దేవాలయాలలో రావిచెట్టు, వేప చెట్టు ఎందుకు వుంటాయి?
రావిచేట్టుకి అశ్వత్థ వృక్షమని , భోధివృక్షమని పేర్లు వున్నాయి. దాదాపు ప్రతి దేవాలయం లోను రావిచెట్టు లేదా వేపచెట్టు వుంటాయి. ఎక్కువ చోట్ల రావి,వేప కలసి వుంటాయి. రావిచెట్టును విష్ణు స్వరూపంగాను, వేపచేట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని పెద్దలు చెపుతారు. రావి చెట్టులో అణువణువూ నారాయణ స్వరూపమే అని ఆగమ శాస్త్రాలు, స్కాందపురాణం చెపుతున్నాయి. అందుకే శ్రీ కృష్ణుని "వటపత్ర సాయి" అని అంటారు. రావి చెట్టు కింద విశ్రమించిన తరువాత మహా జ్ఞానోదయం కలిగి సిద్ధార్ధుడు 'బుద్ధుడు ' అయ్యాడు.అందువల్లనే రావిచేట్టును 'బోధివృక్షం' అంటారు.
వేపవృక్షం కుడా యీనో ఔ షాద గుణాలను కలిగిన దివ్యవృక్షం. వేప ఆకులను ఎన్నో రోగాలకు మందుగా వాడతారు. వేపచెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి.వేపాకులను నీటిలో వేసి కాచి త్రాగినా, స్నానం చేసినా చర్మ వ్యాధులు నశిస్తాయి.వేపవంటి దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు.దివ్య శక్తులున్న వృక్షాలు కాబట్టి రావి, వేప చెట్టులను దేవాలయాలలో ప్రత్యేకంగా నాటి పూజిస్తారు.
No comments:
Post a Comment