Monday, March 14, 2016

ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లి, మార్క్ ఫోలీ.

ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లి, మార్క్ ఫోలీ.
ఇప్పుడు నీటిరంగుల్తో ప్రయోగాలు చేస్తున్న వాళ్ళల్లో అగ్రగణ్యుడైన ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లిని నేను అభిమానిస్తున్నానని చెప్పానుకదామరి మొరెల్లి అభిమానిస్తున్న చిత్రకారులెవరు?
అతడు అమెరికన్ గ్రాఫిక్ డిజైనర్ మిల్టన్ గ్లాసర్ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడుకాని ఇటీవలి కాలంలో అతడు పదే పదే మాట్లాడుతున్న చిత్రకారుడు తన కన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడైన మార్క్ ఫోలీ. (  మాటకొస్తే మార్క్ ఫోలీ నాకన్నా కూడా చిన్నవాడే). మార్క్ ఫోలీ మరొక ఫ్రెంచి చిత్రకారుడు.అతడూమొరెల్లీ కలిసి సంయుక్తంగా తమ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. 2012 లో ఫ్రెంచి పట్టణం రీమ్స్ లో వారిద్దరూ ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడుఒక పత్రిక వారిని ఇంటర్వ్యూ చేసిందిఇంటర్వ్యూ చేసిందనడం కన్నా వారిద్దరిమధ్యా సాగిన ఒక సంభాషణ ను రికార్డు చేసింది సంభాషణ ఇద్దరు సమకాలిక నీటిరంగుల చిత్రకారుల మధ్య సంభాషణనే అయినప్పటికీరెండు తరాల దృక్పథాల మధ్య సంభాషణ కూడావయసులో పెద్దవాడూప్రయోగశీలీ అయిన మొరెల్లి తన భావాల్లో యువకుడిగానూసాహసికుడిగానూ కనిపిస్తేయువకుడూవర్ధిష్ణువూ అయిన ఫోలీ ఎంతో జాగ్రత్తపరుడూసంప్రదాయాన్నీ పునరన్వేషించేవాడిగానూ కనిపించడం నన్ను ఆశ్చర్య పరిచిందివాళ్ళు సంభాషణ మొదలుపెడుతూనే ఒక మాట చెప్పుకున్నారు.మామూలుగా  ఇద్దరు చిత్రకారులూ తమ కళ గురించి బాహాటంగా చర్చించుకోరు,ఎందుకంటే ఇద్దరిలోనూ కొంత స్పర్థాశీలత ఉంటుంది కాబట్టి నలుగురూ వినేలా వాళ్ళు తమ కళగురించి చర్చించుకోరనికాని తామిద్దరూచిత్రకళని కేవలం ఒక కళగా మాత్రమే కాక ఒక వారసత్వంగాఒక సాంస్కృతిక సంప్రదాయంగా కూడా చూస్తున్నారు కాబట్టి తమకి అట్లా మాట్లాడుకోవడం ఇబ్బందిగా లేదన్నారు
మార్క్ ఫోలీ కూడా మొదట్లో మొరెల్లి చూపించిన దారిలోనే తేమబాటలోనే ప్రయాణం మొదలుపెట్టాడుఇక్కడ పొందుపరిచిన మొదటిబొమ్మప్రాత:కాల కాంతిలో కపిలవర్ణ శోభితమైన ద్రాక్షపళ్ళ గుత్తివెట్-ఇన్-వెట్ పద్ధతిలో చిత్రించిన బొమ్మదాన్ని ప్రతిష్టాత్మకమైన 'ఆర్ట్ ఆఫ్ వాటర్ కలర్పత్రిక ముఖచిత్రంగా ముద్రించిందంటేనే  చిత్రం ప్రశస్తి మనకి తెలుస్తున్నదికానిదానిలో మొరెల్లిలో కనిపించే ప్రవాహశీలతచలనశీలత లేకపోవడం గమనించాలిఅలాగేరెండవ బొమ్మ నైపుణ్యంలో మరింత సిద్ధహస్తాన్ని కనపరుస్తోంది.తెల్లటి వస్త్రం మీద గులాబీల ఊదారంగునీడలుకుంచె మీదారంగులమీదాదృశ్యం మీదా అసాధారణమైన పట్టు సాధించినవాడు మాత్రమే
