Saturday, March 12, 2016

చిన్నారుల, ఈ గురువుల చొరవ మనకు స్ఫూర్తి నివ్వాలి, ఆదర్శం కావాలి.

అభినందనలు తమ్ముడూ ....... 


నీటి విలువ మనకు తెలియచేసేందుకు చిన్నారుల, ఈ గురువుల చొరవ మనకు స్ఫూర్తి నివ్వాలి, ఆదర్శం కావాలి. 
పంచభూతాలలో ఒకటైన సమస్త జీవులకు, వృక్షజాల మనుగడకు ఆధారభూతమైన జలవనరులను సంరక్షించడం ఘనకార్యం కాదు కనీస కర్తవ్యమ్. ఇప్పటికే మనం అపారమైన జలవనరులను వృధా చేస్తూ జీవనదులను తాగేసి మురుగునీటి ప్రవాహాలను పెంచేస్తున్నాము. దూరంగా ఎక్కడో ఎటి నుంచి నీరు కావడిలో మోసుకొచ్చే, బావిలో నీళ్ళు తోడుకునే రోజులలో మనిషి తన శక్తి కొలది, అవసరం కొలదీ నీటిని సక్రమంగా వినియోగించుకునేవాడు, దైనందిన జీవితంలో వివిధ అవసరాలను ఒక చెంబుడు నీళ్ళతో శుభ్రంగా సరిపెట్టుకునేవాడు. మరి ఇప్పుడు ఈనాడు ఎంత ఎత్తైన, ఎన్ని బహుళ అంతస్తుల భవనాలలో కుళాయిల ద్వారా సరఫరాతో నీటిసేకరణ అనాయసమై వాష్ బసిన్ల, సింక్ ల పుణ్యమా అని ఉదయం లేచిన వెంటనే ముఖం కడిగేటప్పుడు, గడ్డం చేసేటప్పుడు, బట్టలు ఉతికేతప్పుడు బాత్ టబ్ స్నానాలు ఇలా వివిధ అవసరాలకు అవసరానికి మించి నీటి వినియోగంతో జలవనరులు అడుగంటుతున్నాయి, కాళ్ళకి మట్టి అంటకూడదని ఇంటిలో మిగిలిన కాస్త మేర సిమెంట్ చేసెయ్యడం వల్ల వర్షపు నీరు నెలలో ఇంకే నేల విస్తీర్ణం తగ్గిపోవడం ఇలా ఒకటేమిటి తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఎక్కడా చుక్క దొరకని స్థితికి చేరుకొన్నాము, ఈ దశలో చిన్నారులతో ఈ గురువులు మేము సైతం అంటూ ఇటు పిల్లలు పెద్దల దృష్టిలో అవగాహన, చైతన్యం కొరకు వీరి కృషిని మనస్పూర్తిగా అభినందిస్తూ....ఇటువంటి కార్యక్రమాలలో చిన్నారులకు స్పూర్తిని నింపే కృషిలో ఎల్లప్పుడూ ముందుండే రావులపాడులో ప్రధానోపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తూన్నమా తమ్ముడు చిరంజీవి విస్సా వెంకటేశ్వర్లు, మరియు ఇతర ప్రధానోపాధ్యాయ, ఉపాధ్యాయులకు చిన్నారి విద్యార్ధినీ, విద్యార్ధులకు పేరు పేరునా మా విస్సా ఫౌండేషన్ హృదయపూర్వక శుభాభినందనలు తెలియచేస్తున్నాం వీరి కృషి మనందరికీ కూడా స్ఫూర్తి ని అందించాలని కోరుకుంటూ మీ సత్యసాయి - విస్సా ఫౌండేషన్.

No comments:

Post a Comment

Total Pageviews