Saturday, March 5, 2016

నువ్వు తెలుగువాడినని గర్వించు!
[మొరటుగా చెప్పాలంటే విర్రవీగు]
*************************
మనవాళ్ళ బుర్రకి తిరుగులేదు ,ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ తెలుగు భాషను వర్ణించి,పొగిడి ,ఆస్వాదించి,ఆదరించి మురిసిపోయారు.
ఇక్కడ చిన్న ఉదాహరణ చేతి వేళ్ళగురించి రెండు కవితలు ,ఎంతగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయో చూడండి.
చేతి వేళ్ళ పాట
~~
తిందాం తిందాం చిటికెన వేలు
ఎట్లా తిందాం ఉంగరం వేలు
అప్పు చేసి తిందాం మధ్యవేలు
అప్పెట్లా తీరుతుంది?చూపుడు వేలు
ఉన్నాగదా నేను అన్నిటికి మీకోసం
పొట్టివాణ్ణి గట్టివాణ్ణి అన్నది బొటనవేలు.
ఇంకొక మహానుభవుడు వేళ్ళమీద మరో చమత్కారం.
అందరికి దండాలు
~~
చిటికెన వేలు చెల్లాయి
ఉంగరపు వేలు బంగారం
నడిమి వేలు నా అన్న
చూపుడు వేలు నీకేసి
బొటనవేలు బొట్టెట్టి
అయిదు వేళ్ళు ఒకటిగ చేసి
చెయ్యి చెయ్యి అంటించి
దండం పెట్టు అమ్మా నాన్నకు
దండం పెట్టు గురువుగార్లకు
దండం పెట్టు పెద్దలందరకు దీవించెదరు మనలందరనూ.
చిట్టి పొట్టి పదాలతో ఎంత గొప్పగా వున్నాయో చూశారా?
ఇంగ్లీషు భాష వ్యామోహంలో తెలుగును మరచిపోయి పసివయస్సు నుంచి వ్యతిరేక భావాలతో పెంచి ..కాస్త ఆలోచించండి.
jack and jill
went up the hill
తరువాత జాక్ పడిపోవడం కాలు విరగకొట్టుకోవడం.
rain rain go away
వచ్చే వర్షాన్ని వద్దనడం.
solomon grandy
born on monday
...........died on sunday
ఇలా నేర్చుకుని పెద్దయ్యాక విలువలు లేవు అని వాపోతే ఏమి ప్రయోజనం. నేను ఇంగ్లీషు చదువులకు వ్యతిరేకిని కాను ,కాని వాటికోసం తెలుగును మరిచిపోవడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడంతోనే పోల్చాలనిపిస్తోంది.మాతృభాష ,అమ్మభాష రాకపోవటం దౌర్భాగ్యం.
జపాను ,చైనా ,రష్యా ,జర్మనీ వీరందరికి ఇంగ్లీషు పెద్దగా రాదు వారందరు డెవలప్ [అభివృధి]చెందలేదా?
కనీసం ప్రైవేటుగా ట్యూషన్లు పెట్టన్నా పిల్లలకి తెలుగు నేర్పండి.
అమ్మభాష తెలియకపోతే అమ్మకు ద్రోహం చేసినట్టే ,అయ్యా మా అమ్మకే రాదని వాదిస్తారా ,దానికి నాదగ్గిర జవాబు లేదు.

No comments:

Post a Comment

Total Pageviews