానూ ఉండు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకన్నా.. విలువైనది స్నేహం మాత్రమే. మంచి స్నేహితులను చేర్చుకో. నీదారి చక్కబడుతుంది. ఇవన్నీ.. మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. నేను నీకు చెప్పదలచి చెబుతున్నవి. నువ్వు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను, అనురాగాన్ని అప్పుడప్పుడు అర్థం చేసుకోగలిగా. రేపు నీకో కొడుకు పుడితే అప్పుడు నా ప్రేమానురాగాలు అర్థమవుతాయి. రేపు, మరునాడు నువ్వు నీ మనవళ్లతో ఏదో ఒక వూరిలో నవ్వులొలుకుతూ మాట్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకం వస్తే.. ఈ లేఖను ఒక్కసారి తీసి చూడు! నీ కంటిలో నుంచి వచ్చే కన్నీటిలో నేనుంటా’.......

No comments:
Post a Comment