పోతన భాగవత పద్యం.
చిక్కడు సిరి కౌగిటిలో
జిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతండు లీల దల్లిచేతన్ రోలన్.
భావం: ఆ లీలా గోపాలబాలుడు లక్ష్మీదేవి కౌగిటిలో చిక్కలేదు; సనకసనందనాదులైన మహాయోగుల హృదయాలలోనూ చిక్కలేదు. ఉపనిషత్తులలోనూ చిక్కలేదు. అటువంటివాడు లీలగా, అవలీలగా తల్లి చేతిలో చిక్కి రోటికి కట్టివేయబడ్డాడు.
No comments:
Post a Comment