మనిషి తన భావాలను ఇతరులకు చెప్పటానికి పడే ఆరాటంవల్ల తన గురించి తాను మరిచిపోతాడు. ఇతరులు తన గురించి గొప్పగా అనుకోవాలని, తనను అదే పనిగా మెచ్చుకోవాలని ఆశపడతాడు.
*ప్రజ్ఞ అనేది ప్రదర్శించి చూపడానికి కాదు. సహజంగా అందరూ అభినందించేదిగా ఉండాలి.
అది లోకోపకారిగా ఉండాలి.
అప్పుడే ప్రశంసార్హమవుతుంది.*
అభినందించడం అవతలివారి అభీష్టం. అభినందనలు పొందడం మన హక్కు కాదు.
*మనం పుట్టినప్పటి నుండి మరణం వరకు భగవంతుడు ఎన్నో ఇస్తున్నాడు*.
కానీ, ఏనాడూ దాన్ని మనం సరిగ్గా గుర్తించడం లేదు. భగవంతుడి గురించి సరైన నిర్వచనం మనకు తెలియదు.
ఎవరి నిర్వచనాలు వారివి. *అడుగడుగునా కనురెప్పకన్నా గొప్పగా మనల్ని ఆదుకుంటూ, హృదయానికి హత్తుకుంటున్నది భగవంతుడేనని మనకు తెలియనే తెలియదు*.
ఇన్ని చేస్తున్నా భగవంతుడు మన అభినందనల కోసం ఎప్పుడూ ఎదురుచూడడు.
*తల్లి బిడ్డలకు చేసే సేవలు,
*తండ్రి తన సంతానానికి కల్పించే రక్షణ,
*మిత్రుడు ఆపదలో ఆదుకోవడం, *గురువు జ్ఞానమార్గాన్ని చూపడం....
ఇన్ని పాత్రల్లో ఉంటూ మనతో నిత్య సన్నిహితుడిగా ఉంటున్నది పరమాత్మే. అది చాలదన్నట్లు *అంతర్యామి* గా మనలోనే కొలువున్నాడు
*సాధారణంగా మనచర్యలన్నీ స్వార్థభరితాలే. ఇతరుల నుంచీ ఎన్నో ఆశిస్తాం. వాటిలో ఒక్కటి కూడా ఇతరులకు చెయ్యం.
అందరూ మనల్ని మెచ్చుకోవాలి. మనం ఎవరికన్నా ఉపకారం చేస్తే, వాళ్ళు కుక్కలా శ్వాస ఉన్నంతవరకూ విశ్వాసంగా ఉండాలి అనుకుంటాం! మరి మనం అలా ఉంటున్నామా? *తల్లిదండ్రుల్ని , అత్తమామల్ని వార్ధక్యంలో పట్టించుకుంటున్నామా? ఏతల్లి, ఏతండ్రి తమ సేవలకు పిల్లల ప్రశంసలు,అభినందనలు ఆశిస్తున్నారు?
కేవలం కాస్త ప్రేమ కోరుతున్నారు. భగవంతుడూ అంతే
ఆయనకేమి తక్కువని మన నివేదనలు, భజనలు, స్తోత్రాలు కోరతాడు?
ఆయన మనలోని లోపాలన్నింటినీ సానుభూతితో గమనిస్తుంటాడు. ఎప్పటికైనా తమను తాము తెలుసుకుంటారన్న ఆశతో నిరీక్షిస్తుంటాడు.

*మనం ఇతరుల్ని గమనించినంతగా మనల్ని మనం గమనించం!
వాళ్ల గురించి చాలా విషయాలు చెబుతాం. వారిలోని మంచికంటే, చెడు గురించే మనం ఎక్కువ చెబుతాం.
మన తప్పులు సమర్థించుకుంటూ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపుతాం! ఈ లక్షణాలు అంతరాలయ ‘అంతర్యామి’ ద్వారాలను గట్టిగా మూసివేస్తాయి. మనల్ని మనం సంస్కరించుకునే వరకూ అవి తెరుచుకోవు.

మనతో మనం రోజూ కనీసం రెండుసార్లయినా ఏకాంతంగా మాట్లాడుకోవాలి.
ఉదయం నిద్ర లేవగానే,
*ఓ అంతర్యామీ! నేను ఈ రోజంతా మంచిపనులు చేసేలా ప్రోత్సహించు! నిద్రపోయే ముందు స్వామీ!
ఈ రోజు నేను చేసిన చెడ్డ పనులేమిటో నాకు చెప్పు. రేపు మళ్ళీ అవి చెయ్యకుండా నిరోధించు!
ఈ రెండు ప్రార్థనలూ నిజాయతీగా, మనస్ఫూర్తిగా చేస్తే, మనం అంతర్యామి వాణిని వినగలుగుతాం!
మనం చేసే చెడ్డపనులకు అనుకోని విఘ్నాలు కలుగుతాయి.
ఇవన్నీ అంతర్యామి అనుగ్రహమేనని విశ్వసిస్తే, నిత్యం మనం అంతర్యామితో మాట్లాడగలుగుతాం!
అంతర్యామి అధీనంలో ఉంటాం కనుక మనం ఎలాంటి అకృత్యాలూ చెయ్యలేం. సాధనలో ఇదే అత్యుత్తమమని మహాత్ములు చెబుతారు.
*మన దృష్టి బయటినుంచి లోపలికి తిరగాలి. మన సంభాషణ అంతర్యామితో జరగాలి.

No comments:
Post a Comment