" పంచభూత లింగాలు ఏవి ? ఎక్కడ వున్నాయి ? వాటి ప్రాశస్త్యం. "
పృధ్వీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు.
శివుడు ఈ పంచభూతాల స్వరుపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై వున్నాడు.
1. పృధ్వీలింగం --- --- కంచి ( తమిళనాడు )
2. జలలింగం --- --- జంబుకేశ్వరం ( తమిళనాడు )
3. తేజోలింగం --- --- తిరువణ్నామలై ( తమిళనాడు )
4. వాయులింగం --- --- శ్రీ కాళహస్తి ( తిరుపతికి సమీపం )
5. ఆకాశ లింగం --- --- చిదంబరం ( తమిళనాడు )
2. జలలింగం --- --- జంబుకేశ్వరం ( తమిళనాడు )
3. తేజోలింగం --- --- తిరువణ్నామలై ( తమిళనాడు )
4. వాయులింగం --- --- శ్రీ కాళహస్తి ( తిరుపతికి సమీపం )
5. ఆకాశ లింగం --- --- చిదంబరం ( తమిళనాడు )
కంచిలోని ఏకామ్రేశ్వరుడు ప్రుధ్వీలింగమై వున్నాడు. ఇక్కడి మామిడిచెట్టు కారణంగా ఈ దేవుడికి ఏకామ్రేశ్వరుడు అని పేరువచ్చింది. కంచి ఏడు ముక్తి దాయక క్షేత్రాలలో ఒకటి. రామేశ్వరం లోని సైకతలింగం కూడా ప్రుధ్వీ లింగమే.
జంబుకేశ్వరం లోని జలలింగం జలమయమై వుంటుంది. శివునకు జలం చాలా ఇష్టం. శివుడు అభిషేకప్రియుడు. దక్ష హింసవల్ల కల్గిన పాపాన్ని తొలగించుకోవడానికి శివుడు జంబుకేశ్వరం లో తపస్సు చేసాడని పురాణాలు చెపుతున్నాయి.ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరుచినాపల్లి వద్ద వున్నది.
అరుణాచలం తేజోలింగనిలయం.అరుణాచలం చుట్టూ చేసే ప్రదక్షిణం మహాపుణ్య ప్రదానమని పెద్దలు చెపుతారు. ఈ క్షేత్రంలోనే రమణ మహర్షి తపోనిష్టుడై వుండి జ్గ్యాన మార్గోపదేశం పొంది ప్రసిద్ధి పొందారు.
శ్రీకాళహస్తి ని దక్షిణ కైలాసం అంటారు. ఇక్కడ వాయులింగ ప్రతిష్టిత మైనది. సాలెపురుగు, పాము, ఏనుగు అనే తిర్యగ్జంతువులు ఇక్కడ శివలింగాన్ని సేవించి ముక్తి పొందాయని శివపురాణం చెపుతోంది. అందువల్లనే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి కెక్కింది.
ఆకాశలింగం చిదంబరంలో వున్నది. ఇక్కడ విశేషం ఏవిధమైన లింగాకారమూ కనిపించక నిరాకారమైన అంతరాలమే కనిపిస్తుంది. ఇది రూప రహితలింగం. అందువల్లనే ఆకాశ లింగంగా ప్రసిద్ధి చెందినది.ఆకాశంలాగా శివుడు ఆత్మ సర్వవ్యాపి అని దీని వల్ల తెలుస్తుంది. ఈ క్షేత్రం నిర్వికల్ప సమాధికి దోహదకారి.
ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచ భౌతికమైన జగమంతా దైవస్వరూపమే అని చాటి చెపుతున్నాయి. ఓం నమః శివాయః ..
ఈవిధంగా పంచభూతాలకు ప్రతీకలైన ఈ లింగాలు పాంచ భౌతికమైన జగమంతా దైవస్వరూపమే అని చాటి చెపుతున్నాయి. ఓం నమః శివాయః ..
No comments:
Post a Comment