తన కోపమె తన శత్రువు... అన్న సుమతీ శతక పద్యం చిన్నతనంలో చదువుకోని వారుండరు. అవి అక్షరసత్యాలు. మనిషికి కోపం రావడం సహజం. దాన్ని ఎదుటివారి మీద ప్రదర్శించకుండా ఉండటం ముఖ్యం. ఒకటినుంచి పది వరకూ లెక్కపెడితే మన కోపం కాస్తా హుష్‌కాకి అయిపోతుందంటారు. అయినా, సమయానికి ఈ విషయం ఛస్తే గుర్తుకురాదు. ఇక తమ కోపానికి కారకులైన వారిమీద విరుచుకుపడటం, తర్వాత తీరిగ్గా విచారించడం ఇదే జరిగేది!
ఒక్కొక్కసారి ఎదుటివారి మీద అకారణంగా కోపం చేసుకోవడం కూడా కద్దు. చాలామంది తమకన్నా అధికులైన వారిమీద వచ్చిన కోపాన్ని తమకన్నా తక్కువ వారిపై తీర్చుకుంటుంటారు. అంటే, భర్తపై కోపం పిల్లలమీద, పై అధికారిపై కోపం తనకన్నా చిన్న పదవిలో ఉన్నవారిపైన తీర్చుకోవడం లాంటివన్నమాట. అలాంటప్పుడు ఆ కోపానికి గురైనవారు అయోమయంలో పడతారు. కారణమేదైనా కానివ్వండి. చెలరేగిన కోపాగ్నిని అణచుకోకుండా బయటకు ప్రదర్శిస్తే ఎన్నో మానవ సంబంధాలను కోల్పోవలసి వస్తుందని గ్రహించాలి. కోపంలో ఉన్న వ్యక్తిలో విచక్షణ నశిస్తుంది. ఎదుటివ్యక్తిని ఆవేశంలో దుర్భాషలాడతారు లేదంటే తూలనాడతారు. ఫలితంగా వారి మధ్య ఉన్న అనుబంధం బీటలువారే ప్రమాదం ఉంది.
గోటితో పోయేదానికి గొడ్డలెందుకన్న సామెత ప్రకారం ఎవరిమీదనైనా కోపం వచ్చినపుడు పదే పదే మనసును శాంతపరచుకోవాలి. ఆ తరువాత ఎవరిమీదైతే కోపం వచ్చిందో, వారికి వారన్న మాటలు తమకు బాధ కలిగించాయని సున్నితంగా తెలియజేయాలి. అప్పుడే ఎదుటివారు మనల్ని అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. ఎదుటివారు తమ తప్పు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అసలు మనిషికి కోపం ఎందుకు వస్తుంది? కొంతమందికి వంశపారంపర్యంగానూ, మరికొందరికి పెంపకలోపంవల్ల కోపిష్టి మనస్తత్వం వచ్చే అవకాశం ఉంది. చిన్నతనంలో కోరినవి ఇవ్వకపోయినా, అనుకున్నది పెద్దలు ఒప్పుకోకున్నా పిల్లలకు కోపం ప్రదర్శిస్తుంటారు. అలాంటప్పుడు మా నాన్న దుర్వాస మహాముని. వీడికి ఆయన పోలికలే వచ్చాయి అంటూ అదేదో స్పెషల్ క్వాలిఫికేషన్‌లా మురిసిపోకుండా 'అలా చేయకూడదు' అని మందలించాలి. ఊహ తెలిసిన పిల్లలకు మెల్లగా నచ్చచెప్పాలి. చీటికీ మాటికీ కోపగించుకోకుండా ఓర్పు, సహనంతో మసలుకోవాలని... అప్పుడే మంచి స్నేహితులు, శ్రేయోభిలాషులూ ఏర్పడతారని చెప్పి వారి ప్రవర్తనని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే!
మనిషికి కోపం రావడానికి మరొక కారణం కూడా ఉంది. ఇతరులనుండి ఆశించిన మేరకు కోరికలు నెరవేరనపుడు... తమ కోరికలు నెరవేర్చుకోవడంకోసం చుట్టూ ఉన్నవారిని తన ఆధీనంలో ఉంచడానికి ప్రయత్నించి విఫలులైన కారణంచేతకూడా కోపం వస్తుంది. కొంతమంది ఇటువంటి కోపాగ్ని పైకి ప్రదర్శిస్తారు. మరికొందరు దీన్ని తమలో తామే అణచుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ రెండూ అనర్థదాయకాలే!!
కోపాన్ని అణచుకోవడంవల్ల అధిక రక్తపుపోటు, హృద్రోగం లాంటి అనారోగ్యాలు ఆవహిస్తాయి. కోపం ప్రదర్శించడంవల్ల స్నేహితులను కోల్పోతారు. అంతేకాదు, వీరికి కోపిష్టి అన్న బిరుదుకూడా వరిస్తుంది. ఇంతటి అనర్థదాయకమైన కోపాన్ని రాకుండానే చేసుకుంటే మంచిది కదా. ఏ పేచీ ఉండదు!
కోపాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. మొదటిది సంతృప్తి. మనిషి తనకున్న దాంట్లో, తను సాధించిన దానిలో తృప్తి చెందితే అసూయ, కోపం దరిచేరకుండా ఉంటాయి. యోగా, మెడిటేషన్ వంటివి తమ దైనందిన జీవితంలో క్రమబద్ధంగా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఏ రంగంలోనైనా, ఏ పనిచేసినా వందశాతం ఫలితాలకోసం పాకులాడటం మానుకోవడం ద్వారా కోపం రాకుండా చూసుకోవచ్చు. ఎదుటివారిని వారి లోపాలతో సహా స్వీకరించడం, తమకు అపకారం తలపెట్టిన వారిని కూడా క్షమించే సుగుణం అలవరచుకోవడం ద్వారా కూడా కోపాన్ని దరి చేరకుండా చూసుకోవచ్చు.

No comments:
Post a Comment