ఆవు యొక్క పవిత్రత.
గోవు, గంగ, గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవుని నమస్కరించి... పూజిస్తే 33 కోట్ల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుంది.ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మలమూత్రాలను 'పంచగవ్యములు' అంటారు. గోమూత్రంలో వానదేవుడు, గోమయమందు అగ్నిదేవుడు, గో ఘ్రుతమందు సూర్యభగవానుడు , గో దదియందు వాయుదేవుడు, గో క్షీరమందు చంద్రుడు ఉంటారు.గోమయంలో అనేక క్రిమికీటకాలు లేకుండా చేసే శక్తి, అనేక నేత్ర, హృదయ సంబంద రోగాలను పారద్రోలే శక్తి వుంది. ఆవును ముట్టుకున్నంతనే ఆయుష్షు పెరుగుతుందని, అందుకే గోమాత పూజిమ్పదగినడిగా, పరమ పవిత్రమైనదిగా సర్వదేవతలకు ప్రతిరూపం అని పెద్దలు చెపుతారు.
No comments:
Post a Comment