Thursday, March 17, 2016

మిత్రులారా...శుభోదయం!!

మహనీయుల సాహితీ సేద్యములో కుసుమించిన కావ్య సౌరభాలని ఒక సారి ఆస్వాదిద్దాం! ఆనందిద్దాం!!.భావితరాలకి అందిద్దాం ..మన తెలుగు దనం కృషిని అభినందిద్దాం!!! ఇలా..ప్రతి రోజు మనవైన ..ఘన సాహితీ సంపదలను పంచుకుని...పెంచుకుందాo.
తనకు తెలియదు, ఒకడు చెబితే వినడు.
కొందరు మాకు అన్నీ తెలుసునని గొప్పగా చెప్పుకుంటారు. ఆ విషయం మీద అవగాహన లేకపోయినా మాకు అంతా తెలుసులే అని గర్వంగా ఫీలవుతారు. ఎదుటి వారు ఇలా కాదు, 'అలా' అంటే వినరు. ఇతరులు నాకు చెప్పేంత వాళ్ళా అని కోపగించుకుంటారు. నేనే గొప్పని చెప్పుకుంటారు. అందరి కంటే నాకే బాగా తెలుసు అని భ్రమపడతారు. కాని వాళ్ళకు ఏం తెలియదు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని ఉద్దేశించినప్పుడు ఈ నానుడిని వాడతాం.
ఆలోచించి మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఆలోచించకూడదు.
ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడుతున్నామా? స్నేహపూరకంగా మాట్లాడుతున్నామా? అనే విషయాల్ని మాట్లాడేటప్పుడే ఆలోచించాలి. మాట్లాడిన తర్వాత ఆ మాటను తిరిగి వెనక్కి తీసుకోలేం. మాట నాలుక దాటి బయటకు వచ్చే ముందు ఈ విషయాల్ని గ్రహించటం మంచిది. ఎందుకంటే పెదవిదాటి బయటకు వచ్చిన మాటకు విలువ ఉండదు సరికదా! ఆ మాట సరైనది కాకపోతే నలుగురిలో నవ్వులపాలు కావాల్సి వస్తుంది.అంతే కాదు మనల్ని మంచివారుగానో, చెడ్డవారుగానో ఎదుటివారి ముందు నిలబెట్టేది మనమాటే. నోరుంది కదా! అని నోటికొచ్చిన మాటల్లా మాట్లాడితే మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచిస్తే మాట్లాడిన తర్వాత చింతించే ప్రమాదం తప్పుతుంది.

No comments:

Post a Comment

Total Pageviews