Tuesday, June 9, 2015

శివలింగానికి, నందీశ్వరునుకి మధ్య మనుషులు నడవకూడదు ఎందుకు?

శివలింగానికి, నందీశ్వరునుకి మధ్య మనుషులు నడవకూడదు ఎందుకు?
శివలింగానికి,నందీశ్వరునికి మధ్య మనుషులు నడవకూడదు అనేది సంప్రదయసిద్దమైన ఆచారం.
'అజయోర్ధ్వి యోర్మధ్యే నంది శంకర యోరపి "అనే ప్రమాణాన్ని బట్టి మేకపోతులనడుమ, ద్విజుల నడుమ, 
నంది శంకరుల నడుమ నడువరాదు  అంటారు.ఇందుకు పెద్దలు వివరించే కారణం శివుడు భక్తానుగ్రహతత్పరుడు. నంది శివభక్తులలో అగ్రగణ్యుడు, శివునికి వాహనమైన వాడు శివుని పాదపద్మాలను ఎడ తెగకుండా నందీశ్వరుడు దర్శిస్తుంటాడు. శంకరుడు కూడా అవిచ్చిన్నంగా భక్తాగ్రగణ్యుడైన నందీశ్వరునిపై అనుగ్రహం  ప్రసరింప చేస్తుంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్చేదం ఏర్పడుతుంది. అందువల్ల శివలింగం, నందీశ్వరుల మధ్య నడువరాదని పెద్దలు చెపుతారు.



No comments:

Post a Comment

Total Pageviews