ఇట్లాంటి చిత్రం చిత్రించగలడుకాని ఇందులో కూడా మొరెల్లిలో కనిపించే గతిశీలత లేదుఎందుకని రోజు వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణ మొత్తం  అంశం చుట్టూతానే తిరిగిందితాను మొదట్లో వెట్-ఇన్-వెట్ పద్ధతి పట్ల ఆకర్షితుడైనప్పటికీఅది తన స్వభావానికి సరిపోదనీ,అందువల్ల వదిలేసాననీ మార్క్ చెప్పాడుఅతడిట్లా అంటున్నాడు:  'నా తేమ దశ ( wet period) ఏడాదిన్నర పాటుమాత్రమే నడిచిందితేమ కి సంబంధించిన అన్ని అంశాలూ నాకు సరిపోవని నేను గ్రహించానుదానిలో ఒక నిర్మాణం లేదునరాల తీవ్రత లేదునీరు దాదాపుగా ప్రతి ఒక్కదాన్నీచివరికి చిన్నపాటి జాగాలు వదలకుండా అన్నీ ఆక్రమించేస్తుంది.నీరు నియంతలాంటిదిఅక్కడ రాతల మధ్య వైవిధ్యానికి చోటులేదుఇక  తేమవల్ల అన్నిరకాల సంజ్ఞలూ అణగిపోయ్యే ప్రమాదమెలానూ ఉందిచివరికి కుంచె గీతల ఆనవాళ్ళు కూడా మిగలకుండా నీరు ముంచెత్తుంది...'ఇది నీటిరంగుల చిత్రకారుడు మాట్లాడుతున్న మాటల్లా లేవుఒక పోస్ట్ మాడర్న్ తత్త్వవేత్తఅన్ని రకాల signs నీ అణచివేసే hegemony గురించి మాట్లాడుతున్నట్టుంది.
 స్థితినుంచి బయటపడటానికి మార్క్ ఎంచుకున్న మార్గమేమిటిమరింత ప్రయోగశీలత్వమాకాదుసాంప్రదాయిక చిత్రకారులు తమనీతమ కళనీ కాపాడుకోడానికి  తోవన నడిచారో అదే తోవ.అది మూడు దశల ప్రయాణంమొదటిదశలోవిస్పష్టమైన రేఖా చిత్రం (drawing). అప్పుడుకంటిముందున్న దృశ్యాన్ని విస్పష్టమైన వెలుగునీడల్లో (values) కి అనువదించుకోవడం వెలుగునీడల్ని రంగుల్లోకి మార్చుకోవడం చివరి దశ.  చూపరులకి రంగులు అద్భుతంగా కనిపిస్తాయిగాని,నిజానికి అదంతా values చేసే ఇంద్రజాలమనేది చిత్రకళలో ఉండే నానుడివాల్యూస్ (వాల్యూ అంటే విలువ అని అర్థం కాదు,అది చిత్రకళాపరిభాషలో వెలుగునీడల సాంద్రతని సూచించే పదంలేకపోతే రెండుకొలతల తలం ఎప్పటికీ చిత్రంగా మారదుడావిన్సీ నుంచి మొరెల్లీ దాకా వాల్యూ లేకపోతే చిత్రకారుడే లేడుఇప్పుడు కొత్తగా మార్క్ వాల్యూస్ గురించి చెప్తున్నదేమిటిఅతడు చెప్తున్నది రంగు కన్నా రేఖకీ,వాల్యూకి తాను ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడనేఇది