Thursday, March 26, 2015

దేవీ దేవతల చేతులలోనున్నవాటికి వాటి నామధేయాలకు వారి లీలలకు వెనుక అంతర్నిగూడ మైన అర్ధాలున్నాయి. మధుర మీనాక్షిదేవి చేతిలో చిలుక ఉంటుంది.ఎందుకు?

దేవీ దేవతల చేతులలోనున్నవాటికి వాటి నామధేయాలకు వారి లీలలకు వెనుక అంతర్నిగూడ మైన అర్ధాలున్నాయి.  మధుర మీనాక్షిదేవి చేతిలో చిలుక ఉంటుంది.ఎందుకు?
         మధుర మీనాక్షీదేవిచేతిలో చిలుక జీవునికి, జీవుని ప్రాణానికి లేక మనస్సుకి ప్రతీక. అలాగే మీనాలవంటి కన్నులు కలిగివుంటుంది కాబట్టి  ఆ అమ్మకి మీనాక్షి అని పేరు. ఈ పేరువెనుక ఒక రహస్యం కుడా వుంది. చేపలు గ్రుడ్లుపెట్టి,  వాటిని పొదుగుతాయి. వాటినుండి పిల్లలు వస్తాయి.వెంటనే ఆకలితో అలమటిస్తాయి. చేప సస్తన ప్రాణి కాదు. వాటికి పాలివ్వలేదు. వాటి ఆకలి తీర్చడానికి తల్లిచేప వాటి కళ్ళు విప్పి చూస్తుంది. ఆ చూపుతో వాటి కడుపు నిండుతుంది. అదేవిదంగా విష్ణువు చేతిలోని చక్రం మన మనస్సే. మనస్సు  చక్రం వంటిది. ప్రపంచమంతా తిరిగివస్తుంది. దానిని పరమాత్మ పరంచేస్తే విష్ణు చక్రమవుతుంది.ఆయన చేతిలోని గదమన బుద్ధి. గదకు ప్రతిదాన్ని చితకొట్టే గుణమున్నట్లే.. మన బుద్ధికి ప్రతివిషయాన్ని తర్కంతో విశ్లేషించే దానిని భగవత్పరం చేస్తే భగవదర్పిత బుద్ధిగా మారుతుందని పెద్దలు చెపుతారు.   

No comments:

Post a Comment

Total Pageviews

338,135