( శ్రీనాధుడు రాసిన " భీమఖండం "లోని సూర్యోదయ వర్ణన ఇది )
"" చంద్రుడు వెలవెలపోగా,,చుక్కలు పలుచబడగా,,దిగుడుబావులలోని తామరలమధ్య తుమ్మెదల ఝుంకారాలు చెలరేగగా,,కలువలు కన్నుమూస్తూ ఉండగా దిక్కులు తెలతెలవారాయి.తూర్పుదిక్కున అరుణరాగం ఉదయించింది..
ఉదయసంధ్య అనే కాంత నొసటిమీద అందగించే సింధూర తిలకమేమో ! దేవేంద్రుని రాణి నిండుగా అలంకరించుకుని చేతబట్టిన రత్న దర్పణమేమో !! ఉదయగిరిమీద చిగిర్చిన మెత్తని కంకేళీ నికుంజమేమో !!! దేవేంద్రుని అంతఃపుర సౌధకూటంపై కనిపించే బంగారు పద్మమేమో !!!! కాలమనే సిద్ధుడు పట్టి మ్రింగి వినోదార్ధం తిరిగి ఉమిసిన రసఘటకమేమో !!!!! ఆకాశమందిరంలోని దీపపు మొలకయేమో !!!!! అన్నట్లు ఉదయించాడు సూర్యుడు ""
బాగుంది కదూ ఈ వర్ణన?
No comments:
Post a Comment