Wednesday, September 13, 2017

పాము సాధువు కథ !


⁠⁠⁠⁠⁠పాము సాధువు కథ !
ఓ సారి వూరి వెలుపల ఓ సాధువు గారు కొలువు తీరారు.. ఆ సాధువు గారు కూర్చుని ఉన్న అల్లంత దూరాన పుట్టలో ఉన్న పాము బయటకు వచ్చి బుసలు కొట్టింది . సాదువు గారు దానికి హితబోధ చేసారు చూడు నిన్ను చూసి అందరూ ఎలా భయపడుతున్నారో.. నువ్వు కుడా నాలా సాధువులా జీవించు అని హితం చెప్పారు. సాధువు గారు చెప్పిన మాట విని పాము తన కోపాన్ని తగ్గించుకుంది . ఆహారానికి తప్ప బయటకు రావడం మానేసింది .. మనుషులు ఎవరిని చూసినా బుస కొట్టడం మానేసింది .ఇపుడు జనాలు తనను చూసి భయపడ్డం లేదు..కొందరు ఆకతాయిలు ఇది గమనించి పుట్టలోకి వెళ్లబోతున్న పాము తోకను బట్టి ఈడ్చి నేల కేసి కొట్టారు. ఎలాగో జారవిడచుకుని బ్రతుకు జీవుడా అని పుట్టలోకి జారుకుంది. ఇప్పుడు ఆహారం కోసం పుట్ట నుండి బయటకు రావాలన్నా భయం వేస్తోంది.కొన్నాళ్లకు సాధువు గారు మళ్ళీ వచ్చి అదే చోట కొలువు దీరారు. అందరూ వెళ్లాక పాము బయటకు వచ్చి తన దీన గాథను వివరించింది . అపుడు సాధువు అన్నారు.. పిచ్చిదానా .. నిన్ను నీవు రక్షించుకునేదానికి అయినా బుసకొట్టాలి లేక పోతే ఇంతే.. నిన్ను అపకారం చేయవద్దన్నాను గానీ నిన్ను నీవు రక్షించుకోవద్దు అన్నానా అని చెప్పారు.. దీనిలో నీతి ఏమిటంటే
మనం హిందువులం.. అహింసా పరమో ధర్మ: అని చెబుతాయి మన వేదాలు , శ్రుతులు,ఇతిహాసాలు. మన ధర్మం అహింస అన్నాము కదా అని కనీసం నీ మీద ఉద్ధేశ్యపూర్వక దాడులు జరుగుతున్నా మౌనం వహిస్తే అది చాతకాని తనమే అవుతుంది తప్ప అహింస అనిపించదు. ధర్మాగ్రహం తప్పని సరి.. ఎవరి పాపానికి వారు పోతారులే అనుకుంటే పాము గతే పడుతుంది.

No comments:

Post a Comment

Total Pageviews