స్పష్టంగా సాంప్రదాయిక దృక్పథంసాహిత్య పరిభాషలో చెప్పాలంటేకథనం కన్నా కథకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టుఒక యువకుడిట్లా మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిచిందికాని బహుశా ఇప్పుడు యూరోప్  దిశగా ప్రయాణం మొదలుపెట్టింది కావచ్చుకాని అతడి మాటలకి మొరెల్లి ఇచ్చిన జవాబు నాకు గగుర్పాటు కలిగించిందినీరు తనని ముంచేస్తుందనే భయాన్ని మార్క్ ప్రకటించినప్పుడు మొరెల్లి అతడితో భయం నీటిలోని అపారమైన ఆకర్షణ వల్ల పుట్టే భయమని చెప్తూ యులిసెస్ కథని గుర్తు చేస్తాడుయులిసెస్ సముద్రం మీద తిరిగి గృహోన్ముఖ యాత్ర చేస్తున్నప్పుడు ఒకచోట అతడు సాగరకన్యల గానాన్ని వినవలసివస్తుంది గానం ఎంత ప్రలోభపూరితంగా ఉంటుందంటే దారినపొయ్యే నావికులు  గానపాశానికి లోబడి ఓడమీంచి సముద్రంలోకి దూకేస్తుంటారుఅందుకని యులిసెస్ ముందు జాగ్రత్త చర్యగా,తన నావికులందరి చెవుల్లోనూ మైనం నింపుతాడుతనని మాత్రం ఓడ తెరచాపకొయ్యకి ఇనపగొలుసుల్తో బంధించమంటాడుతానెంత వేడుకున్నా  గొలుసులు విప్పవద్దంటాడుఅతణ్ణట్లానే కట్టేస్తారుఓడ  దారినరాగానే మహామోహపూరితమైన  సాగరకన్యల సంగీతం అతడి చెవులపడుతూనే అతడా కట్టుబాట్లనుంచి విడివడాలని శతధా ప్రయత్నిస్తాడుకాని తక్కిన నావికులకిచెవుల్లో మైనం వల్ల  గానం వినబడదు కాబట్టివాళ్ళు యులిసెస్ ని మరింత గట్టిగా బంధిస్తారుచివరికి ఓడ  విపత్కరసంగీత ఛాయనుంచి తప్పించుకున్నాక యులిసెస్ ని విడుదల చేస్తారు.
మొరెల్లి యులిసెస్ గురించి చెప్పడంలో మనం చూడవలసిందేమిటంటేయులిసెస్ కూడా తన నావికుల్లానే తాను కూడా చెవుల్లో మైనం పెట్టుకోవచ్చు కదా,అంత హింస పడటం దేనికిఎందుకంటేయులిసెస్  సంగీతం వినాలనుకున్నాడుదాని ఆకర్షణ ఏమిటో తేల్చుకోవాలనుకున్నాడుకాని అది తనని ముంచెత్తకుండా తనని తాను బంధించుకున్నాడు.
ఒక్క నీటి రంగుల చిత్రకారుడికే కాదు కళాకారుడికైనా ఇది వర్తిస్తుంది, మాటకొస్తేజీవితానందాన్ని
రుచిచూడాలనుకున్న ప్రతి పిపాసికీ ఇది వర్తిస్తుంది.నీ కళలోకి నువ్వు దూకాలికాని మునిగిపోకూడదు.కొన్ని కట్టుబాట్లతో నిన్ను నువ్వు బంధించుకునే ఉండాలి.  మొరెల్లి మాటల్ని మార్క్ పూర్తిగా అనుసరించగలడనిచెప్పలేంఎందుకంటే అతడి స్వభావం వేరుమార్క్ లో తన otherness ని తాను చూస్తున్నాననీ,అందుకనే అతడి చిత్రాల్ని తానిష్టపడుతున్నానంటాడు మొరెల్లి.
ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లి, మార్క్ ఫోలీ.
