పోతన భాగవత పద్యం.
నీ పద్యావళు లాలకించు చెవులున్, ని న్నాడు వాక్యంబులున్,
నీ పేరం బనిసేయు హస్తయుగముల్, నీ మూర్తిపైo జూపులున్,
నీ పాదంబులపొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై జిత్తముల్,
నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!
భావం :- " కమల పత్రాల వంటి నేత్రాలు గల మహానుభావా! నీపై రచించిన స్తుతి వింటూ వుండే చెవులునూ, నిన్ను గురించి మాట్లాడే వక్కునూ, మాకు అనుగ్రహించు. ఏ పనిచేసినా నీ పేరనే, నీ పనిగా చేసేటట్లు, మా చూపులన్నీ నీ రూపం పైననే ఉండేటట్లూ, మా బుద్ధులు నీ పైననే ఉండేటట్లూ దయతో మమ్మల్ని అనుగ్రహించు.

No comments:
Post a Comment