Monday, March 14, 2016

వేసవి కాలం వచ్చేసింది మరి ఆ సూర్యుడి ప్రతాపం నుంచి కొంచెం ఉపసమనం పొందాలంటే ఆహారంలో కూడా మార్పులు అవసరం. మరి వేసవి వచ్చిందంటే ముందుగా మనకి గుర్తు వచ్చేవి తాటి ముంజులు.వాటిగురించి తెలుసుకుందామా !!


తాటి ముంజను తొలవగానే కొంతనీరు ఉంటుంది. ఆ నీరు మాత్రం నోరూరించే రుచిగా ఉంటుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగ పడతాయి. తాటి ముంజ మనిషికి ఎంతో మేలు చేస్తాయి. మనిషి శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. శరీరానికి మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఎండకాలం ఈ తాటి ముంజల్లో నీల్లు చాలా చలువ చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వృద్దులకు చాలా మంచిది. వీటిలో అధికంగా తేమ కలిగిఉండి తక్కువ కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి. చిన్నారులకు, షుగర్ వ్యాధి గ్రస్తులకు, స్థూల కాయులకు ఉపయోగ పడుతుంది. ఆరోగ్యానికి దోహాదం చేయడంతో పాటు దాహార్థికి కూడా మంచి విరుగుడు.




             తెలుసుకున్నాం కదా... మరి ఇంకెందుకు ఆలశ్యం మరి వెళ్లి తెచ్చుకుని తినేద్దమా....ఏమంటారు?

No comments:

Post a Comment

Total Pageviews