నీటిరంగుల్ని అసాధారణమైన సామర్థ్యంతో సాధనచేస్తున్న సమకాలిక చిత్రకారులందరిలోనూ జీన్ లూయీ మొరెల్లి కి నేను పెద్ద పీట వేస్తాను.కొన్ని వందల ఏళ్ళుగా చీనాజపాన్భారతదేశంలోనూగత రెండు శతాబ్దాలుగా బ్రిటన్ లోనూ,అమెరికాలోనూవందేళ్ళుగా ప్రపంచమంతటా వికసిస్తూ వచ్చిన  కళా ప్రక్రియను గత పాతికముఫ్ఫై ఏళ్ళుగా మొరెల్లి మనం ఊహించలేని ఎత్తులకి తీసుకుపోతూ ఉన్నాడుఆయన 1945 లో పుట్టాడుచిత్రకళను స్కూల్లోనూకళాశాలలోనూ అభ్యసించాడుహెన్రీ గోయెట్జ్ అనే ప్రసిద్ధ సర్రియలిస్టు చిత్రకారుడుప్రింట్ మేకర్ స్టూడియో లో అప్రెంటిస్ గా పనిచేసాడు. 1989 లో పారిస్ శివార్లలో తన సొంత స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడుఅప్పణ్ణుంచీ అతడు నీటీరంగుల చిత్రకళకి సంబంధించి ఎన్నో ప్రదర్శనలువర్క్ షాపులు నిర్వహిస్తూ ఉన్నాడుతన సాధన రహస్యాల్ని Watercolor Painting: A Complete Guide to Techniques and Materials పేరిట 1999 లో పుస్తకరూపంలో వెలువరించాడుఅప్పణ్ణుంచీ  రచన ప్రపంచమంతటా wet-in wet పద్ధతి సాధనచేసేవారికి కరదీపికగా ఉపకరిస్తూనే ఉందిమనం నీటిరంగులుగా వ్యవహరించే వాటిలో రెండు రకాలున్నాయిఒకటిపారదర్శకంగా ఉండేవి (transparent), మరొకటిఅపారదర్శకంగా ఉండేవి (opaque). మామూలుగా మనం పోస్టర్ కలర్స్ గా పిలిచేవి, (కొందరు వీటిని బాడీ కలర్స్ అనిడిజైనర్స్ కలర్స్ అని కూడా అంటారు), గత యాభై ఏళ్ళుగా ప్రపంచ చిత్రకళరంగాన్ని పరిపాలిస్తున్న ఏక్రిలిక్స్ అపారదర్శకమైన నీటిరంగులువీటి ప్రత్యేకత ఏమిటంటేవీటితో బొమ్మలు వేసేటప్పుడుతైలవర్ణాల్లాగాదట్టమైనపూత మీద మళ్ళా పలచని పూత వెయ్యవచ్చుముదురునీలంరంగునోనలుపునో గీసాకదానిమీద పసుపుగీతలోతెల్లగీతలో గియ్యవచ్చుఅంటేఅక్కడ తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుందితైలవర్ణాల్లాగా అవి అత్యంత క్షమాశీలాలు.  కాని పారదర్శకమైన నీటిరంగులకి  సౌలభ్యం లేదుఅక్కడ ఒకసారి దట్టమైన రంగు అద్దాకదానిమీద మళ్ళా పల్చని పూత పుయ్యలేంకాబట్టి  రంగుల్ని మనం ముందు పలచటి పూతతో మొదలుపెట్టిచివరకి చిక్కటిదట్టమైన రంగులు వెయ్యవలసిఉంటుంది క్రమంలో  చిన్న పొరపాటు చేసినా దాన్ని దిద్దుకోలేంస్వభావరీత్యా అవి అత్యంత క్రూరమైనవి. most unforgiving. మామూలుగా ప్రతి ఒక్కరూ నీటిరంగులు చాలా సులభమైన మాధ్యమమనుకుంటారుకాని మొదలుపెట్టాకఅవి ఎంత నిర్దయాత్మకాలో తెలిసాకఅందులోని సవాలు ఏమిటో అనుభవానికొస్తుందికాని వాటి పారదర్శకత వల్లమరే