Saturday, December 8, 2018

ఓం నమః శివాయ.... శంభోశంకర హరహర మహాదేవ...

శివపార్వతుల కళ్యాణానికి
వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ
పక్కన కూర్చున్న పేరంటాలిలో
గుసగుసగా  ఓ మాట అంది .......

>>>. ఇదేం విడ్డూరం అమ్మాయ్ః
పార్వతి ఎండకన్నెరుగని పిల్ల ........
పరమేశ్వరుడేమో  ఎండలో  ఎండిపోతూ
వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం

ఆమె తనువంతా సుగంధ లేపనాలు ....
అతడి శరీరమంతా బూడిద గీతలు .....
ఆమె చేతులకు పంకీలు  ......
అతడి చేతులకు పాము పిల్లలు ......
  ఎక్కడా పొంతనే లేదు
      చూస్తూ ఉండూ   నాలుగు రోజులైతే
               పెళ్ళి పెటాకులవుతుంది

నాలుగు రోజులు కాదు ........
నాలుగు యుగాలు గడిచిపోయాయి .......
    ఆదిప్రేమికులు ఆదిదంపతులుగా
           వర్ధిల్లుతూనే ఉన్నారు 
....     ....      ....

బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుడి అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి

      అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ
          కాలంబు గతి రత్నగర్భ పథము 
                 దర్శించుకుందా తల్లి
         కాబట్టే ఆ ప్రేమ అజరామరమైంది

       అతడు విష్ణువు అయితే   ఆమె లక్ష్మీ
           అతడు సూర్యడైతే  ఆమె నీడ
         అతడు పదం అయితే ఆమె అర్థం
   
           అలా అని ఆ దంపతుల మధ్య
        విభేదాలు రాలేదా అంటే వచ్చాయి
 ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా అంటే
     తలెత్తాయి    ప్రతి సమస్య తర్వాత
         ఆ బంధం మరింత బలపడింది
              ప్రతి సంక్షోభం ముగిశాక
       ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు

ఏ ఆలుమగలైనా పట్టువిడుల పాఠాల్ని
   శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి

     ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే
మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది

         మధురలో అమ్మవారిదే పెత్తనం
 సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే
       నైవేద్యాలు కూడా దొరసానమ్మకు
              నివేదించాకే  దొరవారికి 
                అదే చిదంబరం లో
           నటరాజస్వామి మాటే శాసనం 
    శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు...
 
ఒక్క మధురై ఏంటి ఒక్క చిదంబరం  ఏంటి
     ఇలా ఎన్నో చోట్ల భార్య పెత్తనం కొన్ని చోట్ల
అలానే భర్త పెత్తనం మరి కొన్ని చోట్ల
     అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే
అది దంపతులు ఆయిన్నారు పార్వతీపరమేశ్వరులు

  ఓం నమః శివాయ....
 శంభోశంకర  హరహర మహాదేవ...

No comments:

Post a Comment

Total Pageviews