మాధ్యమమూచివరికి తైలవర్ణాలు కూడా అందివ్వలేని అపారతేజోమయత్వాన్నిఅంతర్జ్యోతిస్సీమల్ని పారదర్శక జలవర్ణ చిత్రాలు సుసాధ్యం చేస్తాయిఅద్భుతమైన వాటి transparent, translucent కాంతి కోసమే ఎందరో చిత్రకారులు తమ జీవితకాలమంతా వివశులవుతున్నారువ్యామోహపడుతున్నారుసృష్టిలో ఏడురంగులూ కలిస్తే తెల్లటి రంగుగా మారుతుందనిమనకు తెలుసుకాని రంగుల పళ్ళెంలో మనం  మూడు రంగుల్ని కలిపినాతెలుపు రావడానికి బదులు బురద వస్తుందినీటిరంగుల చిత్రకారుణ్ణి వేధించే సమస్య ఇదేరంగుల్తో కాంతిని చిత్రించడమెట్లాపాదార్థికమైన రంగుల్తో కాంతిని చిత్రించాలనుకోవడమే మొరెల్లి చేస్తూ వచ్చిన సాధన క్రమంలో మొరెల్లి తెలుసుకున్న రహస్యాల వెనక రెండు మూడు వందల ఏళ్ళుగా యూరోప్ లో చిత్రకారులుభౌతికశాస్త్రవేత్తలురాసాయనిక శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తూ వచ్చిన ఆవిష్కరణలున్నాయిఅన్నిటికన్నాగొప్ప రహస్యం మొరెల్లి కనుక్కున్నదివినగానే మీకు నవ్వు పుట్టించవచ్చుగానిగొప్ప సత్యంఏమిటంటేనీటిరంగుల్లో చాలా ముఖ్యమైందిరంగు కాదునీరు అనేదినీటిపోకడనిముఖ్యంకాగితం మీద పూసిన తరువాత నీరు ఎట్లా ప్రవర్తిస్తుందికుంచెలోకి తీసుకున్నతరువాతనీరు ఎట్లా కదులుతుందితడి కాగితం మీదరంగుతో నింపిన కుంచెని పెట్టినప్పుడు రెండింటిలోనూ ఉన్న నీరు ఒకదానితో ఒకటి ఎట్లా పెనవైచు కుంటుదన్నదే మొరెల్లి గత మూడు దశాబ్దాలుగా చేస్తూ వస్తున్న పరిశీలనఅందుకనే అతడునీటిరంగుల చిత్రం గియ్యడమంటేనీటితో ఒక సంభాషణకు పూనుకోవడమంటాడునీరు చెప్పే సందేశాన్ని కళ్ళతో వినమంటాడుజెన్ బౌద్ధులుగెస్టాల్ట్ తత్త్వవేత్తలు చెప్పేటట్టు ఒక్క క్షణం most critical moment కోసం వేచిఉండమంటాడు
అట్లాంటి క్షణాల్ని పట్టుకున్న నీటిరంగుల చిత్రాలెట్లా ఉంటాయో,మొరెల్లి చిత్రించిన  మూడు చిత్రాలూ చూస్తే బోధపడుతుందిఇందులో మొదటిబొమ్మలో బెర్రీలు కాంతితో మిలమిలమెరిసిపోతున్నాయి translucence పారదర్శకమైన నీటిరంగులు మాత్రమే ఇవ్వగలవుకానీ  సౌందర్యంలో కొంత ఫలసౌందర్యమేననుకున్నాతక్కిన రెండు బొమ్మలూ వస్తురీత్యా మరింత గొప్పవిఒకటిపనికిరాని మద్యంసీసాలు పారేసిన తొట్టిరెండవదిఇంకా నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ లో పనివాళ్ళు వదిలి వెళ్ళిపోయిన మినరల్ వాటర్ బాటిల్హీనంగా చూడకు దేన్నీకవితామయమేనోయ్ అన్నీ అన్న మహాకవి వాక్యానికి ఇంతకన్నా నిరూపణ ఏముంటుంది?

No comments:

Post a Comment

Total Pageviews